13/05/2023
*సక్సెస్ స్టోరీ*
*అన్నమయ్య జిల్లా*
*రాయచోటి*
*తేదీ : 13-05-2023*
*★ శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు*
*★ పేదల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలో నాలుగో స్థానంలో అన్నమయ్య జిల్లా*
*★ ఇంతవరకూ 20,946 ఇళ్లు పూర్తి*
*★ వివిధ దశల్లో 52,490 ఇళ్లు*
*★ 502 లేఅవుట్లలో చేపట్టిన నిర్మాణాలు*
*★ రూ.606.01 కోట్ల బిల్లులు చెల్లింపు*
*★ మరింత వేగంగా నిర్మాణాలు చేపట్టడానికి ప్రతి శనివారం ‘హౌసింగ్ డే’*
*★ లక్ష్యం నిర్ణయించుకొని వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు*
*రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో పేదల సొంతింటి కల సాకారమవుతోంది. అన్నమయ్య జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాలో 502 లేఅవుట్లలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. సొంత స్థలం కలిగిన వారు ప్రభుత్వం సాయంతో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఇంటి నిర్మాణం వేగంగా పూర్తి చేసుకుని సొంతింటికి చేరి తమ కల నేరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 502 లేఅవుట్లుగా చేసి 79,661 మందికి ఇళ్లు మంజూరు చేశారు. అందులో 73,436 మంది లబ్దిదారులు రిజిస్ట్రార్ చేసుకున్నారు. ఇంకా 5898 మంది లబ్దిదారులు రిజిస్ట్రార్ చేసుకోవాల్సి ఉంది. ఇంతవరకు 20,946 వేల ఇళ్లు పూర్తి చేయగా వాటిలో 20,946 వేల వరకు గృహ ప్రవేశాలు జరిగాయి. ఇళ్ల నిర్మాణంలో అన్నమయ్య జిల్లా ఉత్తమ పనితీరుతో రాష్ట్రంలోనే నాలుగవ స్థానంలో నిలుస్తోంది*.
*పుంజుకున్న నిర్మాణాలు...వివిధ దశల్లో 52,490 ఇళ్లు :-*
ప్రస్తుతం వర్షాలు లేకపోవడం, వాతావరణం కూడా సహకరిస్తుండటంతో ఇళ్ల నిర్మాణాలు పుంజుకున్నాయి. 'నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కరెంటు, నీటిసరఫరా కనెక్షన్లు ఇప్పటికే ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు ఇస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా శ్లాబ్, సన్‌డైన్, బేసిమెంట్ తదితర దశల నిర్మాణాల్లో 52,490 ఇళ్లు ఉన్నాయి. ఎన్.ఎస్ దశలో 938, బిలో బేస్‌మెంట్ లెవెల్ 20,294, బేస్‌మెంట్ లెవెల్ 21,177, ఇళ్లు ఉన్నాయి. రూఫ్ లెవెల్లో 6899, స్లాబ్ లెవెల్లో 3,182 ఇళ్లు ఉన్నాయి. కలెక్టర్ గిరీషా పిఎస్ జిల్లాలోని జగనన్న లేఅవుట్‌లో ఇళ్లు నిర్మాణం వేగంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు హౌసింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలో పెద్ద ఎత్తున గృహప్రవేశలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
*మా జీవితాలకు భరోసా ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి :-*
నా పేరు షేక్ మహమ్మద్ అలీ రాయచోటి నారాయణరెడ్డి పల్లి జగనన్న లేఅవుట్ కాలనీలో ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశం అయ్యాను. నేను ఇంతకు ముందు రాయచోటిలో అద్దె గది కోసం రూ.5 వేలు చెల్లింపు చేసే వాడిని. ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన ఇంటి స్థలం నేడు లక్షల రూపాయల ఆస్తిగా నిలిచింది. విలువైన స్థలాలను ఉచితంగా అందించి మాలాంటి పేదల జీవితాలకు భరోసా ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. *-మహమ్మద్ అలీ షేక్, నారాయణరెడ్డి పల్లి జగనన్న లేఅవుట్ కాలనీ రాయచోటి, అన్నమయ్య జిల్లా.*
*అద్దె ఇంటి బాధలు తీరయి :-*
నా పేరు వేమల్ల సుబ్బమ్మ నారాయణరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాలనీ రాయచోటిలో నివాసం ఉంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెంటు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ధర పలికే విలువైన స్థలాలను ఉచితంగా అందించారు. మా జీవితాలకు భరోసా ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. నేను ఇటీవలే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాను. ఇంటి బాధలు తీరుతున్నాయని అద్దె ఇంటి నుంచి సొంతింటికి చేరాను. *-వేమల్ల సుబ్బమ్మ, జగనన్న లేఅవుట్ కాలనీ రాయచోటి, అన్నమయ్య జిల్లా.*
*రోజువారీ లక్ష్యాలు ఇస్తున్నాం :-*
ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. మండలాల వారీగా రోజువారీ లక్ష్యాలను ఇస్తున్నాం. వెనుకబడిన మండలాలపై ప్రత్యేకదృష్టి పెడుతున్నాం. స్వయంగా వెళ్లి నిర్మాణాలు ఆలస్యం అవడానికి కారణమైన సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నాం. హౌసింగ్ డే రోజున పథకంతో ముడిపడి ఉన్న అధికారులు రెండు లేఅవుట్‌లు సందర్శించాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. లేఅవుట్లలో మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.*-అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్.*
*----Issued by PRO, Annamayya District----*q