19/05/2025
అన్నమయ్య జిల్లా మదనపల్లె లో జరిగిన " హిందూ హనుమాన్ శోభా యాత్ర " సంఘటన పై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశం....
17.05.2025 వ తేదీకి 3 రోజుల క్రితం మదనపల్లి పట్టణంలోని రామాలయం నుండి ఎన్టిఆర్ సర్కిల్ > నీరుగట్టువారిపల్లే > చౌడేశ్వరి సర్కల్ > గొల్లపల్లి క్రాస్ > అంబేద్కర్ సర్కల్ > బర్మా వీధి > సబ్ కలెక్టర్ ఆఫీసు > నిమ్మనపల్లి సర్కల్ > ఎన్విఆర్ లే ఔట్ > శేష మహల్ > చిత్తూర్ బస్టాండ్ > నెహ్రూ బజార్, అప్పరావ్ వీధి > బెంగళూరు బస్ స్టాండ్ మీదుగా రామాలయం వరకు “హిందూ హనుమాన్ శోభ యాత్ర” జరపాలని శ్రీ బండి బాలాజీ విజయ్ కుమార్ @ బండి బాలాజీ, వారితో సుమారు 400 మంది 300 మోటార్ సైకిళ్లలో ర్యాలీ చేయాలని అనుమతి కొరగా జిల్లాలో వున్న ప్రస్తుత శాంతిభద్రతల కారణంగా మరియు, మదనపల్లిలో ఉన్న ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా, మదనపల్లి SDPO శ్రీ S. మహేంద్ర 16.05.2025 వ తేదీ రాత్రి 8.00 గం. లకు సదరు ర్యాలీ నిర్వాహకులతో తన ఆఫీసునందు మీటింగ్ నిర్వహించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ వుండటకు ర్యాలీని 17.05.2025 వతేదీ మద్యాహ్నము 3.00 గంటలకు ప్రారంబించి రామాలయం నుండి ఎన్టిఆర్ సర్కిల్ > అనిబిసెంట్ సర్కిల్ > మల్లిఖార్జున సర్కిల్ > మెట్రో కాంప్లెక్స్ సర్కిల్ > అంబేద్కర్ సర్కల్ > బర్మా వీధి > సబ్ కలెక్టర్ ఆఫీసు > చిత్తూర్ బస్టాండ్ > నెహ్రూ బజార్ > వెంకటేశ్వరస్వామి గుడి > మడికాయల శివాలయం > కాలనీ గేట్ మీదుగా రామాలయం చేరే విధంగా హెల్మెట్లు ధరించి ర్యాలీ చేయాలని, రూటు అనుమతి ఇవ్వడం జరిగినది. దానికి నిర్వాహకులు ఒప్పుకోని పోవడం జరిగినది. దీని మేరకు, మదనపల్లి SDPO గారు తగిన సిబ్బందితో అనుమతించిన రూటులో బందోబస్తు వేసుకొని సంసిద్దంగా వుండటం జరిగినది.
✅17.05.2025 వతేదీ మదనపల్లి పట్టణంలోని రామాలయం నుండి సాయంత్రం 4.30 pm గంటలకు శ్రీ బండి బాలాజీ విజయ్ కుమార్ సుమారు 400 మందితో 300 మోటార్ సైకిళ్లలో ర్యాలీగా బయలుదేరి,అనుమతించిన రూటు మేర రాకుండా, ముందుగా వాళ్ళు నిర్ణయించుకొన్న రూటులోవచ్చి, ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు సా. 5.00 pm గం.లకు చేరుకొనగా, అక్కడ పోలీసు శాఖ నుంచి అనుమతి పొందిన రూటు మార్గంలో వెళ్లాలని, మదనపల్లి SDPO శ్రీ S. మహేందర్ గారు, I టౌన్, II టౌన్ మరియు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్లు ర్యాలీ నిర్వాహకులను సూచించగా, తాము ముందు నిర్ణయించుకున్న పాత రూట్ మ్యాప్ లోనే వెళ్తామని, పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగి ధర్నాకు కూర్చోవడం జరిగినది. అప్పటికే రెండు గంటలు ఆలస్యంగా ర్యాలి మొదలుపెట్టినందున ట్రాఫిక్ 2 గంటల నుండి స్థంభించినది. పోలీసువారు అనుమతించిన రూట్ లోనే వెళ్లాలని ప్రజలకు, ట్రాఫిక్ సమస్య లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లాలని సూచించిన కానీ, వారు వినలేదు. వారిలో సుమారు 150 మందిని బండి బాలాజీ రెచ్చగొట్టగా, మోటార్ సైకిల్ లను బలవంతంగా తోలుకుంటూ కదిరి రోడ్డువైపు వెళ్లి పోయినారు. మిగిలిన వారు పొలిసు వారి మాట వినకుండా, అక్కడే కూర్చొని ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తుండగా, అటుగా వెళ్ళుచున్న ఎస్పీ గారికి దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుచున్నారని పలు పిర్యాదులు రాగా జిల్లా ఎస్పీ గారు వెంటనే ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరి అక్కడ రోడ్డుపైన కూర్చొన్న వారితో మాట్లాడి, ఇలా చేయడం మంచి పద్దతి కాదని, ప్రజలకు, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా పోలీస్ బందోబస్త్ వున్న రూటులో, పోలీసు వారు అనుమతి యిచ్చిన రూటులో వెళ్ళమని కొరినారు. పోలీసులు ఎంత చెప్పిన బండి బాలాజీ వినకపోయేసరికి, బండి బాలజీని అదుపులోనికి తీసుకోని, మదనపల్లి II టౌను పోలీసు స్టేషనుకు తరలించడం జరిగినది.
✅తరువాత బండి బాలాజీ సూచనల మేరకు అతని అనుచరులు 150 మంది గొల్లపల్లి సర్కిల్ కు వెళ్ళి పోలీసులు ఎవరు లేని రూట్లో కూర్చొని సుమారు అరగంట పాటు తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారి-240లో, బస్సులు ఆపి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించడం జరిగినది. తదుపరి అక్కడనుండి పోలీసుల అనుమతి లేకపోయిన అక్కడ నుండి బయలుదేరి, కొంత మంది II టౌను పోలీసు స్టేషను ముందు ఆగి, ధర్నాచేసి తిరిగి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో, ప్రజలు తీవ్రమైన ఇబ్బందికి గురి అవుతున్నారని, 2 టౌను స్టేషనులోవున్న సెంట్రీ, మిగులు సిబ్బంది వెంటనే రోడ్డుపై వచ్చి ట్రాఫిక్ అంతరాయము గురించి ఎంత వారించిన వాళ్ళు వినకపోవడంతో, సుమారు ఒకగంట పాటు ప్రజలకు తీవ్ర అసౌకర్యంకు గురిచేయడంతో అక్కడికి చేరుకొన్న మదనపల్లి I టౌను, II టౌను, మొలకలచెరువు సి.ఐలు మరియు వివిద స్టేషనుల సిబ్బంది ఎంత చెప్పిన బండి బాలాజీ అనుచరులు వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో, వర్షం పడే అవకాశం ఉంది, ప్రజలు మరింత అసౌకర్యానికి గురవతారని గమనించి, సిబ్బంది అక్కడ వున్నవారిని చెదరగొట్టడమైనది.
✅ఇందులో ప్రజలు గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని, పోలీసులు ర్యాలీని అడ్డగించినారని ప్రచారం జరుగుతున్నవిషయం పూర్తిగా అవాస్తవం. పోలీసువారు పైర్యాలీకి సరియైన సమయం, రూటు నిర్దేశించి అనుమతి ఇస్తూ, అనుమతి యిచ్చిన రూటులో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వుండుటకు, 100 మందికి పైగా సిబ్బందితో ముందస్తు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడమైనది. మద్యాహ్నం 3.00గం.లకు ప్రారంబించవలసిన ర్యాలీ, 3.00 గం. లకు ప్రారంబించకుండా, ఆలస్యంగా 4.30 గంటలకు ప్రారంబించి, పోలీసులు లేని రూటులో వెళ్ళుతామని పోలీసులతో వాగ్వివాదానికి దిగి అనేక చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలిగించి, పోలీస్ అడ్డుకొన్నప్పటికి, అనేక చోట్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించి తిరిగి II టౌను పోలీస్ స్టేషను ముందు అదేవిధంగా ట్రాఫిక్ కి అంతరాయము కలిగే విధం గా ధర్నా చేయడంతో, తప్పనిసరి పరిస్థితులలో పోలీసులు అక్కడ చేరిన గుంపును అక్కడి నుండి చెదరగొట్టి ట్రాఫిక్ క్రమ బద్దీకరించడం జరిగినది.
ఇందులో లోపాలు/ఉల్లంఘనలు.
👉పోలీసులు బందోబస్తు యిచ్చిన, వాళ్ళు అనుమతి యిచ్చిన రూటులో కాకుండా వాళ్ళు నిర్ణయించుకొన్న రూటులో వెళ్ళడం.
👉హెల్మెట్లు ధరించకుండా ర్యాలీ చేయడం.
👉పబ్లిక్ స్థలములో ధర్నా చేసి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించడం జరిగిందే తప్ప, వారికి అనుమతి ఇవ్వడం నిరాకరించలేదని పోలీసులు ర్యాలీని అడ్డుకొన్నారన్న వదంతులు అపద్దము.
👉ఇలాంటి దుష్ప్రచారములు ఏవరైన చేస్తే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం.
👉ఒక వర్గానికి చెందిన సీఐ. లాఠీ చార్జి చేసినారని ప్రచారం జరుగుచున్నది. దీనికి పోలీసు శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది.
👉బండి బాలాజీ అతని అనుచరులు కావాలనే, పోలీసులు తమ కోరిన రూటు అనుమతి ఇవ్వలేదని, తాము కొరుకొన్న రూటులోనే వెళ్లాలనే తమ అనుచరులు పట్టుపట్టి, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రూటుమార్చి పెల్లుతుంటే ఆపినారని, తనతో కూడా ర్యాలీ వున్నవారికి ఎలా వెళ్ళాలో చెప్పకుండా, ఏమి జరుగుతున్నాదో తెలియనీకుండా, 2 టౌను పోలీసు స్టేషను ముందర ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించి ప్రజలకు తీవ్ర అసౌకర్యము కలిగించినందున, అక్కడ గుమిగుడిన వ్యక్తులను చెదరగొట్టి, బండి బాలజీని పోలిసే స్టేషనుకు తేవడం జరిగినది, అంతే తప్ప, హిందూ హనమాన్ శోభ యాత్రకు ఎలాంటి అంతరాయము చేయలేదు.
👉బండి బాలాజీ అతని అనుచరులు పోలీసులు నిర్దేశించిన రూటులో కాకుండా వేరే రూటులో వచ్చి ట్రాఫిక్ అంతరాయం కలిగించి, ప్రజలకు తీవ్ర అంతరాయం కలిగించినందుకు చట్టపరంగా అతనిపై కేసు నమోదు చేసి, సెక్షను 35 BNSS Act మేరకు నోటీసు జారిచేసి పంపడమైనది.
🎯ఎవరైనా తప్పుడు సమాచారము సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసిన యెడల చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం.
👇
*ఇట్లు*
వి.విధ్యాసాగర్ నాయుడు, ఐ.పి.యస్,
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,
అన్నమయ్య జిల్లా.