30/08/2026
చాలా మంది కి వేళకి వాళ్ళ ఆర్డర్స్ చేసిన పుస్తకాలు వాళ్లకి ఇంకా చేరకపోవడానికి బలమైన కారణం ఉంది. పాఠకుడు అన్యధా భావించకుండా సమస్యని అర్థం చేసుకుంటారని ఈ పోస్ట్ పెడుతున్నాను.ఈ ఫోటో లో కనపడుతున్న పార్సెల్స్ దాదాపు వంద వరకు డెలివరీ కాకుండా గమ్యానికి చేరుకోవడానికి ఎదురు చూపులు చూస్తున్నవి. ఆగష్టు ఫస్ట్ నుంచి డిపార్ట్మెంట్ పార్సెల్ రేట్స్ సడన్ గా పెంచేసింది నలభైల నుంచి డెబ్బైలకి కి రేట్లు పెంచేసింది దాని వలన నాలాంటి ఇండిపెండెంట్ పబ్లిషర్స్ కి చాలా చాలా ఇబ్బంది అయ్యింది బుక్ రీడర్స్ దగ్గిర పార్సెల్ ఛార్జర్స్ యాభై రూపాయలు తీసుకునే నేను బుక్ రీడర్స్ దగ్గిర డెభైల రూపాయలు పార్సెల్ చార్జెస్ తీసుకోవడానికి మొహమాటం పడి తక్కువ డబ్బులు తీసుకోవడం తో అసలైన ఇబ్బందులు మొదలైంది.కొంత మంది బుక్ రీడర్స్ యాభై రూపాయల కంటే పార్సెల్ చార్జెస్ ఇవ్వరు తిరిగి విషయం అర్థమయేలా చెప్తే మా ఆర్డర్ కాన్సుల్ చెసిండబ్బు వెనక్కి పంపేయండి కొందరు అంటారు తిరిగి పంపేద్దామనుకుంటే ఫోన్ పే , గూగుల్ పే నాకు అవుట్ గోయింగ్ పనిచేయదు దానికో పెద్ద కథ ఉంది. బ్యాంకు వాడిని అడిగితే మాకు సంబంధం లేదు అంటారు , యూపీఐ వాళ్లకి కంప్లైంట్ చేస్తే మా వైపు కరెక్ట్ గా వుంది మీకే ఏదో సాఫ్ట్ వేర్ ప్రాబ్లెమ్ ఉందని చెప్తాడు. ఈ విషయం బుక్ రీడర్స్ కి చెప్తే వెటకారంగా నవ్వుతాడు అవుట్ గోయింగ్ లేకపోవడం ఏంటి ? అని సందేహం గా చూస్తాడు మాట్లాడుతాడు. నా పరిస్థితి ముందు చూస్తే నుయ్య , వెనక చూస్తే గొయ్య అన్నట్లు ఉంటుంది. ప్రాబ్లెమ్ మాత్రం గత ఐదు సంవత్సరాలు గా అలానే ఉంది ప్రతి దానికి బ్యాంకు , ఎటిఎం పై ఆధారపడవలసి వస్తోంది. పోస్టల్ చార్జెస్ పెంచడం వలన దాదాపు గా పార్సెల్స్ అదనపు ఖర్చు నా సొంత డబ్బులు పెట్టుకొని పంపేసాను ఇంకా చాలా మిగిలి ఉన్నాయి అవి ఇంకో రెండు రోజుల్లో డిస్పాచ్ చేస్తాను దయచేసి ఓపిక పట్టండి అర్థం చేసుకుంటారని ఈ పోస్ట్ పెడుతున్నాను. 📚📙🙏🏽