అన్నమయ్య జిల్లా మీడియా

అన్నమయ్య జిల్లా మీడియా Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from అన్నమయ్య జిల్లా మీడియా, Media, Rayachoti.

నా పేరు, విశ్వనాథ రెడ్డి,సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,రాయచోటి, పోలీస్ స్టేషన్. *తల్లిదండ్రులకు చేతులు జోడించి 🙏 నమస్కరించ...
06/02/2025

నా పేరు, విశ్వనాథ రెడ్డి,
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,
రాయచోటి, పోలీస్ స్టేషన్.

*తల్లిదండ్రులకు చేతులు జోడించి 🙏 నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా*
********

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.

తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.

క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.

పిల్లలకి బడిలో భయంలేదు.
ఇంట్లో భయం లేదు.
అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది.
వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు.
అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.
ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు.

*గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.*
ఇది నిజం.

*గురువంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది*?

*కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు*!

*5వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళే వారిని వచ్చే వారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి*.

*దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లి దండ్రులే మావాడు చదవకున్నా ఏమి కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు*.

*ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు*.

పెన్ను ఉంటే పుస్తకం ఉండదు,
పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు, తెచ్చుకోరు.
భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం.
ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.

కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా...?

స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్ట కూడదు, కనీసం మందలించ కూడదు ప్రేమతో చెప్పాలట.
ఇదెలా సాధ్యమ్?

మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?

మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.

తల్లిదండ్రులకు నా మనవి. పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయుల తోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు.

90 శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు.
ఇది యదార్ధం.

ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.

మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు.

అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు.
మా బాగు కోసమే అని అనుకునేవారు.

ముందుగా తల్లి దండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.

తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..

*పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60 % , కానీ 40% మాత్రం తల్లి దండ్రులే..!🙏*

*పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢ నమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు.*

*ఇప్పుటి తరం 70% పిల్లలు..*

👉తల్లిదండ్రులు కారు, బండి శుభ్రం మంటే తుడవరు.

👉మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు.

👉లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు.

👉కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.

👉రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు.

👉గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు.

👉తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు.

👉 మైనర్ పిల్లలకి బైక్లు ఇవ్వడం
వారు ఆక్సిడెంట్లకు చేయడం
కేసులలో ఇరుక్కోవడం

👉ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.

👉ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి.

👉అతిథులు వస్తే కనీసం గ్లాసేడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు.

👉20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు.

👉బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి.

👉కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు.

👉వారిస్తే వెర్రి పనులు.

👉మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు.

పై వాటికి కారణం మనమే. ఎందుకంటే మనకు అహం,పరువు మరియు ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.

చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.

గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..

*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి.*

*కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు.*

*ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వలన కొందరు యువత 15 ఏళ్లకే ప్రేమ - దోమ అనటం,సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.*

మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు..

అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..
ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లి దండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..

మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం.

👉కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు.

గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనా తీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..

03వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు.

05వ తరగతి వారికి అల్సర్, బీపీలు.

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచక పోవడమే. అందుకే తల్లి దండ్రులు మారాలి.

రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?

కేవలం గుడికి , దర్గా లకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు.

సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..
పిల్లలకు..👇
👉 బాధ్యత
👉 మర్యాద
👉 గౌరవం
👉 కష్టం
👉 నష్టం
👉 ఓర్పు
👉 సహనం
👉 దాతృత్వం
👉 ప్రేమ
👉 అనురాగం
👉 సహాయం
👉 సహకారం
👉 నాయకత్వం
👉 మానసిక ద్రృఢత్వం
👉 కుటుంబ బంధాలు
👉 అనుబంధాలు
👉 దైవ భక్తి
👉 దేశ భక్తి

కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..

మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం, మన ఆనందం కోసం బ్రతుకుదాం.

ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..

భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు.

🙏చదివిన వారందరి విన్నపం...
దయచేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి

*ఈ మేసేజ్ చదివి అందరూ మారిపోతారు అని నేను అనుకోవడం లేదు....*

కనీసం ఒక్కరు అయిన మారుతారని ఉద్దేశంతో ఈ మేసేజ్ పెడుతున్నాను
ఇట్లు ,
మీ విశ్వనాథరెడ్డి.
ట్రాఫిక్ సి,ఐ
రాయచోటి🙏🙏🙏

*అన్నమయ్య జిల్లా*➡️జిల్లా ప్రజలు అందరూ సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి.➡️మీ పరిధిలో చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు జ...
05/02/2025

*అన్నమయ్య జిల్లా*

➡️జిల్లా ప్రజలు అందరూ సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి.

➡️మీ పరిధిలో చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయండి.

➡️ఎప్పటి కప్పుడు జిల్లా ప్రజలను పోలీసు యంత్రాంగం అప్రమత్తం చేస్తూనే ఉంటుంది.

*💠జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు.*

✅జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు ఈ రోజు తన కార్యాలయం నుండి జిల్లా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

🎯సోషల్ మీడియా పట్ల, రోడ్డు భద్రత, మహిళల భద్రత, బాల్య వివాహాలు, గంజాయి ఇతర మాదకద్రవ్యాలు, క్రికెట్ బెట్టింగ్, సైబర్ క్రైమ్, వైట్ కాలర్ నేరాలపై అవగాహన, మరియు అన్నమయ్య జిల్లా పోలీసు వార్తల కోసం వాట్సప్ చానల్ ను ప్రారంభించామని, మీ పరిధిలో చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలను వాట్సప్ ఛానల్ ద్వారా అప్రమత్తం చేస్తూనే ఉంటుందని ప్రతి ఒక్కరూ మా చానల్ ద్వారా ప్రసారం అవుతున్న కార్యక్రమాలను వీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.

🟣ఈ సంధర్భంగా ఎస్పీ గారు జిల్లా ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలియజేశారు.

*సోషల్ మీడియా*

1.సోషల్ మీడియా అనేది సమాచార మార్పిడికి, వ్యక్తులతో అనుసంధానానికి ఒక గొప్ప సాధనం, కానీ దానిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

*వ్యక్తిగత సమాచారం*

2.పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ మొదలైనవి షేర్ చేయవద్దు. తెలియని వారితో చాటింగ్ చేయవద్దు.

3.గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే సందేశాలు మరియు లింక్‌లపై క్లిక్ చేయవద్దు.

4.సోషల్ మీడియాలో వేరే వారిని వేధించవద్దు లేదా బెదిరించవద్దు.

5.తప్పుడు సమాచారం మరియు పుకార్లు వ్యాప్తి చేయవద్దు.

*రోడ్డు భద్రత*

1.రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత.

2.ట్రాఫిక్ నియమాలను పాటించండి.

3.హెల్మెట్ ధరించండి మరియు సీట్ బెల్ట్ పెట్టుకోండి.

4.డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ ఉపయోగించవద్దు.

5.మద్యం సేవించి వాహనం నడపరాదు.

6.పాదచారులకు దారి ఇవ్వండి.

*మహిళల భద్రత*

1.ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

2.అనుమానాస్పద వ్యక్తుల నుండి దూరంగా ఉండండి.

3.అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు కాల్ చేయండి.

4.మీ చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోండి.

*బాల్య వివాహాలు*

1.బాల్య వివాహాలు చట్టవిరుద్ధం మరియు పిల్లల హక్కులకు భంగం కలిగిస్తాయి.

2.బాల్య వివాహాల గురించి ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి.

3.బాల్య వివాహాలను నిరోధించడానికి కృషి చేయండి.

*గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలు*

1.గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలు ఆరోగ్యానికి హానికరమైనవి మరియు చట్టవిరుద్ధం.

2.మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.

3.మాదకద్రవ్యాల గురించి ఎవరికైనా తెలిస్తే పోలీసులకు తెలియజేయండి.

*క్రికెట్ బెట్టింగ్*

1.క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధం.

2.క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొనవద్దు. జీవితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది.

3.క్రికెట్ బెట్టింగ్ గురించి ఎవరికైనా తెలిస్తే పోలీసులకు తెలియజేయండి.

*సైబర్ క్రైమ్*

1.సైబర్ క్రైమ్ అనేది ఒక తీవ్రమైన నేరం.

2.మీ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేయవద్దు.

3.గుర్తు తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు.

4.ఓటిపి ల గురించి జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ షేర్ చేయవద్దు.

*వైట్ కాలర్ నేరాలు/ ఆర్థిక నేరాలు.*

1.ఆర్థిక లావాదేవీల గురించి జాగ్రత్తగా ఉండండి.

2.మోసపూరిత వ్యక్తుల నుండి దూరంగా ఉండండి.

3.వైట్ కాలర్ నేరాల గురించి ఎవరికైనా తెలిస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు.

*జిల్లా పోలీసు యంత్రాంగానికి సూచన చేసిన- ఎస్పీ.*

🌀సైబర్ నేరాల గురించి ఎక్కువుగా పిర్యాదులు వస్తున్నాయని, జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు, అందరూ కలసి
ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని, ఎస్పీ గారు ఆదేశాంచారు.

🥏జిల్లా ప్రజలను అప్రమత్తం చేయుటకు, అవగాహన కల్పించుటకు ఏర్పాటు చేసిన వాట్సప్ ఛానల్ ను, మీరు మీ కుటుంబ సభ్యులు ఫాలో అవుతూ.. అన్నమయ్య జిల్లాలో ఆండ్రాయిడ్ (ఇంటర్నెట్) వాడుతున్న ప్రతి ఒక్కరి మొబైల్ లో మన అన్నమయ్య పోలీస్ చానల్ ఉండేలా 🔗 లింక్ ను మీ పరిధిలోని ప్రతి ఒక్కరికీ పంపించేలా చూడాలని. అవగాహనతోనే జిల్లా ప్రజలను అప్రమత్తం చేద్దామని, ముఖ్యంగా కళాశాలలో అధ్యాపకులకు, విద్యార్థిని విద్యార్థులకు, మన ఛానల్ లింక్ వెంటనే చేరేలా చేయటం మీ బాధ్యత అన్నారు, ఈ బాధ్యత ఒక యజ్ఞంలా కొనసాగాలని, ఇది ఒక టాస్క్ అని ఎస్పీ గారు పోలీసు యంత్రాంగానికి పిలుపునిచ్చారు.
👇
వాట్సప్ ఛానల్ లింక్
https://whatsapp.com/channel/0029Vb1yOZj65yDLKfyRdh1u

🌈పైన పేర్కొన్న అంశాలపై అవగాహన కల్పించడానికి మరియు నేరాలను తగ్గించడానికి, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. మరియు ఏదైనా సమస్య
ఉంటే పోలీసులకు తెలియజేయవచ్చని, జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు పేర్కొన్నారు.
👇
*పోలీసు ప్రధాన కార్యాలయం,*
*అన్నమయ్య జిల్లా-రాయచోటి*

🕉️🕉️🕉️🕉️🕉️*ఓం నమో వేంకటేశాయ**తిరుమల సమాచారం**05-ఫిబ్రవరి-2025* *బుధవారం* 🕉️ *తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది*🕉️ నిన్న  *04-...
05/02/2025

🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*05-ఫిబ్రవరి-2025*
*బుధవారం*

🕉️ *తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది*

🕉️ నిన్న *04-02-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *73,599* మంది...

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *16,069* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *3.21* కోట్లు ...

🕉️ ఉచిత సర్వదర్శనానికి *2* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు....

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *6* గంటల సమయం....

🕉️ నిన్న రధసప్తమి సందర్భంగా ఇవ్వాళ టైమ్ స్లాట్ (SSD) దర్శనం టోకన్లు రద్దు చేసిన టిటిడి..

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *3* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

కడప జిల్లా..చక్రాయపేట..చక్రాయపేట మండలం కల్లూరుపల్లి గ్రామ సమీపంలో.. విద్యుత్ షాక్ కు గురై 15 గొర్రెలు మృతి..నరసింహనాయుడు...
06/11/2024

కడప జిల్లా..
చక్రాయపేట..

చక్రాయపేట మండలం కల్లూరుపల్లి గ్రామ సమీపంలో..

విద్యుత్ షాక్ కు గురై 15 గొర్రెలు మృతి..

నరసింహనాయుడు కు చెందిన గొర్రెలుగా గుర్తింపు..

గొర్ల యజమాని కి కూడా విద్యుత్ షాక్ తగలడంతో స్పృహ తప్పి పడిపోయిన గొర్ల యజమాని నరసింహనాయుడు..

విద్యుత్ వైరు తెగి కింద పడడంతో జరిగిన ప్రమాదం..

దాదాపు 2 లక్షల రూపాయలు పైన నష్టం వాటిల్లిందని వెల్లడించిన గొర్ల యజమాని బంధువులు.

*అన్నమయ్య జిల్లా*4️⃣/1️⃣1️⃣/2️⃣0️⃣2️⃣4️⃣*జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేధిక" కార్యక్రమం..**మీకోస...
04/11/2024

*అన్నమయ్య జిల్లా*
4️⃣/1️⃣1️⃣/2️⃣0️⃣2️⃣4️⃣

*జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేధిక" కార్యక్రమం..*

*మీకోసం కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత-జిల్లా ఎస్పీ.శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు..*

🪀రాయచోటి, నవంబర్ 4: ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని వాటిని చట్టపరిధిలో విచారించి న్యాయం అందించడానికి అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందని ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు అన్నారు,ఈరోజు మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ గారు స్వయంగా మాట్లాడి, వారి సమస్యను విని, సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు,అంతేకాక సబ్ డివిజన్ పరిధిలో సర్కిల్ పరిధిలో మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించాలని, వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను పూర్తిగా విని చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించాలని, సదరు ఫిర్యాదులను "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయాలని, జిల్లా ఎస్పీ శ్రీ.వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు పోలీసు అధికారులను ఆదేశించారు, వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి, వారి సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు,సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులకు సిబ్బంది సహాయం చేసి ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి సహాయం చేశారు. సమస్య తీవ్రత ఎలా ఉన్నా చట్ట పరిధిలో పూర్తిస్థాయి విచారణ జరిపి నిర్ణీత గడువు లోపల పరిష్కారం అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని, సమస్యను గూర్చి చింతించకుండా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చని ఎస్పీ గారు ఫిర్యాదుదారులకు భరోసా కల్పించారు..

*పోలీసు ప్రధాన కార్యాలయం,*
*అన్నమయ్య జిల్లా-రాయచోటి*


🟣🟢🔵🔴

🌸 *రాజధాని నిర్మాణానికి అన్నా క్యాంటీన్ నిర్వహణకు ₹10 లక్షల రూపాయల విరాళం.*  *సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెక్ అందజేసిన...
04/11/2024

🌸 *రాజధాని నిర్మాణానికి అన్నా క్యాంటీన్ నిర్వహణకు ₹10 లక్షల రూపాయల విరాళం.*

*సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెక్ అందజేసిన రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.*

అమరావతి, నవంబర్ 04
రాజధాని నిర్మాణానికి,
అన్న క్యాంటీన్ నిర్వహణకు, రాయచోటి నియోజకవర్గ వ్యాపారస్తులు, వర్తకుల వారు *₹10 లక్షల రూపాయల* విరాళాన్ని అందజేశారు. సంబంధిత చెక్ లను అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు అందజేశారు.

*IMPORTANT**స్క్రోలింగ్/ప్రెస్**3.11.2024 - రాయచోటి, అన్నమయ్య జిల్లా**జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు ...
04/11/2024

*IMPORTANT*
*స్క్రోలింగ్/ప్రెస్*
*3.11.2024 - రాయచోటి, అన్నమయ్య జిల్లా*

*జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేయాలి: రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి*

*ఆదివారం ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో... రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం*

*ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్ కుమార్ రెడ్డి, షాజహాన్ భాష, అరవ శ్రీధర్, ఆకేపాటి అమర్నాథరెడ్డి, జేసి ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్వో మధుసూదన్ రావు, ఆర్డీఓలు శ్రీనివాస్, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.*

*ఈ సమీక్ష సమావేశంలో రెవిన్యూ, పిజిఆర్ఎస్, సామాజిక పింఛన్లు, పౌరసరఫరాలు-దీపం 2, అన్నా క్యాంటీన్లు, ఉచిత ఇసుక విధానం అమలు, రోడ్లు భవనాలు, రవాణా, వ్యవసాయ అనుబంధ శాఖలు, వైద్య ఆరోగ్యం, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, ఎంజిఎన్ఆర్ఇజిఎస్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్తు, గృహ నిర్మాణం, ఐసిడిఎస్, స్కిల్ డెవలప్మెంట్, గ్రామ వార్డు సచివాలయాలు, సంక్షేమం తదితర అంశాలపై చర్చించనున్నారు.*

*సమగ్ర అభివృద్ధి సాధనకు కృషి చేద్దాం*

*జిల్లా సమీక్షా కమిటీ సమావేశం ప్రారంభంలో జిల్లా కలెక్టరు శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ... నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం ఇంఛార్జి మంత్రి గారి అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జరుగుతోందన్నారు. జిల్లా మంత్రివర్యులు గారితోపాటు శాసనసభ్యులు, ఎంఎల్సీలు అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకున్న చర్యల కార్యాచరణ నివేదికను సభ్యులకు అందజేశామన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో అందరం కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

*జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి*

సమావేశం ప్రారంభంలో జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ... గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, నాతోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, అన్నమయ్య జిల్లా అధికారులకు, మీడియా మిత్రులకు, అందరికీ నా నమస్కారాలు.

> గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లాకు నన్ను ఇన్చార్జి మంత్రిగా నియమించడం జరిగింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పై 32 వేల కీర్తనలు రచించిన అన్నమాచార్యులు జన్మించిన ఈ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నన్ను నియమించినందుకు చాలా ఆనంద పడుతున్నాను, అదే సమయంలో ముఖ్యమంత్రివర్యులు నా మీద పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది.

> అన్నమయ్య జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాలుగు స్థానాలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడంలో అన్నమయ్య జిల్లా కీలకపాత్ర పోషించింది.

> అందుకు అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

> అన్నమయ్య జిల్లాకు నేను రావడం ఇదే మొదటిసారి అయినప్పటికీ నేను, నా మంత్రివర్గ కార్యాలయ సిబ్బంది సహాయంతో, అన్నమయ్య జిల్లాలోని ఎన్డీఏ కూటమి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ మరియు కార్యకర్తలతో ఎప్పటికప్పుడు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తూనే ఉన్నాను.

>మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన భూ కుంభకోణం, ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ, జాతీయ రహదారుల పనులు, ఉచిత ఇసుక విధానం, ఇతర సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, కార్యకర్తల సమస్యలు.... వీటన్నిటిపై ఎప్పటికప్పుడు నేను సమీక్షిస్తూనే ఉన్నాను.

> ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ విషయానికి వస్తే అన్నమయ్య జిల్లా మొదటి మూడు స్థానాలలో నిలుస్తోంది. జిల్లాను ముందు వరసలో నిలబెట్టిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గారికి మరియు జిల్లా యంత్రంగానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

> అదేవిధంగా పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి పెట్టి స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అవార్డులను పొందిన విషయం మనకు అందరికీ తెలిసిందే.

> అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047కు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ అభిప్రాయాల సేకరణ చేపట్టిన విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే.

> ఇన్ని మంచి కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా జిల్లాను ముందుకు నడిపిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గారికి మరియు జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు.

> ఉచిత ఇసుక పాలసీ జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని తెలుస్తోంది.

> అలాగే జిల్లాలో పలుచోట్ల అన్నా క్యాంటీన్లను జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.

> రెండు రోజుల క్రితమే జిల్లాలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలైన దీపం 2.0, మిషన్ పాట్ హెూల్ ఫ్రీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది.

> దీపం 2 పథకం ద్వారా జిల్లాలోని ఎంతోమంది మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాను.

> అలాగే గత ప్రభుత్వంలో పాడైపోయిన రోడ్లను మరమ్మత్తులు చేసి గుంతలు లేని రోడ్లను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.

> అన్నమయ్య జిల్లాలో పలు జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి.

> అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్యక్రమంలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే పనులను చేపట్టడం జరిగింది.

> ఈ పనులపై జిల్లా కలెక్టర్ తో సమీక్ష నిర్వహించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను.

> "సంపద సృష్టి" ఈ ప్రభుత్వ లక్ష్యం. సంపద సృష్టి కోసం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ఎంతో అవసరం. అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ గారు పలు చర్యలు తీసుకోవడం జరిగింది. దీనితోపాటు యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఇప్పటికే చాలాసార్లు జాబ్ మేళాలు విజయవంతంగా నిర్వహించారు.

> త్వరలో జిల్లాలో స్కిల్ సెన్సెస్ జరగబోతోంది. స్కిల్ సెన్సెస్ కార్యక్రమం ద్వారా అన్నమయ్య జిల్లాలోని యువతకు నైపుణ్యాన్ని పెంచి, వారికి ఉద్యోగ కల్పనకు బాటలు వేస్తామని తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

> ఇక జిల్లాలోని ముఖ్యమైన సమస్యల విషయానికొస్తే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ భూకుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా గారితో నేను చర్చించడం జరిగింది. దీనిపై త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను.

> ఇతర భూ సమస్యలపై జిల్లాలో పలు రెవెన్యూ సదస్సులను, ఫ్రీ హోల్డ్ భూముల రీ వెరిఫికేషన్ కార్యక్రమాలను, విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

> అలాగే జిల్లాలో చేపట్టిన వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు, విద్య, వైద్యము, ఇలా అన్ని అంశాలపై రాయచోటి ఎమ్మెల్యే మరియు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఇతర ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కూలంకషంగా చర్చించి అన్నమయ్య జిల్లాను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను.

> అన్నమయ్య జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు గాను నాలుగు నియోజకవర్గాలను ఎన్డీఏ కూటమికి అందించిన కార్యకర్తల సంక్షేమము ఈ ప్రభుత్వ ప్రాధాన్యత లలో ముందు వరుసలో ఉంటుంది.

> కార్యకర్తలను కలవడానికి నేనెప్పుడూ ముందుంటాననే విషయం అందరికీ తెలుసు. ఏ విషయంపైనైనా కార్యకర్తలను నా వద్దకు వచ్చి చర్చించవచ్చు.

అందరూ కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు.

*సమావేశంలో మంత్ర మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ*...... ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ నాలుగు నెలల కొద్దికాలంలోనే ఏవైతే ప్రజలకు అందాలో మరియు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో వాడవాడలో ప్రజల వద్దకు వెళ్ళాం. వారందరూ ఇది ఒక మంచి ప్రభుత్వం అని నిరాజనాలు పలికారు. గ్రామసీమల్లో వెలుగులు నింపడానికి పల్లె పండుగ కార్యక్రమంలో రోడ్లు డ్రైనేజీలు త్రాగునీటి సౌకర్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వంద రోజుల్లో చెప్పిన ప్రతి పని చేయడమైంది. జిల్లాలో సుమారు 65 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తున్నాం. మొదటి మంత్రివర్గ సమావేశంలోనే నిరుద్యోగుల కోసం డీఎస్సీ ని ప్రకటించి ప్రజల ప్రభుత్వంగా నిరూపించుకున్నాం. మనకు కరువుతో ఉన్న మండలాల్లో రైతులకు కర్షకులకు ప్రజలకు ఇన్చార్జి మంత్రివర్యులు ఆధ్వర్యంలో పూర్తిగా సహాయ సహకారాలు అందించి ప్రభుత్వ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేయడానికి కృషి చేస్తాం. రాయచోటి నియోజకవర్గం లో వర్షాభావంతో నీటి సమస్యలు ఉన్నాయి. ఆరు మండలాల్లో నీటి సౌకర్యం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ జిల్లాలో టమోటా మామిడి ఎక్కువ. ప్రాసెసింగ్ కౌల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. హార్టికల్చర్ అబ్బుగా చేయడానికి మీ సూచనలు సలహాలు సహకారం కోరుతున్నాను. లోకేష్ బాబు నేతృత్వంలో విద్య ఐటీ రంగాల అభివృద్ధి చెందడంతో పాటు రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

*అనంతరం జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని ఇన్చార్జి మంత్రి ప్రారంభించారు.*
-----------------///----------------
*డిపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా*

ప్రకటన...SB కోచింగ్ సెంటర్...TET & DSC..ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, YSR IT కంప్యూటర్స్ ప్రక్కన..కొత్తపేట..రాయచోటి..అన్న...
04/11/2024

ప్రకటన...

SB కోచింగ్ సెంటర్...

TET & DSC..

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, YSR IT కంప్యూటర్స్ ప్రక్కన..

కొత్తపేట..

రాయచోటి..

అన్నమయ్య జిల్లా...

కారు ఢీ కొని ఒకరు మృతి _----------------------------------అన్నమయ్య జిల్లా...సిబ్యాల గ్రామం మోడల్ స్కూల్ వద్ద రాత్రి జరిగ...
04/11/2024

కారు ఢీ కొని ఒకరు మృతి
_----------------------------------
అన్నమయ్య జిల్లా...

సిబ్యాల గ్రామం మోడల్ స్కూల్ వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి చెందారు.సిబ్యాల గ్రామం గోళ్ళావాండ్ల పల్లెకు చెందిన జబ్బు రామాంజులు రాత్రి 7 గంటల సమయం లో మోడల్ స్కూల్ వద్దవున్న జగనన్న కాలనీలో తన పనిముగించుకుని రోడ్డు మీదకొచ్చి బస్సుకోసం మోడల్ స్కూల్ వద్దనున్న కు నడుచుకుంటూ వెళుతుండగా సుండుపల్లి నుండి రాయచోటి వైపు వస్తున్న కారు ఢీ కొనడంతో రామాంజులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ రామాంజులు ను తన బంధువులు అంబులెన్సు ద్వారా కడప రూయాకు తరలించారు.చికిత్స పొందుతూ రామాంజులు మృతి చెందినట్లు రామాంజులు బంధువులు తెలిపారు.మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. సంఘటన పట్ల పోలీస్ లు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

అన్నమయ్య జిల్లా....సంబేపల్లి వద్ద బొలెరో వాహనం ఢీకొని అక్కడికక్కడే చెన్నకేశవ అనే వ్యక్తి మృతి..మృతుడు బద్వేల్  పెద్ద గోప...
03/11/2024

అన్నమయ్య జిల్లా....

సంబేపల్లి వద్ద బొలెరో వాహనం ఢీకొని అక్కడికక్కడే చెన్నకేశవ అనే వ్యక్తి మృతి..

మృతుడు బద్వేల్ పెద్ద గోపవరం గ్రామానికి చెందిన కోడూరు చెన్నకేశవగా గుర్తింపు...

తన సొంత పనుల మీద అన్నమయ్య జిల్లా పీలేరుకు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదం...

సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు .....

*పత్రికా ప్రకటన:తేదీ 2/11/2024**అన్నమయ్య జిల్లా*👉గంజాయి కేసులో నలుగురు అంతరాష్ట్ర ముద్దాయిలు అరెస్ట్..👉ఒక సుమో, ఒక కారు,...
02/11/2024

*పత్రికా ప్రకటన:తేదీ 2/11/2024*

*అన్నమయ్య జిల్లా*

👉గంజాయి కేసులో నలుగురు అంతరాష్ట్ర ముద్దాయిలు అరెస్ట్..

👉ఒక సుమో, ఒక కారు,దాదాపు 50 కేజీల గంజాయి స్వాధీనం..

*💠మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు..*

❇️రాయచోటి, నవంబర్ 2 : అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్వాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, రాజంపేట డిఎస్పీ శీ.ఎన్. సుధాకర్ గారి అద్యర్యంలో, కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ. పి.వెంకటశ్యర్లు, కోడూరు అర్చన్ ఇన్స్పెక్టర్ శ్రీ .హేమసుందర్ రావు మరియు రాజంపేట రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ.బి.వి రమణ గారు, ఓబులవారిపల్లి తహసీల్దార్ శ్రీ.బి.శ్రీధర్ రావు మరియు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బిందితో కలిసి, కోడూరు రూరల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గారికి గంజాయి రవాణా గురించి రాబడిన సమాచారము పై, ఓబులవారిపల్లి మండలం, మంగంపేట, చెన్నకేశవగుడి సమీపంలో NH-716 రేడ్ లో వాహనాలు తనిఖీ" చేస్తూ ఉండగా, మంగళంపల్లి దారిగుండా నలుగురు వ్యక్తులు ఒక సుమో మరియు ఒక కారు లో ముగ్గురు మగవారు, ఒక ఆడ వ్యక్తి, తిరుపతికి తరలిస్తున్న సుమారు 10 లక్షలు విలువ చేసే 50 కేజీల గంజాయిని స్వాధీనం చేనుకోవడమైనది. నలుగురు అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేయడమైనది.

*👉అరెస్ట్ కాబడిన, మరియు స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు..*

1. కల్లపల్లి నాగేంద్ర @ కీల, వయస్సు:40 సంవత్సరాలు, తండ్రి. కృష్ణమూర్తి, రంగంపల్లి, పుల్లంపేట మండలం.
(4 ఎర్రచందనం కేసులు, 4 గంజాయి కేసులు, APO4 AW 9662 సుమో,APO4 DL 5992 కారు, 30 కేజీల గంజాయి స్వాధీనం)

2. కె. కుమారి, 38 సంలు. భర్త: అన్నామలై ఆచారి, గాంధీ నగర్, తిరుపతి.

3. బాపురాజన్ శ్రీని, 43 సం.లు, తండ్రి: బాపురాజన్, కేరళ రాష్ట్రం.
(2 గంజాయి కేసులు, 10 కేజీల గంజాయి స్వాధీనం)

4. షేక్ సలీం బాషా, 47 సం.లు, తండ్రి, షఫీ ఉల్ల కాకతోపు వీధి, పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా.
(6 గంజాయి కేసులు, 10 కేజీల గంజాయి స్వాధీనం)

🌈మొత్తం సుమారు 10 లక్షల విలువ చేసి సుమారు 50 కేజీల గంజాయి మరియు ఒక సుమో, ఒక కారు, స్వాధీనం చేసుకోవడమైనదని, వీరితో పాటు ఇంకొంతమంది ప్రమేయం ఉందని తెలిపారు. పై వారి మీద ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు. వీరిని కోర్ట్ లో హాజరు పరుస్తామని ఎస్పీ గారు తెలిపారు.

🎯ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. గంజాయి అమ్మినా, కొన్నా, దాచి ఉంచినా, అక్రమ రవాణా చేసినా, అందుకు ఏవిధంగా సహకరించినా అట్టివారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, వారిపై హిస్టరీ షీట్లు తెరుస్తామని, పదే పదే ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై "పీడీ"యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ప్రజలెవరైనా, మీ దృష్టికి ఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం వస్తే మాకు తెలియపరచండి. మీ వివరాలు గోప్యంగా ఉంచి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కేసులో మంచి ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు. పై వ్యక్తులను పట్టుకోవడంలో ఓబులవారిపల్లి ఎస్ఐ శ్రీ. మహేష్ నాయుడు క్రింద పడి చేతికి గాయాలు అయినట్లు, అయినా వెరవకుండా ముద్దాయిలను అరెస్ట్ చేసిన ఎస్ఐ ను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ..

*పోలీసు ప్రధాన కార్యాలయం,*
*అన్నమయ్య జిల్లా-రాయచోటి*

*పత్రికా ప్రకటన**ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం**నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి ప్రత్...
30/10/2024

*పత్రికా ప్రకటన*

*ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం*

*నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు*

*రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*

*రాయచోటి, అక్టోబర్ 30:-*

ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం రాయచోటి పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ.... గత ఎన్నో ఏళ్లుగా రాయచోటి ప్రాంతంలో సమస్యలు పరిష్కారానికి నోచుకోక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొనే వారని నేడు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు.
రాయచోటి నియోజకవర్గంలో నీటి సమస్య అధికంగా ఉందని నీటి సమస్య పరిష్కారానికి గ్రామాలలో బోర్లు వేసి మోటార్ల గురించి ప్రజలకు నీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా నీరు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ మంత్రి ఆదేశాలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మౌర్యా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
—————////—————

Address

Rayachoti

Website

Alerts

Be the first to know and let us send you an email when అన్నమయ్య జిల్లా మీడియా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category