Nellore Live News

Nellore Live News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nellore Live News, News & Media Website, ULAVAPALLA, Pune.

వేరుకాపురం అని వేధిస్తే.. భార్యకు విడాకులు ఇవ్వొచ్చు!తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉండాలంటూ భర్తను భార్య వేధిస్తే.. బాధి...
11/04/2023

వేరుకాపురం అని వేధిస్తే.. భార్యకు విడాకులు ఇవ్వొచ్చు!

తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉండాలంటూ భర్తను భార్య వేధిస్తే.. బాధితుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. మానసికంగా వేధింపులకు గురిచేయడమేగాక
భర్తకు ఆ హక్కు ఉంటుంది.. కలకత్తా హైకోర్టు స్పష్టీకరణ

తల్లిదండ్రులను చూడడం కొడుకు బాధ్యత అని స్పష్టం

కోల్‌కతా, ఏప్రిల్‌ 10: తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉండాలంటూ భర్తను భార్య వేధిస్తే.. బాధితుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. మానసికంగా వేధింపులకు గురిచేయడమేగాక సహేతుకమైన కారణాలు చూపకుండా అత్తమామల నుంచి దూరంగా ఉండాలని భార్య ఒత్తిడి చేస్తుంటే.. విడాకులు కోరే హక్కు భర్తకు ఉంటుందని తేల్చిచెప్పింది. ‘‘తల్లిదండ్రులతో ఉండడంతోపాటు వారిని పోషించడం కొడుకు బాధ్యత. భారతీయ సంస్కృతిలో ఇది భాగం’’ అని జస్టిస్‌ సౌమెన్‌ సేన్‌, జస్టిస్‌ ఉదయ్‌కుమార్‌ల ధర్మాసనం పేర్కొంది. తన భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు మార్చి 31న ఈ వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ మిడ్నాపూర్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్‌ మండల్‌కు 2001లో ఝార్నాతో వివాహమైంది. ప్రశాంత్‌ స్కూళ్లలో పార్ట్‌టైం టీచర్‌గా, పిల్లలకు ట్యూషన్లు చెప్పడం వంటి పనులతో కొంత సంపాదించేవాడు. అయితే తల్లిదండ్రులతో పాటు కుటుంబాన్ని పోషించడానికి ఆ ఆదాయం సరిపోయేది కాదు. దీంతో, ఆమె వేరు కాపురం ఉందామని ప్రశాంత్‌ను వేధించింది. ప్రశాంత్‌ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఝార్నా అతనిపైనా, అత్తమామలపైనా వేధింపుల కేసు పెట్టింది. ఆ కేసుతో ప్రశాంత్‌ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందకుండా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో వెస్ట్‌ మిడ్నాపూర్‌లోని ఫ్యామిలీ కోర్టులో ప్రశాంత్‌ విడాకుల కేసు దాఖలు చేయగా.. 2009లో విడాకులు మంజూరు చేసింది. దాన్ని సవాలు చేస్తూ ఝార్నా కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.

ఆసక్తికర రాజకీయం............!అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.బాపట్ల: అ...
11/04/2023

ఆసక్తికర రాజకీయం............!

అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

బాపట్ల: అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. దళితులు, మైనార్టీల అభివృద్ధిపై చర్చకు రావాలంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు (Former minister Nakka Anandbabu) విసిరిన చాలెంజ్‌ను మంత్రి మేరుగ నాగార్జున (Minister meruga Nagarjuna) స్వీకరించారు. వేమూరులో అభివృద్ధిపై, సంక్షేమంపై చర్చకు సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. ఒక్కడే వచ్చిన సరే, చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) కొడుకును తెచ్చుకున్న సరే అని... తాను మాత్రం ఒక్కడినే వస్తానని అన్నారు. ఛాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి మేరుగ స్పష్టం చేశారు.

దళితులు, మైనారిటీ సంక్షేమం - దాడులపై చర్చిద్దామని మంత్రికి నక్కా ఆనందబాబు (TDP Leader) సవాల్ విసిరారు. దమ్ముంటే మంత్రి మేరుగ నాగార్జున (AP Minister) చర్చకు రావాలన్నారు. మంత్రి మేరుగ చేసిన దాడులు, దోపిడీ, మోసాలు నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు. ఇద్దరం సాంఘిక సంక్షేమశాఖకు మంత్రులుగా చేశామని, ఎవరెవరు ఏమేం చేశామో చర్చిద్దామా అంటూ టీడీపీ సవాల్ విసిరారు.

కాగా టీడీపీ (TDP) అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇసుక, మట్టి అడ్డగోలుగా దోచేశాడంటూ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. నక్కా ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసని, నియోజకవర్గంలో జగన్‌ అన్న కాలనీల్లో ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. మట్టి తవ్వకాలకు పంచాయతీ తీర్మానాలు, కలెక్టర్ అనుమతులు ఉన్నాయని చెప్పారు. నక్కా ఆనందబాబు అక్రమ మట్టి తవ్వకాలు అంటూ హడావిడి చేయడానికి ప్రయత్నించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు.

02/09/2022
10/01/2022

కర్ణాటక రాష్ట్రం నుండి శబరిమల లోని అయ్యప్ప స్వామి దర్శనం కోసం దాదాపు 850 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న, ఈ చిన్న స్వాములు..! | NELLORE LIVE NEWS

కేంద్రం దిగి వచ్చినా ఆగని రైతు ఆందోళన.. కొత్త డిమాండ్లతో రెండో సంవత్సరంలోకి..కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ...
27/11/2021

కేంద్రం దిగి వచ్చినా ఆగని రైతు ఆందోళన.. కొత్త డిమాండ్లతో రెండో సంవత్సరంలోకి..

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజదాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు ఆందోళన సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ రోజును దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ముందుగానే మూడు వివదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంది.స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురు నానక్ జయంతి రోజున వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే చటాలు మంచివే, సదుద్దేశంతో చేసినవే, అయితే ఈ చట్టాలను వ్యతిరేక్సితున్న కొందరిని ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకే చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సందర్భంగా ప్రధాని కొందరిని ఒప్పించలేని ప్రభుత్వ అశక్తతను అంగీకరించారు.రైతులను క్షమాపణలు కోరారు.

అయినా, ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నాయకులు, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించలేదు. సంతోషం వ్యక్తం చేయలేదు. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో చట్టాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రాధాని హామీ ఇచ్చినప్పటికీ... కొత్త డిమాండ్లను తెరమీదకు తెచ్చి ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. మూడు చట్టాలను రద్దు చేస్తే చాలు, ఆందోళన విరమింఛి వెనక్కి వెళ్లి పోతామని చెప్పిన రితు నాయకులే, ఇప్పుడు, ఎంఎస్’పీ (కనీస మద్దతు ధర), ఆందోళన సందర్భంగా చనిపోయిన వారికి నష్ట పరిహారం. కేసుల ఎత్తివేత వంటి కొత్త డిమాండ్ల సాధన కోసం పాత ఉద్యమాన్ని కొత్త పంథాలో నడిపించాలని, నిర్ణయించారు. ఈ నేపధ్యంలోనే ఈరోజు (నవంబరు 26) న పాత ఆందోళన ప్రధమ వార్షి కొత్సవం జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీ సరిహద్దులు రైతుల ఈరోజు భారీ సభ నిర్వహించారు. రైతు సంఘాల ఉమంది వేదిఅక పిలుపు మేరకు నిర్వహించిన ఢిల్లీ చలో కార్యక్రమంలో వేలాదిసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.వ్యవసాయ పంటలకు కనీస మద్ధతు ధర ఇచ్చేలా చట్టపరమైన హామీతో సహా తమ డిమాండ్లు నెరవేరే వరకు రైతుల ఆందోళన కొనసాగుతుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ టికాయత్ చెప్పారు.


వెన్నుచూపని రైతుల పోరాటానికి యావత్తు ప్రపంచం సెల్యూట్ చేసింది. ఏడాదిపాటు శాంతియుతంగా చేసిన పోరాటంలో 700 మందికిపైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. సాగు చట్టాలను కేంద్రం రద్దును స్వాగతించిన అన్నదాతలు.. మిగతా డిమాండ్లు నెరవేర్చే వరకూ తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. తమ ఉద్యమానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టారు. పంజాబ్, హరియాణాల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోకి భారీగా రైతులు చేరుకున్నారు.
ఢిల్లీలో ధర్నాకు సంఘీభావం తెలుపుతూ కర్ణాటక, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో రైతులు, ట్రేడ్ యూనియన్లు జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ప్రదర్శనలు నిర్వహించారు. మరో వంక రైతుల ఆందోళనకు ప్రతిపక్షాలు సైతం మద్దతు ప్రకటించాయి. అయితే, రైతుల కొత్త డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందా లేక ఆందోళన ఈళాఆఏ కొనసాగనిస్తుందా చూడవలసి వుంది.

న్యాయవ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడులు.. రక్షించుకోవాల‌న్న జ‌స్టిస్ ర‌మ‌ణ‌..న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్య...
27/11/2021

న్యాయవ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడులు.. రక్షించుకోవాల‌న్న జ‌స్టిస్ ర‌మ‌ణ‌..

న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కోరారు. ఉద్దేశపూర్వక దాడుల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులదే అని తెలిపారు. నిజం వైపు నిర్భయంగా నిలబడటం సహా తప్పును అంతే స్థాయిలో ఖండించాలన్నారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

న్యాయవ్యవస్థ అనే కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సభ్యులని సీజే ర‌మ‌ణ‌ అన్నారు. ప్రజా సంక్షేమమే రాజ్యాంగ మూలసూత్రమని.. న్యాయవాద వృత్తి చాలా పవిత్రమైనదని గుర్తు చేశారు. రాజ్యాంగ మూల సూత్రాలు అర్థం చేసుకొని ముందుకు వెళ్లేలా ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు.

ఆర్ ఆర్ ఆర్` ర‌న్ టైమ్.. కాస్త ఎక్కువే!చ‌రిత్ర పురుషులు అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ పాత్ర‌ల‌కి క‌ల్పిత ఘ‌ట్టాల‌ను ...
27/11/2021

ఆర్ ఆర్ ఆర్` ర‌న్ టైమ్.. కాస్త ఎక్కువే!

చ‌రిత్ర పురుషులు అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ పాత్ర‌ల‌కి క‌ల్పిత ఘ‌ట్టాల‌ను జోడిస్తూ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి తెర‌కెక్కించిన పిరియ‌డ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`. అల్లూరిగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, కొమురంగా యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ నటించిన ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప‌లు భాష‌ల్లో సంద‌డి చేయ‌నుంది. పాట‌లు, ప్ర‌చార చిత్రాలతో అంచ‌నాలు పెంచేస్తున్న ఈ విజువ‌ల్ వండ‌ర్.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా ఎంట‌ర్టైన్ చేయ‌నుంది.
ఇదిలా ఉంటే.. `ఆర్ ఆర్ ఆర్` ర‌న్ టైమ్ కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. 186 నిమిషాల‌ (3 గంట‌ల 6 నిమిషాలు) నిడివితో ఈ సినిమా జ‌నం ముందుకు రానుంద‌ట‌. అదే గ‌నుక నిజ‌మైతే.. ఈ డ్యూరేష‌న్ కాస్త ఎక్క‌వనే చెప్పాలి. మ‌రి.. జ‌క్క‌న్న సినిమాలంటే ఎమోష‌న్స్, విజువ‌ల్స్ మేలి క‌ల‌యిక కాబ‌ట్టి.. మ‌రోసారి ఆ మ్యాజిక్ కొన‌సాగి ఈ లెంగ్తీ సినిమా బాక్సాఫీస్ ముంగిట సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

కాగా, `ఆర్ ఆర్ ఆర్`లో అజ‌య్ దేవ‌గ‌న్, అలియా భ‌ట్, ఓలివియా మోరీస్, శ్రియ‌, స‌ముద్ర‌క‌ని ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య నిర్మించారు.

బైసెక్సువ‌ల్‌గా బోల్డ్ రోల్‌లో స‌మంత‌!ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఎలా వున్న‌ప్ప‌టికీ ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌లో దూసుకుపోతోంది స‌మంత‌. ఆమె ...
27/11/2021

బైసెక్సువ‌ల్‌గా బోల్డ్ రోల్‌లో స‌మంత‌!

ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఎలా వున్న‌ప్ప‌టికీ ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌లో దూసుకుపోతోంది స‌మంత‌. ఆమె త‌న త‌ర్వాతి సినిమాకు సంత‌కం చేసింది. అది మామూలు ప్రాజెక్ట్ కాదు. ఫేమ‌స్ సిరీస్ 'డౌన్‌ట‌న్ అబ్బే' డైరెక్ట‌ర్ ఫిలిప్ జాన్ రూపొందించే 'ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్' అనే సినిమాలో ఆమె లీడ్ రోల్ పోషించ‌నుంది. ఈ మూవీలో సొంతంగా డిటెక్టివ్ ఏజెన్సీని న‌డిపై ఒక బైసెక్సువ‌ల్‌గా స‌మంత క‌నిపించ‌నుంది. "ఈరోజు 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్‌'తో నా జ‌ర్నీని ప్రారంభించ‌డంతో నాకోసం స‌రికొత్త ప్ర‌పంచం తెరుచుకుంది. అది మ‌నోహ‌ర‌మైన వ్య‌క్తిగ‌త క‌థ" అని వెరైటీ ప‌త్రిక‌కు తెలిపింది. ఫిలిప్ జాన్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డానికి ఉత్సాహంతో ఉన్నాన‌ని కూడా ఆమె చెప్పింది.

"ఎంతో కాలంగా ఎవ‌రి ప్రాజెక్టుల‌నైతే ద‌గ్గ‌ర‌గా ఫాలో అవుతూ వ‌స్తున్నానో, ఆ డైరెక్ట‌ర్ ఫిలిప్ జాన్‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి నేను సంతోషిస్తున్నారు. ఆయ‌న తీసిన 'డౌన్‌ట‌న్ అబ్బే'కి నేను పెద్ద అభిమానిని. 'ఓ బేబీ' త‌ర్వాత మ‌రోసారి సునీత‌తో క‌లిసి ప‌నిచేయ‌డం కోసం ఎదురుచూస్తున్నాను. ఈ మూవీలో నాది సంక్లిష్ట‌మైన క్యారెక్ట‌ర్‌. దాన్ని పోషించ‌డం నాకు ఒక స‌వాలు మాత్ర‌మే కాదు, ఒక మంచి అవ‌కాశం కూడా. సెట్‌లో దాన్ని చేయ‌డం కోసం ఎదురుచూస్తున్నా" అని చెప్పింది స‌మంత‌.

'ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్' మూవీలోని పాత్ర‌కు స‌మంత ఆడిష‌న్‌ను ఎదుర్కొంది. చివ‌రిసారిగా ఆమె 12 ఏళ్ల క్రితం 'ఏమాయ చేశావే' మూవీ కోసం ఆడిష‌న్‌కు వెళ్లింది. ఫిలిప్ జాన్‌తో క‌లిసి దిగిన ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన స‌మంత‌, "ఒక స‌రికొత్త ప్ర‌పంచం.. నేను చివ‌రిసారిగా 2009లో 'ఏమాయ చేశావే' సినిమా కోసం ఆడిష‌న్‌కు వెళ్లాను. 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ ఆడిష‌న్‌కు వెళ్లిన‌ప్పుడు అదే నెర్వ‌స్‌నెస్‌ను అనుభ‌వించాను. ఇది రోజూ ఆడిష‌న్‌కు వెళ్లే లాంటిది కాదు. 'బాఫ్టా' అవార్డు గెలుచుకున్న‌, మీ మోస్ట్ ఫేవ‌రేట్ సిరీస్ 'డౌన్‌ట‌న్ అబ్బే'ని తీసిన విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన ఆడిష‌న్‌. ఫిలిప్ జాన్ స‌ర్ న‌న్ను ఎంచుకున్నందుకు ఆనందంతో గెంతుతున్నా.. ఈ అవ‌కాశం క‌ల్పించినందుకు సునీత తాటి, గురు ఫిలిమ్స్‌కు థాంక్స్‌. ఈ ఉత్తేజ‌క‌ర‌మైన ప్ర‌యాణాన్ని స్టార్ట్ చేయ‌డం కోసం ఎదురుచూస్తున్నా." అని రాసుకొచ్చింది.

దీనికి కామెంట్స్ సెక్ష‌న్‌లో రాశీ ఖ‌న్నా, కాజ‌ల్ అగ‌ర్వాల్ కంగ్రాచ్యులేష‌న్స్ చెప్పారు. నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన త‌ర్వాత కెరీర్ ప‌రంగా స‌మంత మ‌రింత దూకుడును ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని చెప్పాలి.

సిరి చెంప ఛెల్లు మ‌నేదంట‌.. ఎందుకో..బిగ్‌బాస్ రియాలిటీ షోని అంతా అనుమానిస్తున్న‌ట్టుగానే ఓ జంట వ‌ల్గ‌ర్ స్టాయికి తీసుకెళ...
27/11/2021

సిరి చెంప ఛెల్లు మ‌నేదంట‌.. ఎందుకో..

బిగ్‌బాస్ రియాలిటీ షోని అంతా అనుమానిస్తున్న‌ట్టుగానే ఓ జంట వ‌ల్గ‌ర్ స్టాయికి తీసుకెళుతోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. హౌస్‌లో ఎమోష‌న‌ల్ బాండింగ్ పేరుతో హ‌గ్గులు, కిస్సులు.. ఎక్కువైపోయాయ‌ని... సంద‌ర్భం అనేది లేకుండానే హ‌గ్గులు .. కిస్సుల‌తో ఓ జంట నాన ర‌చ్చ చేస్తోంద‌ని నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు. ఆ జంట మ‌రెవ‌రో కాదు. సిరి, ష‌ణ్ముఖ్‌. హౌస్‌లో వీరిద్ద‌రి రొమాన్స్‌కి ఎక్క‌డా అడ్డుక‌ట్ట‌ప‌డ‌టం లేదు.

ఇటీవ‌ల సిరి త‌ల్లి హౌస్‌లోకి ఎంట‌రై ష‌ణ్ముఖ్‌ ఓ అన్న‌లా, తండ్రిలా స‌పోర్ట్ చేస్తున్నాడ‌ని, అయితే ప్ర‌తీసారి హ‌ద్దులు మీరి హ‌గ్గులు ఇవ్వ‌డం త‌న‌కేమీ న‌చ్చ‌డం లేద‌ని బాంబ్ పేల్చిన విష‌యం తెలిసిందే. ష‌ణ్ముఖ్‌కు దూరంగా వుండ‌మ‌ని, అత‌నికి ద‌గ్గ‌ర కావ‌డం త‌న‌కు న‌చ్చ‌డం లేద‌ని సిరి త‌ల్లి ఎంత చెప్పినా సిరి మాత్రం త‌న మాట‌ని లెక్క‌చేయ‌డం లేదు. అలా అంటే ష‌న్ను ఫీల‌వుతాడ‌ని చెప్పి త‌ల్లికే క్లాస్ పీకిన సిరి ఆ త‌రువాత యాజ్ యూజ్‌వ‌ల్‌గా ష‌న్నుని హ‌గ్ చేసుకోవ‌డంతో నెటిజన్స్ త‌ల్లి చెప్పినా మార‌లేద‌ని సిరిపై సెటైర్లు వేస్తున్నారు.

దీనిపై జెస్సీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. వెర్టిగో వ్యాధితో బాధ‌ప‌డుతున్న జెన్సీ ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టాడు. హౌస్‌లో త‌ను అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న స‌మ‌యంలో సిరి త‌న‌కు అండ‌గా నిలిచింద‌ని, ఆ స‌మ‌యంలో కుటుంబం వుంటే బాగుండేద‌ని ఫీల‌య్యాన‌ని, అందుకే బ‌య‌టికి వ‌చ్చాన‌ని జెస్సీ చెప్పాడు. అంతే కాకుండా హౌస్‌లో ఒంట‌రి త‌నం ఫీల‌వుతున్న‌ప్పుడు మ‌న‌కు బాగా ద‌గ్గ‌ర‌గా వుండే వాళ్ల‌తో ఎక్కువ‌గా క‌నెక్ట్ అవుతామ‌ని, అలాగే సిరి, ష‌న్ను క‌నెక్ట్ అవుతున్నార‌ని, ఓ సంద‌ర్భంలో సిరి బాత్రూమ్ గోడ‌కి త‌ల కొట్టుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, ఆ స‌మ‌యంలో నేను హౌస్‌లో వుంటే ఖ‌చ్చితంగా సిరి చెంప ఛెల్లుమ‌నేద‌ని చెప్పుకొచ్చాడు జెస్సీ.

హోంవంటలువెరైటీ వంటలుక్యారెట్‌ పొరియల్‌తమిళనాడు వంటకం చేయడం ఎంతో తేలిక. దీన్ని చపాతీలతో కలిపి తినవచ్చు. సాంబార్‌, రసాలతో ...
14/11/2021

హోంవంటలువెరైటీ వంటలుక్యారెట్‌ పొరియల్‌

తమిళనాడు వంటకం చేయడం ఎంతో తేలిక. దీన్ని చపాతీలతో కలిపి తినవచ్చు. సాంబార్‌, రసాలతో కలిపి సైడ్‌ డిష్‌గా అన్నంతో ఆస్వాదించవచ్చు.

కావలసిన పదార్థాలు: తాలింపు గింజలు: ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు: రెండు రెమ్మలు, పచ్చిమిర్చి: 2 (నిలువుగా కట్‌ చేసుకోవాలి), క్యారెట్‌ ముక్కలు: రెండు కప్పులు (కడిగి, తొక్కుతీసి, ముక్కలు తరగాలి), పసుపు, ఉప్పు, ఇంగువ: సరిపడా, నువ్వుల నూనె: రెండు టీస్పూన్లు, పచ్చి కొబ్బరి తరుగు: 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం: బాండీలో నూనె వేడి చేసి, ఆవాలు, మినప్పుప్పు వేయించాలి. తర్వాత కరివేపాకు వేసి, చిటపటలాడాక, పచ్చిమిర్చి, క్యారెట్‌ ముక్కలు వేయాలి. పసుపు, ఉప్పు, ఇంగువ వేసి కలిపి, అర కప్పు నీళ్లు పోయాలి. నీళ్లు ఇంకేవరకూ చిన్న మంట మీద ఉడికించాలి. కొబ్బరి తురుము వేసి, కలపాలి. మూత తీసి ఉంచి, నీరంతా ఇగిరిపోయి, కూర పొడిగా మారే వరకూ చిన్న మంట మీద ఉడికించాలి. తరిగిన కొత్తిమీర చల్లి వేడిగా వడ్డించాలి.

ప్రాతఃస్మరణస్తోత్రమ్ అర్థాలతోప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వంసచ్చిత్సుఖం పరమాహంసగతిం తురీయమ్ |యత్స్వప్న జాగార సుమ...
14/11/2021

ప్రాతఃస్మరణస్తోత్రమ్ అర్థాలతో

ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం
సచ్చిత్సుఖం పరమాహంసగతిం తురీయమ్ |
యత్స్వప్న జాగార సుమప్తమవైతి నిత్యం
తద్ బ్రహ్మ నిష్కలమాహం న చభూతసంఘ |1|

సచ్చిదానందరూపము, మహా యోగులకు శరణ్యము, మోక్షమునిచ్చునదీ అగు ప్రకాశవంతమైన ఆత్మాతత్త్వమునుపాత్రః కాలమునందు నా మదిలో స్మరించుచున్నాను. ఏ బ్రహ్మస్వరూపము స్వప్నము, జాగరణ, సుషుప్తి అనువాటితిని తెలుసుకొనుచున్నదో, నిత్యమూ, భేదము లేనిదీ అగు ఆ బ్రహ్మనేనే. నేను పంచబూతముల సముదాయము కాదు.

ప్రాతర్భజామి చ మనోవచసామగమ్యం
వాచోవిభాన్తి యదనుగ్రహిణ |
యంనేతినేతి వచనై నిగమా అవోచు
స్తం దేవదేవమజమచ్యుతమహురగ్ర్యమ్ |2|

మనస్సుకు, మాటలకు అందని ఆ పరబ్రహ్మను ప్రాతఃకాలమునందు సేవించుచున్నాను. ఆయన అనుగ్రహము వల్లనే సమస్త వాక్కులు వెలుగొందుచున్నవి. వేదములు 'నేతి'' "నేతి'' (ఇదికాదు, ఇది కాదు) అణు వచనములచే ఏ దేవుని గురించి చెప్పచున్నవో, జనన మరణములు లేని ఆ దేవ దేవునే అన్నిటికంటే గోప్పగాడుగా పండితులు చెప్పిరి.

ప్రాతర్భజామి తామస పరమర్కవర్ణం
పూర్ణం సనతనపదం పురుషోత్తమాఖ్యమ్ |
యస్మిన్నిదం జగదీషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజజ్గమ ఇవ ప్రతిభాసితం వై |3|

అజ్ఞానంధకారము కంటే వేరుగా సూర్యుని వలే ప్రకాశించు పూర్ణస్వరూపుడు, సనాతనుడు, అగు పురుషోత్తముని ప్రాతఃకాలము నాడు నమస్కరించుచున్నాను. అనంతస్వరూపుడగు ఆయన యందే ఈ జగత్తంతయూ తాడులో సర్పము వేలే కనబడుచున్నది.

శ్లోకత్రయమిదం పుణ్యం లోకోత్రయవిభూషణమ్ |
ప్రాతఃకాలే పరేద్యస్తు సగచ్చేత్పరమం పదమ్ |4|

మూడులోకములను అలంకరించునవి, పుణ్యకరములు అగు ఈ శ్లోకములను ఎవడైతే ప్రాతఃకాలము నందు పఠించునో వాడు మోక్షమును పొందును.

పోలింగ్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లునేడు వార్డు స్థానాలకు, రేపు మున్సిపల్‌, ఎమ్పీటీసీ స్థానాలకు1289 మంది సిబ్బంది, 1042...
14/11/2021

పోలింగ్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నేడు వార్డు స్థానాలకు, రేపు మున్సిపల్‌, ఎమ్పీటీసీ స్థానాలకు

1289 మంది సిబ్బంది, 1042 మంది పోలీసు సిబ్బంది

కలెక్టర్‌ చక్రధర్‌బాబు వెల్లడి

నెల్లూరు : నెల్లూరు నగరపాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ, ఎమ్పీటీసీ, వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్‌బాబు చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెంలతోపాటు జిల్లాలోని 4 ఎంపీటీసీ, 6 వార్డు స్థానాలకు సంబంధించి మొత్తం 4.15 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. వార్డు స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరుగుతాయని, నెల్లూరు నగరపాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి సోమవారం పోలింగ్‌ జరుగుతుందన్నారు. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు స్థానిక సెలవు దినంగా ప్రకటించామన్నారు. ఎంపీటీసీ స్థానాలకు 16న పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. ఈ ఎన్నికల కోసం 1289 మంది పోలింగ్‌ సిబ్బందిని, 1042 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్‌, ఎమ్పీటీసీ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, వార్డు స్థానాలకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున పోలింగ్‌ స్టేషన్ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్‌ సరళిని ప్రజలు చూసేందుకు 145 కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ప్రత్యేక కౌంటింగ్‌ ఏర్పాట్లు చేట్టి టేబుల్స్‌ సంఖ్య పెంచామని తెలిపారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాబడిన ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్‌ సమయంలో చివరి గంటలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పొలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచేందుకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. త్వరితగతిన కౌంటింగ్‌ ఫలితాలు వెల్లడించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎస్పీ విజయరావు మాట్లాడుతూ 51 కేంద్రాలను అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా, 80 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ కేంద్రాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నెల్లూరులో ఏడుగురు డీఎస్పీలు, బుచ్చిరెడ్డిపాళెంలో ఇద్దరు డీఎస్పీలను పోలింగ్‌ నిర్వహణకు నియమించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు బసంతకుమార్‌, నెల్లూరునగరపాలక సంస్థ కమిషనర్‌ దినే్‌షకుమార్‌, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Address

ULAVAPALLA
Pune
524152

Alerts

Be the first to know and let us send you an email when Nellore Live News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nellore Live News:

Share