Krishnam Vande Jagatguru - Telugu

Krishnam Vande Jagatguru - Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Krishnam Vande Jagatguru - Telugu, Digital creator, Tirupati.

🚨 ఈ పేజీలో ఎటువంటి వివాదాస్పద పోస్టులు చేయబడవు కామెంట్ చేసేవాళ్లు గమనించండి
🛕 కృష్ణం వందే జగద్గురు ఆధ్యాత్మిక విషయాలు
🌺 కృష్ణ తత్వములు
👉 భగవద్గీత, మహాభారత, రామాయణం,
🎁 శ్రీల ప్రభుపాదుల వారి కృష్ణ చైతన్య చింతనం

🙏🌿Tirumala Tirupati Devastanam🙏🛕🌿
19/07/2025

🙏🌿Tirumala Tirupati Devastanam🙏🛕🌿

*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*  *ఓం నమో భగవతే వాసుదేవాయ*🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁                *సంకల్ప బలం**దేవుడ్ని అనేక మంది అనేక కోరి...
18/07/2025

*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*సంకల్ప బలం*

*దేవుడ్ని అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా, అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా? అని ఒక అయన ప్రశ్న*

*అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలీదు కానీ ఒక కథ చెప్తా విను అని ఒక గురువు గారు చెప్పారు...*

*ఆ కథ...*

*ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ "తథాస్తు" అన్నాడు. గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు.*

*ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను.*

*"ఏమిటా కోరిక గురువు గారూ" తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని. వచ్చే జన్మలోనా కాదు ఈ జన్మలోనే*

*శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక* *కదూ... అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "*

*అర్హతకేం నాయనా... జీవితమంతా ప్రతి ఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా*

*అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది. ఏమో... భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు.*

*ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.*

*సంవత్సరం తరువాత...*

*శిష్యుడు పరుగు పరుగున వస్తూ గురువు గారూ... ఈ వింత విన్నారా… శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!*

*గురువు గారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. అయింది కదా...*

*"అంటే..."*

*అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు... ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో... ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది.*

*శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది. అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు.*

*భగవంతుడి లీలలు మనకి అర్ధం కావు*

*అందుకే అంటారు సంకల్పం (కోరిక ) బలం గా ఉండాలి అప్పుడు అందరి సహకారం ఉంటుంది అని.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

అనంతపూర్ లోని కృష్ణ మందిరం 🛕 #అనంతపూర్
17/07/2025

అనంతపూర్ లోని కృష్ణ మందిరం 🛕

#అనంతపూర్

16/07/2025

రావణుని కోరిక తీరలేదెందుకు❓విభీషణుడికి ఎందుకు చిరంజీవిత్వం? | Bhakti Secrets

16/07/2025
ఎంట్రీ ఫర్ వైకుంఠం 🚩🛕
16/07/2025

ఎంట్రీ ఫర్ వైకుంఠం 🚩🛕

15/07/2025

Satkarma Anustanam Ante enti ❓

🔱 పవర్‌ఫుల్ శివ మంత్రం:🔔 “ఓం నమః శివాయ” 🔔ఈ మంత్రం ఐదు అక్షరాల మహామంత్రం.ప్రతి జపంతో మనస్సు ప్రశాంతమవుతుంది,పాపాలు క్షమిం...
14/07/2025

🔱 పవర్‌ఫుల్ శివ మంత్రం:

🔔 “ఓం నమః శివాయ” 🔔
ఈ మంత్రం ఐదు అక్షరాల మహామంత్రం.
ప్రతి జపంతో మనస్సు ప్రశాంతమవుతుంది,
పాపాలు క్షమింపబడతాయి, శక్తి పెరుగుతుంది.

🌿 “మహా మృత్యుంజయ మంత్రం” 🌿
🕉
ఓం త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం।
ఉర్వారు కమివ బంధనాన్
మృత్యోర్ముక్షీయ మామృతాత్॥

ఈ మంత్రాన్ని జపించడం ద్వారా
అనారోగ్యం, ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది,
ఆయుష్షు పెరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది.

🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి పవిత్ర 10 నామాలు:1. ఓం సూర్యాయ నమః2. ఓం ఆదిత్యాయ నమః3. ఓం భానవే నమః4. ఓం ఖగాయ నమః5. ఓం పూష్ణే ...
13/07/2025

🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి పవిత్ర 10 నామాలు:

1. ఓం సూర్యాయ నమః
2. ఓం ఆదిత్యాయ నమః
3. ఓం భానవే నమః
4. ఓం ఖగాయ నమః
5. ఓం పూష్ణే నమః
6. ఓం హిరణ్యగర్భాయ నమః
7. ఓం మరీచయే నమః
8. ఓం సవిత్రే నమః
9. ఓం అర్కాయ నమః
10. ఓం రవయే నమః

#సూర్యనారాయణస్వామి

🔱 "హనుమాన్ చాలీసా – శక్తి, భక్తి, శాంతి" 🔱ఆంజనేయ స్వామి అనగానే మనసు నిండే శక్తి, భక్తి, భయం తొలగించే ఆశ్రయం గుర్తుకు వస్...
12/07/2025

🔱 "హనుమాన్ చాలీసా – శక్తి, భక్తి, శాంతి" 🔱

ఆంజనేయ స్వామి అనగానే మనసు నిండే శక్తి, భక్తి, భయం తొలగించే ఆశ్రయం గుర్తుకు వస్తుంది.
హనుమాన్ చాలీసా అంటే 40 చరణాలతో కూడిన పవిత్ర గ్రంథం, అందులో ప్రతి పదం స్వామివారి మహిమను నింపుకుని ఉంటుంది.

🌺 ఇది కేవలం ఒక స్తోత్రం మాత్రమే కాదు…
💪 జీవితం లో భయాలనూ, శత్రువులనూ పారద్రోలే ఆధ్యాత్మిక ఆయుధం.
🙏 ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠనం చేయడం వల్ల మనస్సుకు ధైర్యం, చిత్తశుద్ధి, జీవితంలో శుభ మార్గం కలుగుతాయి.

"బుద్ధి హీన్ తను జాన్ కె, సుమిరౌ పవన కుమార"
అంటూ ప్రారంభమయ్యే ఈ చాలీసా, మన బుద్ధిని సరి దిద్దే దివ్య మంత్రం.

ఇవాళ ఈ ఆంజనేయ స్వామి దివ్యమూర్తిని చూసి...
ఒక్కసారి హనుమాన్ చాలీసా చదవండి…
మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభమవుతుంది. 🙌

🔔 జై శ్రీ రాం… జై హనుమన ! 🔔















ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🙏 #వెంకటరమణా
12/07/2025

ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🙏

#వెంకటరమణా

Address

Tirupati

Website

Alerts

Be the first to know and let us send you an email when Krishnam Vande Jagatguru - Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Krishnam Vande Jagatguru - Telugu:

Share