17/11/2023
కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష..
పైలెట్ నాయకత్వమే తాండూరుకు రక్ష..
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తోనే భవిష్యత్ కు బాటలు..
70 ఎండ్లు గా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు..
కాంగ్రెస్ లో చేరిన వారి రాజకీయ జీవతం సమాప్తం..
- బీఅర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష..
పైలెట్ నాయకత్వమే తాండూరుకు రక్ష అని తాండూరు మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నారు. ఈరోజు యలాల మండలం నాగాసముందర్, రాఘవాపూర్, సంగాయి గుట్ట తండా, తాండూరు మండలం కోటబాస్పల్లి, పెద్దెముల్ మండలం జనగాం, బషీరాబాద్ మండల ఎకమై గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తోనే తాండూరు భవిష్యత్ కు బాటలన్నారు. 70 ఎండ్లు గా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదునీ వారు అన్నారు. డబ్బులకు ఆశపడి కాంగ్రెస్ లో చేరిన వారి రాజకీయ జీవతం సమాప్తం మళ్ళీ తాండూరులో గెలిచేది పైలెట్ రోహిత్ రెడ్డి అని భారీ మెజారిటీ ఆయనను గెలిపించుకుంటామని వారు తెలిపారు.