04/09/2026
తూ.గో. జిల్లా ప్రజా రవాణా అధికారిగా మనోహర్ ఛార్జ్
తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారిగా ఎం.యు.వి. మనోహర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రాజమండ్రి అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (కమర్షియల్)గా, రాజోలు, అమలాపురం, కాకినాడ డిపోల్లో మేనేజర్గా పనిచేశారు. కాకినాడ డి.పి.టి.వోగా విధులు నిర్వహిస్తూ బదిలీపై తూ.గో. జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా రాజమండ్రి, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపో మేనేజర్లు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు.