GMR media

GMR media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GMR media, Broadcasting & media production company, Srikakulam.

https://youtu.be/aAZoebyqXd0
16/07/2022

https://youtu.be/aAZoebyqXd0

మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు సిరి. PRAJA TV

26/06/2022

ప్రియమైన మిత్రులకు ..శ్రేయాభిలాసులకు..తెలియజేయనిది ఏమనగా...
తే 27-06-2022 ది. అనగా సోమవారం మన నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మధుమేహం(sugar),కొలెస్ట్రాల్(cholesterol)మరియు ECG అనే వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించబడును.కావున ఈ సదా అవకాశాన్ని వినియోగించుకుంటారు అని కోరుకుంటున్నాం.
గమనిక:-మధుమేహం(sugar)పరీక్ష చేయించుకునేవారు ఉదయం 7గంటలకు టీ,కాఫీ త్రాగకుండా కాలీ కడుపుతో రావాలి.
ఇట్లు
డా|| పొన్నాడ. గణేష్
M.D జనరల్ మెడిసిన్
నారాయణ మల్టీ స్పెసాలిటీ హాస్పిటల్. నరసన్నపేట.

24/06/2022

https://youtu.be/a1e7Bo7WLgQ

*కరణ్ అర్జున్ సినిమా హీరో నరసన్నపేట కుర్రాడే..*
*సినిమాను ఆదరించాలని కోరిన సినిమా హీరో, హీరోయిన్.*

*తెలుగు రాష్ట్రాల్లో నేడు విడుదలవుతున్న "కరణ్ అర్జున్" సినిమా*

*హీరో,హీరోయిన్ ప్రెస్ మీట్*

*PLEASE SUBCSRIBE AND SHARE*

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
21/06/2022

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.

1998 బ్యాచ్ DSCకి అర్హత సాధించిన అల్లక కేదారేశ్వరరావు ఎం.ఏ.,బి.ఎడ్  గారు...ఎన్నాళ్లో వేచిన ఉద్యోగం..ఈయ‌నెవ‌రో తెలుసా? చి...
20/06/2022

1998 బ్యాచ్ DSCకి అర్హత సాధించిన అల్లక కేదారేశ్వరరావు ఎం.ఏ.,బి.ఎడ్ గారు...

ఎన్నాళ్లో వేచిన ఉద్యోగం..

ఈయ‌నెవ‌రో తెలుసా? చిరిగి, శిథిల‌మైన మ‌న వ్య‌వ‌స్థ‌.

ఈయ‌నేంటో తెలుసా? జీతం వ‌చ్చే ఉద్యోగం వ‌చ్చేస‌రికి జీవిత‌మే కోల్పోయిన నిర్బాగ్యుడు.

ఈయ‌న‌కి జ‌రిగిన అన్యాయం..ఎంద‌రికో..
ఒక్కొక్క‌రికి...ఒక్కో వ్య‌వ‌స్థ‌లో...

మ‌న‌కు ద‌క్కాల్సిన న్యాయ‌మో, ఉద్యోగ‌మో జీవిత‌కాలం లేటు అయితే దీనికి
ఎవ‌రు దోషులంటే..ఎవ‌రు కాదు అనేది జ‌వాబు.
ఎవ‌రు కార‌కులంటే..అంద‌రూ బాధ్యులే.

1998 డిఎస్సీ క్వాలిఫైడ్ వాళ్ల‌తో ఉద్యోగం సాధించి వుంటే... శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన ఈ... కేదారేశ్వ‌ర‌రావు పెళ్లి చేసుకుని ఉండేవారు. త‌న పిల్ల‌ల్ని చైత‌న్య, నారాయ‌ణలో చ‌దివించి పెద్ద‌వాళ్ల‌ని చేసి ఏ ఇన్ఫోసిస్‌లోనో వాళ్లూ జాబ్ చేసుకుని సెటిలైపోయేవారు. మాస్టారు రెండు చేతులా రియ‌ల్ ఎస్టేట్, చిట్స్ కంపెనీల‌కి ప‌నిచేసి కొత్త‌గా వెల‌సిన కాల‌నీలో డూప్లెక్స్‌లో వుండేవారు. ఇవ‌న్నీ క‌ల‌..వాస్త‌వ‌మేంటో తెలుసా? 1994 డిఎస్సీ తృటిలో కోల్పోయి, 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అయి వివాదంలో ప‌డ్డాక‌.. పాత‌ప‌ట్నం మండ‌లం పెద్ద‌సీదికి చెందిన అల్ల‌క కేదారేశ్వ‌ర‌రావు జీవితం అల్ల‌క‌ల్లోలం అయిపోయింది. పెళ్లి కాలేదు. నిర్వేదంతో అందం, ఆక‌లి వంటి వాటికి దూరమైపోయాడు. సైకిల్‌పై బ‌ట్ట‌లు వేసుకుని ఊరూరికి వెళ్తే మ‌నిషి రూపం చూసి పిచ్చోడు అని ముద్ర‌వేసి ఎవ్వ‌రూ కొనేవారు కాదు. ఆ పిచ్చోడు అన్నామ‌లై బీఈడీ చేశాడు. ఇంగ్లీషు అన‌ర్గ‌ళంగా మాట్లాడేవాడు. బ‌తుకు భార‌మైంది. వృత్తి దూర‌మైంది. తానెవ‌రో మ‌రిచిపోయాడు. ఆక‌లేస్తే అడుక్కోవ‌డానికి కూడా వెనుకాడ‌లేదు. కేదారేశ్వ‌ర‌రావుకి 55 ఏళ్లు వ‌చ్చాక అంటే ఇప్పుడు ..24 ఏళ్ల త‌రువాత 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ వాళ్ల‌కి ఉద్యోగాలిచ్చేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అన్ని సర్టిఫికెట్లు ఉండి, అంతా సవ్యంగా సాగి ఉద్యోగంలో చేరితే ఎన్నాళ్లా ఉద్యోగం? ఫోన్ కూడా వాడటం రాని, ఆధునిక ప్రపంచానికి దూరమై తన మనో ప్రపంచంలో బతుకుతున్న కేదారేశ్వరరావు..థంబ్ లు వేసి మొబైల్ లో అప్ లోడ్ చేసే టీచర్ ఉద్యోగం ఎలా చేయగలడు? త‌న‌కు ఉద్యోగం వ‌చ్చింద‌న్న సంగ‌తి అల్లక కేదారేశ్వ‌ర‌రావుకి తెలియ‌దు. ఊర్లో కుర్రాళ్లు వాట్స‌ప్‌లో వ‌చ్చిన లిస్టులో పేరు చూసి వ‌చ్చింద‌ని చెబితే...ఆయ‌న స్పంద‌నేంటో ఈ వీడియోలో చూడండి.

https://youtu.be/MXEwWXQs72w

*PLEASE SUBSCRIBE AND SHARE*

*593 మార్కులు* సాధించిన గౌతమ్ సాయి కు *ఉప సర్పంచ్ కృష్ణ బాబు* అభినందనలు.............................................ఇటీవ...
09/06/2022

*593 మార్కులు* సాధించిన గౌతమ్ సాయి కు *ఉప సర్పంచ్ కృష్ణ బాబు* అభినందనలు.............................................
ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 593 మార్కులు సాధించిన *అగ్రపు గౌతమ్ సాయి* ను నరసన్నపేట మేజర్ పంచాయతీ *ఉపసర్పంచ్ సాసుపల్లి కృష్ణ బాబు* అభినందించారు.
స్థానిక *నేతాజీ వీధిలో* నివాసముంటున్న గౌతమ్ ఇంటికి వెళ్లి ఉప సర్పంచ్ కృష్ణ బాబు , తోపాటు వార్డు మెంబర్లు *రఘుపాత్రుని శ్రీధర్ (బుజ్జి) , బంకుపల్లి లోకనాథం శర్మ* లు పుష్పగుచ్చం , *జ్ఞాపిక ను అందజేస్తూ, *దుశ్శాలువతో* సత్కరించారు. పది ఫలితాల్లో జిల్లాలోనే *అత్యధిక* మార్కులు సాధించి నరసన్నపేట *ఊరు పేరు నిలబెట్టినందుకు* మెచ్చుకున్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించి *జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని* ఆకాంక్షించారు . వీరితోపాటు గౌతమ్ సాయి తల్లి పూర్ణ, తాతయ్య అమ్మమ్మ గడ్డి బాబు, కృష్ణవేణి , మేనమామ జగదీష్ , బాబాయ్ రమేష్ లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆనందంతో మిఠాయిలు కూడా పంపిణీ చేశారు..................................................

06/06/2022

ఆంధ్రప్రదేశ్లో విడుదల అయిన 10వ తరగతి ఫలితాల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని స్కూళ్ళ సంఖ్య : 71
ఎలా స్పందించాలి😢😢😢😢

04/06/2022

https://youtu.be/MTwWFvamXHc
*పంచాయతీ పొగతో మా ప్రాణాలు పోతున్నాయంటున్న నరసన్నపేట మేజర్ పంచాయతీ జగన్నాధపురం వాసులు.*

*PLEASE SUBSCRIBE AND SHARE*

Address

Srikakulam
532001

Website

Alerts

Be the first to know and let us send you an email when GMR media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share