29/09/2025
*ప్రజల విజ్ఞాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించు గంగమ్మ తల్లి ...*
*రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం PN కాలని గ్రామం ఊటుపాలెంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా గంగమ్మ తల్లిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి, టిడిపి సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు...*
ప్రజల విజ్ఞాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించమని టిడిపి రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి టిడిపి సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు గారు ప్రార్ధించారు.రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం PN కాలని గ్రామం ఊటుపాలెం లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా గంగమ్మ గుడిలో ఏర్పాటు చేసిన పూజాకార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ PN కాలని ఊటుపాలెం చంద్రబాబు నాయుడు కుటుంబం మరియు గ్రామ వాసులు అందరు కలసి భక్తి శ్రద్ధలతో దసరా నవరాత్రులు పూజలు నిర్వహించడం మరియు అన్నదానం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు కుల మతాలకు అతీతంగా పండుగ వాతావరణం తలపించేలా దసరా ఉత్సవాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ వారిని అభినందించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని తెలియజేసారు