08/06/2026
రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల ఆస్తులకు కూటమి ప్రభుత్వ భద్రత
ఓడి చెరువు మండలం తుమ్మలకుంట్లపల్లిలో సుమారు 608 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ, మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను భద్రపరచడం కోసమే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు రెవిన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నారని తెలిపారు.