17/09/2020
*1948 సెప్టెంబర్ కరీంనగర్ లో జరిగిన యదార్థ సంఘటన.*
బ్రిటిష్ నుండి దేశానికి స్వాతంత్రం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది కానీ తెలంగాణలో ఇంకా నిజాం పాలన నడుస్తుంది. అసలైన తెలంగాణ ప్రజలు ఏమో బానిసలుగా విదేశీ నుండి అక్రమంగా ఈ దేశానికి వచ్చి తెలంగాణ ని ఆక్రమించుకున్న నిజాం ఏమో రాజుగా ఉన్నరూ . తెలంగాణ ని పాకిస్తాన్ లో కలపాలి లేదా పాకిస్తాన్ లాంటి ప్రత్యేక దేశం చేయాలి అని నిజాం అనుకున్నాడు కానీ తెలంగాణ ప్రజలు మేము భారతీయులం మమాల్ని ఈ దేశం నుండి భారతమత నుండి విడతీయడానికి నువ్వు ఎవరు అని పోరాట మొదలుపెట్టారు.
ఆరోజు తెలంగాణ లో ప్రతీ పల్లె నుండి నిజాం పై పోరాటానికి పెద్దలనుంది చిన్న పిల్లలవరకి అందరూ సిద్ధమయ్యారు.
నిజాం సైన్యం అయిన రాజకర్లు మన తెలంగాణ ప్రజల్ని చాలా హింసకు గురిచేశారు.
మొగవారిని చంపడం ఆడవారిని చేరుస్తు ఇళ్ళు వకిళ్ళు తగలపెడ్తు ఊర్లు అన్ని శ్మశాన వాటికలు గా మార్చి వెళ్తున్నారు.
""అయితే ఆ సెప్టెంబర్ నెలలో కరీంనగర్ లో జరిగిన యదార్థ సంఘటన""
ప్రస్తుతం ఇప్పుడు కరీంనగర్ లో చాలా నగర్ లు కాలనీ లు ఉన్నాయి కానీ అప్పుడు ఉన్నవి ఒక నాలుగు ప్రాంతాలు మాత్రమే అందులో రెండు ప్రాంతాల కథ.
ఒక ప్రాంతం ఏమో రాజకర్లు ఉన్న ప్రాంతం ఇంకో ప్రాంతం పెరు జంబలగడ్డ. అయితే జంబలగడ్డ ప్రాంతం వాళ్ళు రజాకార్ల పై వీరోచిత పోరాడుతున్నారు..
జాంబలగడ్డ ప్రజలు రాజకర్లని వాళ్ళ ప్రాంతానికి రానివ్వకుండా పగలు రాత్రి కాపలా ఉంటున్నారు.
రాజకర్లు దాడి చేసిన ప్రతిసారి జాంబలగడ్డ వైపు కొందరు రజాకార్ల వైపు చాలామంది చనిపోతున్నారు.
ఈ పోరాటం చాలా రోజులు జరిగించి .సెప్టెంబర్ 17 కి కొన్ని రోజులముందు రాజకర్లకి హైదరాబాద్ నుండి ఆయుధాలు వచ్చాయి ఇక జంబలగడ్డ ప్రాంతాన్ని శ్మశానం చేయడమే మిగిలింది అని రాజకర్లు అనుకున్నారు.
జంబలగడ్డ ప్రాంతం లో ప్రజలు రజాకార్ల దగ్గర తుపాకుల ఉన్నాయి మనదగ్గర కర్రలు కత్తులు తప్ప ఏమీ లేవు ఈ పోరాటంలో మనం గెలవడం కష్టమే అని అనుకున్నారు అయితే వీళ్ళలో ఒకరు అయిన "నరసయ్య" అన్నాడు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి కి మనం ధైర్యంగా పోరాడటం లేదా చచ్చిపోవటం రెండు దారులు మాత్రమే ఉన్నాయి అన్నాడు. ఒకతను లేచి మనం మన ప్రాంతం వదిలి ఎటైనా పారిపోయి అన్ని సద్దుమణిగాక వద్దాం అన్నాడు దానికి "నరసయ్య"గారు పారిపోవడమా అది చనిపోవడం కిందికే వస్తది మనం మన జాంబలగడ్డ వదిలి పారిపోవడం లేదా మనం పుట్టిన ఈ గడ్డ మీద చచ్చిపోవడం రెండు ఒక్కటే అని అన్నారు.
అయిన ఇది మన నేల మన భూమి మన తాతలు, పూర్వికులు, కోమరంభీం లాంటి స్వతంత్ర సమరయోధులు పుట్టిన భూమి బయపడితే నిజాం బయపడలి మనం కాదు మనవాళ్ళు స్వేత్చావాయువు పీల్చకుండా నే ఈ మట్టిలో కలిసి పోయారు ఈ యుద్ధం చేసిన చేయకపోయిన మనం ఎదో ఒకరోజు చనిపోతాం అది ఏదో ఈరోజే నిజం ని బొంద పెట్టి తెలంగాణ కి స్వాతంత్రం సాధించి చనిపోదాం అన్నాడు.
అందరూ "నరసయ్య" గారి మాటలు విని ధైర్యంగా పోరాటానికి సిద్ధం అయ్యారు.
ఆరోజు తుపాకులు బాంబులు తో రాజకర్లు జాంబలగడ్డ ప్రాంతాని దాడి చేయడానికి సిద్ధమైయ్యారు జాంబలగడ్డ వాళ్ళు కూడా రజాకార్ల అంతు తేల్చడానికి సిద్దమయ్యారు.
"నరసయ్య" గారికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు అయిన ఇంట్లోంచి బయల్దేరే ముందు వాళ్ళ భార్య కి చెప్పాడు నేను తిరిగి రావచ్చు రాకపోవచ్చు . నేను రాకపోతే మాత్రం పిల్లల్ని జాగ్రత్తగా చేస్కో పరిస్థితి చెయ్ దాటిపోతే నువ్వు పిల్లలని తీసుకొని ఏదయినా సురక్షిత ప్రాంతానికి వేళ్ళు అని చెపి వెళ్ళిపోయాడు.
నిజానికి రాజకర్లు నిజాం యొక్క సైనికులు యుద్ధ విద్యలు తెలిసినవాళ్ళు అన్ని ఆయుధాలు కలిగినవారు కానీ జాంబలగడ్డ ప్రాంతం వాళ్ళు మాత్రం ఒక ఆత్మరక్షణ తప్ప ఎం తెలియనివారు నిరాయుధులు కానీ యుద్ధం తప్పనిసరి అయినప్పుడు సాక్షాత్తు శ్రీరాముడు సైతం సైనికుడు ఐ పోరాడక తప్పలేదు .
ఇక ఆ రోజు రాత్రి రాజకర్లు దాడి చేశారు మన వాళ్ళు తుపాకులు లేకపోయినా ఉన్న ఆయుధాలతో పోరాడారు చాలా ప్రాణనష్టం జరిగింది వాళ్ళు ఉన్న ఇండ్లు అంటిపెట్టుకుని వెళ్తున్నారు .
వాళ్ళ తుపాకులు, బాంబులు పేలుతున్నాయి మనవాళ్ళు చాలా మంది గాయపడ్డారు ఇక అంతా ఐపోయింది అందరం చనిపోతాం జాంబలగడ్డ శ్మశానం అవుతుంది అని అందరూ బాధతో పోరాడుతున్నారు అదే సమయంలో రంగంలోకి దిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపిన భారత్ సైన్యం .
మొత్తం రాజకర్లని చుట్టుముట్టి వాళ్లకి తుపాకులు గురిపెట్టింది ఒక్కడు తుపాకీ ఎత్తిన రజాకార్ల అందరాని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు మన భారతసైన్యం చూసి రజాకార్ల కి గుండె కిందికి జాతిపోయి మమల్ని వదిలియండి అని కలబెరం కి వచ్చారు . అందర్నీ బందీ చేసి తీసుకెళ్లారు. గాయపడ్డ జాంబలగడ్డ ప్రాంతం వారికి వైద్యం అందించి వాళ్ళని మెచ్చుకొన్నారు .
ఆ మరుసటి రోజు తెలంగాణ కి స్వాతంత్రం వచ్చింది.
తెలంగాణ భరతమాత ఓడిలో చేరింది.
ఎలాంటి సంఘటనలు ప్రతి జిల్లాలో ఇంకా చాలా జరిగాయి కానీ ఇది కరీంనగర్ లో జరిగిన సంఘటన మనకి ఏ పుస్తకాల్లో youtube ఛానల్ లో దొరకదు లేదు కూడా . మాకు ఆ ప్రాంతం లో ఉన్న ఒక తాత చెప్పడం జరిగింది.
ఆరోజు ఉన్న జంబలగడ్డ ప్రాంతమే ఈరోజు మనం పిలిచే కాపువాడ, మంగళవాడ, పాతబజార్ .
రజాకార్ల ప్రాంతంగా పిలిచిన ప్రాంతం ఇప్పుడు ఉన్న శశమహెల్.
చాలా కథలు, యుద్ధ సినిమాలు చూసి మీకు ఇది అంత పెద్దగా అనిపించకపోవచ్జ్ కానీ ఆరోజు వాళ్లు పోరాదడిలేకుంటే ఈరోజు కరీంనగర్ లో కొన్ని వంశాలే ఉండకపోయేవి . మన తాతలు అమ్మమ్మలు ఆరోజే వల్ల చేతిలో అంతమియేవారు లేక కరీంనగర్ వదిలి వలస వెళ్లేవారు కావచ్చు.
అయితే కరీంనగర్ లోని ప్రజలు ఆ రోజు యుద్ధం చేసినవాళ్ళు ఈరోజు మనతో లేరు కావచ్చు కానీ కరీంనగర్ చరిత్ర లో వాళ్లు ఎప్పటికి ఉండిపోవాలి అని చెప్పడానికి చేసిన మా ప్రయత్నం 🙏🇮🇳
Courtesy and Source: kumar
https://www.facebook.com/100036905732032/posts/337860120787510/?extid=QqwpCcTgmRkkZ1GF&d=n