DSB FILMS

DSB FILMS Telugu Short Films https://youtube.com/c/DSBFilms

ఖాన్ తో గేమ్స్ ఆడకు.. శాల్తీలు లేచిపోతాయ్...😊బ్రహ్మానందం గారు 👌👌
06/05/2025

ఖాన్ తో గేమ్స్ ఆడకు.. శాల్తీలు లేచిపోతాయ్...😊
బ్రహ్మానందం గారు 👌👌

75 సంవత్సరాలుగా ఆ పేరు పెట్టే ధైర్యం ఏ తల్లిదండ్రులూ చెయ్యలేకపోయారు!సినిమా రంగంలో  నటిగా పేరు తెచ్చుకోవడం, తనకంటూ ఓ ప్ర...
11/04/2025

75 సంవత్సరాలుగా ఆ పేరు పెట్టే ధైర్యం ఏ తల్లిదండ్రులూ చెయ్యలేకపోయారు!

సినిమా రంగంలో నటిగా పేరు తెచ్చుకోవడం, తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని రాణించడం అనేది మామూలు విషయం కాదు. తను తప్ప ఆ క్యారెక్టర్‌ మరొకరు చెయ్యలేరు అనేంతగా ప్రేక్షకుల మనసుల్లో ముద్ర పడిపోవాలంటే వారు ఎంతో ప్రతిభగల వారై ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో అలాంటి నటీనటులు కొంత మందే ఉన్నారు. కొన్ని రకాల పాత్రల్లో వారిని తప్ప మరొకరిని ఊహించుకోలేం. అలా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుక్ను నటి సూర్యకాంతం. ఆ పేరులో ఓ విశిష్టత ఉంది. ఆమె మొట్ట మొదట గయ్యాళి అత్తగా నటించిన సినిమా ‘సంసారం’. ఈ సినిమా తర్వాత అన్ని సినిమాల్లోనూ గయ్యాళి అత్తగానే నటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సూర్యకాంతం అనే పేరు కలిగిన ఏకైక వ్యక్తి ఆమే. ఆ సినిమాకి ముందు రాష్ట్రంలో ఎంతో మంది సూర్యకాంతం పేరు కలిగి ఉండవచ్చు. కానీ, అప్పటి నుంచి అంటే దాదాపు 75 సంవత్సరాలుగా ఆ పేరు తమ పిల్లలకు పెట్టే ధైర్యం ఏ తల్లిదండ్రులూ చెయ్యలేకపోయారు.

సినిమాల్లో గయ్యాళి అత్తగా తన నటనతో ప్రేక్షకులకు ఆగ్రహాన్ని కలిగించేవారు సూర్యకాంతం. ఎందుకంటే ప్రతి సినిమాలోనూ కోడల్ని రాచి రంపాన పెట్టడం, ఇతరులను బాధపెట్టడం వంటి క్యారెక్టర్లే చేసేవారు. ఏ పెళ్లికి వెళ్లినా లేదా ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినా ఆమె దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడేవారు. కనీసం ఆటోగ్రాఫ్‌ కావాలని కూడా అడిగేవారు కాదు. సూర్యకాంతం చేసిన పాత్రలు వారిపై అంతటి ప్రభావాన్ని చూపాయి. ఓసారి ఆమె ఇంటి పనిమనిషి ఏదో కారణం వల్ల కొన్నాళ్ళు రాలేనని చెప్పింది. ఆ సమయంలో తన ఇంట్లో పనిచేసేందుకు ఓ మనిషి కావాలి అని కాకినాడలో ఉన్న స్నేహితురాలికి ఉత్తరం రాశారు సూర్యకాంతం. చెప్పినట్టుగానే ఆమె స్నేహితురాలు ఒక పనిమనిషిని వెంటబెట్టుకొని మద్రాస్‌ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కి వచ్చారు. ఎవరింటికి పనిమనిషిగా వెళ్తోందో ఆ మహిళకు తెలీదు. మాటల సందర్భంలో విషయం తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా భయపడిపోయి ‘బాబోయ్‌.. సూర్యకాంతం ఇంట్లో పనిచెయ్యాలా..’ అంటూ బ్యాగ్‌ తీసుకొని రైల్వేస్టేషన్‌ నుంచి బయటకు పరుగులు తీసిందట. ఇలాంటి సంఘటనలు సూర్యకాంతం జీవితంలో ఎన్నో జరిగాయి.

ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో వైపు సినిమాల్లో కనిపించేదానికి పూర్తి విరుద్ధమైన మనస్తత్వం ఆమెది. నిజజీవితంలో ఆమె ఎంతో సౌమ్యురాలు. ఎంతో సున్నితమైన మనసు గలవారు. ఈ విషయం ఆమెను దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఒక సినిమాలో నాగయ్యను ఎంతో కోపంగా తిట్టే సన్నివేశంలో నటించారు సూర్యకాంతం. షాట్‌ అయి పోయిన వెంటనే ఆయన కాళ్ళకు నమస్కారం చేసి కన్నీళ్ళతో క్షమించమని అడిగారు. దానికి నాగయ్య ‘నన్ను తిట్టింది నువ్వు కాదు, నువ్వు పోషిస్తున్న పాత్ర. బాధపడకమ్మా’ అంటూ ఆమెను ఓదార్చారు. ‘సంసారం’ చిత్రం తర్వాత ఓ హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం సూర్యకాంతంకి వచ్చింది. అయితే అంతకుముందు ఆ సినిమా కోసం ఓ అమ్మాయిని తీసుకొని ఆ తర్వాత ఆమెను తీసేశారట. అది తెలుసుకున్న సూర్యకాంతం ఒకరి బాధ తన సంతోషం కాకూడదు అని ఆ సినిమా చెయ్యనని దర్శకనిర్మాతలతో చెప్పేశారు. ఆమె మనసు ఎంత సున్నితమైందో ఈ సంఘటనలను బట్టి తెలుస్తుంది. ఆమె సినిమాలు చేస్తున్న సమయంలో ప్రతిరోజూ ఆమె ఇంటి నుంచి రకరకాల వంటకాలతో కూడిన క్యారేజ్‌ వచ్చేది. అందరికీ ఎంతో ప్రేమగా ఆమె వడ్డించేవారు. అలాగే ఇంటికి ఎవరైనా వస్తే తప్పనిసరిగా భోజనం చేసి వెళ్లాల్సిందే. ఆరోజుల్లో సావిత్రి, షావుకారు జానకి, కృష్ణకుమారి వంటి నటీమణులు కూడా ఈ తరహా మర్యాదలు చేసేవారు. అంతేకాదు, సూర్యకాంతంకి దయాగుణం ఎక్కువ. తన సహాయం కోరి వచ్చేవారిని ఎప్పుడూ నిరాశపరిచేవారు కాదు. తన స్థాయికి తగ్గట్టుగా వారిని ఆదుకునేవారు. .


- సేకరణ

21/01/2025
DSB FILMS
05/04/2024

DSB FILMS

32 సంవత్సరాలు వెనక్కి వెళితే, మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్...
04/05/2023

32 సంవత్సరాలు వెనక్కి వెళితే,
మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.
థడ్...థడ్...అని తలుపు చప్పుడు.
తెరిస్తే ఒక వ్యక్తి. 'ఎవరు మీరు?' అంటే, బదులుగా 'మీ అభిమానిని అమ్మా!' అని సమాధానం. లోపలికి తీసుకువచ్చి అన్నం పెట్టి కష్టసుఖాలు అడిగింది ఆ మహానుభావురాలు. తనది కిళ్ళీకొట్టు వ్యాపారం అనీ, ఇప్పుడంతా నష్టపోయానని చెప్పాడు ఆ అభిమాని.
తన దగ్గిర సమాయానికి డబ్బులు లేవు. ఒకప్పుడు బాగా బ్రతికి, పది మందిని బ్రతికించిన ఆమెకి ఊరికే పంపడమంటే ఏంటో తెలియదు. ఆలోచించింది. తన బీరువా గుర్తుకువచ్చింది. తనకి ఎంతో ఇష్టమైన రెండో మూడో పట్టుచీరెలని అందులో దాచుకుంది. ఇప్పుడే వస్తాను బాబూ అని వెళ్ళి ఒక చీరె తీసుకొని చేతులు వెనకపెట్టుకుని అతనికి కనపడకుండా బయటకి వచ్చింది. వీధి చివర తనకి తెలిసినవాడికి ఇచ్చి "అన్నయ్యా, దీన్ని అమ్మి ఎంత వస్తే అంత పట్టుకురా" అని చెప్పింది. తిరిగి లోపలికి వెళ్ళి అభిమానికి భోజనం వడ్డించింది. అరగంటకి ఆ 'అన్నయ్య' వచ్చి ఒక 5000 చేతిలో పెట్టాడు. ఆమె నవ్వుతూ అవి తీసుకొని లోపలకి వెళ్ళింది. కానీ ఆ చీరె విలువ ఆ రోజుల్లోనే 30,000. మిగతా పాతికవేలు ఆ అన్నయ జేబులోకి వెళ్ళాయి. ఆ విషయం తనకి తెలీదు. అంతెందుకు? తన జీవితంలో అసలు డబ్బులు ఎప్పుడూ లెక్కపెట్టలేదు అంటే నమ్ముతారా? ఇలా లెక్కలేనన్ని ఆర్ధిక అవకాశ రాబందులు తన జీవితంలో.
ఇలా ఎన్నున్నా, నటననే ప్రేమించింది కానీ ప్రేమని మాత్రం నటించలేదు.
ఆమె కనురెప్పలే కోటి భావాలు పలికేవి.
మహానటులుకు సైతం ఆమె పక్కన నటించడానికి చెమటలు పట్టేవి.
తెలుగువారు సగర్వంగా చెప్పుకునే 'ఆడతనం' ఆమెది.
30 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రస్థానంలో మామూలు నటులు ఎప్పటికీ మోయలేని కిరీటాలని తను చిటికనవేలుతో ఆడించి చూపించింది.
పాత్రలే తనకోసం ఎదురుచూసేవి.
'దేవదాసు' లో విరహాన్ని పొంగించే ఆ కళ్ళు 'మాయాబజార్' లో ఠీవిని పలికించాయి. ఆ కళ్ళే దక్షిణభారతాన్ని అందంగా మోసం చేశాయి. అది నటన కాదు, జీవం అని మనల్ని మరిపించి మురిపించాయి.
ఆ కళ్ళే SVR, MGR, Sivaji Ganeshan, NTR, ANR, Amitabh, Rajnikanth, Kamal haasan లాంటి వారు కూడా ఆమె నటనకి పాదాభివందనం చేసేట్టు చేశాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'నీలం సంజీవరెడ్డి' మంత్రులతో సహా ఆమె ముందు రోడ్డు మీద నడుస్తూ ఆమెను ఏనుగు మీద రవీంద్ర భారతి వరకు 'గాజారోహణం' చేయించారు. భారతదేశ సినిమా చరిత్రలో 'ఎవరికీ దక్కని' అరుదైన గౌరవం ఇది.
'ఇప్పటికీ' 'ఎప్పటికీ' తెలుగువారి ఖ్యాతిని అఖండజ్యోతిలా వెలిగించేవాళ్ళలో ముందు వరుసలో వుంటుంది ఆమె నటనా జీవితం.
ఆమే 'సావిత్రి'.
సావిత్రి గారు మనల్ని పొగడమనో, గుర్తుంచుకోమనో ఏ రోజూ అడగలేదు. గాంధీ కూడా ఆయన బొమ్మని నోటు మీద వేయమని అడగలేదు. గొప్పవాళ్ళు ఎవరూ అడగరు. వాళ్ళ సేవని గుర్తుంచుకొని మనమే ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి.
ఒక scene లో మెట్ల మీద నుండి కిందకి దిగాల్సివుంది. తాను చేయాల్సిన scene ఎప్పుడో చేసేసింది. అయినా shooting gap లో expressions లో వ్యత్యాసం అర్ధం చేసుకోవడం కోసం సావిత్రి గారు కొన్ని వందల సార్లు ఆ మెట్లు ఎక్కి దిగారు. ఒక్కో సారి ఒక్కో expression తో. ఏడుస్తున్నప్పుడు ఇలా, కోపంతో ఇలా, నవ్వుతూ ఇలా, గర్వం తో ఇలా దిగాలి అని. అలాంటి సావిత్రి గారి dedication గురించి "అ ఆ ఇ ఈ" లు కూడా తెలియని ఈ కాలపు నటీమణులు తమ అభిమాన నటి సావిత్రి అని చెప్తున్నారు. ఆ మాట నిజంగా వాళ్ళ మనసులోనుండి వస్తే అంత కంటే ఆనందం లేదు. అలా కాకుండా వాళ్ళు సావిత్రి పేరుని impression కోసం వాడుకుంటే, అంతకంటే అవమానం లేదు.
జయంతికి, వర్ధంతికి మాత్రమే గుర్తుచేసుకోవాల్సిన మనిషి కాదు సావిత్రి గారు. తెలుగు సినిమా గాలి వున్నన్ని రోజులు అందులోని పరిమళం లా వుంటుంది ఆమే.

#సేకరణ

02/04/2023

చంద్రబోస్ తో ఆస్కార్ ఆనందాన్ని పంచుకున్న మెగాస్టార్ చిరంజీవి..🥰

Address

Ravulapalem
533238

Alerts

Be the first to know and let us send you an email when DSB FILMS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DSB FILMS:

Share