
24/06/2025
జనసేనాని పవన్ కళ్యాణ్ బూచిగా బలిజలను అనగదొక్కుతున్న అధికార పార్టీ
రాయలసీమ లో ప్రధానంగా కడప,రాజంపేట, రాయచోటి, తిరుపతి, చిత్తూరు లో టీడీపీ కి బలమైన పునాదులు గా బలిజ నాయకులు ఉండే వాళ్ళు.
బలిజలే టీడీపీ పుట్టుక నుంచి జెండా మోసారు.
చిత్తూరు లో డీకే ఆడికేశవులు నాయుడు ఫ్యామిలీ, తిరుపతి లో చదలవాడ ఫ్యామిలీ, వెంకటరమణ ఫ్యామిలీ, రాజంపేట పసుపులేటి ఫ్యామిలీ, రైల్వే కోడూరు బత్యాల, కడప దుర్గా ప్రసాద్, బాలిశెట్టి , రాయచోటి & రాజంపేట ల నుంచి సుగవాసి ఫ్యామిలీ... ఇలా... ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలలో టీడీపీ కి బలిజలు పెట్టని కోటగా ఉన్నారు.
అలాంటిది.... ఇప్పుడు జనసేన తో పొత్తు ఉంది... జనసేన ను చూసి బలిజలు టీడీపీ కి ఓట్లు వేసేస్తారని అనుకున్నారో లేదో.. 2024 గెలుపు ను బలుపు అనుకున్నారో తెలియదు గానీ... టీడీపీ లో బలిజ నాయకులను మొత్తం తొక్కేస్తున్నారు.
దశాబ్దాలు గా టీడీపీ జెండా మోసిన బలిజ నేతలకు మొండి చేయి చూపిస్తున్నారు.
చిత్తూరు లో బలిజలను కాదని కమ్మ ను తెచ్చారు...ఆదికేశవులు ఫ్యామిలీ ని వాడుకొని వదిలేసారు. తిరుపతి లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ను ఎందుకు పనికిరాని కార్పొరేషన్ కు ఛైర్మెన్ చేశారు, జనసేన ఎమ్మెల్యే ఆరని బ్రదర్స్ పై అను నిత్యం ఏదో ఒక ఆరోపణలను అనుకూల మీడియా లో రాస్తూ బలిజను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.
రాజంపేట లో దశాబ్దాల పాటు టీడీపీ జండా మోసిన పసుపులేటి బ్రాహ్మయ్య చనిపోయే వరకు క్షోభ పెట్టి, నిందలు వేసి ఆఖరికి చనిపోయేలా చేశారు. బత్యాల ను ప్రతి పక్షం లో ప్రతి లీగల్ అవసరాలకు వాడుకున్నారు, ఐదేళ్లు రాజంపేట లో వాడుకున్నారు, ఎన్నికల్లో రైల్వే కోడూరు వాడుకున్నారు... ఇప్పుడు పొమ్మన కుండా పొగ పెడుతున్నారు. ఆఖరికి... రేపో, మాపో రాజంపేట మరో రెడ్డికి పట్టం కట్టబోతున్నారు రైల్వే కోడూరు లో దళిత ఎమ్మెల్యే ను డమ్మీ చేసి ఆల్రెడీ రెడ్డి గారే రాజ్యమేళుతున్నారు.
ఇంక... రాయచోటి, రాజంపేట నియోజకవర్గాల్లో సుగవాసి ఫ్యామిలీ కి చేసిన ద్రోహం అంతా, ఇంతా కాదు... అందరూ పదవుల కోసం పార్టీ లోకి వస్తే... 1984 లో ఎమ్మెల్యే పదవి లో ఉండి... టీడీపీ మునిగి పోతుంటే... అడ్డుగొడై నిలబడ్డాడు సుగవాసి పాలకొండ రాయుడు గారు, రాజంపేట కు వెళ్లి పార్లమెంట్ కు పొమ్మంటే పోయి గెలిచాడు....చనిపోయాక కూడా టీడీపీ జండా కప్పుకునే పోయారు. అలాంటి గొప్ప నాయాకుడికి నివాళులు అర్పించడానికి కూడా తండ్రి, కొడుకులు రాలేకపోయారు. సుగవాసి కుటుంబం నుంచి... పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యం కు మొదట పార్లమెంట్ సీట్ అన్నారు... తర్వాత సొంత ఊరు రాయచోటి కాదని రాజంపేట అసెంబ్లీ కి పంపించారు అయినా కాదనకుండా పోటీ చేశారు... అక్కడ ఉన్న వర్గాల సమాచారం తెలిసి కూడా వాళ్ళ మధ్య సాయోధ్య కుదర్చకుండా ఎన్నికల్లో పోటీ చేయించారు... ఎన్నికలు అయ్యాక పార్టీ ద్రోహి ని ఉసి గోలిపి, అధికారిక సమావేశాల్లో అధికారులు పాల్గొనకుండా చేసి అవమానం చేశారు. ఆఖరికి.. పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నికల్లో 40 కోట్లు ఖర్చు చేసుకొని కూడా పార్టీ వదిలేసారు అంటే.. ఎంత మానసిక క్షోభ పెట్టారో ఆయనను. అలాగే... రాయచోటి, రాజంపేట లలో కాళ్ళకు చక్రాలు కట్టుకొని టీడీపీ గెలుపు కోసం పనిచేసిన సుగవాసి ప్రసాద్ బాబు ఎలాంటి న్యాయం చేయకుండా కాలయాపన చేస్తూ పరీక్షిస్తూనే ఉన్నారు. అన్న ను కాదని నమ్మిన పార్టీ కోసం టీడీపీ లోనే కొనసాగుతానని ప్రకటించిన సుగవాసి ప్రసాద్ బాబు కు ఇప్పటికి న్యాయం చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. అప్పుడెప్పుడో వైసీపీ కౌన్సిలర్ల కు ప్రచారం చేసారని నిందలు వేసే వాళ్ళు పార్టీ మరినోళ్ళకు టికెట్స్ ఇచ్చేటప్పుడు కేవలం పార్టీ బహిస్కరించిన ఎన్నికల్లో తన అనుచరులకు మద్దత్తు గా ప్రచారం నిర్వహించడాన్ని సాకు గా చెప్పడం సిగ్గుచేటు.
సి. రామచంద్రయ్య, బలిశెట్టి హరిప్రసాద్, దుర్గా ప్రసాద్ లాంటోళ్లను... ఎన్నికలు వచ్చిన ప్రతి సారి వాళ్లల్ని వాడుకోవడం ఎన్నికలు అయ్యాక వదిలేయడం... ఇలా ఆఖరికి... వాళ్ల రాజకీయ ప్రస్థానం లేకుండా చేస్తున్నారు అంటే... ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన పరిస్థితి.