14/06/2025
సూపర్ 6 మోసాలు !
బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు ₹81,398 కోట్లు !
సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా 143 హామీలను ఎగ్గొట్టిన చంద్రబాబు
వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు
నాడు తన హామీలకు 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ' పేరుతో ఇంటింటా బాండ్ల పంపిణీ
చంద్రబాబు నైజం తెలిసి ప్రజలు నమ్మరేమోనని జనసేన అధ్యక్షుడు పవన్ పూచీ
వైఎస్ జగన్ పథకాలన్నీ కొనసాగిస్తామని.. అంతకు రెండింతలు సంక్షేమం ఇస్తామని భరోసా
నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ తుంగలోకి..
రెండో ఏడాదిలోకి అడుగు పెడుతూనే సూపర్ సిక్స్ అమలు చేసేశానంటూ బాబు ప్రకటన
దీనిపై ఇంకెవరైనా మాట్లాడితే నాలుక మందం తప్ప మరోటి కాదంటూ హూంకరింపు
చంద్రబాబును నమ్మి ఓట్లు వేస్తే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపడమేనన్న వైఎస్ జగన్
నాటి వైఎస్ జగన్ మాటలు అక్షర సత్యంగా మారాయంటోన్న రాజకీయ విశ్లేషకులు
దీపం పథకం కింద మహిళలకు రూ. 3.218 కోట్లు ఎగవేత
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.10,717 కోట్లు ఇవ్వని వైనం
నిరుద్యోగ భృతి కింద యువకులకు రూ.7,200 కోట్లు మోసం
ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు రూ.32 వేల కోట్లు ఎగనామం
తల్లికి వందనం పథకం కింద రూ. 13,113 కోట్లు ఎగ్గొట్టి పంగనామాలు
ఉచిత బస్సు కింద మహిళలకు రూ.3,500 కోట్లు ఎగవేత
మత్స్యకారులకు వేట నిషేధ భృతి తొలి ఏడాది రూ.265 కోట్లు ఎగవేత
రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం చెల్లించని సర్కార్
50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పింఛన్ పథకం కింద రూ.9,600 కోట్ల ఎగనామం