Telangana Prajasakti

Telangana Prajasakti Telangana Prajasakti, also spelled as TS.Prajashakti, is a Telugu news digital platform that is published in digital media, India by the Muppidi Madhusudhan.

It started as a online media in 2014 with Telangana as the center.

21/01/2026
ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ జీసీసీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న లోరియల్ఈ ఏడాది నవంబర్‌లోనే ప్రారంభం దావోస్‌:: ప్రపంచం...
21/01/2026

ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ జీసీసీ

హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న లోరియల్

ఈ ఏడాది నవంబర్‌లోనే ప్రారంభం

దావోస్‌::

ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ (L'Oreal) సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్​లో ప్రారంభించనుంది.

దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ –2026లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో లో హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులతో బ్యూటీ–టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ జీసీసీ ఏర్పాటుతో లోరియల్‌కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది.

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందిస్తామని హియెరోనిమస్ తెలిపారు. దీంతో గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ కార్యకలాపాలకు హైదరాబాద్ ప్రాముఖ్యత మరింత పెరుగనుంది.

నవంబర్‌లో జీసీసీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లను లోరియల్ ఆహ్వానించింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. లోరియల్ జీసీసీని హైదరాబాద్‌కు తీసుకురావాలన్న ఆలోచనపై ముఖ్యమంత్రి ప్రత్యేక ఆసక్తి చూపారని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.

హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రదేశమని చెప్పారు. మెడ్‌టెక్‌, హెల్త్‌టెక్‌ మాత్రమే కాకుండా బ్యూటీ–టెక్‌ వంటి కొత్త విభాగాల్లోనూ తెలంగాణ ముందుంటోందని మంత్రి అన్నారు. ఇప్పటికే మారియెట్, వ్యాన్ గార్డ్, నెట్ ఫ్లిక్స్, మెక్ డోనాల్డ్స్, హినెకెన్ , జాగర్ , కోస్ట్కో వంటి గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయన్నారు.

తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH) గురించి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా వివరించింది. జీసీసీతో పాటు మాన్యుఫాక్షరింగ్ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని లోరియల్ను ఆహ్వానించారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమల ఎకోసిస్టమ్‌ను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తయారీ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హియెరోనిమస్ సానుకూలంగా స్పందించారు

దుర్గం చెరువు మాటనగర గుండెల్లో నీలి నిశ్శబ్దం,దుర్గం చెరువు—ఒక కాలపు అందం.పక్షుల పాటల్లో ఊగిన అలలు,ఈరోజు మౌనంగా మూలుగుతు...
21/01/2026

దుర్గం చెరువు మాట
నగర గుండెల్లో నీలి నిశ్శబ్దం,
దుర్గం చెరువు—ఒక కాలపు అందం.
పక్షుల పాటల్లో ఊగిన అలలు,
ఈరోజు మౌనంగా మూలుగుతున్న కలలు.
గుర్రపుడెక్క నీడలు పడిన నీటిలో,
కలుషితమైంది స్వచ్ఛత కథలో.
బోట్ల నవ్వులు ఆగిన తీరాన,
పర్యాటకం కూడా వేసింది మౌనాన్నే ముద్రాన.
అప్పుడు అడుగుపెట్టాడు బాధ్యతతో,
హైడ్రా చేతిలో ఆశల వెలుగుతో.
రంగనాథ్ చూపు చెరువు వైపు,
“రక్షణే మా ధ్యేయం” అన్న సంకల్పపు దీపం నెత్తురు లేకుండా వెలిగింపు.
జీహెచ్‌ఎంసీ, జలమండలి చేతులు కలిపి,
నీటిపారుదల స్వప్నం దిశగా నడిపి,
రహేజా ప్రతినిధులతో కలిసి నడిచిన అడుగులు,
చెరువు పునర్జన్మకు మోగిన పాదమృదంగులు.
మళ్లీ అలలు చెప్తాయి కథలు,
పచ్చదనం పూస్తుంది తీరాల కలలు.
దుర్గం చెరువు—నగర హృదయ స్పందన,
రక్షితమైతే అదే నిజమైన అభివృద్ధి లిఖితం.
ముప్పిడి మధుసూధన్
21.01.2026

దుర్గం చెరువు మాట

నగర గుండెల్లో నీలి నిశ్శబ్దం,
దుర్గం చెరువు—ఒక కాలపు అందం.
పక్షుల పాటల్లో ఊగిన అలలు,
ఈరోజు మౌనంగా మూలుగుతున్న కలలు.

గుర్రపుడెక్క నీడలు పడిన నీటిలో,
కలుషితమైంది స్వచ్ఛత కథలో.
బోట్ల నవ్వులు ఆగిన తీరాన,
పర్యాటకం కూడా వేసింది మౌనాన్నే ముద్రాన.

అప్పుడు అడుగుపెట్టాడు బాధ్యతతో,
హైడ్రా చేతిలో ఆశల వెలుగుతో.
రంగనాథ్ చూపు చెరువు వైపు,
“రక్షణే మా ధ్యేయం” అన్న సంకల్పపు దీపం నెత్తురు లేకుండా వెలిగింపు.

జీహెచ్‌ఎంసీ, జలమండలి చేతులు కలిపి,
నీటిపారుదల స్వప్నం దిశగా నడిపి,
రహేజా ప్రతినిధులతో కలిసి నడిచిన అడుగులు,
చెరువు పునర్జన్మకు మోగిన పాదమృదంగులు.

మళ్లీ అలలు చెప్తాయి కథలు,
పచ్చదనం పూస్తుంది తీరాల కలలు.
దుర్గం చెరువు—నగర హృదయ స్పందన,
రక్షితమైతే అదే నిజమైన అభివృద్ధి లిఖితం.

ముప్పిడి మధుసూధన్
21.01.2026

ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్...
21/01/2026

ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారు. దావోస్‌లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.

✳️ ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార–వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని ముఖ్యమంత్రి గారు అన్నారు. అందుకే ప్రతి ఏడాది జులై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరం నిర్వహించాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రతినిధులకు సూచించారు.

✳️ హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, 5.75 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని ముఖ్యమంత్రి గారు తెలిపారు.

✳️ “ప్రతి ఏడాది మేము ఎంవోయూలపై సంతకాలు చేయడానికి దావోస్‌కు వస్తాం. కానీ ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో, తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చాం,” అని తెలిపారు.

✳️ హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (GCCs) ప్రధాన కేంద్రంగా మారిందని ముఖ్యమంత్రి గారు అన్నారు. మూసీ నది పునరుజ్జీవనంతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి పెడుతామని చెప్పారు. దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.

✳️ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఇందులో 50 శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందని అన్నారు.

✳️ ఈ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ప్రదర్శించారు. అదే వేదికపై తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ (TAIH), తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030ను ఆవిష్కరించారు.

✳️ సమావేశంలో పాల్గొన్న మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణ, చెరువులు–కుంటల పునరుజ్జీవనం వంటి గేమ్-చేంజర్ ప్రాజెక్టులను వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన క్యూర్, ప్యూర్, రేర్ ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావించారు. తెలంగాణలో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సాంకేతికత, అనుభవం, నైపుణ్యాల పరంగా గ్లోబల్ కంపెనీల సహకారం స్వీకరిస్తామని తెలిపారు.

✳️ ప్రముఖ నటుడు చిరంజీవి గారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి గారితో కలిసి వారు విందులో పాల్గొన్నారు.

Address

Telangana Prajasakti C/o H. NO. 2-151, Thatiparthy Village, Yacharam Mandal, Rangareddy District
Ranga Reddy
501509

Alerts

Be the first to know and let us send you an email when Telangana Prajasakti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telangana Prajasakti:

Shortcuts

Share