Gemine vartha channel

Gemine vartha channel breaking news

*కూటమి సంవత్సర పాలన సక్సెస్-- కార్యకర్తల్లో...... 😔😔**టీడీపీ నేత R J వెంకటేష్ షాకింగ్ కామెంట్స్*
17/06/2025

*కూటమి సంవత్సర పాలన సక్సెస్-- కార్యకర్తల్లో...... 😔😔*

*టీడీపీ నేత R J వెంకటేష్ షాకింగ్ కామెంట్స్*

J VENKATESH

హక్కుల కోసం పోరాడిన కార్మికుల విజయగగీతిక...శ్రమజీవుల సంఘటిత శక్తికి ప్రతీక... మేడే.కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐*మీ....
01/05/2025

హక్కుల కోసం పోరాడిన కార్మికుల విజయగగీతిక...
శ్రమజీవుల సంఘటిత శక్తికి ప్రతీక... మేడే.
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐
*మీ.. గురజాల జగన్మోహన్ MLA చిత్తూరు*

హక్కుల కోసం పోరాడిన కార్మికుల విజయగగీతిక... శ్రమజీవుల సంఘటిత శక్తికి ప్రతీక... మేడే. కార్మిక దినోత్సవ శుభాకాంక్ష.....

*జగన్ ని నమ్మితే ఏమవుతుందో ప్రత్యేకంగా రుజువవుతోంది*
26/04/2025

*జగన్ ని నమ్మితే ఏమవుతుందో ప్రత్యేకంగా రుజువవుతోంది*

జగన్ ని నమ్ముకుంటే.. | YS Jagan Mohan Reddy | YSRCP | PSR Anjaneyulu | Andhra Pradesh ​ ​ ​ ​ ​ . ...

*స్వయంగా ఇంటింటికి వెళ్లి ఫింఛన్ అందించిన నారా చంద్రబాబు నాయుడు*https://youtu.be/--vVu9EUD0w?si=xSRlH2ND2E1j-5qF*రేవంత్ ...
01/04/2025

*స్వయంగా ఇంటింటికి వెళ్లి ఫింఛన్ అందించిన నారా చంద్రబాబు నాయుడు*
https://youtu.be/--vVu9EUD0w?si=xSRlH2ND2E1j-5qF
*రేవంత్ రెడ్డికి మెంటల్, అతను ఒక ఫ్రాడ్ సీఎం అన్న విద్యార్థి*
https://youtu.be/--vVu9EUD0w?si=xSRlH2ND2E1j-5qF
*స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది: సునీత విలియమ్స్*
https://youtu.be/--vVu9EUD0w?si=xSRlH2ND2E1j-5qF
*శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోస్తవాలు ఘనంగా జరగాలి: C K లావణ్య*
https://youtu.be/--vVu9EUD0w?si=xSRlH2ND2E1j-5qF
*మదనపల్లిలో ఘనంగా రాటకొండ మధుబాబు జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన పలువురు టీడీపీ నేతలు*
https://youtu.be/--vVu9EUD0w?si=xSRlH2ND2E1j-5qF
*పటాస్ సినిమా తరువాత మొదటి సారి బయటికి వచ్చానన్న సినీ హీరో కళ్యాణ్ రామ్*
https://youtu.be/--vVu9EUD0w?si=xSRlH2ND2E1j-5qF
*బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు*
https://youtu.be/--vVu9EUD0w?si=xSRlH2ND2E1j-5qF
*మడకశిర నియోజవర్గఅభివృద్దే మా లక్ష్యం: MLA ms రాజు*
https://youtu.be/--vVu9EUD0w?si=bSQnU94JwwLUNbRZ

gjm/ gurajalajaganmohan chittoor apcm

సర్వమానవ సమానత్వాన్ని సూచించేది ఇఫ్తారు విందు -- మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ -- మదనప...
29/03/2025

సర్వమానవ సమానత్వాన్ని సూచించేది ఇఫ్తారు విందు -- మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ -- మదనపల్లె టౌన్ ప్యారనగర్ సల్మాన్ పార్శి మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తారు విందుకు హజరైన నిస్సార్ అహమ్మద్

ఉపవాసాలు, ప్రార్థనలు, దాన,ధర్మాలతో పాటు నియమ నిష్టలతో రంజాన్ మాసం జరుపుకునే ముస్లింలకు సాయంత్ర సమయాలలో ఇచ్చే ఇఫ్తారు విందు సర్వమానవ సమానత్వాన్ని సూచిస్తుందని మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మదనపల్లె టౌన్ ప్యారనగర్ పార్శి మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తారు విందుకు నిస్సార్ అహమ్మద్ హాజరైనారు. ఈ సందర్భంగా స్దానిక ముస్లింతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం ఉపవాస దీక్షలో వున్న వారికి ఆహారం పంచిపెట్టారు. ‌ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ఆహార తీసుకుని రోజంతా మంచినీరు తీసుకోకుండా కూడా ఉపవాసం ఉంటారని, సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విరమించే సమయంలో ఇచ్చే ఇఫ్తారు విందుకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో ప్రత్యేకతో కూడుకున్నదని అన్నారు ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనేవి ఇస్లాం మతానికి మూలస్తంభాలు. ప్రతి ముస్లిం ఈ ఐదు సూత్రాలను రంజాన్ మాసంలో పాటించడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భర్త సలీం, ఎస్.ఎ.కరీముల్లా, యూనస్, నూర్ మొహిద్దీన్, తాజ్, షానవాజ్, జాబీ మరియు మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి- టిడిపి నాయకులు నాగూర్ వలి కితాబు- మండిపల్లి సోదరులకు జ...
19/03/2025

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి
- టిడిపి నాయకులు నాగూర్ వలి కితాబు
- మండిపల్లి సోదరులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షో ఆప్ శీనా
మదనపల్లె : అన్నమయ్య జిల్లాను రాష్ట్ర రోడ్డు రవాణా,యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మదనపల్లి పట్టణానికి చెందిన టిడిపి నాయకులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) కితాబునిచ్చారు.బుధవారం మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి,ఆయన సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు టిడిపి నాయకులు,కార్యకర్తలు సమక్షంలో ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా షో ఆప్ శీనా మండపల్లి సోదరులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ 15 సంవత్సరాల తర్వాత రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందంటే అది మండిపల్లె కుటుంబం గొప్పతనమన్నారు.మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో అయనకు మంచి సాన్నిహిత్యం ఉందని గుర్తుచేశారు.రాయచోటి నియోజకవర్గమే కాకుండా,జిల్లా ప్రజలతో మండిపల్లి కుటుంబానిది విడదీయరాని అనుబంధమన్నారు.అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల శ్రేయస్సు కోసం మంత్రి మండిపల్లి నిరంతరం పరితపిస్తుంటారని కొనియాడారు.మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు,యువ మంత్రి నారా లోకేష్ దృష్టిని ఆకర్షించారన్నారు.రామాయణంలో రాముడికి లక్ష్మణుడు సహాయ,సహకారాలు అందించాడని,అదే తరహాలోనే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి ఆయన సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి రాజకీయాల్లో అండగా నిలుస్తున్నాడని వివరించారు.ఆ భగవంతుడు ఆశీస్సులతో మండిపల్లి సోదరులు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

చేనేతలకు ఉచిత విద్యుత్ హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం- టిడిపి నాయకులు నాగూర్ వలి హర్షం మదనపల్లె : ఏపీలోని కూటమి ప్రభు...
19/03/2025

చేనేతలకు ఉచిత విద్యుత్ హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
- టిడిపి నాయకులు నాగూర్ వలి హర్షం
మదనపల్లె : ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని,మంత్రి మండలి సమావేశంలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు అందిస్తామని తీర్మానించడం శుభపరిణామమని అన్నమయ్య జిల్లా,మదనపల్లి పట్టణానికి చెందిన టిడిపి నాయకులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం సందర్భంగా చేనేత కార్మికులు అధికంగా ఉండే మదనపల్లి,మంగళగిరి ధర్మవరం ప్రాంతాల్లో చేనేతల సమావేశాలను ఏర్పాటు చేసి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారన్నారు.అదేవిధంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేనేత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.మంత్రి నారా లోకేష్ తన మాటలలో ఒక హామీ నెరవేర్చితే ఏదో నా బాధ్యత తీరిపోయినట్టు కాదు..భారం దించుకున్నట్టు కాదు..లక్షలాది బతుకులకు అది వెలుగు దారి కావాలనే నా ఆశయం నెరవేరుతుందనే ఆనందం ఇది.చేనేత మగ్గం ఉన్న కార్మికులకు 200 యూనిట్లు,పవర్ లూమ్ ఉన్నవారికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ప్రతిపాదనకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదముద్ర వేయడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది.అధికారంలోకి వచ్చిన 9 నెలలలోగానే నేను ఇచ్చిన మాటను మంత్రిమండలి కార్యరూపంలో పెట్టడం మా ఎన్డీఏ ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనమన్నారు.2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయాను.అయినా నియోజకవర్గాన్ని వీడిపోలేదు.ఆ రోజు నుంచి నియోజకవర్గంలో ప్రజల్లో ఒకడిగా మారాను.మంగళగిరిలో చేనేత కళాకారుల కుటుంబాలు చాలా ఎక్కువ.వారి ఇళ్లకు,పని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు అందమైన వస్త్రాలను నేసే వారి జీవితాలలో కష్టాలను చూశాను.యువగళం పాదయాత్రలో ధర్మవరం,వెంకటగిరి,మదనపల్లె చేనేతల సమస్యలు విన్నాను.రాష్ట్రవ్యాప్తంగా చేనేతలందరూ పడుతున్న ఇబ్బందులు కళ్లారా చూశాక చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చాను.మాట నిలబెట్టుకుని
చేనేతలకు చేదోడుగా నిలిచాం.‌నేను ఎక్కడికి వెళ్లినా..ఏ అతిథిని కలిసినా మంగళగిరి చేనేత కళాకారులు నేసిన శాలువాతోనే సత్కరిస్తాను.చేనేత వస్త్రాలకు విస్తృత మార్కెటింగ్ కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు.ఐటీ,మానవవనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

నిశ్వార్థ రాజకీయ నాయకుడు యువత అభ్యుదయమే ధ్యేయంగా టిడిపి ఆశయాలకు అనుగుణంగా సేవలు అందిస్తున్న రాష్ట్ర రవాణా, యువజన,క్రీడా ...
19/03/2025

నిశ్వార్థ రాజకీయ నాయకుడు యువత అభ్యుదయమే ధ్యేయంగా టిడిపి ఆశయాలకు అనుగుణంగా సేవలు అందిస్తున్న రాష్ట్ర రవాణా, యువజన,క్రీడా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 💐💐

*శుభాకాంక్షలకు ధన్యవాదాలు🙏 తెలిపిన శ్రీరామ్*మదనపల్లి :శనివారం తన జన్మదినం సందర్బంగా రాష్ట్రంలోని టీడీపి కుటుంబ సభ్యులు, ...
16/03/2025

*శుభాకాంక్షలకు ధన్యవాదాలు🙏 తెలిపిన శ్రీరామ్*

మదనపల్లి :

శనివారం తన జన్మదినం సందర్బంగా రాష్ట్రంలోని టీడీపి కుటుంబ సభ్యులు, తెలుగు యువత మరియు నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారని వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు అన్నారు. దూరప్రాంతాల్లో ఉన్నవారు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని, అయితే మదనపల్లిలో జరిగిన వేడుకల్లో ఉదయం నుండే ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కొందరి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేక పోయానని అందుకు క్షమించమని అడిగారు.తమ ఆధరాభిమానాలు కలకాలం నిలవాలని శ్రీరామ్ ఆకాక్షించారు.

" *న్యాయం లభించే వరకు పోరాటం కొనసాగుతుంది – వెటర్నరీ విద్యార్థుల నిరసన శబ్దం ప్రభుత్వం వినాలి!"* తేదీ: 15 మార్చి 2025📍 స...
15/03/2025

" *న్యాయం లభించే వరకు పోరాటం కొనసాగుతుంది – వెటర్నరీ విద్యార్థుల నిరసన శబ్దం ప్రభుత్వం వినాలి!"*

తేదీ: 15 మార్చి 2025
📍 స్థలం: తిరుపతి

ఆంధ్రప్రదేశ్‌లో వెటర్నరీ విద్యార్థుల స్టైఫెండ్ పెంపును డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె నేటితో 41వ రోజుకు, అలాగే రిలే నిరాహార దీక్ష 37వ రోజుకు చేరుకుంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదని విద్యార్థులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు, వెటర్నరీ విద్యార్థులందరూ గవర్నర్ గారి అపాయింట్మెంట్ కోరుతూ గవర్నర్ గారికీ, గవర్నర్ సెక్రటరీ గారికీ పెద్ద ఎత్తున మెయిల్స్ పంపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఏటా కేవలం రూ.8 కోట్లు వెచ్చిస్తేనే వెటర్నరీ విద్యార్థుల స్టైఫెండ్ పెంపు సాధ్యపడుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలియజేశారు. ఇతర కోర్సుల విద్యార్థులకు మెరుగైన స్టైఫెండ్ అందిస్తున్నప్పటికీ, 13 ఏళ్లుగా వెటర్నరీ విద్యార్థుల స్టైఫెండ్ పెంచకపోవడం తీవ్ర అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు నారా లోకేష్ గారు, అచ్చం నాయుడు గారిని ఇప్పటికే విద్యార్థుల ప్రతినిధులు పలుమార్లు కలిసి సమస్యను వివరించారు. అయినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడం నిరాశను కలిగిస్తోంది.

వెటర్నరీ విద్యార్థుల ఆక్రోశం సమాజం వినాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. సమానత్వం, గౌరవం, న్యాయం లభించే వరకు ఈ ఉద్యమం ఆగదని విద్యార్థులు స్పష్టం చేశారు. త్వరలోనే సమ్మెను మరింత ఉధృతం చేయనున్నట్లు వారు ప్రకటించారు.

*తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడి జన్మదిన వేడుకను జయప్రదం చేయండి*🙏రేపు అనగా 15/03/25శనివారం ఉదయం 10.30 నిమిషాలకు తెలుగు యు...
14/03/2025

*తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడి జన్మదిన వేడుకను జయప్రదం చేయండి*🙏

రేపు అనగా 15/03/25
శనివారం ఉదయం 10.30 నిమిషాలకు
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు *శ్రీరామ్ చినబాబు* జన్మదిన సందర్బంగా నీరుగట్టువారిపల్లి శ్రీరామ్ చినబాబు నివాసం నందు *రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి యలగిరి దొరస్వామి నాయుడు* ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు తెలుగు యువత సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని దొరస్వామి నాయుడు తెలిపారు.

Address

5-23, Sivsjothi Nagar
Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when Gemine vartha channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category