Ap hub 24 X 7

Ap hub 24 X 7 24/7 Andhara Pradesh News Updates aphub24x7

29/05/2021

ఓడి చెరువు. మండలంలో ప్రాథమిక ఆరోగ్య వైద్యశాల ను, బియ్యం స్టాక్ పాయింట్ ను శనివారం పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. మొదట ప్రాథమిక ఆరోగ్య వైద్యశాల తనిఖీ చేసి ఇ వ్యాక్సినేషన్ ఏ విధంగా జరుగుతుంది టెస్ట్ లు ఎన్ని చేస్తున్నారు అని వైద్యాధికారి ఇ ఆనంద్ వర్ధన్ అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ వీలైనంత ఎక్కువ మందికి వేయాలని, ఎక్కువ మందికి కోవిడ్ పరీక్షలు చేయాలని అని సూచించి పూలు రికార్డులను పరిశీలించారు. అనంతరం బియ్యం స్టాక్ పాయింట్ ను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు స్టాక్ ఎంత ఉంది ఎంత స్టాక్ గ్రామాలకు తరలించారు అని స్టాక్ లిస్ట్ రవి స్వామి ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి అభ్యర్థి దామోదర్ రెడ్డి, మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, డీలర్లు అశ్వంత్ రెడ్డి, రంగారెడ్డి, జౌళి బాబా,తదితరులు పాల్గొన్నారు.

28/05/2021

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 99 వ జయంతి సందర్భంగా కదిరి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు స్థానిక టిడిపి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా టిడిపి నాయకుడు బండారు మనోహర్ నాయుడు మాట్లాడుతూ 1983 లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను మార్పులు తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశం కల్పించిన ఘనత రామారావు ది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బండారు మనోహర్ నాయుడు ,మోపూరిశెట్టి చంద్రశేఖర్, కౌన్సిలర్లు ఆల్ఫా ముస్తఫా, రమణ,బాబయ్య , నాయకులు గుత్తా కళ్యాణ్,గోపాల్ నాయుడు, డైమండ్ ఇర్ఫాన్, సులేమాన్ , నాసిర్ , బండారు రవి , ప్రశాంత్ నాయుడు , నందా తదితరులు పాల్గొన్నారు.

25/05/2021

అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పిలుపు మేరకు కోవిడ్ బాధితులకు బాసటగా అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ బాధితులను పరామర్శిస్తుండగా, పోలీసులు హుటాహుటిన వచ్చి కదిరి మాజీ ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ను అదుపులోకి తీసుకొని అనంతపురం 2 వ పట్టణ పొలీస్ స్టేషన్ కు తరలించారు.

25/05/2021

అనంతపురం జిల్లా కదిరి పట్టణం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని కోవిడ్ కేర్ సెంటర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించి కరోనా రోగులకు వైద్యం, భోజనం, పరిశుభ్రత విషయాలలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించి వాటిపై లోపాలను ప్రభుత్వానికి తెలియజేయుటకు పంపించడం జరిగింది. అందులో భాగంగా అనంతపురంలోని కోవిడ్ కేర్ సెంటర్లో పరిశీలనకు వెళ్లిన కదిరి టీడీపీ ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ని అరెస్టు చేయడం, అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకులను కోవిడ్ సెంటర్లకు వెళ్లకుండా ప్రభుత్వం అరెస్టు చేయడం పై జిల్లా అధికార ప్రతినిధి బండారు మనోహర్ నాయుడు మండిపడ్డారు. ప్రతిపక్షం కోవిడ్ కేర్ సెంటర్ల పరిశీలనకు వెళితే అక్కడ నిజాలు బయటపడతాయని ముఖ్యమంత్రి భయపడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేయడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా విషయంలో పూర్తి స్థాయిలో స్పందించాలని, కరోనా రోగులకు మంచి వైద్యం, పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.

23/05/2021

కొత్తచెరువు గ్రామానికి చెందిన మహిళ రిషీ (28) 108 వాహనం లోనే ప్రసవం.

*జిల్లాకు పీఎం కిసాన్ జాతీయ అవార్డు*  *ఈ నెల 24న ఢిల్లీలో అవార్డు తీసుకోనున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు* ఫిబ్రవరి 19...
19/02/2021

*జిల్లాకు పీఎం కిసాన్ జాతీయ అవార్డు*

*ఈ నెల 24న ఢిల్లీలో అవార్డు తీసుకోనున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు*

ఫిబ్రవరి 19, అనంతపురము

ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో అనంతపురము జిల్లా ముందు వరుసలో ఉంటుందని మరోసారి రుజువైంది. తాజాగా కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ అవార్డు సొంతం చేసుకుని జిల్లా సత్తా చాటింది. పీఎం కిసాన్ పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవంతో పాటు పథకం అమలులో ముందు వరుసలో ఉన్న జిల్లాలకు అవార్డులు ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పీఎం కిసాన్ లో లబ్ధిదారుల ఫిజికల్ వెరిఫికేషన్ విభాగంలో జిల్లాకు అవార్డు వరించింది.

పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారిలో 28,505 మంది రైతుల వెరైఫికేషన్ ను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. జాతీయ స్థాయిలో మరే జిల్లాలోనూ లేని విధంగా 99.60 శాతం రైతుల వెరిఫికేషన్ పూర్తి చేయడంతో జిల్లాకు అవార్డు దక్కింది.

జిల్లాకు అవార్డు రావడంపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆనందం వ్యక్తం చేశారు. అక్షర క్రమంలో ముందు వరుసలో ఉన్న అనంతపురము జిల్లా అభివృద్ధి, సంక్షేమంలోనూ ముందు వరుసలో ఉంటుందని మరోసారి నిరూపితమైందన్నారు. గతంలో కిసాన్ రైలు వంటి కార్యక్రమానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కిందని, ఇప్పుడు వ్యవసాయ రంగంలోనే మరో అవార్డు దక్కడం ద్వారా రైతుల కోసం జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి దేశ వ్యాప్త గుర్తింపు దక్కినట్టయిందన్నారు.

ఫిబ్రవరి 24న న్యూఢిల్లీ పుసా భవనంలో నిర్వహించనున్న పీఎం కిసాన్ వార్షికోత్సవ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో కలిసి కలెక్టరు అవార్డు స్వీకరించనున్నారు.

ఆ గ్రామంలో 33 ఏళ్లుగా ఆయన చెప్పిందే వేదం... నిలబెట్టిన వారే సర్పంచ్...ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పంచాయతీ  ఎన్నికల హడావిడి ...
19/02/2021

ఆ గ్రామంలో 33 ఏళ్లుగా ఆయన చెప్పిందే వేదం... నిలబెట్టిన వారే సర్పంచ్...

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఏకగ్రీవాల కోసం, విజయాల కోసం పార్టీలు, వారు మద్దతిచ్చిన అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.

సర్పంచిగా ఒక్కసారి గెలవడానికే ఆపసోపాలు పడిపోయే కాలం ఇది. పంచాయతీని బట్టి ఎన్నికల ఖర్చు లక్షలు కోట్ల రూపాయలు దాటి పోతున్నాయి. అలాంటిది ఓటర్లకు వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా వరుసగా ఆరు ఎన్నికలలో అంటే ముపైమూడేళ్లుగా ఆ నాయకుడు చెప్పిన వాళ్లకే ఓట్లు వేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం ప్రజలు. అలాగని అదేదో వెయ్యో పదిహేను వందల ఓట్లున్న చిన్న గ్రామం కాదండోయ్. మొత్తం ఓటర్లు 5,563 మంది. ప్రతి ఎన్నికలలో అయిదు వందల ఓట్లు తగ్గకుండా మెజారిటీ.

ఆయన నిలబెట్టిన వారే సర్పంచ్

ఆయన పేరు సలాది వెంకట్రావు. అందరూ వెంకన్న అంటారు. 1988లో సర్పంచిగా తొలిసారి పోటీ చేసి 864 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. అధ్వానంగా ఉండే ఊరిని బాగు చెయ్యడంలో విశేష కృషి చేసారు. 1995 ఎన్నికలలో సర్పంచ్ పదవి బిసి మహిళకు కేటాయించారు. అప్పుడు కుడిపూడి శారదను వెంకట్రావు పోటీలో నిలపగా 1347 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2001లో ఒసి జనరల్ కావడంతో ఆయనే పోటీ చేసి 1046 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. 2006లో బిసి జనరల్ అయ్యింది ఇళ్ల శేషాద్రి శ్రీనివాస్ ని పోటీలో నిలిపి 678 ఓట్లు మెజారిటీతో గెలిపించారు. 2013లో ఎస్సీ జనరల్ అయ్యింది. అయితే ఎంతో నమ్మకంగా ఉండే పంచాయతీలో పారిశుధ్య కార్మికరాలు యర్రంశెట్టి వెంకాయమ్మను పోటీలో నిలిపి 1310 ఓట్లు మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు కూడా ఎస్సీ లకే రిజర్వ్ అయ్యింది. ఈసారి ఎమ్ఎ చదివిన లంక వర ప్రసాద్ ను పోటీలో నిలిపారు. నామినేషన్లుకు రెండు రోజుల ముందు ప్రసాద్ ను పిలిచి పోటీ చేయాలని వెంకట్రావు ప్రతిపాదించారు. మొత్తం అయిదుగురు పోటీలో ఉండగా జనసేన అభ్యర్థిగా వెంకట్రావు పోటీచేయించిన ప్రసాద్ 776 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఓట్లు అడగడాలుండవ్...

వెంకట్రావు ఎన్నికల ప్రచారం చాలా విచిత్రంగా ఉంటుంది. బలపర్చిన అభ్యర్థి దండం పెట్టుకుని నడుస్తుంటే పక్కన చేతులు వెనక్కి పెట్టి వెంకట్రావు ఓట్లు అడిగేతీరు ఆశ్చర్యం కల్పిస్తుంది. “నేను ఇతన్ని పోటీలో నిలబెట్టాను...నామీద నమ్మకం ఉంటే ఓటు వెయ్యండి లేకపోతే మానేయండి..” అని మొహమాటం లేకుండా చెబుతాడు. ఏ ఓటరకు చేతులు జోడించి దణ్డం పెట్టరు. ప్రచారానికి కూడా ఎవరనీ పనులు మానుకుని రావద్దంటారు. అభ్యర్థితో పాటు ఈయన ఒక్కరే తిరుగుతారు. ఓటర్లకు ఎలాంటి ప్రలోబాలు ఉండవు. ఎన్నికల గుర్తు తెలిడం కోసం డోర్ పోస్టర్స్ ముద్రిస్తారంతే. ఈ సారి తక్కువ సమయం ఉన్నందున మైకు పెట్టి ఆటోలో ప్రచారం చేశారు. మొత్తం 14 వార్డులలో పది వార్డులు వెంకట్రావు నిలబెట్టిన వారినే గెలిపించారు: ఓటుకు కిలో చికెన్, 30 గుడ్లు.. పీక్స్ కి చేరిన పంచాయతీ ప్రచారం
తిట్టుకున్నా.. ఓట్లేస్తారు...

మూలస్థాన అగ్రహారం వెళ్ళి వెంకన్న ఎలాంటోడని అడిగితే పిచ్చొడండి బాబూ..అని తిట్టుకుంటారు. ఎందుకంటే ఎవరికీ అనుకూలంగా చేయరు. తను చెయ్యాలనుకున్నదనే చేస్తారు. అందరికీ న్యాయం జరగాలంటారు. అందుకునే తిట్టుకున్న వాళ్లు కుడా ఓట్లేసి గెలిపిస్తారు. ఎన్టీఆర్ పై అభిమానంతో పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉన్నారు. అయితే ఇటీవల పార్టీలో ఎన్టీఆర్ ఆశయాలు సన్నగిల్లాయని పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరానని చెప్తారాయన. తన రాజకీయమంతా సైకిల్ పైనే సాగింది. తెల్లవారుజామునే ఊరంతా తిరిగి పారిశుద్ధ్యం, త్రాగు నీరు, వీధి లైట్లు వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తారు. రాజకీయంగా రూపాయి ఆశించరు. పావలా పెట్టరు. డబ్బు ఖర్చు పెట్టి గెలిస్తే వాటిని సంపాదించుకోవడానికి అడ్డదారులు తొక్కుతారంటారు వెంకట్రావు. అసలు సర్పంచ్ కు చెక్ పవర్ ఉండకూడదని వాదిస్తారు. అంతేకాదు రెండున్నర ఏళ్ల తర్వాత సర్పంచ్ పాలన ప్రజలకు నచ్చకపోతే రీకాల్ ద్వారా తొలగించే చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేస్తారు.ప్రస్తుత రోజుల్లో ఇటువంటి నాయకులు అత్యంత అరుదుగానే ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు

*ఏపీకి వర్ష సూచన*ఆంధ్రప్రదేశ్‌ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడ...
19/02/2021

*ఏపీకి వర్ష సూచన*

ఆంధ్రప్రదేశ్‌ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది*. ఈ ప్రభావంతో శుక్రవారం దక్షిణ కోస్తాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడొచ్చని సూచించారు. శుక్రవారం ఉదయం నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పంటలు చేతికి అందివచ్చే సమయం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. తేలికపాటి జల్లులు అయితే సమస్యలేదని.. భారీ వర్షాలు పడితే ఇబ్బందులు తప్పవంటున్నారు.
మరోవైపు తెలంగాణలో కూడా వానలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది.. రోడ్లు జలమయం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుండి ఇలా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

*ప్రజలు అభివృద్ధికి అండగా నిలిచారు**రెండింతల అభివృద్ధిని చేసి చూపిస్తాం**అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ...
18/02/2021

*ప్రజలు అభివృద్ధికి అండగా నిలిచారు*

*రెండింతల అభివృద్ధిని చేసి చూపిస్తాం*

*అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ*

అనంతపురం ,ఫిబ్రవరి18 :

అనంతపురం అర్బన్ పరిధిలోని పంచాయతీల ప్రజలు వైసిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కి సంక్షేమ పాలనకు అండగా నిలిచి తమ అభ్యర్థులను అఖండ మెజారిటీ తో గెలిపించారని ప్రజల నమ్మకాలను వమ్ము చేయకుండా ఇంతకు రెండింతల అభివృద్ధిని అందజేస్తాం అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలోని 3 పంచాయతీలలో ఘన విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులు దూదేకుల ఆశాబీ, సుగాలి పద్మావతి, ఉదయ్ శంకర్ లు గురువారం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులు తమ మద్దతుదారులను విజయానికి కీలకంగా వ్యవహరించాయి అని తెలిపారు. ప్రజాసంక్షేమ పాలనతో పాటు తగిన మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని,ప్రజల నమ్మకాన్ని ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏవిధంగా అయితే నెరవేర్చాడో అదే బాటలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు.వైసిపి ప్రభుత్వం పై నమ్మకంతో గత మొదటి రెండవ విడత లో మాదిరిగా మూడో విడత పంచాయతీ ఎన్నికల లోనూ 80 నుంచి 85 శాతం సర్పంచ్ అభ్యర్థులను అందించి ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ప్రజలు అందించిన విజయాన్ని తాము ప్రజా విజయంగా భావించి వారికి సేవ చేస్తామని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

*'అన్ని వార్డుల కౌంటింగ్ ఒకేసారి మొదలు కావాలి'*  *'సాయంత్రం 8 గంటలకే కౌంటింగ్ పూర్తవ్వాలి'*  *'ఎన్నికల నిబంధనల ప్రకారమే ...
18/02/2021

*'అన్ని వార్డుల కౌంటింగ్ ఒకేసారి మొదలు కావాలి'*

*'సాయంత్రం 8 గంటలకే కౌంటింగ్ పూర్తవ్వాలి'*

*'ఎన్నికల నిబంధనల ప్రకారమే రీకౌంటింగ్ నిర్వహించాలి'*

*'సర్పంచ్, ఉప సర్పంచు ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రకటించాలి'*

నాలుగో దశ పోలింగ్ నిర్వహణపై నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

ఫిబ్రవరి 18, అనంతపురము

గురవారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలోని ఎన్ఐసీ భవనం నుంచి నాలుగో దశ గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇప్పటికే పూర్తయిన మూడు దశల గ్రామ పంచాయితీ ఎన్నికలలో అక్కడక్కడా నెలకొన్న చిన్న చిన్న సమస్యలు పెనుకొండ డివిజన్ లో జరగనున్న ఆఖరి దశ ఎన్నికలలో పునరావృతం కాకుండా ఉండాలంటే అనుసరించాల్సిన కార్యాచరణ గురించి కలెక్టర్ మాట్లాడారు.

ముందుగా పోలింగ్ సమాచారం ప్రతి గంటకోసారి ఆలస్యం కాకుండా అందించాల్సిన బాధ్యత ఎంపీడీవోలదేనని తెలిపారు. ఉదయం 6:30 గంటలకు పోలింగ్ మొదలయినప్పటి నుంచి ప్రతి గంటకూ సంబంధించిన పోలింగ్ రిపోర్టు పది నిమిషాల తేడాతో తనకు చేరాలని ఆదేశించారు. పోలింగ్ రిపోర్టు అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఎంపీడీవోలు నియమించుకోవాలన్నారు.

ఓట్ల లెక్కింపు తొందరగా పూర్తిచేయాలని ఆదేశిస్తూ పోలింగ్ అధికారులకు టైమ్ లైన్ ఇచ్చారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పోలింగ్ పూర్తయితే పది నిమిషాలలో వార్డుల కౌంటింగ్ మొదలవ్వాలన్నారు. సాయంత్రం 8:00 గంటలకు వార్డు మెంబర్లు, సర్పంచ్ ఓట్ల కౌంటింగ్ పూర్తవ్వాలన్నారు.

కౌంటింగ్ చేసేటప్పుడు ఒక వార్డు తర్వాత మరో వార్డు లెక్కపెట్టడం సరికాదన్నారు. అన్ని వార్డుల ఓట్లు ఒకేసారి లెక్కపెట్టాలన్నారు. అన్ని వార్డు ఓట్లను ఒకేసారి కౌంటింగ్ చేసేందుకు అనుగుణంగా ఉండేలా పెద్ద హాలు, సరిపడినన్ని బెంచీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వార్డుల ఓట్లతో పాటూ సర్పంచు ఓట్లను కూడా ఏకకాలంలో కౌంటింగ్ చేయాలన్నారు.

కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడి చేసి, అప్పటికప్పుడు ఉప సర్పంచు ఎన్నిక కార్యక్రమం నిర్వహించి, గెలిచిన వారికి ధ్రువ పత్రాలు కూడా అక్కడే జారీ చేయాలన్నారు.

రీకౌంటింగ్ నిబంధనల గురించి ఆర్వోలు క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి రీకౌంటింగ్ నిర్వహించకూడదన్నారు.. ఈ అంశంలో ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు..

*జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సంచలన ఆదేశాలు..*విజయవాడ: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ సంచ...
18/02/2021

*జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సంచలన ఆదేశాలు..*

విజయవాడ: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్‌ఈసీ మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ నెల 20లోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ పేర్కొంది. గతంలో నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను కూడా ఇవ్వాలని ఎస్ఈసీ పేర్కొంది.ఫిర్యాదులు లేకపోయినా.. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా.. కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనతో తెలిపింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు.

ఇటీవల నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపుల కారణంగా నామినేషన్ వేయనివారికి తిరిగి అవకాశం కల్పించాలని ఎస్. గుంటూరులోని మాచర్ల, కడపలోని పులివెందుల, రాయచోటి, చిత్తూరులోని పుంగనూరు, పలమనేరు, తిరుపతి నగర పాలక సంస్థలో సింగిల్ నామినేషన్లపై అధికారులను రమేశ్ కుమార్ నివేదిక కోరారు. ఈనెల 20 లోపు పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బెదిరిస్తున్నారని రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఆ వార్డుల్లో నామినేషన్లు తీసుకోవాలని సూచించారు. బెదిరింపులపై మీడియాలో వచ్చిన వార్తలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు..ఆయా రాజకీయపక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రమేశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు...

Address

Puttaparthi

Telephone

+919989115108

Website

Alerts

Be the first to know and let us send you an email when Ap hub 24 X 7 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ap hub 24 X 7:

Share