Venky Reporter

Venky Reporter Telugu Breaking, Trending News..

క్షణాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్త వార్తల కోసం ఫాలో అవ్వండి పేజీ..

08/03/2026

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు...

ముగ్గురు నిందితుల అరెస్ట్, రిమాండ్ కు తరలింపు...

అక్రమ సంబంధం తోనే హత్య..

స్థానిక సిద్ధార్థ కాంప్లెక్స్‌ లాడ్జిలో జరిగిన భూక్య మోహన్ హత్య కేసును వేములవాడ పట్టణ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు.ఈ కేసులో ప్రధాన నిందితురాలు బైరి శారద అలియాస్ కళ్యాణితో పాటు ఆమె భర్త బైరి శేకర్, సహకరించిన గుండం రవి అలియాస్ రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ అంజనీనగర్‌లో నర్సుగా చేస్తున్న బైరి శారదకు, మృతుడు భూక్య మోహన్‌కు మధ్య అక్రమ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో మోహన్ తరచూ డబ్బులు కావాలని శారదను వేధించడమే కాకుండా, వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరించసాగాడు. ఈ వేధింపులు భరించలేక శారద తన భర్త శేకర్ తో కలిసి మోహన్‌ను వదిలించుకోవాలని పథకం రచించింది.ఈ క్రమంలో గుండం రవి అనే వ్యక్తి సహాయం తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన శారద పథకం ప్రకారం మోహన్‌ను వేములవాడలోని సిద్ధార్థ కాంప్లెక్స్‌కు పిలిపించింది. అక్కడికి చేరుకున్న శేకర్, రవిలు కలిసి నైలాన్ తాడుతో మోహన్ గొంతు నులిమి హత్య చేశారు. నిందితుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన బైక్, నైలాన్ తాడు మరియు చాకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకున్న వేములవాడ టౌన్ సీఐ వీర ప్రసాద్, ఎస్ఐలు రామ్మోహన్, ప్రేమానందం, పిసిలు ఇమ్రాన్, సల్మాన్, శ్రీనివాస్‌లను వేములవాడ డిఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు..

25/02/2026

రాజన్న సిరిసిల్ల జిల్లా...

మొబైల్ ఫోన్ల రికవరిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నా జిల్లా పోలీస్ యంత్రాంగం.

6 లక్షల విలువ గల 63 మొబైల్ ఫోన్లు రికవరీ...మొబైల్ యజమానులకు అందజేత.

మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in (CEIR ) అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి: ఏస్పీ మహేష్ బి. గితే.

జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి పోయిన , చోరీకి గురైన సుమారు 6లక్షల రూ.విలువ గల 63 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఈరోజు సంబంధిత మొబైల్ ఫోన్ల యజమనులకి అందజేయడం జరిగింది.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని, మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్ వంటివి మొబైలో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు మొబైల్ దొంగిలించి,వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే,గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు.

ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు బ్లాక్ చేసి, సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.

జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్ లను మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని అన్నారు. ఎవరైన దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లైతే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్ ,కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ లను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.

పోయిన మొబైల్ ఫోను మళ్లీ దొరకదనుకున్న మొబైల్ ఫోన్ జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు జిల్లా ఎస్పీకి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐటి కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్, ఆర్.ఐ యాదగిరి,క

17/02/2026

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి కలకలం.. మూడు ఆవు దూడల మృతి...

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. పొరుగున ఉన్న సిద్దిపేట జిల్లా నుండి అటవీ మార్గం ద్వారా ఈ పులి తిప్పాపూర్ గ్రామ పరిధిలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది..

గత రెండు రోజులుగా గ్రామ శివారులో సంచరిస్తున్న పెద్దపులి, ఇప్పటికే మూడు ఆవు దూడలపై దాడి చేసి చంపివేసింది. పశువుల కళేబరాలను చూసిన రైతులు భయాందోళనతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి అడుగుజాడలను పరిశీలించారు. పులి సంచారం వాస్తవమేనని ధృవీకరించిన అధికారులు, గ్రామ ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

ముఖ్యంగా రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని, రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పులిని తిరిగి అడవిలోకి పంపేందుకు అటవీశాఖ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.

02/02/2026

రాజన్న సిరిసిల్ల జిల్లా::

కోతుల బెడదకు వినూత్న పరిష్కారం:ఎలుగుబంటి వేషంలో గ్రామం చుట్టిన సర్పంచ్...

నాగంపేటలో సర్పంచ్ రాజిరెడ్డి చొరవ… కోతుల నుంచి గ్రామానికి ఉపశమనం...

గ్రామంలో కోతుల బెడద రోజురోజుకీ పెరుగుతుండటంతో వినూత్నంగా స్పందించారు సర్పంచ్ రాజిరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో పంటలు, ఇళ్లపై కోతుల దాడులు ఎక్కువ కావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సర్పంచ్ రాజిరెడ్డి స్వయంగా ఎలుగుబంటి వేషం ధరించి గ్రామ వీధుల్లో తిరిగి కోతులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు.ఈ చర్యకు కోతులు భయపడి అడవివైపు పారిపోవడంతో గ్రామానికి కొంతకాలం ఉపశమనం లభించింది.గత కొంతకాలంగా కోతుల కారణంగా పంటలకు తీవ్ర నష్టం జరుగుతుండటంతో పాటు, పిల్లలు మరియు వృద్ధులు బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొన్నది. సర్పంచ్ చూపిన చొరవను గ్రామస్తులు అభినందిస్తూ, కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామ సంక్షేమం కోసం సర్పంచ్ చేసిన ఈ వినూత్న ప్రయత్నం ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

22/01/2026

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త ఇళ్ల యజమానులను మోసం చేసిన ఇద్దరి అరెస్ట్, రిమాండ్ కు తరలింపు..

రూ.14 వేల నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం సీజ్..

కొత్త ఇళ్లు నిర్మించుకుంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఇటుకలు, బేస్‌మెంట్ రాయి సరఫరా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కోనరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కోనరావుపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ రుత్విక్ సాయి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. చల్లూరు గ్రామం, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా కు చెందిన శివరాత్రి సదయ్య (60), తండ్రి ఎల్లయ్య, మరియు తురకల మద్దికుంట గ్రామం, పెద్దపల్లి మండలం కు చెందిన గాదాసు రాజయ్య (50), తండ్రి రాజయ్య ఇద్దరూ కలిసి చుట్టుపక్కల మండలాల్లో తిరుగుతూ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు కొత్త ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలను గమనించి, గ్రామస్తుల ద్వారా ఇంటి యజమాని, మేస్త్రి వివరాలు సేకరించేవారు. అనంతరం పలానా మేస్త్రి పంపించాడని, ఇటుకలు వచ్చాయని, ఊరి బయట ట్రాక్టర్లు ఉన్నాయని నమ్మబలికి ముందస్తుగా డబ్బులు తీసుకుని, ట్రాక్టర్లను ఊర్లోకి తీసుకువస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యేవారు. ఈ విధంగా కోనరావుపేట, చందుర్తి, కథలాపూర్ మండలాల్లో మొత్తం ఐదుగురిని మోసం చేసి నగదు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. చందుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ముందస్తు సమాచారం మేరకు నిజామాబాద్ కమాన్ వద్ద కోనరావుపేట ఎస్సై కె. ప్రశాంత్ రెడ్డి తమ సిబ్బంది కె. విశాల్ రాజు, బి. నాగరాజులతో కలిసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,000 నగదు, నేరానికి ఉపయోగించిన రెండు నోకియా మొబైల్ ఫోన్లు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు చేదనలో చురుకుగా పనిచేసిన ఎస్సై మరియు సిబ్బందిని అధికారులు ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రుత్విక్ సాయి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, గుర్తుతెలియని వ్యక్తులు సరఫరాల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మి మోసపోవద్దని, వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు...

22/01/2026

వేములవాడలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు..

ఆటో నడిపి ర్యాలీ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్...

రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ బాధ్యత వహించాలి..

వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే, ఏఎస్పీ రుత్విక్ సాయి, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్, ఆర్డీఓ రాధాబాయి, ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ ఆటోలకు భద్రతా స్టిక్కర్లు అంటించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం తిప్పాపూర్ బస్ స్టాండ్ నుంచి కోరుట్ల బస్ స్టాండ్ వరకు స్వయంగా ఆటో నడిపి రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. తరువాత అధికారులతో కలిసి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రభుత్వం ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇంటి నుంచి బయలుదేరే ప్రతి ఒక్కరూ ఇంట్లో తమవారు ఎదురు చూస్తున్నారని గుర్తుంచుకుని బాధ్యతగా వాహనం నడపాలని అన్నారు. డ్రైవర్ చేతిలోనే ప్రయాణికుల ప్రాణాలు ఉంటాయని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని, అతివేగాన్ని నివారించాలని, మద్యం లేదా మత్తు పదార్థాలు తీసుకుని వాహనం నడపరాదని హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయకూడదని, రోడ్డు ప్రమాదాలు జరిగితే మనతో పాటు ఇతరులు కూడా తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. అధికారుల సూచనలు డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాలని, నిత్యం వాహన యజమానులు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆటో డ్రైవర్లకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని విప్ భరోసా ఇచ్చారు...

Tgsrtc
Anumula Revanth Reddy
Telangana Digital Media Wing
Telangana Congress
Telangana State Road Transport Corporation

21/01/2026

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి పేరుతో బెదిరింపులకు గురిచేస్తు డబ్బులు వసూలు చేసే ముఠా సభ్యుడు అరెస్ట్,రిమాండ్.

ఒక కంట్రిమేడ్ పిస్టోల్,ఒక ఎక్సట్రా మ్యాక్జిన్,08 రౌండ్లు స్వాధీనం.

వివరాలు వెల్లడించిన సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి.

ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ...జనశక్తి కార్యకలాపాల పేరుతో బెదిరింపులకు గురి చేస్తున్న నలుగురు నింధితులను (తోకల శ్రీకాంత్, దాసరి తిరుపతి, వంజరి సురేందర్ @ విశ్వనాథ్ @ బాదం సూర్య ప్రకాష్ రెడ్డి,పయ్యావుల గోవర్ధన్) లను ఈనెల 07 వతేదీన అరెస్ట్ చేసి 9mm పిస్టల్ స్వాధీనం చేసుకొని రిమాండ్ చేయడం జరిగింది.అట్టి కేసు దర్యాప్తులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్ముడ్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన సుధాపల్లి సుధాకర్ s/o బాజన్న, వయస్సు:-50y, ముస్తాబద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామానికి చెందిన బోయిని దేవరాజు s/o అగయ్య,age 49 సం,నల్లగోండ జిల్లా r/o ఉట్కూర్ v/o శాలి గౌరారం మండలం చెందిన దుబ్బ మధు s/o అంజయ్య, వయస్సు:-30 అను వారు పై నలుగురు నిందుతులతో సంబంధం పెట్టుకొని జనశక్తి పేరుతో డబ్బున్న వ్యక్తులను బెదిరింపుల గురి చేసి డబ్బులు వసూలు చేయడం,రియల్ ఎస్టేట్, భూమి వివాదంలో జోక్యం చేసుకొని వారిని బెదిరించడం ద్వారా డబ్బులు అధికంగా సంపాదించవచ్చని ప్లాన్ వేసుకోగా సూడపెళ్లి సుధాకర్,బోయిని దేవరాజు ను ఈనెల 09 తేదీన అదుపులోకి తీసుకిని రిమాండ్ చేయడం జరిగిందని,దుబ్బా మధును ముస్తాబద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకొని అతని వద్ద ఒక కంట్రిమేడ్ పిస్టోల్,ఒక ఎక్సట్రా మ్యాక్జిన్, 08 రౌండ్లు స్వాధీనం చేసుకుని ఈరోజు రిమాండ్ కి తరలించడం జరిగిందని డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ప్రజలను బెదిరించడం, అక్రమ కార్యకలాపాలకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా డిఎస్పీ హెచ్చరించారు. డిఎస్పీ వెంట సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి, తంగలపల్లి ఎస్.ఐ ఉపేంద్రచారి, సిబ్బంది పాల్గొన్నారు.

21/01/2026

రాజన్న కోడెలను సంరక్షించాలి..

పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు..

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హెచ్చరిక...

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలల నుంచి రైతులకు అందజేసే కోడెలను భక్తి, బాధ్యతతో సంరక్షించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌లో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అనుబంధ గోశాలలో బుధవారం అర్హులైన రైతులకు 103 జతల కోడెలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ రైతులకు కోడెలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులను వ్యవసాయ భూమి కలిగి ఉన్నారా? ఇప్పటికే పశువులు ఉన్నాయా? అనే అంశాలపై ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ… కోడెల పంపిణీ కోసం ముందుగానే ప్రకటన జారీ చేసి, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించామని తెలిపారు. గతం, ప్రస్తుత దరఖాస్తులు కలిపి మొత్తం 238 ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. రెవెన్యూ, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖలు మరియు ఆలయ అధికారులతో కలిసి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హులైన రైతులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అన్ని పత్రాలతో ఆన్లైన్‌లో దరఖాస్తు చేసిన రైతుల వివరాలను మరోసారి తనిఖీ చేసిన తరువాతే కోడెలను పంపిణీ చేశామని ఆమె పేర్కొన్నారు. తిప్పాపూర్ గోశాలలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కోడెలను “రాజన్న ప్రసాదం”గా రైతులకు అందిస్తున్నామని, వాటికి గడ్డి, దాణా అందజేస్తూ శ్రద్ధగా సంరక్షించాలని సూచించారు.
పంపిణీ చేసిన కోడెలను వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులతో క్రమం తప్పకుండా తనిఖీ చేయిస్తామని, వాటిని పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

18/01/2026

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగల బీభత్సం..తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ!..

సుమారు 4.5 తులాల బంగారం, రూ. 1.20 లక్షల నగదు అపహరణ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు నిక్షిప్తం...

వేములవాడ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మార్కండేయ నగర్‌లో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లోకి చొరబడిన దుండగులు భారీగా నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కండేయ నగర్‌కు చెందిన నేదూరి రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 16న బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు, అర్ధరాత్రి సమయంలో ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు తలుపుల తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి, బీరువాలో ఉన్న 4.5 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. తాము పట్టుబడకుండా ఉండేందుకు దొంగలు అత్యంత చాకచక్యంగా సీసీ కెమెరాలకు కవర్లు అడ్డం పెట్టడం గమనార్హం. అయినప్పటికీ, వారు లోపలికి ప్రవేశిస్తున్న దృశ్యాలు కెమెరాల్లో నమోదయ్యాయి. బాధితుడు రమేష్ ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ వీర ప్రసాద్ కేసు నమోదు చేశారు.క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు వేగవంతం చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.



Telangana State Police
Rajanna Sircilla District
Rajanna Sircilla District Police
Telangana CMO
Anumula Revanth Reddy

15/01/2026

వినూత్న రీతిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

ఫాజుల్ నగర్ బస్టాండ్ వద్ద కార్యక్రమం నిర్వహణ*

రోడ్డు భద్రత పాటించే వారికి గులాబీ పువ్వులు ఇస్తూ వారిని అభినందించిన – వేములవాడ రూరల్ ఎస్ ఐ వెంకట్రాజం

జాతీయ రోడ్డు భద్రత కార్యక్రమం “Arrive Alive” అనే థీమ్‌తో రోడ్డు భద్రత మీద ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని వేములవాడ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్రాజం తెలిపారు.

ఈ సందర్బంగా ఎస్ ఐ వెంకట్రాజం మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగిసి, ప్రతి వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరాలనే సందేశాన్ని ఈ థీమ్ స్పష్టంగా తెలియజేస్తుంది అని తెలిపారు. వాహనదారులు ముఖ్యం గా అతివేగంగా వాహనాలు నడపకూడదు అని మద్యం సేవించి వాహనం నడపడం వల్ల మీకు మరియు ఎదుటి వారికి ప్రమాదం అని, మోటార్ సైకిల్ లు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించకపోవటం, కార్ లు నడిపే వారు సీట్‌బెల్ట్ ధరించకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ నియమాలు విధిగా అందరూ పాటించాలి అని సూచించారు.

13/01/2026

టీ స్టాల్‌పైకి దూసుకెళ్లిన కారు: ఎల్లారెడ్డిపేటలో తప్పిన పెను ప్రమాదం..

రాజన్న సిరిసిల్ల జిల్లా ​ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హెచ్‌పి పెట్రోల్ బంక్ సమీపంలో గల కోకిల రెస్టారెంట్ వద్ద మంగళవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఒక మహిళ వేగంగా నడుపుకుంటూ వచ్చిన కారు అదుపుతప్పి నేరుగా హోటల్ ముందున్న టీ స్టాల్‌లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ పలువురు నిలబడి టీ తాగుతున్నారు. కారు తమ వైపు దూసుకురావడాన్ని గమనించిన వ్యక్తులు అప్రమత్తమై పక్కకు పరుగులు తీయడంతో పెను ముప్పు తప్పింది. లేదంటే భారీ ప్రాణనష్టం సంభవించేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కారు వేగానికి హోటల్ ముందున్న వస్తువులు ధ్వంసమయ్యాయి. ఈ భీకర దృశ్యాలన్నీ హోటల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మహిళా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు...
Rajanna Sircilla District Police
Rajanna Sircilla District
Ponnam Prabhakar
TV9 Telugu

11/01/2026

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

చలి తీవ్రతకు తట్టుకోలేని నిరాశ్రయులకు, యాచకులకు మీ వంతు సహకారం అందించండి -యువ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్

ఫౌండేషన్ అధ్యక్షుడు గొడిశెల తిరుపతి గౌడ్ చేతుల మీదుగా దుప్పట్లు అందజేత

వేములవాడ పట్టణంలో చలి తీవ్రతకు తట్టుకోలేక దేవాలయం సమీపంలో వున్న యాచకులకు, నిరాశ్రయులకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది.ఈ కార్యక్రమం కు ఫౌండేషన్ అధ్యక్షుడు గొడిశెల తిరుపతి హాజరై దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ యువ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పోలీస్, ఆర్మీ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు మరియు ఉద్యోగం లో చేరిన యువతీ యువకులు ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొని సమాజ సేవ చేయటం అభినందనీయం యువకులను అభినందించారు.అనంతరం యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ చలి తీవ్రత అధికం గా వుంది అని అన్ని సౌకర్యాలు వున్న మనమే చలి కి తట్టుకోలేక పోతున్నాం రాత్రి వేళలో పట్టణం లో తిరుగుతూ ఎవరికైతే దుప్పటి లేదో వారిని గుర్తించి దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది అని,రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి మీ మీ ఏరియాలలో ఎవరైనా అభాగ్యులు ఉంటే వారికి కప్పుకోడానికి దుప్పట్లు లేనట్టు అయితే దుప్పట్లు దానం చేసి మానవత్వం చాటుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మధు మహేష్,యువ ఫౌండేషన్ ఉద్యోగులు రాజు, అరవింద్, అభ్యర్థులు మనోజ్, వినయ్,రామ్ కుమార్,మోహన్,రాహుల్,హేమంత్, రాకేష్, ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, చిన్నారులు సింధూజ,సిరి చందన,చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Address

Pragathi Nagar
Sircilla
505301

Website

Alerts

Be the first to know and let us send you an email when Venky Reporter posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share