Public voice

Public voice this page very useful to me and publicing my news thank you

11/11/2021

తిరుమల బ్రేకింగ్ న్యూస్

తిరుమల నుంచి తిరుపతి ప్రయాణించే ఘాట్ రోడ్ మూసివేత

భారీ వర్షాల కారణంగా మొదటి ఘాట్ రోడ్డులో అక్కడక్కడా విరిగి పడుతున్న కొండచరియల

ఈ కారణంగా రాత్రి 7 గంటల నుండి తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించే ఘాట్ రోడ్ లో రాకపోకలు నిషేధించారు

టిటిడి భద్రతా సిబ్బందిL

అక్రమ మద్యం పట్టివేతఅనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలోని శ్రీ విద్యా కాలేజ్ వద్ద కర్ణాటక ఆక్రమ మద్యం అమ్ముతున్నారని సమా...
25/08/2021

అక్రమ మద్యం పట్టివేత

అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలోని శ్రీ విద్యా కాలేజ్ వద్ద కర్ణాటక ఆక్రమ మద్యం అమ్ముతున్నారని సమాచారం రావడంతో తన సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేయగా పోలినేని గోపాల్: నాయుడు పట్టుబడ్డాడని ఎస్ఐ లింగన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అతని వద్ద నుండి 12 బెంగుళూరు విస్క్ 90 ఎంఎల్ టెట్రా ప్యాకెట్లతో పాటు మోటార్ సైకిల్ ను సీజ్ చేసి, అతని పైన కేసు నమోదు చేసి రిమాండుకు పంపించడం జరిగిందిని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హర్ష, శివ, రమేష్, జిల్లా నాయక్ పాల్గొన్నారు.

05/01/2021

కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే మరో వ్యాధి తన పంజా విసురుతోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన బర్డ్‌ ఫ్లూ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ క్రమంగా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త వైరస్‌ను రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఈ వైరస్‌ను గుర్తించారు.ఆయా రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో కాకులు, నెమళ్లు, బాతులు, కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు ముందస్తు చర్యలను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే కేరళలో వేలాది పక్షులను చంపేస్తున్నారు. ఇదిలా ఉంటే హిమచల్‌ ప్రభుత్వం బర్డ్‌ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చికెన్‌, గుడ్లు, చేపల విక్రయంపై నిషేధం విధించారు. ప్రజలకు కూడా బర్డ్‌ ఫ్లూ సోకే ప్రమాదం పొంచి ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇదిలా ఉంటే బర్డ్‌ ఫ్లూ కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న పాంగ్‌ డ్యామ్‌ లేక్‌లో వలస బాతులు బర్డ్‌ఫ్లూ బారిన పడ్డాయి. రాజస్థాన్‌లోనూ సోమవారం 170 వరకు పక్షులు మృతి చెందాయి.

30/12/2020

*అంగనవాడి, ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి*

పుట్టపర్తి అర్బన్ అంగనవాడి, ఆశా వర్కర్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిపిఎం, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీలు, ఆశాలు హెల్పర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సి ఐ టి యు కార్యదర్శి గౌస్ లాజాం మాట్లాడుతూ తక్కువ వేతనంతో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయకపోవడం అన్యాయమన్నారు. వారిని నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి మెరుగైన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో వారి తరఫున ఉద్యమిస్తామన్నారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ నరసింహుల కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు రాము, రామాంజనేయులు, బాబావలి, వెంకటేష్ అంగన్వాడి ఆశాల సంఘం నాయకురాళ్లు సుజాతమ్మ, రేణుక దేవి తదితరులు పాల్గొన్నారు.

27/12/2020

అనంతపురం జిల్లా పుట్టపర్తి పేదలకు సొంతింటి కల నెరవేరడమే ప్రభుత్వ లక్ష్యమని శాసన సభ్యుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం నగర పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి లో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేస్తున్నామన్నారు. నగర పంచాయతీలో 2089 మంది లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేశామని 432 మందికి టిట్కో గృహాలు పంపిణీ చేస్తున్నామన్నారు.మంజూరు కాక పోతే తిరిగి దరఖాస్తు చేసుకుంటే 90 రోజులలో మంజూరు చేస్తామన్నారు. టిడిపి నాయకులు ఇంటి పట్టాలు ఇవ్వకుండా కోర్టుల కెక్కి ఇబ్బంది పెట్టినా, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట నెరవేర్చుతున్నారన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఈఈ చంద్రమౌళి రెడ్డి, ప్రత్యేక అధికారి హరిప్రసాద్, కమిషనర్ శివరామిరెడ్డి, వైసిపి కన్వీనర్లు మాధవరెడ్డి, గంగాద్రి, నాయకులు కొండారెడ్డి, లోచర్ల విజయభాస్కర్ రెడ్డి, నారాయణ రెడ్డి, సాయి లీల, సాయి గీత, తిప్పన్న తదితరులు పాల్గొన్నారు.

"" ఔను నేను అభిమన్యుడినే""ఔను నేను అభిమన్యుడనే..వ్యవసాయ"ఋణ"క్షేత్రంలో నిత్య ఓడుతున్న అభిమన్యుడిని నేను.పగబట్టిన ప్రకృతి ...
23/12/2020

"" ఔను నేను అభిమన్యుడినే""

ఔను నేను అభిమన్యుడనే..
వ్యవసాయ"ఋణ"క్షేత్రంలో నిత్య ఓడుతున్న అభిమన్యుడిని నేను.
పగబట్టిన ప్రకృతి ప్రకోపానికి గురై..
నేలున్నా చినుకులు కనికరం లేక..
నిత్య వలసవాసం చేస్తున్న అభిమన్యుడిని నేను.
అనుదినం ఓడుతున్నా.. మరోసారి వ్యవసాయ జూదం చేద్దామనుకునే ధర్మరాజు వారసుడు అభిమన్యున్ని నేను.
కడదాకా తోడుండిన కాడెడ్లకు కడుపు మాడుస్తూ..
ఆలుమగలొక చోట, బిడ్డలొకచోట.
వలసవాసంలో ప్రతి ఒక్కరం పాత్రదారులమే జీవితమనే నర్తనశాలలో.
హలం పట్టిన పాపానికి
హాలాహలం చేతికొచ్చింది.
అయినా తెలిసీ అదే తప్పు చేస్తున్నా..
పద్మవ్యూహంలోకి తెలిసీ వెళ్లిన అభిమన్యుడిలా..
వర్షాన్ని నమ్ముకొని పంటపెట్టి,
అభివృద్ధి చేయకున్నా వాడికే ఓటేసి.
పంటల విలువను వలువల్లాగా లాగేస్తున్న దళారులతో..
తీరని దారుణ ఋణాలతో..
నా శరీరం తూట్లు పాలై
వ్యవసాయ రణరంగమనే పద్మవ్యూహంలో కసితీరా కాటేసిన కరువు రక్కసికి బలైన అభిమన్యుడిని నేను.
ఇప్పటికీ నా పరిస్థితి ఉరికొయ్యపై ప్రాణం పోని దృశ్యం.
ఇంతకీ నేనేప్రాంతం వాడినో తెలుసా..
ఉరుముల్ని,మెరుపుల్ని అరుదుగా మాత్రమే చూసే ప్రాంతం వాడిని.
ఐదొందలు కోట్లు ఖర్చుపెట్టినా నాలుగు చినుకులు రాలని అనంత రైతుని..

Public voice
19/12/2020

Public voice

*రాష్ట్రంలోని జర్నలిస్టులకు టిడ్కో ఇళ్లను కేటాయించాలి.**కరోనాతో మృతిచెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షలు వ...
19/12/2020

*రాష్ట్రంలోని జర్నలిస్టులకు టిడ్కో ఇళ్లను కేటాయించాలి.*

*కరోనాతో మృతిచెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షలు వెంటనే ఇవ్వాలి*

*అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు అందజేయాలి.*

*సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి*
*మచ్చా రామలింగారెడ్డి*
*(రాష్ట్ర అధ్యక్షులు, జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ) విజ్ఞప్తి.*

-------------------------------------------------

👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో ఇప్పటికే టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్లను జర్నలిస్టుల అందరికీ కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేశారు.

👉టిడ్కో ద్వారా నిర్మించిన ఇల్లు సింగల్ బెడ్ రూమ్, డబల్ బెడ్ రూమ్ ఇల్లు త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రభుత్వం ఎవరికి కేటాయించలేదు కాబట్టి వెంటనే ఇళ్లను రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ కేటాయించాలి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

👉ఈరోజు అనంతపురం R&B గెస్ట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడుతూ మచ్చా రామలింగారెడ్డి.. డిసెంబర్ 25న రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల పట్టాలు ఇవ్వాలని టిడ్కో ఇల్లు పంపిణీ చేయాలని, ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని, జర్నలిస్టులను ఆదుకోవాలని మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు.

👉ప్రభుత్వం ప్రకటించిన విధంగా కరోనాలో మృతి చెందిన జర్నలిస్టులకు 5 లక్షలు వెంటనే చెల్లించాలని మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని వారిని ఆదుకోవాలని మచ్చా కోరారు.

👉రాష్ట్ర వ్యాప్తంగా 40 మందికి పైగా జర్నలిస్టులు కరోనాతో మృతిచెందారని వారి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని వెంటనే ఆర్థిక శాఖ, సమాచార శాఖ అధికారులు నిధులు విడుదల చేసి ఆదుకోవాలన్నారు.

👉13 జిల్లాల్లో టిడ్కో ద్వారా ప్రభుత్వం ఇళ్లు నిర్మించి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలతో పాటు నగరాల్లో కూడా చేరడానికి అనువుగా ఉన్నాయని వాటిని రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు కేటాయించాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు జర్నలిస్టులకు ఆ ఇల్లు కేటాయిస్తే జర్నలిస్టులు చిరస్థాయిగా వైయస్ జగన్ పేరు గుర్తుంచుకుంటారాని పరిశీలించి వెంటనే న్యాయం చేయాలని జర్నలిస్టులను ఆదుకోవాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు

👉రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు జర్నలిస్టులందరికీ ఆ ఇళ్లను కేటాయించాలని రాష్ట్రంలోని జర్నలిస్టులు అందరూ ఇదే అంశం మీద మాట్లాడాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు.

👉రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సీఎం జగన్ జర్నలిస్టులను ఆదుకోవాలని అన్నారు.

👉సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరాజు, ఆంధ్రప్రభ రాజా, భాస్కర్ రెడ్డి, శ్రావణ్, కుల్లాయస్వామి, జానీ, హనుమంతు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యం**▪️ఈ నెల 25 నుంచి పండుగలా ‘ఇంటి పట్టాల పంపిణీ’**▪️అనంతపురం నియోజకవర్గంలో 33,067 మంది లబ...
19/12/2020

*పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యం*

*▪️ఈ నెల 25 నుంచి పండుగలా ‘ఇంటి పట్టాల పంపిణీ’*

*▪️అనంతపురం నియోజకవర్గంలో 33,067 మంది లబ్ధిదారుల ఎంపిక*

*▪️2112 మంది టిడ్కో లబ్ధిదారులకూ ఇంటి పట్టాలు*

*▪️నెల పాటు లబ్ధిదారులందరికీ స్థలం చూపి పట్టాలందిస్తాం*

*▪️రెండు దశల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడతాం*

*▪️ప్రతిపక్ష నేతల మాటలు విని ఎవరూ ఆందోళన చెందొద్దు*

*▪️రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా సంక్షేమ పథకాల విప్లవం*

*▪️చంద్రబాబు వంటి ప్రతిపక్ష నేత ఉండడం దురదృష్టకరం*

*▪️అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం*

*▪️ఇంకా అర్హులుంటే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోండి*

*▪️ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టీకరణ*

*▪️టిడ్కో ఇళ్లకు కట్టిన డబ్బును తిరిగి చెల్లిస్తాం : కమిషనర్‌*

*▪️కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాలకు త్వరలో పరిష్కారం : ఆర్డీఓ*

అనంతపురం, డిసెంబర్‌ 19 :

పేదవాడి సొంతింటి కలను సాకారం చేసి వారి ముఖాల్లో చిరునవ్వును చూడాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగానే ఈనెల 25వ తేదీ నుంచి నెల రోజుల పాటు పండుగ వాతావరణంలో ఇంటి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. లబ్ధిదారులందరికీ లేఅవుట్‌లలో ‘ఇదే మీ స్థలం’ అని చూపించి మరీ పట్టాలు అందిస్తామని స్పష్టం చేశారు. శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో కమిషనర్‌ మూర్తి, ఆర్డీఓ గుణభూషన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అనంత ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉగాది నాటికే పట్టాలు ఇవ్వాలని అనుకున్నా చంద్రబాబు, టీడీపీ నేతల కారణంగా ఆలస్యమైందన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏనాడూ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించలేదని, పైగా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వంటి నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండడం దురదృష్టకరమని అన్నారు. గుడిసెల్లేని ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయాలన్న లక్ష్యంతో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 47 లక్షల మందికి ఇళ్లు నిర్మించారని గుర్తు చేశారు. వైఎస్‌ ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా సీఎం జగన్‌ రెండు అడుగులు ముందుకు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25వ తేదీన 30.75 లక్షల మంది సొంతింటి కలను సాకారం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా ఏనాడూ సంక్షేమ పథకాలు ఆగలేదని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ విప్లవం కొనసాగుతోందని చెప్పారు.

*33,067 మంది లబ్ధిదారుల ఎంపిక*

అనంతపురం నియోజకవర్గ వ్యాప్తంగా 33,067 మంది లబ్ధిదారులకు ఇంటిపట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే అనంత తెలిపారు. ఇందులో టిడ్కో లబ్ధిదారులు 2112 మంది ఉన్నారని, వారందరికీ ఉచితంగానే స్థలాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష నేతల మాటలు విని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టిడ్కో లబ్ధిదారులు కట్టిన డబ్బును తిరిగి చెల్లిస్తామని తెలిపారు. అర్హులందరికీ ఇంటి పట్టాలు ఇవ్వడమే తమ లక్ష్యమని తెలియజేశారు. ఇంటి పట్టాల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియని, ఇంకా అర్హులుంటే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

*రెండు దశల్లో ఇళ్ల నిర్మాణాలు*

‘‘పెళ్లి చేసి చూడు..ఇళ్లు కట్టి చూడు అని పెద్దలు సామెత చెబుతుంటారు. ఈ రెండు పనులు చేయడమంటే పేదవాడికి ఎంతో కష్టం. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడిగా వైఎస్‌ జగన్‌ పేదలందరికీ ఇళ్లు కట్టి చూపిస్తారు..రాష్ట్రంలో సొంతిళ్లు లేని వాళ్లెవరూ ఉండకూడదన్నదే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని ఎమ్మెల్యే అనంత తెలిపారు. అనంతపురం నియోజకవర్గంలో గుర్తించిన 10 లేఅవుట్‌లలో రెండు దశల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని చెప్పారు. ఇంటి నిర్మాణాలు ప్రారంభం అయ్యాక అక్కడ ఏర్పాటు చేసే ప్రతి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.

*టిడ్కో లబ్ధిదారులకు రీఫండ్‌*

టిడ్కో లబ్ధిదారులు చెల్లించిన డబ్బును తిరిగి చెల్లించనున్నట్లు కమిషనర్‌ మూర్తి చెప్పారు. సుమారు రూ.14 కోట్ల వరకు రీఫండ్‌ చేస్తామన్నారు. ఆ లబ్ధిదారులకు కురుగుంట వద్ద ఉచితంగా పట్టాలు అందిస్తామని తెలిపారు. పట్టాల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని, ఒక రోజు ఆలస్యమైనా ఎవరూ ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. మొదటి దశలో 9 వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలాలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆర్డీఓ గుణభూషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే లేఅవుట్‌లను సిద్ధం చేశామని తెలిపారు.

పంచాయితీ కార్యదర్శిపై కలెక్టర్ వేటుఅనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు పంచాయితీ కార్యదర్శిపై సస్పెన్షన్ ...
12/12/2020

పంచాయితీ కార్యదర్శిపై కలెక్టర్ వేటు

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు పంచాయితీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు పడింది. బూదిలి పంచాయతీ పంచాయతీలో సచివాలయ నిర్మాణ విషయంలో వివాదాలు ఏర్పడి కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో పంచాయతీ కార్యదర్శితోపాటు మరో సచివాలయ ఉద్యోగి ఈ సమస్యపై సరిగా స్పందించపోవడంతో కలెక్టర్ సస్పెండ్ చేశారు. నెలక్రితమే ఆదేశాలందినా మండల పరిషత్తు కార్యాలయ అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. శుక్రవారం ఎంపీడీవో అంజినప్ప విషయాన్ని ధ్రువీకరించారు. నారాయణనాయక్ పై సస్పెన్షన్ ఎత్తివేయించే ప్రయత్నంలో కొందరు ఉన్నారని అందుకే విషయం బయటకు పొక్కకుండా చూసినట్లు సమాచారం. మరోవైపు వానవోలు పంచాయతీ కార్యదర్శి ఫారూఖ్ సెలవుపై వెళ్లారని, అక్కడికి హిందూపురం నుంచి బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శి ఆనంద్ విధుల్లో చేరి, సెలవుపై వెళ్లారని ఎంపీడీవో చెప్పారు

* ఈ నెల 25వ తేదీన 2,03,000 ఇళ్ళ పట్టాలను పంపిణి* అదే రోజున 1,11,000 ఇళ్ళ నిర్మాణాలకు శ్రీకారం* లాటరీ పద్ధతిలో లబ్దిదారుల...
11/12/2020

* ఈ నెల 25వ తేదీన 2,03,000 ఇళ్ళ పట్టాలను పంపిణి

* అదే రోజున 1,11,000 ఇళ్ళ నిర్మాణాలకు శ్రీకారం
* లాటరీ పద్ధతిలో లబ్దిదారులకు ప్లాట్ల కేటాయింపు
* అన్ని కులాల లబ్ధిదారులతో ఇంటిగ్రేటెడ్ కాలనీలు
* రోడ్లు, డ్రైనేజ్, చెట్ల పెంపకాలతో సుందరంగా ఇళ్ళ కాలనీలు

*ధర్మవరం మండలం కుణుతూరు వద్ద ఇంటి పట్టాల లేఔట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

అనంతపురము జిల్లాలోని పేదలకు స్వంత ఇంటి కల సాకారం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శుక్రవారం ధర్మవరం మండలం కుణుతూరు గ్రామంలో రూపొందించిన ఇళ్ళ పట్టాల లేఔట్ లను జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా చేపట్టిన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా జిల్లాలో 2,03,000 ఇళ్ళ పట్టాలను లబ్దిదారులకు పంపిణి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే రోజున 1,11,000 ఇళ్ళ నిర్మాణాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన ఒకే రోజు 30 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణి చేయడమే కాకుండా, 15 లక్షల ఇళ్ళ నిర్మాణాలకు కూడా శ్రీకారం చుడుతోందన్నారు. ఇళ్ళ పట్టాలను పంపిణి చేసే లేఔట్లలో రోడ్డు వసతి, విద్యుత్ సౌకర్యంతో పాటు అంగన్ వాడి, పాఠశాల భవనాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలో ఏర్పాటు చేసిన లేఔట్ లలో అంతర్గత రహదారులను, అప్రోచ్ రోడ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. లేఔట్ లలో 9 మీటర్లు, 6 మీటర్ల రహదారులను నిర్మిస్తున్నామన్నారు. 9 మీటర్ల రహదారి నిర్మాణంలో 6 మీటర్ల వెడల్పుతో రోడ్డును, ఆ రోడ్డుకు ఇరువైపులా 1.50 మీటర్ వెడల్పుతో మురుగునీటి కాలువలను నిర్మిస్తామన్నారు. అలాగే 6 మీటర్ల రహదారి నిర్మాణంలో 4 మీటర్ల వెడల్పుతో రోడ్డును, ఆ రోడ్డుకు ఇరువైపులా ఒక మీటర్ వెడల్పుతో మురుగునీటి కాలువలను నిర్మిస్తామన్నారు. రోడ్లను 6 ఇంచుల మందంతో నిర్మిస్తున్నామన్నారు. లబ్దిదారులందరికి సౌకర్యవంతంగా ఉండేలా లేఔట్ నిర్మాణాలను అత్యంత నాణ్యత, పచ్చదనం, అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏ ప్లాటు ఎక్కడ ఉందో సూచించే రాళ్ళను ఏర్పాటు చేయడం, కుటుంబానికి ఉపయోగపడే మొక్కలు, పర్యావరణానికి హితమైన మొక్కలను నాటడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా ధర్మవరం మండలం కుణుతూరు గ్రామంలో రూపొందించిన ఇళ్ళ పట్టాల లేఔట్ లో నాటిన మొక్కలను, ప్లాట్లను సూచించే రాళ్ళను, నిర్మించిన రోడ్లను జిల్లా కలెక్టర్ మీడియాకు చూపించారు. ఈ లేఔట్ లో 90 రోజుల్లో ఇళ్ళ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ప్లాట్లను కేటాయిస్తున్నామని, ఇప్పటికే 33 మంది లబ్దిదారులను లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లను కేటాయించడం జరిగిందన్నారు. లేఔట్ లలో అన్ని కులాల లబ్ధిదారులతో ఇంటిగ్రేటెడ్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోడ్లు, డ్రైనేజ్, చెట్ల పెంపకాలతో సుందరంగా ఇళ్ళ కాలనీలను నిర్మించడం జరుగుతుందన్నారు. గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు అన్ని వసతులు సమకూరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇళ్ళ పట్టాలను ప్రభుత్వo ఉచితంగా అందిస్తోందన్నారు. పట్టణ ప్రాంతాల్లో 1.50 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.05 సెంటు భూమిని అందిస్తున్నామన్నారు. ప్రతి ఇంటిని రూ.1,80,000/-ల ఖర్చుతో నిర్మిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మెటీరియల్ సరఫరాకు టెండర్ కమిటీలను ఏర్పాటు చేశారన్నారు. జిల్లా స్థాయి టెండర్ కమిటీ ద్వారా ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే మెటల్, సిమెంట్ ఇటుకలు, కిటికీలు, ఇతర సామాగ్రిని తక్కువ ధరకే లబ్దిదారులకు అందిస్తామన్నారు. నిన్నటి రోజున జిల్లా స్థాయి టెండర్ కమిటీ సమావేశoలో టెండర్లను పిలిచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

ప్రతి ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తామన్నారు. బయట మార్కెట్ లో ఒక మెట్రిక్ టన్ను ఇసుక ధర రూ.375/-లు వుందని, ప్రతి లబ్దిదారునికి రూ.7,500/-లు ఉచితంగా అందించినట్టు అవుతుందన్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి ఇసుకను ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఇసుక రీచ్, స్టాక్ యార్డ్, డిపోల నుండి రవాణా చార్జీలు మాత్రమే లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి సైతం జిల్లా స్థాయిలో సేకరించి లబ్దిదారులకు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి 92 సిమెంట్ బస్తాలు అవసరమన్నారు. ఒక సిమెంట్ బస్తా ధర మార్కెట్ లో రూ.360/- నుండి 370/-లు ఉంటే గృహ నిర్మాణ లబ్దిదారులకు తక్కువ ధరకే నాణ్యమైన సిమెంట్ ను ఒక్కొక్క సిమెంట్ బస్తాపై దాదాపు రూ.125/-లను తగ్గించి, 92 సిమెంట్ బస్తాలను మార్కెట్ ధరకన్నా తక్కువకే అందించడం జరుగుతుందన్నారు. తద్వారా సిమెంట్ పై సుమారు రూ.11,500/-ల మేర లబ్ధి కలుగుతుందన్నారు.

లబ్దిదారుల మోముల్లో ఆనందం – ఇంటి యజమానులు అవుతున్నామనే ధీమా

కుణుతూరు గ్రామానికి చెందిన ఇళ్ళ పట్టాలను కేటాయించిన లబ్దిదారుల మోముల్లో ఆనందం తొణికిసలాడుతోందని, ఇంటి యజమానులు అవుతున్నామనే ధీమా వారిలో స్పష్టంగా కనబడుతోంది. ఈ సందర్భంగా నాగమణి, జైమూన్ బీ, వీరనారమ్మ, దిల్షాద్ బీ, దీప, ఇతర లబ్దిదారులు మీడియాతో మాట్లాడుతూ తాము 15 సంవత్సరాలుగా అద్దె ఇంటిలో నివసిస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్ళుగా స్వంత ఇంటి కల కలగానే మిగిలిపోతుందనే తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తమకు ఈ నెల 25వ తేదీన ఇళ్ళ పట్టాలను అందించనుండడంతో తమ కల నెరవేరడంతోపాటు ఇంటి యజమానులు అవుతున్నామనే ధీమా తమకు కలిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్.డి.ఓ. మధుసూదన్, నోడల్ అధికారి వరప్రసాద్, ధర్మవరం తహసిల్దార్ నీలకంఠా రెడ్డి, హౌసింగ్ డిఇ చంద్రశేఖర్, ఎపిడి పుల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్యోద్యమంలో ఇల్లూరు కేశమ్మ                                                                              1920 ఖిల...
08/12/2020

స్వాతంత్ర్యోద్యమంలో ఇల్లూరు కేశమ్మ

1920 ఖిలాఫత్ఉద్యమం, సహాయనిరాకరణోద్యమం మొదలుకొని 1930 ఉప్పుసత్యాగ్రహం ,1940 వ్యష్టి సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం, హరిజన దేవాలయ ప్రవేశం, కల్లంగళ్ల ముందు పికటింగు మొదలగు స్వాతంత్ర్యోద్యమ కాలంలోని ముఖ్యమైన ఉద్యమాలన్నింటిలోనూ అనంత దేశభక్తులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్నితాలూకాల నుండి ప్రజలు పాల్గొన్నారు. కానీ ఇందులో దాదాపు 284 మందికి శిక్షలు పడగా , ఇందులో మహిళలు నలుగురు. ఈ నలుగురూ వ్యష్టి సత్యాగ్రహం , క్విట్ యిండియా ఉద్యమంలో పాల్గొని శిక్షలు పొందినారు. ఒక ముస్లిం మహిళ– శ్రీమతి రాబియాబీ – ఆమెను అరెస్టు చేయలేదు ప్రభుత్వం.

1. ప్రతాపగిరి శాంతాబాయి — వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొని 20-01-1941 నుండి మూడు నెలలు వెల్లూరు జైలులో శిక్ష అనుభవించినారు.

2. కరణం ఉమబాయమ్మ (కల్యాణదుర్గం తాలుకా శెట్టూరు గ్రామం) —వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టిందని ప్రభుత్వం శిక్ష వేసింది.25-01-1941 నుండి మూడు నెలలు వేలూరు, కడలూరు జైళ్లలో శిక్ష అనుభవించినారు.

3. వెంకమ్మ —క్విట్ యిండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 28-01-1943 నుండి ఆరు నెలలు వెల్లూరు జైలులో శిక్ష అనుభవించినారు.4. ఎక్కువ శిక్ష పొందిన మరో దేశభక్తురాలు ఇల్లూరు కేశమ్మగారు.


కేశమ్మ 01-05-1916లో ఇల్లూరు గ్రామంలో జన్మించినారు. తండ్రి అయితరాజు నరసప్ప. తల్ల్లి లక్ష్మమ్మ . నరసప్పగారు ఇల్లూరు కరణం. కేశమ్మ చెల్లెలు రాజమ్మ. ( వీరే జిల్లా కమ్యూనిస్టుఉద్యమ నిర్మాతలలో ఒకరైన ఇదుకల్లు సదాశివన్ గారిని వివాహ చేసుకున్నారు.) తమ్ముడు సుందరయ్య. నరసప్ప గారికి , నీలం చిన్నపరెడ్డిగారికి మంచి స్నేహం వుంది. నీలం చిన్నపరెడ్డి గారు , తరిమెల సుబ్బారెడ్డిగారు గాంధీ గారి ప్రభావంతో ఇల్లూరు, తరిమెల గ్రామాలలో కల్లంగళ్ళు లేకుండా చేసినారు .మంచి పుస్తకాలతో గ్రంథాలయం నిర్వహించే వారు. తమ పిల్లల చదువుల పట్ల చాలా శ్రద్ధ వహించినారు. వీరి స్నేహితుడైన నరసప్ప కూడా తమ ఇద్దరు కూతుర్లనూ చదివింఛినారు. స్వాతంత్ర్యోద్యమం వల్ల మహిళలకు కలిగిన మేలు ఇది. జాతీయోద్యమం స్తిలను కుటుంబ పరిధి నుండి దాటి విశాలమైన సమాజం లోకి రావడానికి అవకాశం కల్పించింది.

1940 ఏప్రిల్ లో గాంధీ నాయకత్వాన కాంగ్రెసుపార్టీ వ్యష్టి సత్యాగ్రహం ప్రారంభించింది. యుద్ధాన్ని వ్యతిరేకించమని, అరెస్టులకు సిద్ధం కమ్మని పిలుపు యిచ్చింది. ` ఈ సమయానికి కేశమ్మ మదనపల్లిలో ఇంటరు రెండో సంవత్సరం చదువుతున్నారు. గాంధీగారి పిలుఇపు అందుకొని చదువు వదిలేసి స్వాతంత్ర్యసమరానికి సిద్ధమైనారు. సత్యాగ్రహం చేసినా ప్రభుత్వంఈమెను అరెస్టు చేయలేదు. అరెస్టే దేశభక్తి కొలతను నిర్ణయిస్తుంది. అరెస్టు అయితే తప్ప దాస్య శృంఖలాల మీద దెబ్బ వేసిన తృప్తి కలగదు. అందుకే మరింత విస్తృతంగా ఉద్యమములో పాల్గొన్నది ఒంటరిగా 60 గ్రామాలలో కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఒక మహిళ ఇంత అంకిత భావంతో పట్టుదలతో స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడం ప్రజలకు ఆశ్చర్యం , ఉత్తేజం కలిగించింది. ఉద్యమంలో పాల్గొనే మహిళల పట్ల గౌరవం పెరిగింది. ముఖ్యంగా స్త్రీలపై మంచి ప్రభావం కలుగ చేసింది.

1942 ఆగస్టు 9న గాంధీజీ “క్విట్ యిండియా” నినాదం యిచ్చినాడు. కేశమ్మ ఆమె చెల్లెలు రాజమ్మ యుద్ధానికి వ్యతిరేకంగా కరపత్రాలు రాసి, కార్బన్ నకళ్ళు తయారు చేసినారు రాత్రంతా మేల్కొని. వాటిని తీసుకొని కేశమ్మ ఒక్కతే తాలుకా కేంద్రమైన “గుత్తి’ కి వెళ్ళింది. అక్కడ డిప్యూటి కలెక్టరు అధికారులతో సమావేశం జరుపుతున్నారు. ఆ సమావేశంలోకి దూసుకొని వెళ్లి, కరపత్రాలు పంచింది. ప్రభుత్వం వెంటనే ఈమెను అరెస్టు చేసి, ఒక నెలవరకు గుత్తి సబ్ జైలులో వుంచింది. విచారణ తరువాత తొమ్మిది నెలలు శిక్ష విధించింది కోర్టు. 02-12-1942 నుండి 9నెలలు రాయవేలూరు జైలులో శిక్ష అనుభవించింది కేశమ్మ.


శిక్షా కాలం పూర్తీ అయిన తరువాత 1943 లో తిరిగి వచ్చింది. ఆ సమయంలో బెంగాల్ లో భయంకరమైన కరువు వుంది. ల్లక్షలాది మంది స్త్రీ, పురుషులు . పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. జైలు నుండి రాగానే బెంగాల్ కరువు గురించి తెలుసుకొని చలించి పోయింది. తన చెల్లెలు రాజమ్మను తోడుతీసుకోంది. అలాగే సంఘ సేవకురాలు హట్టిపిళ్ళెమ్మ(అనంతపురం ) పుల్లమ్మ(ఛాయాపురం) గార్ల సహాయం తీసుకొని జిల్లాలోని అనేక ప్రాంతాలుతిరిగి, సుమారు నాలుగువేల రూపాయలు వసూలు చేసి సహాయనిధికి పంపినారు.

శారదా సమాజం అనంతపురం జిల్లాలోని మొదటి మహిళా సమాజం.1920 తొలినుండేమహిళలకు కొన్ని కార్యక్రమాలు నిర్వహించేది. జిల్లా ఉన్నతాధికారుల సతీమణులు– అంటే జిల్లా కలెక్టరు. డిప్యూటి కలెక్టరు ,ఎస్.పి, జిల్లా జడ్జి,ఆసుపత్రి సర్జన్, ఇన్స్పెక్టరు, ప్రొఫెసరు, ఇంజనీరు, వకీలు – వీరి సతీమణులు -–వీరే శారదా సమాజ నిర్వాహకులు. శారదాసమాజానికి మూడో రోడ్డులో స్వంత కార్యాలయం వుంది. రోజూ మహిళలు సమావేశం అయ్యేవారు. స్త్రీలకు కుట్టుపని మొదలగు చేతి పనులు నేర్పే వారు. ప్రతి శుక్రవారం ఎవరో ఒకరు ఏదోఒక విషయముపైవ్యాసాలు చదివేవారు. చర్చలు జరిగేవి. ‘శారదామునిసిపల్ ఉన్నత పాఠశాల” శారదా సమాజం ప్రారంభించిందే. ఈ సమాజం గ్రంథాలయం కూడా నిర్వహించేది. కేశమ్మ గారు 1944 నుండి 1945వరకు గ్రంథాలయ బాధ్యతలు తీసుకున్నారు. స్త్రీలలో పఠనాభిలాషను పెంచడానికి కృషి చేసినారు.

వార్ధాలో “ నయీతాలిం” సంఘంలో నూతన విద్యాబోధనలో శిక్షణ పొందటానికి ఆంద్ర ప్రాంతం నుండి ఎనిమిది మంది మహిళలు ఎన్నికైనారు. అందులో కేశమ్మగారు ఒకరు. ఆమె వార్ధా వెళ్లి ఒక సంవత్సరం శిక్షణ పొందినారు. మహాత్మా గాంధీ , రాజేంద్రప్రసాద్, అరుణా అసఫ్ అలీ , సుచేతా కృపలానీ , అమృత కౌల్ , జాకీర్ హుస్సేన్ , వినోబాబావే మొదలగు వారు అక్కడ ఉపన్యాసాలు యిచ్చినారు, బోధనలు చేసినారు.

1947,1948 రెండు సంవత్సరాలు పెద్దవడుగూరులో అనాథ శరణాలయం నిర్వహించినారు. నిర్వహణకు పెద్ద వడుగూరులో చిన్నారపరెడ్డి గారు సహాయ సహకారాలు అందించినారు. తరువాత 1949 నుండి రెండు సంవత్సరాలు దుర్గాబాయి ప్రోత్సాహంతో హైదరాబాద్ లో “కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్టు”లో ఆర్గనైజరుగా పని చేసారు.

తరువాత నిజామాబాద్ జిల్లాలో ప్రదానోపాధ్యాయినిగా పని చేసి పదవీ విరమణ చేసినారు. 1975 లో అప్పటి ముఖ్య మంత్రి శ్రీ జలగం వెంగళరావు గారు అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా అనతపురంలో కేశమ్మ గారిని సన్మానించినారు.

17-03-1991న భర్తను, కూతురును వదలి తనువు చాలించినారు.

ప్రజా సేవ పట్ల తపనతో, అంకిత భావంతో జీవితాంతము కార్యకలాపాలు నిర్వహించినారు.మితభాషి, నిరాడంబర జీవి, ఆదర్శ మూర్తి , స్ఫూర్తి దాత శ్రీమతి ఇల్లూరు కేశమ్మ.

Address

Puttaparthi
515134

Website

Alerts

Be the first to know and let us send you an email when Public voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share