07/03/2024
స్త్రీలకు నిజాయితీ?
ప్రస్తుత ప్రపంచ/దేశ పరిస్థితిని మనం గమనించినప్పుడు స్త్రీలు కూడా భయంకరమైన నేరాలు, సామాజిక తప్పిదాలు చేస్తున్నారు. కానీ చట్టం మరియు సమాజం కేవలం పురుషులు చేసేవాటిపైనే ఎక్కువగా స్పందిస్తుంటుంది. ఈ సత్యం స్త్రీలకు కూడా తెలుసు. కానీ నేను సోషల్ నెట్వర్క్ లో "చాలామంది" స్త్రీలు పెట్టే పోస్టింగులను, అదేవిధంగా చట్టపరమైన ఉద్యోగాలలోనూ, ప్రముఖ స్థానాలలోనూ ఉన్న స్త్రీల మాటలను పరిశీలించినప్పుడు వారు తమ జెండర్ చేసేవాటిని దాచిపెడుతూ పైగా వాటిని వేరే కారణాలతో సమర్థిస్తూ పురుషులు చేసేవాటిపై మాత్రమే ఆగ్రహం వ్యక్తం చెయ్యడం గమనించాను. దీనికి వారిలో ఉన్న లింగపక్షపాతమే కారణం.
ఉదాహరణకు, ఆ మధ్యకాలంలో ఒక జైలర్ మాట్లాడుతూ "కొందరు భార్యలు తమ భర్తలు తాగేసి వచ్చి హింసిస్తుంటే సహించలేక వారిని చంపుతున్నారని, కానీ దురదృష్టవశాత్తూ తమ పిల్లల సాక్ష్యం ఆధారంగానే ఆ భార్యలకు శిక్షలు పడుతున్నాయని" ఆవేదన వ్యక్తం చేసింది. ఒక విధంగా ఆమె చెబుతుంది కొందరు భార్యల విషయంలో సత్యమైయుండవచ్చు కానీ, ఆమె అదే కొలమానం భార్యల విషయంలో విసిగిపోయి హత్యలు చేసిన భర్తలపై కూడా పెట్టి, వారికి పడిన శిక్షల విషయంలో ఆవేదన వ్యక్తం చెయ్యగలదా? పోని ఇప్పటికీ పురుషాధిపత్య సమాజమని నిందించబడుతున్న ఈ సమాజంలో ఏ పురుష జైలరైనా ఆమె సమర్థించినట్టు పురుష నేరస్తులను సమర్థించాడా?
ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన విషయం గమనించండి; స్త్రీలు తమను భర్తలు వేధించినా లేక ప్రియులు మోసగించినా వారిని చట్టపరంగా శిక్షించే భరోసాను కలిగియున్నారు. వీరికోసం పుట్టగొడుగుల్లా ఎన్నో చట్టాలు పుట్టుకొస్తున్నాయి. సమాజంలో కూడా వీరిపై విపరీతమైన సానుభూతి కనపరచబడుతుంది. అటువంటి భరోసా కలిగియున్న స్త్రీలే తమకు అన్యాయం జరిగినప్పుడు సహించలేక పురుషులపై భౌతిక దాడులకు పాల్పడుతుంటే లేక చంపుతుంటే, చట్టపరంగానూ సమాజంలోనూ అంతటి భరోసా లేని పురుషులు స్త్రీల విషయంలో అన్యాయానికి గురైనప్పుడు, వారిని చట్టపరంగా ఏమీ చేయలేక భౌతికదాడులకు పాల్పడే అవకాశం మరి ఎక్కువగా ఉంటుంది కదా!
అయినప్పటికీ వారు చేసే భౌతిక దాడుల విషయంలో ఎటువంటి సమర్థనలూ భావ్యం కాదు. కేవలం చాలామంది స్త్రీలలో కనిపించే లింగ పక్షపాతాన్ని వివరించడానికి మాత్రమే నేను ఈ ఉదాహరణను తీసుకోవలసి వచ్చింది.
ఇటువంటి తీవ్ర లింగ పక్షపాతంతో వ్యవహరిస్తున్న స్త్రీలు అన్ని రంగాలలోనూ సమానత్వం సంపాదించిన తరువాత ఎటువంటి న్యాయాన్ని అనుసరిస్తారో బాగా ఆలోచించండి (ముఖ్యంగా చట్టపరమైన విషయాలలో). ఇప్పటికే లింగపక్షపాత న్యాయాలను, చట్టాలను మనం చూస్తున్నాం. అదేంటో కానీ, కొందరు పురుషులు స్త్రీలపై చూపించే లింగవివక్షను నేరంగా పరిగణించే చట్టం మరియు సమాజం, చాలామంది స్త్రీలలో కొలువైయున్న ఈ స్త్రీ లింగపక్షపాతాన్ని మాత్రం ఖండించలేకపోతుంది. కాబట్టి స్త్రీలు అన్ని రంగాలలోనూ పురుషులతో పాటు సమానంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఆ రంగాలలో వారు సమాన న్యాయాన్ని అనుసరించేలా నైతికతను అలవరచుకోవాలి. ఈ విషయంలో సమాజం మరియు చట్టం వారిపై ప్రత్యేక దృష్టిని పెట్టాలి.
గతంలో ఒకామె నాతో "స్త్రీలు ఎక్కువమంది నిజాయితీగానే ఉంటారు కానీ పురుషులు మాత్రం అలా ఉండరంటూ" అడ్డకోలు వాదనకు దిగింది. ఒకవేళ స్త్రీలు ఎక్కువమంది ఆమె చెబుతున్నట్టుగా నిజాయితీగానే ఉంటే, పురుషులు స్త్రీల విషయంలో జరుగుతున్న దాడులపై పోరాడినట్టు, వారు (ఎక్కువమంది) తమ స్త్రీలు చేసే నేరాలు ఘోరాల గురించి ఎందుకు పోరాడరు?
పైగా వాటికి కారణాలు చెప్పి సమర్థిస్తుంటారు (అవే కారణాలు పురుషుల విషయంలో మాత్రం ఆపాదించరు), ఎవరైనా వాటిని ఖండిస్తే విరుచుకుపడతారు. ఎక్కువమంది స్త్రీలలో ఉండే నిజాయితీ అంటే ఇదేనా? మరి ముఖ్యంగా వీరిలో చాలామంది తమ స్త్రీలు పురుషులపై దాడులకు పాల్పడినప్పుడు, వాటిని హాస్యం (comedy) గా పరిగణించే క్రూర ప్రవృత్తిని కూడా కలిగియున్నట్టు మనం చూడగలం.
- Repudiating evil feminism
"స్త్రీవాదుల అడ్డకోలు (అనైతిక) వాదనలకు, న్యాయబద్ధమైన ఖండనలు"
పరిచయం:
మన సమాజంలో "స్త్రీ వాదులు" అనబడే ఒక గుంపు చేస్తున్న అడ్డకోలు (అనైతిక) వాదనలనూ వారి దుర్మార్గపు వైఖరినీ న్యాయబద్ధంగా ఖండించాలనే ఉద్దేశంతో నేను ఈ వ్యాసం రాయడం ప్రారంభించాను. వాటిని వరుసగా (17 భాగాలుగా) బహిర్గతం చేసి ఖండించడానికి ముందు అసలు "స్త్రీ వాదులు" అంటే ఎవరో కొద్దిగా స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వీరిలో కొందరు "మేము స్త్రీవాదులమని" Direct గా చెప్పుకోకుండా కొన్ని ముసుగుల్లో దూరి కుయుక్తిగా తమ స్త్రీవాద భావజాలాన్ని విస్తరింపచేస్తుంటారు. అందుకే చదువరులు వారి లక్షణాలు (భావజాలం) ఏంటో అర్థం చేసుకుంటే, వారు ఎలాంటి ముసుగుతో వచ్చినా వీరు స్త్రీవాదులు అని సులభంగా గుర్తుపట్టెయ్యగలరు.
ఈ "స్త్రీవాదులు" పైకి మేము స్త్రీల హక్కుల కోసం, రక్షణ కోసం, సమానత్వం కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటారు కానీ, వీరి చర్యలనూ వాదనలనూ మనం పరిశీలించినపుడు వీరిలో పురుష ద్వేషం, నిజాయితీ రాహిత్యం, తమను తాము అతిగా పొగుడుకోవడం, పురుషుల విషయంలో క్రూరస్వభావం తప్ప ఇంకేమీ మనకు కనిపించవు. ఈ మొత్తం వ్యాసంలో వీటిన్నిటికీ ఆధారాలు చూపించబోతున్నాను. ఒకవేళ వీరు స్త్రీల సమానత్వం కోసమే పోరాడుతుంటే, నేరాలు చేసిన స్త్రీలకు కూడా సమానశిక్షలు అమలవ్వాలని, సమానత్వ భావనతో నిజాయితీగా పోరాడేవారు. కానీ వీరు దానికి పూర్తి విరుద్ధంగా నేరాలు చేసిన స్త్రీలకు చిన్నపాటిగా శిక్షపడినా సహించలేరు, ఏవో కారణాలను ప్రస్తావించి నేరం చేసిన స్త్రీలను సమర్థించాలని చూస్తుంటారు. పురుషుల విషయంలో మాత్రం అలాంటి కారణాలను త్రోసిపుచ్చుతారు. ఈవిధంగా వీరు ఎంతసేపూ పురుషులు చేస్తున్న నేరాలు ఘోరాలపై, వారిలో ఉన్న లోపాలపై గొంతుచించుకోవడమే తప్ప కలలో కూడా స్త్రీలు చేస్తున్న నేరాలు ఘోరాలను ఖండించే సాహసం చెయ్యరు, వారి లోపాల గురించి మాట్లాడరు. ఒకవేళ ఇలాంటి విమర్శలకు భయపడి ఆ ప్రయత్నం చేసినా, పురుషుల విషయంలో చేసినంత తీవ్రస్థాయిలో చెయ్యకపోగా స్త్రీలు చేస్తున్న నేరాలనూ వారిలోని లోపాలనూ ఏదో ఒకచోట తప్పకుండా సమర్థించుకుంటారు. ఇంకా చెప్పాలంటే, వీరు పైకి "స్త్రీ" పురుషుడితో సమానం అంటారు కానీ, సమాజంలో ఏదోవిధంగా స్త్రీని పురుషుడికంటే అధికంగా చూపించాలనేదే వీరి ప్రయాస. అందుకే వీరు పురుషులు తమ కుటుంబాలకోసం పడే ప్రయాసనూ వారి ఘనతనూ, ఎన్నో విధాలుగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులనూ తూలనాడుతుంటారు. చివరకు వారి ప్రాణాలనూ జీవితాలనూ కూడా చులకనగా చూస్తుంటారు. దీనికి మంచి నిదర్శనమే పురుషులకు స్త్రీలవల్ల అపాయాలు, నష్టాలు సంభవించినప్పుడు వాటిని కూడా స్త్రీపురుష సమానభావంతో, మానవత్వంతో ఖండించకుండా లింగపక్షపాత మృగాలుగా వాటిని సమర్థించడానికి ప్రయత్నించడం, లేదా వాటిపట్ల మౌనంగా ఉండడం.
ఇవే "స్త్రీవాదులకు" ఉండే ప్రధానమైన లక్షణాలు. ఇలాంటి క్రూరస్వభావం కలిగిన "ఈ స్త్రీవాదులు" ప్రస్తుతం మనకు అన్నిచోట్లా (కుటుంబాలలో కూడా) అన్ని రంగాలలోనూ (న్యాయవ్యవస్థలో సహా) దర్శనమిస్తున్నారు. అందుకే మానవత్వం కలిగిన మనిషిగా, స్త్రీ పురుషులు ఇద్దరినీ ఒక్కటిగా భావించే నేను వీరి గురించి కొందరికైనా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రచనలు ప్రారంభించాను. అయితే ఇది చదువుతున్నవారికి, ముఖ్యంగా స్త్రీలకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, స్త్రీలు వేరు - స్త్రీవాదులు వేరు, ఇద్దరూ ఒక్కటి కాదు, ఈ విషయం ఇప్పటికే నేను వివరించిన స్త్రీవాదుల లక్షణాలను బట్టి మీకు అర్థమై ఉంటుంది, ముందు ముందు ఇంకా అర్థమౌతుంది. వింతైన విషయం ఏమిటంటే స్త్రీవాదుల్లో పురుషులు కూడా ఉంటారు. వారు ఎందుకలా మారారో చివరి భాగంలో వివరిస్తాను. కాబట్టి ఈ వ్యాసం "నిజాయితీగా ఆలోచించే, ప్రవర్తించే స్త్రీలను ఉద్దేశించింది కాదని ప్రతీ ఒక్కరూ గమనించాలి". ఇక "స్త్రీవాదుల" అడ్డకోలు వాదనలనూ దుర్మార్గపు వైఖరినీ వరుసగా చూద్దాం.
1. కొంతకాలం క్రిందట నేను Facebook లో ఒక "స్త్రీవాది" పెట్టిన పోస్ట్ చూసాను. అందులో ఆమె ఒక స్టోరీని రాస్తూ దాని చివరిలో "అవతార పురుషుడైనా ఆడదానికే పుడతాడనే" mother సెంటిమెంట్ సాంగ్ లిరిక్ ప్రస్తావించి, మగవాళ్ళు చేసే అన్నిపనులూ ఆడవాళ్ళు చెయ్యగలరు కానీ, ఆడవాళ్ళు కన్నట్టుగా మగవాళ్ళు పిల్లలను కనలేరని హేళన చేసింది. నిజానికి ఇటువంటి వ్యాఖ్యల వల్ల స్త్రీలకు గౌరవం దక్కదు కానీ, యధార్థం (లాజికల్) గా ఆలోచించేవారి మనసులో వారు ఊరికే డబ్బాలు కొట్టుకుంటారనే చులకన భావన మాత్రం ఏర్పడుతుంది.
ఎందుకంటే, స్త్రీలు పిల్లలను కంటున్నట్టుగా పురుషులు కనలేరు కాబట్టి, పురుషులు స్త్రీల కంటే తక్కువవారు, స్త్రీలు చేసే ఆ పనిని పురుషులు చెయ్యలేరని హేళన చేసే స్త్రీవాదులకు అసలు స్త్రీ పురుషుల శరీరస్వభావం గురించి కూడా తెలియదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, స్త్రీ కంటున్నట్టు పురుషుడు పిల్లల్ని కనలేడు కానీ, స్త్రీ పిల్లల్ని కనేలా ఆమెను గర్భవతిని చేస్తాడు. ఒకవేళ పురుషులు కూడా స్త్రీల వలే పిల్లల్ని కనాలంటే స్త్రీలు కూడా పురుషుల్ని గర్భవతుల్ని చెయ్యాలి మరి. ఒకవేళ అది వారికి సాధ్యం కాకపోతే స్త్రీలు కూడా పురుషులు చేసే ఒక పనిని చెయ్యలేరని ఒప్పుకోవాలి. దీనిని బట్టి పురుషులు స్త్రీలను చులకనగా చూడాలా? హేళన చెయ్యాలా? శరీర స్వభావాన్ని కూడా అర్థం చేసుకోకుండా, ఇతరులను హేళన చేస్తే ఇలాంటి పర్యవసానాలనే ఎదుర్కోవలసి వస్తుంది.
2. కొందరు స్త్రీవాదులు - స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు ఇంకేదో లేదని నినాదాలు చేస్తుంటారు. నిజమే స్త్రీ లేకపోతే అవేమీ ఉండవని అందరికీ తెలుసు కానీ, స్త్రీ మాత్రమే కాదు పురుషుడు లేకపోయినా అవేమీ ఉండవు. స్త్రీ పురుషులు ఎవరు లేకపోయినా ఉండనివాటిని తీసుకుని వాటిని కేవలం స్త్రీలకు మాత్రమే ఆపాదించి పొగుడుకోవడం దరిద్రంగా లేదూ?
ఇలాంటి నినాదాలు చెయ్యడానికి ఆడపిల్లలను చంపేస్తున్నారనేది కారణంగా చూపిస్తారని నాకు తెలుసు. కానీ కొందరు తల్లులు మగపిల్లలను కూడా చంపుతున్నారు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఒకసారి గూగుల్ చేసి చూస్తే ఎంతమంది తల్లులు లింగవివక్షతో మగపిల్లలను చంపేస్తున్నారో, దారుణంగా హింసిస్తున్నారో ఆధారాలు కనిపిస్తాయి చూసుకోండి (ఈదేశంలో కూడా). ఈవిధంగా ఆడపిల్లలకు పురుషులనుండి హింస కలుగుతున్నట్టే మగపిల్లలకు స్త్రీలనుండి కూడా హింస కలుగుతుంది. అలాంటప్పుడు కేవలం స్త్రీలగురించి మాత్రమే ఎందుకు ఆ డబ్బాలు? (Percentages గురించి 6వ భాగంలో వివరిస్తా). అసలు లింగ వివక్ష ఎవరిపై ఎంత తీవ్రంగా చూపబడుతుందో ఇప్పటికే నేను ఆధారాలతో వివరిస్తూ ఒక వ్యాసం రాసాను, ఈ లింక్ ద్వారా మీరు దానిని చదవొచ్చు.
"లింగవివక్ష ఎవరిపై?"
https://m.facebook.com/story.php?story_fbid=259593819219272&id=103344521510870
3. స్త్రీవాదులు నోరుతెరిస్తే చాలు "పురుషులంతా ప్రతీ స్త్రీని తల్లిగా, చెల్లిగా, అక్కగా భావించి ఆమెను గౌరవించాలని" lectures ఇస్తుంటారు. కానీ ఎటువంటి స్త్రీలను తల్లిగా, చెల్లిగా, అక్కగా భావించాలి? ఎటువంటి స్త్రీలను గౌరవించాలి అనే స్పష్టతను మాత్రం వారు ఇవ్వరు. ఎందుకంటే తమ స్వంత పిల్లల్ని/బయట పిల్లల్ని కూడా దారుణంగా చంపేసిన తల్లులున్నారు. పురుషులతో పాటుగా వారు కూడా ఎన్నో నేరాలు చేస్తూ సరైన శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. చివరికి చట్టాలను కూడా ఆయుధాలుగా మార్చుకుని అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నారు.
మనం వారిని కూడా తల్లిగా, చెల్లిగా, అక్కగా భావించాలా? గౌరవించాలా? ఎటువంటి స్త్రీలను గౌరవించాలో స్పష్టత ఇవ్వకుండా, స్త్రీలను గౌరవించాలనే నియమం సమాజానికి అలవాటు చెయ్యడం వల్లే ఈ సమాజం స్త్రీలు ఎటువంటి నేరాలు చేస్తున్నా ప్రతిఘటించలేకపోతుంది. చట్టపరంగానూ సామాజిక పరంగా కూడా వారికి సరైన శిక్షలు పడడం లేదు. ప్రపంచంలో ఉన్న మూఢనమ్మకాలలో ఇదొక భయంకర మూఢనమ్మకం.
దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోడానికి ఈ లింక్ ద్వారా సూచించిన వ్యాసం చదవండి
"స్త్రీని గౌరవించు" (అభ్యంతరం - అనర్థం)
https://m.facebook.com/story.php?story_fbid=581758083975893&id=100064251181217&mibextid=Nif5oz
పురుషులంతా స్త్రీలను గౌరవించాలంటే మరి స్త్రీలు ఎవర్ని గౌరవించాలి? స్త్రీలు పురుషులందరినీ తండ్రిగా, అన్నగా, కొడుకుగా గౌరవిస్తున్నారా? స్త్రీలు పురుషుడి జీవితంలో పాటించే పాత్రలను బట్టి వారందరినీ అదేవిధంగా చూడాలంటే పురుషులు స్త్రీల జీవితంలో పాటించే పాత్రలను బట్టి వారు పురుషులందర్నీ అలానే చూస్తున్నారా? "ఒకవేళ కొందరు స్త్రీలపైన జరుగుతున్న దాడులను బట్టి, వారిని చులకనగా చూసిన చరిత్రను బట్టి స్త్రీలను గౌరవించాలనే నినాదం పుట్టిందని" భావిస్తే, ప్రస్తుతం స్త్రీలు కూడా పురుషులపై ఎన్నో దాడులు చేస్తున్నారు, చులకనగా చూస్తున్నారు. స్త్రీలు పురుషులపై ఎంత భయంకరమైన దాడులు చేసారో, చేస్తున్నారో తెలియనిదెవరికి? ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే గూగుల్ చేసి చూడండి. చివరికి పురుషులతో మనకు అవసరమేంటని ప్రగల్భాలు పలికిన స్త్రీలు, వారిపై దాడులు జరిగినప్పుడు వాటిని హాస్యంగా భావిస్తూ కామెంట్లు చేస్తున్న స్త్రీలు కూడా విస్తారంగా ఉన్నారు. సోషల్ నెట్వర్క్ ఉపయోగిస్తున్నవారికి నేను చెబుతుంది కొత్త విషయమేమీ కాదు. ఈవిధంగా పురుషులపై దాడులు జరిగినపుడు హాస్యంగా కామెంట్లు చేసే ఆడమృగాలు గురించి నేను ఇప్పటికే ఒక వ్యాసం రాసాను, ఈ క్రింది లింక్ ద్వారా మీరు దానిని చదవొచ్చు.
"ఆడ మృగాలు"
https://m.facebook.com/story.php?story_fbid=532468071931844&id=103344521510870
4. కొన్నిరోజుల క్రితం నేను ఒక స్త్రీవాదికి కొందరు స్త్రీలు చేస్తున్న దారుణమైన నేరాలు, వారిలో ఉన్న లోపాల గురించి వివరిస్తూ వాటికి ఆధారంగా ఒక పేపర్ కటింగ్ చూపించాను. దానికి ఆమె "ఒక ఆడది ఇలాంటి నేరం చేసిందంటే ఎంతలా విసిగిపోతే అలా చేస్తుందంటూ" సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఇదే కొలమానం మగాళ్ళపైన కూడా పెట్టి చూస్తే ఎంతగా విసిగిపోయి ప్రేయసిని చంపాడో, భార్యను చంపాడో అని సమర్థించుకోవలసి వస్తుంది. కానీ మనుషులుగా మనం అలా చేయకూడదు కదా. ఏ పరిస్థితిలో అయినా ఎంత విసిగిపోయినా మరో వ్యక్తిని చంపే హక్కు, గాయపరచే హక్కు మనకు లేదు (ఆత్మరక్షణలో మినహా).
ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక స్త్రీని ప్రేమించిన ప్రియుడు మోసం చేసినా, భర్త బాధించినా మరెవడో వేధించినా ఆమె చట్టాన్ని ఆశ్రయించి శిక్షపడేలా చెయ్యవచ్చు. స్త్రీలకు రక్షణగా ఎన్నో చట్టాలు ఉన్నాయి. సమాజంలో కూడా అతనిని దోషిగా నిలబెట్టవచ్చు. ఇలాంటి అవకాశాలు ఉన్న స్త్రీలే తమకు అన్యాయం జరిగినపుడు చట్టాన్ని ఆశ్రయించకుండా, సమాజానికి తెలియచెయ్యకుండా ఎంతో విసిగిపోయి దాడులు చేస్తున్నారని ఎవరైనా సమర్థిస్తే, పురుషులు స్త్రీలపై (ప్రేయసి, భార్యలపై) చేస్తున్న దాడులను వారు మరి ఎక్కువగా సమర్థించవలసి ఉంటుంది.
ఎందుకంటే చట్టపరంగానూ సమాజంలోనూ స్త్రీకి ఉన్నంత భరోసా పురుషుడికి లేదు. ఈ కారణంచేత అతనికి అన్యాయం జరిగినపుడు భౌతికదాడికి పాల్పడడం సమంజసమే కదా! స్త్రీవాదులు దీనిని సమర్థిస్తారా? అన్ని భరోసాలు ఉన్న స్త్రీలు దాడులు చేస్తేనేమో విసిగిపోయి చేస్తున్నారంట, వారిని అందరూ సమర్థించాలంట. ఏ భరోసా లేని పురుషులు దాడులు చేస్తే మాత్రం కఠినంగా శిక్షించాలంట. స్త్రీవాదులు పాటించే న్యాయం ఇంత దుర్మార్గంగా ఉంటాది మరి.
5. స్త్రీవాదులు ఎంతసేపూ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలనూ దాడులనూ చూపించి వారిరక్షణ కోసం మరిన్ని చట్టాలు చెయ్యాలని పోరాడుతుంటారు. స్త్రీలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయనేది వాస్తవం.
అయితే వీటిని మొదటినుంచీ చట్టం మరియు సమాజం ప్రతిఘటిస్తూనే వస్తుంది. అలా చెయ్యడం మంచిదే అయినప్పటికీ, ఈ విషయంలో ఇబ్బంది కూడా ఉంది. కొందరు ఈ చట్టాలను అడ్డుపెట్టుకుని, సమాజంలో వారికున్న సానుభూతిని అవకాశంగా తీసుకుని, ఇతర కారణాలతో అమాయకులపై కూడా అటువంటి ఆరోపణలు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. దాడులు కూడా చేయిస్తున్నారు. ఇక్కడ వారివల్ల బలైపోతున్న అమాయకుల సంగతేంటి? ఈ మధ్యకాలంలో లోన్ రికవరీకోసం ఇంటికి వచ్చిన ఒక పెద్దాయనపై రేప్ కేస్ పెడతానంటూ ఒక స్త్రీ బెదిరిస్తున్న వీడియో సోషల్ నెట్వర్క్ లో బాగా వైరల్ అయ్యింది. స్త్రీలు చట్టాలను ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో గ్రహించడానికి అది మంచి ఉదాహరణ.
స్త్రీవాదులు మాత్రం పైన చెప్పినట్టుగా ఎంతసేపూ వారి జెండర్ తరపున పోరాటాలు చెయ్యడం, సమాజాన్ని సెంటిమెంటల్ గా ట్రాప్ చెయ్యడం తప్ప, వారి స్త్రీలు చట్టాలను దుర్వినియోగం చేస్తూ అమాయకులను ఇరికిస్తున్నప్పటికీ, దాడులకు పాల్పడుతున్నప్పటికీ, వారిని కూడా కఠినంగా శిక్షించాలని కానీ, వారి చేతిలో దాడులకు గురైన బాధితులకు న్యాయం జరగాలని కానీ పోరాడరు. అసలు ఆ ప్రస్తావనలు కూడా తీసుకురారు. ఎందుకంటే వారిలో లింగపక్షపాతం తప్ప నైతికపరమైన మానవత్వం ఉండదు. ఒకవేళ స్త్రీవాదులు కనుక అటు స్త్రీలపై దాడులకు పాల్పడే పురుషుల గురించీ, ఇటు పురుషులపై దాడులకు పాల్పడే స్త్రీల గురించి కూడా న్యాయబద్ధంగా పోరాటం చేస్తే ఒకవైపు నిజంగా స్త్రీలపై దాడులకు పాల్పడే పురుషులూ, మరోవైపు పురుషులపై దాడులకు పాల్పడే (చట్ట దుర్వినియోగంతో సహా) స్త్రీలూ ఇద్దరూ కూడా శిక్షించబడతారు కదా. అన్నింటిలోనూ సమానత్వం కోరుకునే వీరికి శిక్షల్లోనూ, బాధ్యతల్లోనూ మాత్రం సమానత్వం ఎందుకు వద్దు?
6. స్త్రీవాదులను మనం "మీ స్త్రీలు కూడా భయంకరమైన నేరాలు చేస్తున్నారు, అక్రమసంబంధాల కోసం భర్తలనూ పసిపిల్లలను కూడా చంపుతున్నారు, హింసిస్తున్నారు. మనుషులుగా మీరు వాటిపై ఎందుకు స్పందించరు, వారికి కఠినంగా శిక్షలు పడాలని పోరాటాలు ఎందుకు చెయ్యరని" ప్రశ్నిస్తే, వెంటనే వారు స్త్రీలు పురుషులపై, పిల్లలపై చేసే దాడులు చాలా తక్కువ శాతంలో ఉంటాయి, స్త్రీలపై జరిగేదాడులు మాత్రం ఎక్కువ శాతంలో ఉంటాయి. అందుకే మేము తక్కువ స్థాయిలో జరుగుతున్నవాటి గురించి మాట్లాడడం లేదని, వాటి గురించి పోరాటాలు చెయ్యవలసిన అవసరం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.
కానీ, ఈ వాదనలో ఉన్న అసలు సమస్య ఏంటంటే, ప్రభుత్వాలు మహిళా కమీషన్లు ఏర్పాటు చేసి స్త్రీలపై జరుగుతున్న దాడుల శాతం తెలుసుకుంటున్నట్టు, పురుషులకోసం కూడా ఏదైనా కమీషన్ ఏర్పాటు చేసి వాళ్ళపై జరుగుతున్న దాడుల శాతాన్ని గుర్తిస్తున్నారా? అలాంటిదేమీ లేనప్పుడు పురుషులపైన స్త్రీలు చాలా తక్కువ శాతంలో దాడులకు చేస్తున్నారని ఏ కొలమానం ఆధారంగా చెబుతున్నారు? ఒకవేళ పోలీస్ స్టేషన్లలో నమోదు చెయ్యబడే కేసుల సంఖ్యను బట్టి అంటారేమో, చట్టపరంగా స్త్రీలకున్న వెసులబాటులు, అవగాహనలు పురుషులకు సరిగా లేనికారణం చేత కొందరు పురుషులు తమపై స్త్రీలు (భార్యలు/ప్రేయసులు) దాడులు చేసినా, మోసం చేసినా మౌనంగానే ఉంటున్నారు. చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.
స్త్రీలకు వలే వారు కూడా చట్టపరమైన భరోసా కలిగి పోలీస్ స్టేషన్లకు వెళ్తే బావుండేది, కానీ చాలా విషయాల్లో అలా జరగడం లేదు.
ఒకవేళ స్త్రీవాదులు అంటున్నట్టుగా పురుషులపై స్త్రీలు చేస్తున్న దాడులు తక్కువ శాతమే అనుకున్నప్పటికీ, ఆ తక్కువ శాతంలో దాడులు చేసిన స్త్రీలను కూడా ఎందుకు వదిలెయ్యాలి? ఒక్క ప్రాణం పోయినా పోయినట్టు కాదా? ఇంతకూ శిక్షలు నేరాల శాతాన్ని బట్టి విధించాలా, నేర తీవ్రతను బట్టి విధించాలా? ఇదేం దారుణమో కానీ, ఒక మైనర్ అబ్బాయి మైనర్ అమ్మాయి లైంగిక సంబంధం/ ప్రేమ కలిగుంటే అక్కడ అబ్బాయిదే నేరం ఔతుంది (ఫోక్సో). ఇద్దరూ మైనర్లు అయినప్పుడు అక్కడ అమ్మాయిది ఎందుకు నేరం కాదు? కనీసం మైనర్ అబ్బాయితో అక్రమసంబంధం పెట్టుకునే మేజర్ అమ్మాయి (ఆంటీ) లకైనా మైనర్ అమ్మాయితో వ్యవహరం పెట్టుకున్నవాడికి పడే శిక్ష పడుతుందా? నేరాల శాతం గురించి మాట్లాడే స్త్రీవాదులకు ఇలాంటి ఏకపక్ష చట్టాల గురించి తెలియదా? ఎక్కువశాతంలో జరిగేవాటికోసమే పోరాటం చేస్తున్నామని కుయుక్తిగా తప్పించుకునే వీరికి అత్యాచార చట్టాలు ఎంత ఎక్కువ శాతంలో దుర్వినియోగం చెయ్యబడుతున్నాయో అది కూడా తెలియదా? మరి ఆ విషయంలో ఎందుకు పోరాటం చెయ్యట్లేదు?
7. కొంతమంది స్త్రీవాదులు "మీరు ఎంతసేపూ స్త్రీలపై జరుగుతున్న దాడులు, వారిపై చూపబడుతున్న వివక్షలపై పోరాడతారే తప్ప మీ స్త్రీలు పురుషులపై చేస్తున్న దాడులు, వారిపై చూపిస్తున్న వివక్షపై ఎందుకు పోరాడరనే" ప్రశ్నకు ఇప్పటికే నేను 6వ భాగంలో ప్రస్తావించిన అబద్ధపు సమాధానమే కాకుండా, మరొక చెత్త సమాధానం కూడా చెబుతుంటారు. అదేంటంటే, "వీరు స్త్రీలు కాబట్టి స్త్రీలపై జరిగేవాటికోసం మాత్రమే పోరాడతారంట, పురుషులు కూడా మహిళా సంఘాలులా పురుష సంఘాలుగా ఏర్పడి, వారి కోసం పోరాడుకోవాలంట" పైగా పురుషులు అలా చెయ్యకపోవడానికి వారికున్న అహమే కారణమంట. ఒకవిధంగా ఈ సమాధానమేదో కొంచెం వాస్తవంగానే అనిపిస్తున్నప్పటికీ నేను పైన ప్రస్తావించినట్టుగా ఇది ఒక చెత్త సమాధానం. ఎందుకంటే మనం మనపై జరుగుతున్న అన్యాయంపై స్పందించడం మాత్రమే కాదు, మననుంచి అవతలివారికి జరుగుతున్న అన్యాయంపై కూడా స్పందించి వారికి న్యాయం చెయ్యాలనే నైతికతను ఈ సమాధానం తుంగలో తొక్కుతుంది.
పైగా ఈ సమాధానం స్త్రీ పురుషులు ఇద్దరూ సమానం, ఇద్దరూ మనుషులే అనే వాస్తవాన్ని ధిక్కరించి, "వారు వేరు మేము వేరు" అనే బేధాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఇలాంటి ఏకపక్షవైఖరి కలిగియున్నవారు నైతికత కలిగిన మనుషులు కాదని, వారు వేరొక జాతి (మృగ) అని స్త్రీవాదులు ఒప్పుకుంటారా? కాదు మేము కూడా మనుషులమే అనంటే, మనుషులందరిపట్లా ఒకే వైఖరి ఎందుకు కలిగియుండట్లేదు? ఒకవేళ ఈ సమాధానంలో ఉన్నట్టుగా "స్త్రీలు స్త్రీల తరపున పోరాడుకోవాలి, పురుషులు పురుషుల తరపున పోరాడుకోవాలి" అనేది స్త్రీవాదుల ప్రామాణికత అయితే, వెంటనే వీరు "స్త్రీలపై జరుగుతున్న దాడుల విషయంలో పోరాడుతున్న పురుషులను అడ్డుకోవాలి ఎందుకంటే వారు స్త్రీలు కాదుగా" మరెందుకు అడ్డుకోరు? అంతేకాకుండా "స్త్రీని గౌరవించండి" "స్త్రీని కాపాడుకోవడం మన బాధ్యత" అని పురుషులతో చెప్పకూడదు. పురుషులకు ఆ అవసరం లేదుగా?ఈవిధంగా ఇకపై వారి స్త్రీలను వారే గౌరవించుకుని, వారిని వారే కాపాడుకోవాలి. ఇలా చెయ్యడానికి స్త్రీవాదులు సిద్ధమా మరి?
ఒకవేళ పురుషులు కూడా ఇలానే ఆలోచించి, స్త్రీలపై జరుగుతున్న దాడులు, వారిపై చూపబడుతున్న వివక్ష విషయంలో మౌనం వహించియుంటే, ఇప్పటికీ వహిస్తుంటే, స్త్రీల పరిస్థితి ఎలా ఉండేదో కొంచెం ఊహించుకోండి. ఇకపోతే పురుషులు వారిపై జరుగుతున్న దాడుల విషయంలో స్పందించకపోవడానికి ఎక్కడ వారి అహం దెబ్బతింటుందో అనే ఆందోళనే కారణం అంటున్నారు. కానీ వాస్తవమేంటంటే, పురుషులకు ఎలిమెంటరీ/హైస్కూల్ స్థాయినుండీ, స్త్రీలపై చూపబడుతున్నదే వివక్ష అన్నట్టుగా, వారిపై జరుగుతున్నవి మాత్రమే ఉన్మాద దాడులు అన్నట్టుగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. చివరికి వారు టైమ్ పాస్ కోసం చూసే సినిమాలు, ఇతర చిత్రీకరణలలో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది. ఈవిధంగా పురుషులు చేసేవి మాత్రమే ఉన్మాది దాడులుగా ప్రకటించబడి, స్త్రీలు చేసేవిమాత్రం "ఒక ఆడది ఎంతగా విసిగిపోతే అలా చేసిందో" అని సమర్థించబడడాన్ని బట్టి పురుషులు తమ విషయంలో జరుగుతున్నవి గుర్తించలేనంతగా trance లోకి వెళ్ళిపోయారు.
పైగా వారి ఇంట్లో ఉన్న స్త్రీలతో ఉండే సంబంధాలు కూడా "స్త్రీల విషయంలో పోరాడాలనే బాధ్యతను" వారిలో రేకెత్తిస్తుంది. కానీ స్త్రీవాదులకు మాత్రం వారి ఇంట్లో ఉన్న పురుషులతో ఉండే సంబంధాలను బట్టి అలాంటి బాధ్యతలు జనించడం లేదు. ఇక్కడ ఎవరిలో యథార్థత కనిపిస్తుందో, ఎవరిలో లింగపక్షపాత మృగతత్వం కనిపిస్తుందో కాస్త పరిశీలన చేసుకోండి. సరే కాసేపు ఇదంతా పక్కనపెట్టి, పురుషులు తమ అహం దెబ్బతింటుందనే ఆందోళనతోనే వారి విషయంలో జరుగుతున్న దాడుల విషయంలో స్పందించట్లేదు అనుకుందాం. కానీ ఇక్కడ నా ప్రశ్న "స్త్రీలపై జరుగుతున్న దాడుల విషయంలో స్పందించే మీరు అదే నిజాయితీతో, మానవత్వంతో, సమానత్వంతో పురుషులపై మీ స్త్రీలు చేస్తున్నవాటిపై ఎందుకు స్పందించరు" అనేదే తప్ప, పురుషులు తమ విషయంలో జరుగుతున్న దాడుల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని కాదుగా? మరొక విషయం ఏమిటంటే, ఈ స్త్రీవాదులు పురుషులపై జరుగుతున్న దాడుల విషయంలో పోరాడడం పక్కనపెడితే వాటిని సమర్థించాలని చూస్తుంటారు, వాటిపై హాస్యపు కామెంట్లు కూడా చేస్తుంటారు. మృగతత్వం అంటే ఇదే కదా!
8. కొన్నిరోజుల క్రితం ఒక స్త్రీవాది నాతో మాట్లాడుతూ స్త్రీలు కాస్త Sensitive గా ఉంటారు కాబట్టి, వారి లోపాల గురించి మాట్లాడితే నొచ్చుకుంటారని, అందుకే వారికోసం మాట్లాడకపోవడం మంచిదని హితవు పలికింది. స్త్రీలు Sensitive గా ఉంటారా లేదా అన్నది కాసేపు పక్కన పెడితే, వారి లోపాలను ఎత్తిచూపించినప్పుడు నొచ్చుకునే వారు ఎవరైనా న్యాయబద్ధంగా ప్రవర్తించేవారు మాత్రం కారు. అంటే నాతో మాట్లాడిన స్త్రీవాది తమ స్త్రీలలో న్యాయబద్ధమైన మనసు ఉండదని Indirect గా చెబుతుంది కాబోలు.
ఒకవేళ ఆమె చెబుతున్నట్టు, స్త్రీలందరూ sensitive అయితే దారుణమైన నేరాలు ఎలా చేస్తున్నారు? పురుషులపై దాడులు జరిగినపుడు వాటిని హాస్యంగా ఎలా భావిస్తున్నారు? కాబట్టి ఈ వాదన కూడా స్త్రీలు చేసే అనైతిక పనులకు సమర్థింపు మాత్రమే. ఒకవేళ స్త్రీలు sensitive గా ఉంటారు కాబట్టి వారేం తప్పుచేసినా మాట్లాడకూడదు, అలా మాట్లాడితే వారు నొచ్చుకుంటారు, ఎందుకంటే అదివారి నైజమని ఎవరైనా అంటే, పురుషులు కూడా కాస్త కటువుగా ఉంటారు కాబట్టి వారేం నేరం చేసినా మాట్లాడకూడదు మరి. ఎందుకంటే అది కూడా వారి నైజం కదా!
స్త్రీలందరూ sensitive, పురుషులందరూ కటువుగా ఉండేవారే అయితే ఆత్మహత్యలు చేసుకునేవారిలో పురుషుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? వారు స్త్రీల వల్ల మోసపోయి మానసిక రోగులుగా ఎందుకు మారుతున్నారు? సరే వాదనకోసం స్త్రీలందరూ sensitive అనుకుందాం. అలా అయితే ప్రాచీనకాలంలో పురుషులు ఆ sensitivity బట్టే స్త్రీలపై ఎక్కువబాధ్యతలు మోపకుండా వంట ఇంటి కుందేలుగా మార్చి ఉంటారు. అంటే నాతో మాట్లాడిన స్త్రీవాది వాదన ప్రకారం అది లింగవివక్షలో భాగం కాదన్నమాట! యుద్ధంలో శారీరక బలహీనులను ఎలా చేర్చుకోరో, అదేవిధంగా sensitive గా ఉండేవారిపై కూడా ఎక్కువ భారాలు మోపరు కదా!
9. స్త్రీవాదులు ప్రతీదానికీ పురుషాధిపత్యం పురుషాధిపత్యం అని గొంతు చించుకుంటుంటారు.
దేవుడు పురుషుడిని మరియు స్త్రీని సమానంగా పుట్టిస్తున్నప్పుడు వారిలో ఒకరిని బానిసలా చూడడం, వారిపైన ఆధిపత్యం చెలాయించడం నిజంగా ఖండించవలసిన విషయమే. కానీ స్త్రీవాదులు దానిగురించి మాట్లాడడంలో ఉన్న సమస్య ఏంటంటే, సమాజంలో కొందరు పురుషులు, స్త్రీలను బానిసలుగా చూసారనేది, కొన్ని మత గ్రంథాలు వారిని చులకనగా వర్ణించాయనేది ఎంత వాస్తవమో, కొందరు పురుషులు వారిని నెత్తినపెట్టుకున్నారనేది, కొన్ని మతగ్రంథాలు వారిని దైవాలుగా వర్ణించాయనేది కూడా అంతే వాస్తవం.
బానిసల్లా చూసారని గగ్గోలు పెట్టే వీరికి, దైవాలుగా చూసినప్పుడూ, నెత్తినపెట్టుకున్నప్పుడూ సమస్య లేదా? స్త్రీ పురుషుడికి బానిస కాదన్నది ఎంత వాస్తవమో, అదే స్త్రీ పురుషుడి కంటే ఎక్కువా కాదు, దైవమూ కాదన్నది కూడా అంతే వాస్తవం కదా?
మరి వీరు వీటిపై ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే వీరికి అనుకూలంగా ఉంటే అది ఏదైనా సమ్మతమే, ప్రతికూలంగా ఉంటే మాత్రం చిన్న విషయంలో కూడా పోరాటమే, దీనినే అనైతికవాదం అంటారు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకప్పటి సమాజం స్త్రీలను తక్కువగా చూడడం, వంట ఇంటి కుందేలుగా మార్చడం ద్వారా వారికి నష్టంతో పాటు కొన్ని ప్రయోజనాలు కూడా లభించాయి. ఉదాహరణకు, చరిత్రలో జరిగిన ఎన్నో యుద్ధాలలో పురుషులు మాత్రమే ఎక్కువగా చనిపోయారు, గాయపరచబడ్డారు ఎందుకంటే సైన్యంలో వారే ఉండేవారు. చాలామంది పిల్లలకు తండ్రికంటే తల్లిపైన ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకో తెలుసా? ఆమె కష్టపడి వారిని కన్నదని మాత్రమే కాదు ఆమె ఇంటిదగ్గరే ఉండి వారితో ఎక్కువ సమయం ఆప్యాయంగా గడిపేదని కూడా.
అదేవిధంగా, పురుషాధిపత్యంపై పోరాటం చేసే స్త్రీవాదులకు ప్రస్తుతం చట్టవ్యవస్థలోనూ, సమాజంలోనూ స్త్రీ ఆధిపత్యం కనిపించట్లేదా? కొన్ని కుటుంబాల్లో భర్తలను బానిసలుగా చూస్తున్న స్త్రీలపై వీరి స్పందన ఏంటి? ఒకరిపై ఆధిపత్యం చెలాయించడం తప్పు అయితే అది ఎవరు చెలాయించినా తప్పే ఔతుందిగా? స్త్రీవాదులు నిజాయితీపరులే అయితే ఇలాంటి విషయాలపై కూడా పోరాడేవారు.
10. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారో నిజాయితీగా పరిశీలించినవారు ఎవరైనా ముందుకు వచ్చి, కొందరు స్త్రీలు చేస్తున్న నేరాల గురించి కానీ, వారి లోపాల గురించి కానీ, లేదా వారు అమాయకులపై పెడుతున్న కేసుల గురించి కానీ ప్రశ్నించారు అనుకోండి. వెంటనే "ఈ స్త్రీవాదులు" ముందుకు వచ్చి వారిని స్త్రీ వ్యతిరేకులనీ, స్త్రీలను అవమానించారనీ, అలాంటివారు ఆడదానికి పుట్టినవారు కారని దూషిస్తుంటారు. దొంగకేసులు పెట్టి వారిని ఇరికించాలని ప్రయత్నిస్తారు, ఎంతైనా అది వారి నైజంకదా! స్త్రీలు చేసే నేరాల గురించీ, వారిలో లోపాల గురించీ, ముఖ్యంగా ఈ స్త్రీవాదుల నీచపు నైజం గురించీ ప్రశ్నించేవారు స్త్రీ వ్యతిరేకులు అయిపోతే రేపిస్టులను శిక్షించాలని కోరుకునే స్త్రీలంతా పురుష వ్యతిరేకులా? వారు పురుషులకు కాకుండా జంతువులకు పుట్టారా మరి?
నాలాంటివారు ఒకవైపు నేరం చేసిన పురుషులను శిక్షించడంతో సమ్మతిస్తూ అదేవిధంగా నేరాలు చేస్తున్న స్త్రీలను కూడా సమానంగా శిక్షించాలని కోరుకోవడం, స్త్రీలను బానిసలుగా చులకనగా చూసే పురుషాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీలు కూడా పురుషుల పట్ల అలా వ్యవహరించకూడదని బుద్ధిచెప్పడం, స్త్రీలపై వ్యతిరేకత, వారిని అవమానించడం ఔతుందా లేక న్యాయబద్ధమైన సమానత్వం ఔతుందా? ఇకపోతే, పురుషుడైనా స్త్రీ అయినా ఆడదానికీ, మగాడికీ కలిపే పుడతారు కాబట్టి ఇరువురి తరపునా న్యాయంగా ఆలోచించి మాట్లాడేవారు మానవత్వం కలిగిన మనుషులూ నిజాయితీపరులూ ఔతారు. ఒకవేళ పురుషులు ఎవరైనా స్త్రీవాదుల తరహాలో మా జెండర్ వారు ఏ నేరమూ కావాలని చెయ్యరని, వారంతా అమాయకులని, నేరాన్ని ఆపోజిట్ జెండర్ పైకి నెట్టివేస్తే అప్పుడు మాత్రమే వారు స్త్రీ వ్యతిరేకులు ఔతారు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరికి వ్యతిరేకులో, ఎవరు ఎవర్ని అవమానిస్తున్నారో?
విచిత్రం ఏమిటంటే, "ఈ స్త్రీవాదులు" నేరాల విషయంలోనూ, మోసాలు చెయ్యడం విషయంలోనూ ఆడవాళ్ళు అమయాకులని చెబుతూ, మిగిలిన అభివృద్ధి విషయాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం పురుషులకంటే తెలివిగా ముందున్నవాళ్ళని డబ్బాలు కొట్టుకుంటారు. పురుషుడికంటే తెలివైన స్త్రీ పురుషుడిచేతిలో ఎలా మోసపోతుందో మరి? అంటే అలాంటి కేసులన్నీ కూడా తప్పుడు ఆరోపణలేనా? మనుషులుగా మనకైతే ఇలాంటి సమస్యేం లేదు. మనుషుల్లో తెలివైనవారు తెలివి తక్కువవారు, మోసపోయేవారు మోసగించేవారు, దాడులు చేసేవారు దాడులకు గురయ్యేవారు ఇలా రెండు వర్గాలూ ఉంటారని మనకు తెలుసు కదా!
11. ఈమధ్య కాలంలో "ఒక స్త్రీవాది" వేశ్యల గురించి మాట్లాడుతూ, భర్తలు సరిగా లేక ఆర్థిక అవసరాలకోసం వారు వేశ్యలుగా మారి ఒళ్ళు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వాదనలో కొంతమట్టుకు వాస్తవమే ఉన్నప్పటికీ వేశ్యలుగా మారినవారంతా ఈ కోవకే చెందినవారు కాదు. భర్తలను ఇతర కారణాలతో విడిచిపెట్టి/వివాహమే చేసుకోకుండా శారీరక సుఖం మరియు కష్టపడకుండా ధనం సంపాదించాలనే ఉద్దేశంతో వేశ్యలుగా మారినవారు కూడా ఉన్నారు. విలాసాలకు అలవాటు పడే అమ్మాయిలు వేశ్యలుగా మారుతున్నారని ఈమధ్యకాలంలో సుప్రీం కోర్టు కూడా పేర్కొంది.
సరేకాసేపు ఇది పక్కనపెట్టి, ఆ స్త్రీవాది అన్నట్టుగానే భర్తలు సరిగా లేక, ఆర్థిక అవసరతలను బట్టే కొందరు స్త్రీలు వేశ్యలుగా మారుతున్నారు అనుకుందాం. దీనిని బట్టి వారిపై మనం జాలిచూపించి వారిని శిక్షించకూడదనీ, చులకనగా చూడకూడదని కూడా అనుకుందాం. ఇదే కొలమానం దొంగలపై కూడ పెడదాం, కొందరు తమకున్న ఆర్థిక అవసరతలను బట్టి గతిలేక దొంగతనాలు చేస్తుంటారు, మరికొందరు మరింత ఆర్థిక అవసరతలను బట్టి హంతకులుగా కూడా మారుతుంటారు. మరి మనం వారు చేసేది కూడా నేరంగా భావించకూడదా? ఒకవేళ ఆర్థిక అవసరతను బట్టి హంతకుడిగా మారినవాడు అందులో భాగంగా ఒక స్త్రీని చంపితే స్త్రీవాదులు వాడిని అలానే సమర్థిస్తారా లేక కఠినంగా శిక్షించాలని గగ్గోలు పెడతారా? వారే చెప్పాలి.
ఒకవేళ ఈ ప్రశ్నకు స్త్రీవాదులు స్పందిస్తూ, వేశ్యలు ఆర్థిక అవసరతలకోసం ఎవరినీ చంపడం లేదనీ, బలవంతంగా ఎవరి సొమ్మూ దొంగిలించడం లేదనీ, వారిదగ్గరకు ఇష్టపూర్వకంగా వచ్చినవారికి తమ శరీరాన్ని అర్పించి చివరికి తమ శరీరాన్నే నాశనం చేసుకుంటున్నారని వాదనకు దిగితే ఆ వాదన కూడా వారికే చిక్కు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే అప్పుడు నేను ఇష్టపూర్వకంగా ఒకరు మరొకరి దగ్గరకు శారీరక సుఖాన్ని కోరి వస్తే వారితో లైంగిక సంబంధాన్ని కొనసాగించడం ఏ తప్పుకాదా అనే ప్రశ్నను వేస్తాను. వారు కాదని కాని చెప్పారో, మైనర్ అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చినా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్న పురుషుడిది ఎందుకు నేరం ఔతుందో చెప్పాలి. ఒకవేళ ఆ అమ్మాయికి మెచ్యూరిటీ లేదు కాబట్టి అని అంటే, వేశ్యలదగ్గరకు వెళ్ళే మైనర్ అబ్బాయిలకు కూడా మెచ్యూరిటీ ఉండదు. వారు కూడా వ్యభిచారానికి అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటారుగా మరి.
దీనికి ఇంకొందరు చాలా తెలివిగా, ఇష్టపడి వెళ్ళారు కాబట్టి అది వారి కర్మ అని సమాధానం చెబుతారు.
అలా అయితే, పెళ్ళికిముందు ప్రేమ పేరుతోనో కోరికలపేరుతోనో అబ్బాయిలకు దగ్గరై గర్భవతులైన అమ్మాయిల విషయంలో చట్టాలు ఎందుకు ఉన్నట్టు? వారికి సానుకూలంగా స్త్రీవాదులు ఎందుకు స్పందిస్తున్నట్టు? ఇష్టపడి వెళ్ళారు వారి కర్మ కదా!
12. వివాహం జరిగాక కూడా అక్రమ సంబంధాలు పెట్టుకునే కొందరు స్త్రీలను, ఈ స్త్రీవాదులు సమర్థిస్తూ ఇంట్లో భర్త సరైన సుఖం ఇవ్వకపోడం వల్లే వారు అలా దారి తప్పారని సమర్థిస్తుంటారు. పైగా అక్కడ ఆమెతో సంబంధం పెట్టుకున్న పురుషుడితే తప్పు తప్ప ఆమెది కాదంటూ వాదిస్తుంటారు. ఒకవేళ ఇదే కొలమానం తీసుకుంటే వివాహం జరిగాక అక్రమ సంబంధాలు పెట్టుకునే పురుషులు కూడా ఇంట్లో సరిగాలేకనే అలా చేస్తున్నారేమో, అక్కడ కూడా తప్పు అతనితో సంబంధం పెట్టుకున్న స్త్రీదే తప్ప అతనిది కాదుగా మరి.
ఇప్పటికీ చాలామంది స్త్రీలు గృహిణులుగానే ఉంటున్నారు, వారికి కుటుంబపరమైన ఆలోచనలే ఎక్కువ శాతం ఉంటాయి. కానీ పురుషులకు ఒకవైపు కుటుంబపరమైన ఆలోచనలతో పాటుగా ఉద్యోగపరమైన ఒత్తిడులు కూడా ఉంటాయి. దీనివల్ల చాలామంది పురుషులలో లైంగిక సామర్థ్యం అనేది తగ్గుతూ వస్తుంది. ఈవిధంగా కుటుంబంకోసం ఒత్తిడులు అనుభవించే భర్త