Tirumala Divine

Tirumala Divine A humble space sharing divine moments, stories, updates, and devotion related to Lord Venkateswara Swamy & Tirumala. Govinda Govinda

29/06/2026
27/06/2026
25/01/2026


Hanumantha vahanam, TTD Temple, Jublee Hills.

జ‌న‌వ‌రి 9వ తేది నుండి ఆన్ లైన్ లో శ్రీ‌వాణి ద‌ర్శన టికెట్లు జారీ నెల రోజుల పాటు ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లుతిరుమ‌ల‌లో ఆఫ్ లై...
06/01/2026

జ‌న‌వ‌రి 9వ తేది నుండి ఆన్ లైన్ లో శ్రీ‌వాణి ద‌ర్శన టికెట్లు జారీ

నెల రోజుల పాటు ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు

తిరుమ‌ల‌లో ఆఫ్ లైన్ శ్రీవాణి ద‌ర్శ‌న టికెట్ల జారీ నిలిపివేత‌

య‌థావిధిగా ఇప్ప‌టికే అమ‌లులో ఉన్న‌ శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల అడ్వాన్స్ బుకింగ్, తిరుప‌తి విమానాశ్ర‌యంలోని ఆఫ్ లైన్ క‌రెంట్ బుకింగ్ విధానం

భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి రోజువారి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించ‌నున్నారు.

ఈ మేరకు తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్‌లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్‌లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భ‌క్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు (మొత్తం న‌లుగురు) మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్ లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి. ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ‌డ్ విధానంలో భ‌క్తులు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. త‌ద్వారా ఆఫ్ లైన్ లో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కోసం భ‌క్తులు క్యూలైన్ లో నిరీక్షించే స‌మ‌స్య తొల‌గిపోతుంది. ఈ నూతన విధానాన్ని నెల రోజుల‌పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

అదేవిధంగా రోజుకు 500 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుద‌ల చేయ‌డం జరిగింది. మూడు నెల‌ల అనంత‌రం ఈ విధానంపై స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుంది.

తిరుప‌తి విమానాశ్ర‌యంలో ప్ర‌తిరోజూ భ‌క్తుల‌కు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా య‌థావిధిగా కొన‌సాగ‌నుంది.

అన్ని వ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణ‌యాన్ని గ‌మ‌నించి భ‌క్తులు త‌మ ద‌ర్శ‌న ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిచుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేయడమైనది...

Online current booking facility of SRIVANI Tickets from Jan 09 on a trial-basis: TTD

Tirumala, 06 January 2026:

Keeping in view the convenience of devotees, the TTD has taken a significant step introducing online current booking system for SRIVANI Trust tickets on a trial basis which will come into effect from 9th January 2026 onwards.

Highlights:

Conversion of Offline Tickets to Online Mode:

- The 800 SRIVANI Trust Break Darshan tickets currently issued at Tirumala counters will now be made available through online current booking.

- This is in addition to the existing online quota of 500 tickets which were released three months prior.

Daily Online Release Schedule:

- Tickets will be released online every day at 9 AM.

- Bookings will remain open until 2 PM.

- Devotees must report at 4PM for same-day darshan at Tirumala.

Trial-run

- This initiative will undergo a one-month trial run.

- Based on the outcome, a final decision will be taken regarding the overall SRIVANI darshan timings.

Appeal to Devotees

TTD requests all its devotees to kindly take note of this change and make use of the online current booking facility avoiding long waiting for tickets.

By booking tickets online from 9AM onwards, devotees can conveniently avail darshan of Sri Venkateswara Swamy by reporting at 4 PM on the same day.



వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి మముత్ స్వర్ణ రథంపై కొలువై స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు ...
30/12/2025

వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి మముత్ స్వర్ణ రథంపై కొలువై స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు...
Source: SVBC,TTD.

Address

Tirumala
517504

Website

Alerts

Be the first to know and let us send you an email when Tirumala Divine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share