
02/09/2025
రేపటి నుండి పాత రాయచోటి దర్గాలో ఉరుసు ఉత్సవాలు
రాయచోటి:
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం పాత రాయచోటిలో వెలసి ఉన్న హజరత్ జమాలుల్లా బాబా ఉరుసు మహోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుండి జరగనున్నాయి. 4వ తేదీ గురువారం గంధం ఊరేగింపుతో ఉరుసు మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే విధంగా ఈ నెల 5వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం దర్గా ఆవరణలో భారీ అన్నదాన కార్యక్రమం.. అదే రోజు సాయంత్రం ఉరుసు ఉత్సవం జరగనుంది. 6వ తేదీ శనివారం తహలీల్ ఫాతేహా కార్యక్రమంతో ఉరుసు ఉత్సవాలు ముగియనున్నాయి. ఉరుసు ఉత్సవాలకు హిందూ, మహమ్మదీయ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.
ఫోటో: 1) పాత రాయచోటిలో వెలసియున్న జమాలుల్లా బాబా దర్గా
2) దర్గాలో వెలిసియున్న జమాలుల్లా బాబా మజార్