
09/07/2025
కోనసీమ అభివృద్ధి ప్రదాత కళా వెంకట్రావు 🙏
1900 సంవత్సరం జూలై 7వ తేదీన కోనసీమలోని ముక్కామలలో జన్మించిన కళా వెంకట్రావు గారు ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు.. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసారు. ఆ సమయంలో రావులపాలెం మీదుగా జాతీయ రహదారి నిర్మాణం జరగడానికి ఎంతగానో కృషి చేసారు. దీంతో జొన్నాడ - రావులపాలెం మధ్య గౌతమి గోదావరి నదిపైనా, గోపాలపురం - సిద్దాంతం గ్రామాల నడుమ వశిష్ట గోదావరి నదిపైనా బ్రిడ్జిల నిర్మాణం జరిగింది. చుట్టూ గోదావరి పాయలు, సముద్ర జలాలతో దీవిలా ఉండే కోనసీమ ప్రాంతం ఈ విధంగా అభివృద్ధి బాట పట్టింది.. తొలిసారిగా గౌతమి గోదావరి నదిపై జొన్నాడ - రావులపాలెం మధ్య బ్రిడ్జి నిర్మాణం జరగడంతో రావులపాలెం గ్రామాన్ని కోనసీమ ముఖద్వారంగా పిలుస్తారు.. కళా వెంకట్రావు గారు చేసిన కృషికి గుర్తింపుగా రావులపాలెం సెంటర్లో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించి అప్పటి ఉప రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత రావులపాలెం ప్రధాన కూడలి కళా వెంకట్రావు సెంటర్ గా పేరు తెచ్చుకుంది. కోనసీమ ముఖద్వారం అనే ఆర్చ్ నిర్మాణంతో రావులపాలెం గ్రామానికి ఆ పేరు శాశ్వతమైంది.
Konaseema Kaburlu కోనసీమ కబుర్లు