DM Janata

DM Janata Facts & Facts

2000 BCEలో చైనాను వణికించిన భూకంపం, దాని తరువాత వచ్చిన భారీ వరదల సమయంలో, ఒక పెద్దవాడు చిన్నారిని రక్షించడానికి ప్రయత్నిస...
27/09/2025

2000 BCEలో చైనాను వణికించిన భూకంపం, దాని తరువాత వచ్చిన భారీ వరదల సమయంలో, ఒక పెద్దవాడు చిన్నారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరణించిన 4000 సంవత్సరాల నాటి ఎముకలు కనుగొనబడ్డాయి. ఈ విషాదకర సంఘటనను కొన్నిసార్లు ‘చైనాకి చెందిన పాంపీ’ అని పిలుస్తారు. ప్రస్తుతం ఇవి వాయవ్య చైనాలోని లాజియా అవశేషాల మ్యూజియంలో ఉంచబడ్డాయి.

27/09/2025
సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టు – ప్రజాస్వామ్యానికి ముప్పులడఖ్‌కు చెందిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ దేశానికి ఎన్నో...
27/09/2025

సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టు – ప్రజాస్వామ్యానికి ముప్పు

లడఖ్‌కు చెందిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ దేశానికి ఎన్నో మేలులు చేశారు. సైనికుల కోసం హిమాలయాల చలి వాతావరణంలో ఉపయోగపడే సౌర టెంట్లు తయారు చేసి అందించారు. లడఖ్ నీటి సమస్యను పరిష్కరించేందుకు ఐస్ స్టూపాలు నిర్మించారు. విద్యా రంగంలో వెనుకబడిన పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి, జీవన విధానాన్ని పర్యావరణానికి అనుగుణంగా మార్చే ప్రయత్నాలు చేశారు.

ఇలాంటి వ్యక్తిని, ప్రజల హక్కుల కోసం 6వ షెడ్యూల్ రక్షణ కోరాడని జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి మచ్చ. ప్రజల కోసం మాట్లాడటం దేశద్రోహమా? అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ప్రజల కోసం స్వరం ఎత్తితే దాన్ని దేశ వ్యతిరేక చర్యగా ముద్ర వేయడం అనేది నియంతృత్వ పాలనకు సంకేతం.

ప్రభుత్వం నిజమైన దేశభక్తులను గౌరవించకుండా, వారిని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వాంగ్‌చుక్ చేసిన మేలులు అనేకం. ఆయన సేవలు, ఆవిష్కరణలు దేశానికి గర్వకారణం కావాలి గాని, అరెస్టుకి కారణం కావడం అసహనం కలిగిస్తోంది.

చరిత్రలో హిట్లర్ ఐన్‌స్టీన్‌ను లక్ష్యం చేసినట్లే, ఇప్పుడు మోడీ ప్రభుత్వం వాంగ్‌చుక్‌ను లక్ష్యం చేస్తోందనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది.

NATIVE INDIANS FORUM (Copy)

భారతదేశం ప్రజాస్వామ్యం నుంచి డిక్టేటర్షిప్‌ వైపు వెళ్తోంది...నిరసన చేస్తే, వెంటనే టెర్రరిస్ట్, విదేశీ ఏజెంట్, దేశవిరోధి!...
26/09/2025

భారతదేశం ప్రజాస్వామ్యం నుంచి డిక్టేటర్షిప్‌ వైపు వెళ్తోంది...నిరసన చేస్తే, వెంటనే టెర్రరిస్ట్, విదేశీ ఏజెంట్, దేశవిరోధి!

మేకిన్ ఇండియా అట్టర్ ఫ్లాప్..11 ఏండ్లలో 'మోదీ' స్కీమ్ సాధించింది శూన్యంపడకేసిన తయారీ రంగం.. లక్షల ఉద్యోగాలు గాలికి, ప్రో...
26/09/2025

మేకిన్ ఇండియా అట్టర్ ఫ్లాప్..
11 ఏండ్లలో 'మోదీ' స్కీమ్ సాధించింది శూన్యం
పడకేసిన తయారీ రంగం.. లక్షల ఉద్యోగాలు గాలికి,
ప్రోత్సాహకం లేక ఏకంగా 7 లక్షల కంపెనీలకు తాళం
స్వాతంత్య్రంనాటి కంటే దిగువకు ఎగుమతుల శాతం. ప్రభుత్వ పాలసీలతో 3,552 విదేశీ కంపెనీలు గుడ్ బై...

26/09/2025

అనవసరంగా కెలుక్కుని "సర్టిఫైడ్ పిచ్చోడని" అందరికీ తెలిసేలా చేసుకున్నాడు.
సైకోలు అలాగే ఉంటారేమో!

ఒక చిన్న రాయిని నీటిలో వేస్తేనే అది వెంటనే మునిగిపోతుంది కదా !మరి వేల టన్నులు బరువులు మోసుకొని వెళ్లే ఓడలు తేలడానికి కార...
24/09/2025

ఒక చిన్న రాయిని నీటిలో వేస్తేనే అది వెంటనే మునిగిపోతుంది కదా !
మరి వేల టన్నులు బరువులు మోసుకొని వెళ్లే ఓడలు తేలడానికి కారణం…??

▫️ఆర్కిమెడిస్ సూత్రం…. ఒక వస్తువును ద్రవంలో ముంచినప్పుడు, ఆ వస్తువుకు సమాన ద్రవ్యరాశి గల ద్రవాన్ని తొలగించినట్లవుతుంది. అంటే, వస్తువు ద్రవాన్ని తన కిందకు నెట్టివేస్తుంది. ఈ నెట్టివేసిన ద్రవం వస్తువుపై పైకి ఒక బలాన్ని ప్రయోగిస్తుంది. ఈ బలాన్ని ఉద్దీపన బలం అంటారు.

▫️ఓడ యొక్క నిర్మాణం…. ఓడలను లోపలి భాగం ఖాళీగా ఉండేలా నిర్మిస్తారు. ఈ ఖాళీ భాగంలో గాలి ఉంటుంది. గాలి బరువు నీటి బరువు కంటే తక్కువ కాబట్టి, ఓడ యొక్క సగటు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఓడ నీటిలో మునిగిపోకుండా తేలుతుంది.

▫️ఓడ యొక్క ఆకారం… ఓడలను వాటి ఆకారం కూడా తేలడానికి సహాయపడుతుంది. ఓడ యొక్క దిగువ భాగం వెడల్పుగా ఉండి పై భాగం కొంచెం ఇరుకుగా ఉంటుంది. ఈ ఆకారం వల్ల నీరు ఓడను పైకి నెట్టే బలాన్ని పెంచుతుంది.

▫️ఓడ యొక్క బరువు పంపిణీ…. ఓడలోని బరువును సమతుల్యంగా పంపిణీ చేయడం కూడా చాలా ముఖ్యం. ఒక వైపు బరువు ఎక్కువగా ఉంటే ఓడ ఒరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

✴️✴️ చిన్న రాయి ఎందుకు మునిగిపోతుంది ? ….

చిన్న రాయి నీటిలో మునిగిపోవడానికి కారణం దాని సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉండటమే. రాయిలో ఖాళీ స్థలం ఉండదు కాబట్టి దాని సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రాయి నీటిని స్థానభ్రంశం చేయడానికి తగినంత ఉత్ప్లవ బలాన్ని పొందలేక మునిగిపోతుంది.

✴️✴️ ముగింపు…. ఓడలు నీటిలో తేలడానికి ఆర్కిమెడిస్ సూత్రం, ఓడ యొక్క నిర్మాణం, ఆకారం మరియు బరువు పంపిణీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చిన్న రాయి నీటిలో మునిగిపోవడానికి కారణం దాని సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉండటమే.

చివరికి మన తెలుగు  సినిమాలంటే కూడా భయపడే పరిస్థితి తెచ్చారు. నార్త్ అమెరికా లో OG సినిమా షోలను కాన్సెల్ చేసిన York Cinem...
23/09/2025

చివరికి మన తెలుగు సినిమాలంటే కూడా భయపడే పరిస్థితి తెచ్చారు.
నార్త్ అమెరికా లో OG సినిమా షోలను కాన్సెల్ చేసిన York Cinemas చెప్పిన నాలుగు కారణాలు కూడా చాలా సీరియస్.
1. పబ్లిక్ సేఫ్టీ , 2. కలెక్షన్స్ పెంచి చూపించాలని ఒత్తిడి, 3. రాజకీయ సాంస్కృతిక కారణాలతో ప్రజల మధ్య విభేదాలు,4. అనైతిక వ్యాపార పద్ధతులు.

Please find and subscribe this channel
23/09/2025

Please find and subscribe this channel

తెలుగులో మనకున్న కొన్ని ప్రోగ్రెసివ్ యూ ట్యూబ్ ఛానెళ్లలో N9 Media HD ఒకటి. రాకేష్ టీం చాలా కష్టపడి ఇండిపెండెంట్ ఛానెల్ బిల్డ్ చేశారు. యూ ట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అండ్ రిపోర్టులు ఎక్కువగా పడటం వల్ల N9 మీడియా తాత్కాలికంగా ఆగింది. ఇలాంటి టైంలో రాకేష్ అండ్ టీంకి అందరి మద్దతు అవసరం. యూ ట్యూబ్ లో N9 Media ని Subscribe చెయ్యండి. ఫేస్ బుక్ లో ఫాలో అవ్వండి. ఫియర్ లెస్ ఇండిపెండెంట్ గొంతులను కాపాడుకున్నప్పుడే వాస్తవాలు జనంలోకి వెళ్తాయ్. Let's Support N9 Media!

ప్రశ్న కి ఒక బహుమతి!నిజాన్ని నిర్భయంగా వ్యకపరిచినందుకు గొంతునొక్కే ప్రయత్నం. న్యాయం బాగానే వర్ధిల్లుతోంది.డియర్Siddharth...
23/09/2025

ప్రశ్న కి ఒక బహుమతి!
నిజాన్ని నిర్భయంగా వ్యకపరిచినందుకు గొంతునొక్కే ప్రయత్నం. న్యాయం బాగానే వర్ధిల్లుతోంది.

డియర్
Siddharthi Subhas Chandrabose
ఇది అందరూ ఊహించిందే.

ఐనా
ప్రశ్న సుభాష్ తో మొదలు కాలేదు
రాష్ట్ర ఉద్యోగులందరిలో ఒక గెజిటెడ్ ఉద్యోగి
ప్రశ్నకి అక్షరం అరువివ్వడం చరిత్రగా మిగులుతుంది.

సత్యం చూపడం చేతకాని
ఆధిపత్య కులమీడియా
ప్రశ్నించేవాళ్ళని ఎంచుకుని చేసే దాడికి
వత్తాసు ప్రభుత్వాలు ఎన్నో గతంలో గాలికి కొట్టుకుపోయాయి. #దేశమంటేమనుషులోయి

కేర‌ళ ప‌ట్ల కేంద్రం శ‌త్రుత్వం! కేర‌ళ ప‌ట్ల కేంద్రం శ‌త్రుత్వం వ‌హిస్తుంద‌ని ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌యన్ ఆరోపించారు....
22/09/2025

కేర‌ళ ప‌ట్ల కేంద్రం శ‌త్రుత్వం!

కేర‌ళ ప‌ట్ల కేంద్రం శ‌త్రుత్వం వ‌హిస్తుంద‌ని ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌యన్ ఆరోపించారు. నిధుల మంజూరులో, అభివృద్ధిలో కేంద్ర ప్ర‌భుత్వం చొర‌వ చూప‌డంలేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం-స్థానిక సంస్థల అభివృద్ధి విజయాలు, భవిష్యత్తు అభివృద్ధికి సూచనలు అనే వికాసనా సదస్సు రాష్ట్ర స్థాయి కార్య‌క్రమాన్ని ఆయ‌న‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. న్యాయ‌మైనా రాష్ట్ర వాటా కోసం ప్ర‌జ‌ల త‌రుపున‌ తరుచుగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. మ‌న దేశం ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌కు సూచిక‌ని, ప్రజాస్వామ్య బ‌ద్ధంగా కేర‌ళ ప‌ట్టుద‌ల‌తో పోరాటం సాగిస్తుంద‌ని తెలిపారు.

కేర‌ళ అన్ని రంగాల్లో గ‌ణ‌నీయ‌మైనా అభివృద్ధిని సాధించింద‌ని, కేరళ అత్యల్ప శిశు మరణాల రేటును కూడా సాధించింది, ఇది యునైటెడ్ స్టేట్స్ కంటే కూడా తక్కువ” అని ఆయన అన్నారు. కేర‌ళ‌లో అనేక మార్పులు ఇప్ప‌టికే అంద‌రికీ క‌నిపిస్తున్నాయి, ఇంత‌టితో త‌మ ప్ర‌య‌త్నం ఆగ‌ద‌ని, మ‌రింత పురోగ‌తి సాధించడానికి దృఢ సంక‌ల్పంతో తాము ముందుకెళ్తామ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తతో అనేక మైలురాళ్లు దాట‌మ‌ని, అదే స్పూర్తితో అభివృద్దిని కొన‌సాగిస్తామ‌న్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే నిజమైన యజమానులని, ఎన్నిక‌ల హ‌మీల మేర‌కు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నామ‌ని, ప్ర‌జ‌ల‌ అవ‌స‌రాల‌కు అనుగుణంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించామ‌న్నారు.

Address

Srikakulam

Telephone

+919666854137

Website

Alerts

Be the first to know and let us send you an email when DM Janata posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DM Janata:

Share