Spot News East Godavari.

Spot News East Godavari. వేగంగా., సరళంగా - 30సెకన్లలో చదివే వార్తలు

Mughal Biryani...The Taste of Hydrabadi Deccan
06/11/2022

Mughal Biryani...
The Taste of Hydrabadi Deccan

రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ఫైనల్ ఇయర్ లో జర్నలిజంపై ఇంటర్న్ షిప్ చేస్తున్న విద్యార్థులకు చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ రాజమండ్రి వ...
27/10/2022

రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ఫైనల్ ఇయర్ లో జర్నలిజంపై ఇంటర్న్ షిప్ చేస్తున్న విద్యార్థులకు చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ రాజమండ్రి వారు జర్నలిజం ప్రాధాన్యత, భవిష్యత్తు అవకాశాలపై అవగాహన సదస్సును చైల్డ్ ఫ్రెండ్ సిటీ రాజమండ్రి వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కురుపూడి సారధి గారు మరియు స్పాట్ న్యూస్ స్టేట్ ఎడిటర్ ఇమ్రాన్ గారు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

శుభోదయం..
24/10/2022

శుభోదయం..

 #ఆదిరెడ్డి -  #మార్గాని మధ్య  #మాటల_యుద్ధం..👉 అసలు  #ఆజాద్_చౌక్ లో  #ఏంజరిగింది..??
18/10/2022

#ఆదిరెడ్డి - #మార్గాని మధ్య #మాటల_యుద్ధం..
👉 అసలు #ఆజాద్_చౌక్ లో #ఏంజరిగింది..??

 #ఆకలి_రాజ్యం-  #నిరుద్యోగభారతం కాకినాడ జిల్లా కాకినాడ లో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు వలీ ఖాన్ ఆధ్వర్యం...
15/10/2022

#ఆకలి_రాజ్యం- #నిరుద్యోగభారతం కాకినాడ జిల్లా కాకినాడ లో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు వలీ ఖాన్ ఆధ్వర్యంలో జాతీయ ప్రచార ఉద్యమం నేటితో ప్రారంభం, ఈ సందర్భంగా కాకినాడ పార్టీ కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించడం. జరిగింది జిల్లా అధ్యక్షులు వలి ఖాన్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలు నిరుద్యోగం ప్రధానమైనది ఈ రెండు సమస్యలు పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన నష్టాలకు గురవుతున్నారు, ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షం రెండు విఫలమయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి హసన్ షరీఫ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలో రాకముందు రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు, ఇప్పటివరకు మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ సచివాలయ సిబ్బంది మినహా ఏ విధమైనటువంటి శాఖలోనూ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అధికారికంగా నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య ఆరు లక్షల అరవై వేలు పై మాటే వీరందరికీ ఉపాధి కల్పించే వరకు నిరుద్యోగ భృతిని ఇవ్వాలని వెల్ఫేర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ వయస్సు 62 కు పెంచడానికి వెల్ఫేర్ పార్టీ వ్యతిరేకిస్తూ యువకులకు నిరుద్యోగులకు ఉపాధిని పెంచే విధానాలను ప్రవేశపెట్టి నిరుద్యోగం లేని రాష్ట్రాన్ని నిర్మించాలని కోరుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కెవి సత్యనారాయణ, ఎండి నసీరుద్దీన్, ప్రధాన కార్యదర్శి ఖాజా మొహిద్దిన్, జిల్లా సభ్యులు ఎస్.కె అలీషా, కాకినాడ నగర అధ్యక్షులు మధు కిరణ్, పార్టీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 #రోడ్_కం_రైల్వే_బ్రిడ్జ్
13/10/2022

#రోడ్_కం_రైల్వే_బ్రిడ్జ్

 #శుభోదయం
27/09/2022

#శుభోదయం

తండ్రి, కూతుళ్ళ మృతి హృదయ విదారకరం- పార్థివ దేహాలను సందర్శించి నివాళులర్పించిన ఎంపీ భరత్రాజమండ్రి, సెప్టెంబరు 19: రాజమండ...
19/09/2022

తండ్రి, కూతుళ్ళ మృతి
హృదయ విదారకరం

- పార్థివ దేహాలను సందర్శించి నివాళులర్పించిన ఎంపీ భరత్

రాజమండ్రి, సెప్టెంబరు 19: రాజమండ్రిలో తండ్రి, తన ఇద్దరు కుమార్తెలతో బలవన్మరణానికి పాల్పడటం పట్ల రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి నగరంలోని వీఎల్ పురం మృతుల ఇంటికి వెళ్ళి మృతదేహాలను పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రాజమండ్రి నగరం వీఎల్ పురం లో నివసిస్తున్న సత్యేంద్ర తన ఇద్దరి కుమార్తెలతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సత్యేంద్ర (40) జీఎస్టీ బిల్స్ చేసేవారు. ఈ నెల 18వ తేదీ రాత్రి సత్యేంద్ర భార్య బంధువుల ఇంటికి వెళ్ళగా, మర్నాడు అంటే సోమవారం ఉదయం వీరు అఘాయుత్యానికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. రాజవోలు రోడ్డులో చేపల చెరువులో ఇద్దరు కుమార్తెలను రిషిత (12), హాద్విక (7)లను తోసేసి, ఆ తరువాత సత్యేంద్ర కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎంపీ భరత్ కు, పోలీసులకు పలువురు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, పని వత్తిడితోనే ఇలా చేసినట్టు అతను ఒక సూసైడ్ లెటర్ రాసినట్టు ఎంపీ భరత్ కు ఆ ప్రాంత వాసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతిచెందడం పట్ల ఎంపీ భరత్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. పార్థివ దేహాలను చూసి చలించిపోయారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి తనకు పూర్తిగా తెలియజేయాలని బొమ్మూరు సీఐ విజయ్ కుమార్ ను ఎంపీ భరత్ ఆదేశించారు.

         #తెలంగాణవిమోచనదినం  #జాతీయసనైక్యతాదినోత్సవం
16/09/2022

#తెలంగాణవిమోచనదినం #జాతీయసనైక్యతాదినోత్సవం

 #అంతర్జాతియ_ప్రజాస్వామ్_దినోత్సవం
15/09/2022

#అంతర్జాతియ_ప్రజాస్వామ్_దినోత్సవం

నోటికి అందిస్తూనే వెనక్కి లాగేసుకునే పథకం ఎందుకు-  #షాధీతోఫా పథకంపై  #టీడీపీమైనార్టీలు ఘాటు వ్యాఖ్యరాజమహేంద్రవరం :  ఆకలి...
12/09/2022

నోటికి అందిస్తూనే వెనక్కి లాగేసుకునే పథకం ఎందుకు
- #షాధీతోఫా పథకంపై #టీడీపీమైనార్టీలు ఘాటు వ్యాఖ్య
రాజమహేంద్రవరం :
ఆకలి వేసే వాడి నోటికి అన్నం ముద్ద నోటికి అందించినట్టే అందించి వెనక్కి లాగేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ మైనార్టీలు వ్యాఖ్యానించాయి. జగన్‌ ప్రభుత్వం మైనారిటీల కోసం ప్రస్తుతం ప్రకటించిన షాధీ తోఫా పథకం విధి విధానాలు కూడా అలాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు. స్థానిక తిలక్‌ రోడ్డులోని రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ మైనారిటీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ సుభాన్‌ మాట్లాడుతూ మైనారిటీల కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొనడం సరైన విధానం కాదన్నారు. వివాహం చేసుకునే వధువరులు ఇద్దరూ ఖచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని నిబంధన పెట్టడం సబబు కాదని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పిల్లలు మధ్యలోనే చదువులు ఆపేసే సందర్భాలు ఉంటాయన్న సంగతి జగన్‌ ప్రభుత్వం గుర్తించాలన్నారు. పైగా వివాహం చేసుకునే ఇరువురి కుటుంబాల ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతంలో అయితే 10 వేలలోపు ఉండాలని, పట్టణ ప్రాంతంలో 12 వేల లోపు ఉండాలని, 3 ఎకరాలకు మించి మాగాని లేదా 10 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదంటూ పెట్టిన నిబంధన అర్ధం లేదన్నారు. పైగా ఆయా కుటుంబాల్లో వారెవరూ ప్రభుత్వ ఉద్యోగం కానీ, పెన్షన్‌ కానీ పొందకూడదని, ఫోర్‌ వీలర్‌ ఉండకూడదని నిబంధన పెట్టడం పద్దతి కాదన్నారు. పైగా 12 నెలలు సగటున విద్యుత్‌ వాడకం నెలకు 300 యూనిట్లు కంటే తక్కువగా ఉండాలనడంలో అర్ధం లేదన్నారు. ఆదాయపు చెల్లింపుదారుడు కాకుండా ఉండాలనడం సరైన విధానం కాదన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ షాధీ తోఫా పథకాన్ని అసలు ఎవరికీ వర్తించకుండా చేయాలని ప్రభుత్వం ఆలోచన ఉన్నట్టు స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. తమ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అయితే ఇటువంటి అర్ధం పర్ధం లేని నిబంధనలు లేకుండా అందరికీ దుల్హన్‌ పథకాన్ని వర్తింపచేయడం జరిగిందని గుర్తు చేశారు. 2018`19లో 80 వేల మందికి 310 కోట్లు అందించినట్టు వివరించారు. 2019`20లో మైనారిటీ బడ్జెట్‌లో 1316 కోట్లు కేటాయించి 442 కోట్లు ఇతర పథకాలకు మళ్లీంచారని, 2020`2021లో 2050 కోట్లు కేటాయించి నవరత్నాల కోసం 1998 కోట్లు మళ్లీంచారని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే జగన్‌ ప్రభుత్వం మైనారిటీలో సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. షాధీ తోఫా పథకానికి పెట్టిన అర్ధం పర్ధం లేని నిబంధనలు వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. మీడియా సమావేశంలో మైనారిటీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డి.ఎం ఛాన్‌ బాషా, జిల్లా అధ్యక్షులు మహబూబ్‌ జానీ, కోనసీమ జిల్లా అధ్యక్షులు యం.డి మీరాన్‌ షరీఫ్‌, మైనారిటీ నాయకులు బాబా తాజుద్దీన్‌, సయ్యద్‌ ఆదిల్‌ బాషా, లాల్‌ ఖాన్‌ (దిల్లు), మహ్మద్‌ బాబా ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

👉ప్రవేట్ విద్యా సంస్థల్లో బోధనేతర సిబ్బందికి, డ్రైవర్స్, క్లినర్స్ కు కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించాలి.👉సెప్టెంబర్ 20న ...
10/09/2022

👉ప్రవేట్ విద్యా సంస్థల్లో బోధనేతర సిబ్బందికి, డ్రైవర్స్, క్లినర్స్ కు కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించాలి.

👉సెప్టెంబర్ 20న జిల్లా కలెక్టర్ కు సామూహిక వినతిపత్రం ఇవ్వాలని పోస్టర్ ఆవిష్కరణ

👉ESI, PF, బోనస్, లీవ్ రూల్స్ ఇతర సౌకర్యాలు అమలు చేయాలి.

రాజమహేంద్రవరం:- ప్రవేట్ విద్యా సంస్థల్లో బోధనేతర సిబ్బందికి, విద్యాసంస్థల బస్సులపై పనిచేస్తున్న డ్రైవర్స్, క్లినర్స్ కు కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించి అమలు చేయించాలని సీఐటీయూ నాయకులు బి.పవన్ డిమాండ్ చేసారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర సెప్టెంబర్ 20న అన్ని జిల్లాల కలెక్టర్ లకు సామూహిక వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించినదని తెలిపారు. స్థానిక ప్రకాష్ నగర్, లేడీస్ క్లబ్, రాజమహేంద్రవరంలో ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రవేట్ బస్ డ్రైవర్స్ తో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సీఐటీయూ నాయకులు కె.ఎస్.వి. రామచంద్రరావు, బి.పవన్ మాట్లాడుతూ కనీస వేతన చట్టాన్ని సవరించి 11సంవత్సరాలు అయినా ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చెయ్యకపోవడం కార్మిక ద్రోహమని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుత జగన్ ప్రభుత్వం 3సంవత్సరాలు నుండి చట్ట సవరణ చెయ్యకుండా కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. నిత్యావసరం సరుకుల ధరలు, విద్యా, వైద్యం భారం తీవ్రంగా పెరిగినదని దీనిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాన్ని 26వేలకు పెంచి అమలు చెయ్యాలని డిమాండ్ చేసారు. ESI, PF, బోనస్, లీవ్ రూల్స్ ఇతర సౌకర్యాలు ప్రవేటు యాజమాన్యం అమలు చేసెల కార్మిక శాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ యూనియన్ నాయకులు సతీష్, దిలీప్, భాస్కర్, రవి, నరేష్, రాంబాబు, రామకృష్ణ, సురేంద్ర, రమేష్ తదితరులు పాల్గున్నారు.

"నారా" వారిని కలిసిన కుడుపూడిరాజమండ్రి :తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శ...
10/09/2022

"నారా" వారిని కలిసిన కుడుపూడి
రాజమండ్రి :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ ను తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సత్తిబాబు తన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శెట్టిబలిజ సాధికారక సమావేశాల గురించి వారికి వివరించడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయలపై ఉద్యమించాలని కోరారు. శెట్టిబలిజలు ఎన్నడూ తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని, పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సత్తిబాబు వారితో అన్నారు. అధినాయకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బీసీ లందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే బీసీలకు జరుగుతున్న అన్యాయం, వారికి దక్కాల్సిన సంక్షేమ పథకాలు వారి దరి చేరేలా చూడాలని పలు సూచనలు చేశారు. టీడీపీ నాయకులు టేకుమూడి బద్రీనాథ్, గుత్తుల మల్లికార్జున్, మునసా అప్పారావు, కుడుపూడి వీరబాబు తదితరులు వారిని కలిసిన వారిలో ఉన్నారు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వేమగిరి గ్రామం తోట ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ కడియాల సత్యనారాయణ లివర్ వ్యాధి తో గత సంవత్...
10/09/2022

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వేమగిరి గ్రామం తోట ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ కడియాల సత్యనారాయణ లివర్ వ్యాధి తో గత సంవత్సరం నుండి ఇబ్బంది పడుతున్నారు.

లివర్ వ్యాధి తో బాధపడుతున్న ఆటో డ్రైవర్ కడియాల సత్యనారాయణ శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్ లో సుగుణ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

వేమగిరి వైఎస్సార్సీపీ నాయకులు రాజమండ్రి రూరల్ కో ఆర్డనేటర్ చందన నాగేశ్వర్ గారి దృష్టికి తీసుకువచ్చారు.

*రాజమండ్రి రూరల్ కో ఆర్డనేటర్ చందన నాగేశ్వర్ గారు స్పందిస్తూ ఆటో డ్రైవర్ కడియాల సత్యనారాయణ శస్త్ర చికిత్స నిమిత్తం రూ.25,000/- లు చెక్ ను వారికీ శనివారం నాడు రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందించారు.*

 #ప్రపంచఆత్మహత్య_నివారణదినోత్సవం
09/09/2022

#ప్రపంచఆత్మహత్య_నివారణదినోత్సవం

*కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 500/-కే వంట గ్యాస్ అని రాహుల్ గాంధీ ప్రకటనపై మీ అభిప్రాయం?*✍🏻కామెంట్ వ్రాయండి
06/09/2022

*కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 500/-కే వంట గ్యాస్ అని రాహుల్ గాంధీ ప్రకటనపై మీ అభిప్రాయం?*

✍🏻కామెంట్ వ్రాయండి

Address

Rajahmundry
533101

Telephone

+919505782353

Website

Alerts

Be the first to know and let us send you an email when Spot News East Godavari. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share