26/03/2026
#మార్కాపురం: 13మంది మృతి.. 23 మందికి గాయాలు
మార్కాపురం మండలం రాయవరం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది మృత్యువాత పడినట్లుగా అధికారులు ప్రకటించారు.
23 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. మృతులు, క్షతగాత్రులు కనిగిరి, పామూరు మండలాలకు చెందిన వారిగా అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.