16/10/2025
గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ యల్లా శ్రీనివాస్
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎల్ అగ్రహారం గ్రామ పరిధి హైవేపై ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందాడు. ఐదు రోజులుగా అతని కుటుంబ సభ్యులు వివరాలు తెలియకపోవడంతో తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ లో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ యల్లా శ్రీనివాస్ గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి, మరోసారి తన ద్రాతృత్వాన్ని చాటుకున్నారు. గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యల్లా శ్రీనివాస్ ను పలువురు అభినందిస్తున్నారు.