17/01/2026
దీక్ష 11వ రోజు 17-01-2026
*రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించండి*
*లిటిల్ హార్ట్ చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు*
*మద్దత్తు ప్రకటించిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం వైస్ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ రెడ్డ
Rayachoty Local:
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐయుఎంఎల్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు నేటితో 11 రోజులకు చేరుకున్నాయి. ఈ దీక్షలో లిటిల్ హార్ట్ చిల్డ్రన్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొని రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే రాయచోటి చుట్టుపక్కల మండలాలు మరింత త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని రాబోయే ముందు తరాలకు మేలు చేసిన వారు అవుతారని తెలిపారు. నేటి దీక్షలకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షులు రఘునాథరెడ్డి తన మద్దతును తెలుపుతూ రాయచోటి అన్ని రకాల వనరులు, కావలసినంత భూభాగం కలిగిన ప్రదేశమని అన్ని విధాలుగా జిల్లా కేంద్రానికి అనువైన స్థలం అని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, ఐయుఎంఎల్, ప్రజా సంఘాల వారు, లిటిల్ హాట్ చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రెసిడెంట్ శివారెడ్డి, CTS జిల్లా కన్వినర్ అంజాద్ బాషా, రామాపురం మండల్ ప్రెసడెంట్ గోపినాథ్, మైనారిటీ కన్వీనర్ మున్వార్ బాష తదితరులు పాల్గొన్నారు.