Mana Tirupati Mana MP

Call Directions

Mana Tirupati Mana MP Die Hard fan Shiva Rasad Reddy
(3)

*ఎన్నికలు  స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోండి - తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి* స్థానిక సంస్థల ఎన్నికలు ...
15/10/2026

*ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోండి - తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి*

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, బెదిరింపులు ఎదురుకాకుండా తగిన భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్, తిరుపతి జిల్లా కలెక్టరు ఎస్పీలకు లేఖ రాశారు. అక్టోబర్ 14 న జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను ప్రస్తావిస్తూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న దుర్ఘ‌ట‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఎంపీ కోరారు. నామినేషన్ కేంద్రాల వద్ద తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి అడ్డంకులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన పరిపాలనా సౌకర్యాలు ఏర్పాట్లు చేయడంతో పాటు, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు.

అలాగే, ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులను బెదిరించడం, అడ్డుకోవడం వంటి ఘటనలు జరగకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, ఆ హక్కుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు.

06/10/2026

తిరుపతి ఎంపీ తండ్రి మద్దిల మునికృష్ణయ్య గారిని ఫోన్‌లో పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్ది గారు.

చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గారి తండ్రి మద్దిల మునికృష్ణయ్య గారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ద్వారా పరామర్శించారు. మద్దిల మునికృష్ణయ్య గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అంతా మంచే జరుగుతుందని భరోసా ఇచ్చారు.

✨

AbnAndhrajyothy YSRCP Chilakaluripet YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP Maddila Gurumoorthy SumanTV Nellore YSRCP Social Media YSRCP Anaparthy Assembly

*ఎస్సీ విద్యార్థుల కోసం పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి*ఎస్సీ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల...
18/09/2026

*ఎస్సీ విద్యార్థుల కోసం పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి*

ఎస్సీ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకుండా, పోస్ట్‌మెట్రిక్, ఉన్నత విద్యను పూర్తిచేయడానికి ఆర్థిక సహాయం అందించడం పీఎంఎస్ - ఎస్సీ పథకం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల ఉన్నత విద్యలో చేరికను పెంచడం లక్ష్యం.

👨‍🎓 ఎవరు అర్హులు?

✅ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు.

✅ పోస్ట్‌మెట్రిక్ / పోస్ట్‌ సెకండరీ విద్యను అభ్యసిస్తున్న వారు.

✅ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు.

✅ తల్లిదండ్రులు / సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలకు మించకూడదు.

✅ కేంద్ర పథకం నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన విద్యార్థులు.

💰 పథకం ముఖ్య ప్రయోజనాలు.

విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం

• అర్హత కలిగిన కోర్సులకు స్కాలర్‌షిప్.

• నిర్దేశిత నిబంధనల ప్రకారం ఫీజు సహాయం.

• విద్యార్థులకు నిర్వహణ/విద్యా భత్యం.

• అర్హత కలిగిన విద్యార్థులకు నేరుగా బ్యాంకు ఖాతాలో చెల్లింపు.

• 2021–22 నుంచి డీబీటీ విధానం అమలు.

📲 ఎలా దరఖాస్తు చేయాలి?

దరఖాస్తులు సంబంధిత రాష్ట్ర స్కాలర్‌షిప్ పోర్టల్ లేదా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆహ్వానించబడతాయి. దరఖాస్తు, పరిశీలన, ధృవీకరణకు రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు వర్తిస్తాయి.

🌐 అధికారిక వెబ్‌సైట్
National Scholarship Portal:

https://scholarships.gov.in/

*“ఆర్థిక పరిస్థితులు విద్యకు అడ్డంకి కాకూడదు. అర్హత ఉన్న ప్రతి ఎస్సీ విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను పూర్తి చేయాలి.” – మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ*

*విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడు. విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన చల్లన...
14/09/2026

*విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడు. విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. మీఅందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.*

*సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ పోరుబాట**కూటమి సర్కారు నిర్లక్ష్యంపై ఉక్కుపాదం**అరణియార్ ప్రాజెక్టు దుస్...
13/09/2026

*సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ పోరుబాట*

*కూటమి సర్కారు నిర్లక్ష్యంపై ఉక్కుపాదం*

*అరణియార్ ప్రాజెక్టు దుస్థితిపై రైతుల పక్షాన పోరాటం, పిచ్చాటూరులో భారీ ర్యాలీ*

*కీలపూడి నుంచి అరణియార్ వరకు మహా ర్యాలీకి పిలుపు*

*‘జలధార’ పేరుతో పచ్చ నేతల జేబులు నింపే యత్నం*

*మండిపడ్డ ఎంపీ మద్దిల గురుమూర్తి, నూకతోటి రాజేష్*

పిచ్చాటూరు: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పరిరక్షించి, రైతులకు చివరి ఎకరం వరకు నీరు అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తిరుపతి పార్లమెంట్‌ సభ్యులు మద్దిల గురుమూర్తి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌, గూడూరు నియోజకవర్గ పరిశీలకులు బీరేంద్ర వర్మ,రాయలసీమ సాగునీటి పరిరక్షణ కమిటీ సభ్యుడు వేలూరు రాకేష్ హాజరయ్యారు. వీరికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె.వి.భాస్కర్ నాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కేటీ హరిశ్చంద్రా రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు రమేష్ రాజు తదితరులు శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. పిచ్చాటూరు మండల అధ్యక్షులు అధ్యక్షులు చలపతి రాజు ఆధ్వరంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కన్వీనర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులపై దృష్టి పెట్టకుండా కూటమి ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమవుతోందని ఎంపీ విమర్శించారు. నీటి ప్రాజెక్టులపై సరైన శ్రద్ధ పెట్టి, దెబ్బతిన్న కాలువలు, గేట్లు, లాకులకు మరమ్మతులు చేపట్టి, అందుబాటులో ఉన్న నీటిని చివరి ఆయకట్టు వరకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న సమయంలో సాగునీటి ప్రాజెక్టులను మరింత పటిష్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. సప్లై ఛానల్స్‌ను పూర్తిస్థాయిలో శుభ్రం చేసి, మరమ్మతులకు గురైన కాలువలు, గేట్లు, లాకులను వెంటనే బాగు చేయాలని డిమాండ్ చేశారు.

అరణియార్ ప్రాజెక్టు దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, ప్రస్తుతం సుమారు 3 వేల ఎకరాలకే నీరు అందుతున్న పరిస్థితి ఉందని ఎంపీ తెలిపారు. కుడి కాలువ, ఎడమ కాలువ, మధ్య కాలువల్లో సమస్యలు ఉండటంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. గేట్లు, లాకుల సమస్యలను కూడా పరిష్కరించకపోవడంతో ప్రాజెక్టు ఆయకట్టు క్రమంగా కుంచించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అరణియార్ ప్రాజెక్టు సమస్యను రైతుల సమస్యగా భావించి వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని చెప్పారు. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ నాయకుల సూచనల మేరకు రైతులతో కలిసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.

ఈ నెల పిచ్చాటూరులో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్ది, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి పాల్గొననున్నారని ఆయన తెలిపారు. కీలపూడి నుంచి అరణియార్ వరకు మహా ర్యాలీ నిర్వహించి, అరణియార్ ప్రాజెక్టు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆయకట్టు పరిధిలోని రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఎంపీ మద్దిల గురుమూర్తి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌తో కలిసి అరణియార్ డ్యాంను సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. ఆయకట్టు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

‘జలధార’ పేరుతో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, మరమ్మతుల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేసి పచ్చ నేతల జేబులు నింపే ప్రయత్నాలు చేస్తున్నారని నూకతోటి రాజేష్ మండిపడ్డారు. రైతులకు వాస్తవంగా ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, అరణియార్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

12/09/2026

*రాష్ట్రంలో రాజ్యాంగం బదులు.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది*

*పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ‘ఏ పార్టీ?’ అని అడిగే దుస్థితి*

*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు*

*నాయుడుపేట మీడియా సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ధ్వజం*

నాయుడుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి దారుణంగా ఉందని, ఏదైనా సమస్య జరిగి న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ముందుగా “ఏ పార్టీ?” అని అడిగే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయని అన్నారు.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎంపిక చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారని గురుమూర్తి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులకు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసినా, బాధితులపైనే కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి ఉందన్నారు. దేశమంతా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం “రెడ్ బుక్ రాజ్యాంగం” అమలవుతోందనే భావన ప్రజల్లో ఏర్పడిందని విమర్శించారు.

సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలంలో ప్రతిరోజూ ఇదే తరహా సమస్యలు, కేసులు ఎదురవుతున్నాయని ఎంపీ అన్నారు. అక్రమాలను ప్రశ్నించినా, ప్రజల తరఫున గొంతెత్తినా కేసులు పెట్టే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. “ఎక్కడికి వెళ్తున్నాం? ఏ ఆటవిక రాజ్యంలో ఉన్నాం?” అని ప్రశ్నించారు.

సత్యనారాయణ రెడ్డి గారిపై నమోదైన కేసు విషయంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయని గురుమూర్తి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక, సత్యనారాయణ రెడ్డి గారిని ఎలాగైనా జైలులో పెట్టి ఎన్నికలు పూర్తయ్యే వరకు బయటకు రాకుండా చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసు పెట్టారా అనే అనుమానం కలుగుతోందన్నారు.

తన పొలంలో తాను రోడ్డు వేసుకున్న విషయంలో ఏదైనా ప్రభుత్వ భూమి కలిసి ఉందా లేదా అనే అంశాన్ని రెవెన్యూ అధికారులు చట్ట ప్రకారం సర్వే చేయవచ్చని ఎంపీ తెలిపారు. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకుని, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా శాంతియుత వాతావరణంలో సర్వే నిర్వహించవచ్చన్నారు. నిజంగా ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. అయితే అక్కడ ప్రభుత్వ భూమి లేదని రెవెన్యూ యంత్రాంగం తేల్చినట్లు చెబుతున్నప్పుడు, జరిగిన తోపులాట ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొనని వ్యక్తి తనకు ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా ఘటనా స్థలానికి చేరుకునేలోపే సుమారు 100 మీటర్ల దూరంలో మృతి చెందితే, ఆ మరణాన్ని సత్యనారాయణ రెడ్డి గారిపై హత్యగా మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇలాంటి అక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని గురుమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై న్యాయపరమైన పోరాటం చేస్తామని, ఇప్పటికే న్యాయవాది పట్టాభి గారు పేర్కొన్న విధంగా అవసరమైతే ప్రైవేట్ ఫిర్యాదులు కూడా దాఖలు చేస్తామని తెలిపారు. అక్రమ కేసులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే అది ప్రభుత్వ పెద్దలు చేస్తున్న పెద్ద పొరపాటు అవుతుందని హెచ్చరించారు.

ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గరని ఎంపీ అన్నారు. ఎంతగా వేధిస్తే అంతకంటే ఎక్కువగా ప్రజల కోసం పనిచేస్తారని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు పోరాటాలతోనే ముందుకు సాగుతున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. అక్రమ కేసులు, అరెస్టులతో పార్టీని బలహీనపరచాలని చూస్తే అది సాధ్యం కాదన్నారు. అన్యాయానికి గురైన ప్రతి నాయకుడు, కార్యకర్తకు సంజీవన్నతో పాటు తాను, పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరి గొంతును నొక్కే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రామస్థాయి వరకు జరుగుతోందని గురుమూర్తి ఆరోపించారు. అధికార పార్టీకి అడ్డుగా మాట్లాడుతున్న వారు, ప్రభుత్వ దోపిడీని ప్రశ్నిస్తున్న వారు, ప్రజల సమస్యలపై గొంతెత్తుతున్న వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టినా ఐటీ చట్టాల కింద కేసులు పెట్టడం, ఆ పోస్టులు ప్రజలకు కనిపించకుండా చేసే ప్రయత్నాలు చేయడం వంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని అన్నారు.

“ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించుకున్నాం?” అని ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చిందని ఎంపీ అన్నారు. ప్రజల ఓట్లతో కాకుండా ట్యాంపరింగ్‌తో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అందుకే ప్రజలపై కక్ష సాధిస్తోందనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోందని తెలిపారు. అయితే ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు.

తప్పు చేస్తున్న అధికారులు ఎవరైనా సరే భవిష్యత్తులో దానికి మూల్యం చెల్లించుకోక తప్పదని గురుమూర్తి హెచ్చరించారు. ఈరోజు అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, రేపు “ఎందుకు ఇలా చేశాం?” అని బాధపడే రోజులు వస్తాయని అన్నారు. అధికారులు ఒక రాజకీయ పార్టీకి తొత్తులుగా కాకుండా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారని గుర్తుంచుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ఏ కార్యాలయానికి వెళ్లినా న్యాయంగా వ్యవహరించబడుతుందనే నమ్మకం ప్రజల్లో లేకుండా పోతోందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరు మారకపోతే ఉన్నతాధికారులకు, రాజ్యాంగబద్ధ సంస్థలకు ఫిర్యాదులు చేయడంతో పాటు కోర్టులను ఆశ్రయించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తుందని మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు.

11/09/2026

*తిరుపతి నుంచి నైలెట్‌ను అమరావతికి తరలించడంపై జెన్‌ జీ నిరసన*

*వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువత, నగర ప్రజలు*

*తిరుపతిలోనే శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయాలని డిమాండ్*

తిరుపతి: నైలెట్‌ను తిరుపతి నుంచి అమరావతికి తరలించడాన్ని నిరసిస్తూ తిరుపతిలో జెన్‌ జీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా విద్యార్థులు, యువత, నగర ప్రజలు తరలివచ్చి ‘కాక్రోచ్ తిరుపతి’ పేరుతో నిరసన చేపట్టారు. ఎస్వీ యూనివర్సిటీ రెండో గేట్‌ నుంచి మెయిన్ గేట్‌ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ భూమన అభినయ్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ డాక్టర్ శిరీష, మాజీ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ నైలెట్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయాలనే ఆలోచన అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల్లో భాగంగా రూపుదిద్దుకుందని తెలిపారు. 4 వేల నుంచి 12 వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించి, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో వారిని తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. తిరుపతిలోనే సుమారు 15 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్ నిర్మించేందుకు డీపీఆర్ కూడా సిద్ధమైన పరిస్థితుల్లో నైలెట్‌ను అమరావతికి తరలించడం అన్యాయమని అన్నారు. దీనితోపాటు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు.

తిరుపతికి ప్రతిపాదించిన సంస్థలను అమరావతికి తరలించడంపైనే తమ అభ్యంతరమని ఎంపీ స్పష్టం చేశారు. అమరావతికి కొత్తగా విశ్వవిద్యాలయాలు, సంస్థలు రావడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే రాయలసీమకు రావాల్సిన విద్యా, నైపుణ్య సంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల ఈ ప్రాంత యువతకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రాంతంలోని పరిశ్రమల్లో సుమారు 70 శాతం మంది తమిళనాడుకు చెందిన యువత ఉపాధి పొందుతున్నారని తెలిపారు. మన ప్రాంత యువతకు సరైన నైపుణ్య శిక్షణ కల్పిస్తే స్థానికంగానే వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

రాయలసీమలో యువత ప్రధానంగా విద్య, ఉపాధిపై ఆధారపడి ఉన్నారని, ఈ ప్రాంతానికి మరిన్ని ఉన్నత విద్య, నైపుణ్య సంస్థలు అవసరమని గురుమూర్తి అన్నారు. తిరుపతిలోని విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు నైలెట్ వంటి సంస్థలు నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ ప్రాంతంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి సంస్థలు కీలకమన్నారు.

తిరుపతికి ప్రతిపాదించిన నైలెట్‌తో పాటు ఇతర విశ్వవిద్యాలయాలు, సంస్థలను కూడా తిరుపతిలోనే ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. రాయలసీమ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాలను పునఃపరిశీలించాలని ఆయన కోరారు.

*కోట ఎస్సీ గురుకులం మూసివేతపై  మ‌రోసారి స్పందించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి**గురుకులాన్ని కొనసాగించాలని ఇదివరకే సంబంధిత మ...
09/09/2026

*కోట ఎస్సీ గురుకులం మూసివేతపై మ‌రోసారి స్పందించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి*

*గురుకులాన్ని కొనసాగించాలని ఇదివరకే సంబంధిత మంత్రికి లేఖ*

*కోట గురుకులం అభివృద్ధికి 2024-25లో రూ.35.80 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు*

*నిధులు కేటాయించిన త‌న‌పై రాజ‌కీయ దురుద్దేశంతో విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్న ఎంపీ*

తిరుపతి, సెప్టెంబర్ 8: నెల్లూరు జిల్లా కోటలోని డా.బి.ఆర్.అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేత అంశంపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మరోసారి స్పందించారు. గురుకులం మూసివేసి అదే ప్రాంగణంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ 2026 ఆగస్టు 10వ తేదీనే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి ఎంపీ లేఖ రాశారు.

ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి సౌకర్యం అందిస్తున్న కోట డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను అకస్మాత్తుగా మూసివేయడం వల్ల విద్యార్థుల చదువు, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గురుకులాన్ని కొనసాగించాలని స్పష్టం చేశారు.

ఐఐటీ-జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ అందించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ విషయమేనని, అయితే అందుకోసం ఇప్పటికే కొనసాగుతున్న ఎస్సీ గురుకుల పాఠశాలను మూసివేయడం సరైన నిర్ణయం కాదని ఎంపీ స్పష్టం చేశారు. గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

అయితే ఈ అంశంలో వాస్తవాలు తెలుసుకోకుండా ఎంపీ గురుమూర్తి స్పందించలేదని కొందరు చేస్తున్న విమర్శలపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కోట డా.బి.ఆర్.అంబేద్కర్ ఎస్సీ గురుకులం అభివృద్ధికి ఎంపీ గురుమూర్తి గతంలోనే ఎంపీ నిధులు కేటాయించిన విషయం అధికారిక పత్రాల ద్వారా స్పష్టమవుతోంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో గురుకులాలలో మౌలిక వసతుల కల్పన కోసం ఎంపీ మద్దిల గురుమూర్తి మొత్తం రూ.49.80 లక్షల విలువైన నాలుగు పనులను ప్రతిపాదించారు. ఇందులో కోట బాలుర ఎస్సీ గురుకులంలోని టాయిలెట్ బ్లాకుల మరమ్మతులకు రూ.13.50 లక్షలు, డార్మిటరీ బ్లాక్ మరమ్మతులకు రూ.22.30 లక్షలు, మొత్తం రూ.35.80 లక్షలు కేటాయించారు. మిగిలిన నిధులతో సుళ్లూరుపేటలోని బాలికల ఎస్సీ గురుకులాలకు డ్రైనేజీ పనులు చేపట్టారు.

ఈ పనులకు సంబంధించి 2024 డిసెంబర్‌లో జిల్లా అధికారులు సంబంధిత అధికారుల నుంచి సాధ్యాసాధ్యత నివేదికలు, వివరణాత్మక అంచనాలు కోరారు. అనంతరం పనులు పూర్తయ్యాయని, తుది బిల్లులు కూడా క్లియర్ అయినట్లు అధికారిక సమాచారం ఉందని ఎంపీ కార్యాలయం తెలిపింది.

కోట ఎస్సీ గురుకులం విషయంలో ఎంపీ గురుమూర్తి స్పందించలేదని ఆరోపించడం వాస్తవ విరుద్ధమని ఎంపీ కార్యాలయం స్పష్టం చేసింది. గురుకులం మూసివేత అంశంపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయమైనప్పటికీ, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 10వ తేదీనే సంబంధిత మంత్రికి లేఖ రాసి నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఎంపీ కోరారని పేర్కొంది.

ఇటీవల గురుకులం మూసివేతకు వ్యతిరేకంగా దళిత, బహుజన సంఘాలు ఆందోళన చేయడం ప్రజాస్వామ్యంలో సహజమైన విషయమని, విద్యార్థుల హక్కుల కోసం చేసే ప్రతి పోరాటాన్ని గౌరవిస్తామని ఎంపీ కార్యాలయం తెలిపింది. అయితే సమస్యకు కారణమైన ప్రభుత్వ నిర్ణయంపై ప్రశ్నించాల్సింది పోయి, విద్యార్థుల కోసం ముందుగానే స్పందించిన ఎంపీపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొంది.

కోట అంబేద్కర్ ఎస్సీ గురుకులాన్ని యథావిధిగా కొనసాగించడంతో పాటు, విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల శిక్షణ అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి మరోసారి డిమాండ్ చేశారు. విద్యార్థుల విద్య, భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం వెంటనే గురుకులం మూసివేత నిర్ణయాన్ని పునఃపరిశీలించి, గురుకులాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

తిరుపతిలో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య సమావేశంలో తిరుపతి పార్లమెంట్ సభ్య...
06/09/2026

తిరుపతిలో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య సమావేశంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి గారు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి గారితో పాటు, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాడాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

Mana Tirupati Mana MP YSRCP Social Media YS Jagan Mohan Reddy YSRCP Anaparthy Assembly YSR Congress Party - YSRCP Maddila Gurumoorthy

*శివమొగ్గ, తిరుపతి మధ్య కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రతిపాదన**ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తికి రైల్వే శాఖ సానుకూల స్పం...
06/09/2026

*శివమొగ్గ, తిరుపతి మధ్య కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రతిపాదన*

*ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తికి రైల్వే శాఖ సానుకూల స్పందన*

తిరుపతి: తిరుపతి నుంచి కర్ణాటకలోని శివమొగ్గకు బెంగుళూరు మీదుగా కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏర్పాటు చేయాలన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తికి రైల్వే శాఖలో సానుకూల స్పందన లభించింది. శివమొగ్గ టౌన్‌, తిరుపతి మధ్య కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదన రూపొందించినట్లు రైల్వే బోర్డు నుంచి వచ్చిన అధికారిక సమాచారంలో వెల్లడించారు.

తిరుపతి రైల్వే సౌకర్యాల విస్తరణ, మెరుగుదలతో పాటు తిరుపతి నుంచి కొత్త వందే భారత్‌ రైలు సేవలను ప్రారంభించాలని ఎంపీ గురుమూర్తి రైల్వే బోర్డు చైర్మన్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై రైల్వే బోర్డు స్పందించి, సంబంధిత అంశాలపై వివరమైన నోట్‌ను పంపింది. అనంతరం సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే అధికారులు కొత్త రైళ్లకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇందులో శివమొగ్గ, తిరుపతి మధ్య కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రత్యేకంగా పొందుపరిచారు.

ఈ నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి రైల్వే బోర్డు చైర్మన్‌, సిఈఓకు మరో లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మిగిలిన అవసరమైన ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఈ వందే భారత్‌ సేవను వీలైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు. శివమొగ్గ, తిరుపతి మధ్య వందే భారత్‌ సేవలు అందుబాటులోకి వస్తే తిరుపతి, శివమొగ్గతో పాటు బెంగళూరు ప్రాంతాల మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.

తిరుపతికి వచ్చే యాత్రికులతో పాటు విద్య, వైద్యం, ఉద్యోగం, ఇతర అవసరాల కోసం ప్రయాణించే ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. తిరుపతి ప్రాంత ప్రజలకు మెరుగైన రైల్వే సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర రైల్వే శాఖపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని, శివమొగ్గ, తిరుపతి వందే భారత్‌ ప్రతిపాదన త్వరగా కార్యరూపం దాల్చేలా తదుపరి చర్యలను వేగవంతం చేయాలని ఎంపీ గురుమూర్తి కోరారు.


Mana Tirupati Mana MP YSRCP Social Media YS Jagan Mohan Reddy YSRCP Anaparthy Assembly YSR Congress Party - YSRCP Maddila Gurumoorthy

Address

Tirupati

Telephone

+919010990075

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Tirupati Mana MP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share