25/06/2025
*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్ నాయకుడు సుగవాసి సుబ్రమణ్యం చేరిక..*
*కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్, ఎంపీ మిథున్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధ రెడ్డి, హిందూపురం పరిశీలకులు రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి తదితర నేతలు...*
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజంపేట టిడిపి ఎంఎల్ఏ అభ్యర్థి, జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి సుబ్రమణ్యం బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుబ్రమణ్యానికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, హిందూపురం పరిశీలకులు రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి. సతీష్ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, పుంగనూరు నేత శ్రీనాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ తరఫున సుగవాసి సుబ్రమణ్యం కు సముచిత గుర్తింపు, స్థానం లభిస్తుందని నేతలు భరోసా ఇచ్చారు. *వైఎస్ఆర్ సిపి సీనియర్ నేతలు మాట్లాడుతూ...*
"వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే సామాన్యుని పార్టీ. కుల, మత, ప్రాంత వివక్షలకు అతీతంగా అన్ని వర్గాలను గౌరవించే పార్టీ. ఇందులో సీనియర్ నేతలకు గౌరవం ఉంటుంది, అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి" అని తెలిపారు. సుబ్రమణ్యం లాంటి నేతల చేరికతో పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. *సుగవాసి సుబ్రమణ్యం మాట్లాడుతూ*
రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ జగన్ గారి నేతృత్వంపై నాకు విశ్వాసం ఉంది. ప్రజల కోసం పనిచేసేలా, పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తాను. నాకు ఇక్కడ గౌరవం, అవకాశాలు ఉంటాయని నమ్మకం ఉంది" అని అన్నారు.