
14/09/2025
గుజరాత్ లోని జాంనగర్ కి చెందిన చిరాగ్ అనే యువకుడికి, హిరాల్ అనే అమ్మాయితో మార్చిలో నిశ్చితార్థం అయింది. ఈ నెలలో పెళ్లి కావలసి ఉంది.
పెళ్లి పనులలో భాగంగా ఇంటి బాల్కనీలో తుడుస్తూ ఉండగా హై వోల్టేజ్ కరెంట్ వైర్ తెగి హిరాల్ మీద పడింది.
కరెంట్ షాక్ తో ఆమెకు రెండు కాళ్లు, ఒక చెయ్యి తీసెయ్యాల్సి వచ్చింది. అయినా సరే... చిరాగ్ మాత్రం హిరాల్ నే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెకు తోడుగా ఉన్నాడు.
నేటి బుద్ధిమాలిన యువతరం చిన్న చిన్న కారణాలకే విడాకుల దాకా వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో... వీడు ఎవడో గానీ... నిజమైన మగాడు అనే చెప్పాలి. హాట్సాఫ్ రా చిరాగ్.