23/01/2026
గొడవలకు వెళ్ళకండి.. అందరూ ప్రశాంతంగా ఉండండి..
మహిళలు, ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత అంశంగా విస్తృతంగా అవగాహన కల్పన... డి.ఎస్.పి..
కేసాపురం గ్రామంలో గ్రామ సభ...
గ్రామంలో ఎవరు ఎటువంటి గొడవలు కక్షలు కార్పన్యాలకు వెళ్లకుండా ప్రశాంతంగా జీవించాలని పుట్టపర్తి డిఎస్పి విజయ్ కుమార్ సూచించారు శుక్రవారం రాత్రి కేశపురం గ్రామంలో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ..
మహిళలు,ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత గా బావించి గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన చేపట్టామని
శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో నేరాల పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని, మహిళ భద్రత,మాదక ద్రవ్యాలు వలన కలిగే దుష్ప్రభావలు. సైబర్ సేఫ్టీ. రోడ్డు సేఫ్టీ. శక్తీ యాప్, డిజిటల్ మోసాలు మహిళలు, బాలికలపై జరిగే నేరాలు ,
డ్రంక్ అండ్ డ్రైవ్, బాల్య వివాహాలు ,ఫోక్సో కేసుల , గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ లపై ప్రజలకు వివరించారు.
తమ పిల్లలను బాగా చదివించుకొని ఉన్నత విద్యావంతులు చేసుకోవాలని సూచించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా మీ ప్రాంతంలో సంతరిస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100,112 కు సమాచారం అందించాలని, ఈ సందర్భంగా డిఎస్పీ తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సీఐ మారుతి శంకర్ , గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పుట్టపర్తి పోలీస్ సబ్ డివిజన్.