Tirumala Connect

Tirumala Connect Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tirumala Connect, Media/News Company, Tirupati.

TRAIL-RUN GARUDA SEVA ON AUGUST 28 _ ఆగస్టు 28న తిరుమ‌ల‌లో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవతిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర...
28/08/2026

TRAIL-RUN GARUDA SEVA ON AUGUST 28 _ ఆగస్టు 28న తిరుమ‌ల‌లో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ
తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున‌ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గ‌రుడ‌వాహ‌నంపై శుక్రవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు.

సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భ‌క్తుల‌కు కల్పిస్తున్న సౌక‌ర్యాలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించ‌నున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

టీటీడీ ఆసుపత్రుల్లో  మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. స్విమ్స్ నూతన ...
28/08/2026

టీటీడీ ఆసుపత్రుల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. స్విమ్స్ నూతన డైరెక్టర్ గా నియమితులైన డాక్టర్ జగదీష్ గురువారం ఉదయం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ ను చైర్మన్ అభినందించారు.

అనంతరం చైర్మన్ విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్విమ్స్ హాస్పిటల్ కు డాక్టర్ జగదీష్ ను డైరెక్టర్ గా నియమించడం జరిగిందన్నారు. చాలా అనుభవజ్ఞులైన, గొప్ప పేరు, దూరదృష్టి గల వైద్యులైన డాక్టర్ జగదీష్ నేతృత్వంలో స్విమ్స్ ఆసుపత్రిలో అత్యున్నతమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.

స్విమ్స్‌ ఆసుపత్రిని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, త్వరలో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు.

స్విమ్స్ నూతన డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సంకల్పం మేరకు, చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ రవిచంద్ర సూచనలు ప్రకారం స్విమ్స్ ఆసుపత్రిని ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

తిరుపతిని ఇంటిగ్రేటెడ్ మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తామని, స్విమ్స్ ఆసుపత్రిలో వైద్యంపై రోగుల్లో నమ్మకం కలగించి ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యం అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవలను మరింత విస్తరించి పేదరోగులకు ఆర్థిక భారం తగ్గిస్తామని తెలియజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

28/08/2026

Present Situation at Triumala | Darshan Timings | Accommodation Status Live | Tirumala Connect

🙏🙏🙏Om Namo Venkateshaya...!!!🙏🙏🙏Today Present Situation at Tirumala...🙏🙏🙏
28/08/2026

🙏🙏🙏Om Namo Venkateshaya...!!!🙏🙏🙏
Today Present Situation at Tirumala...🙏🙏🙏

SSD 10K & DD 2K Tokens Issue Started @ 1.00 amSSD Tokens – Current StatusQuota Completed @ 03:25am*Srivari Mettu Divya D...
28/08/2026

SSD 10K & DD 2K Tokens Issue Started @ 1.00 am

SSD Tokens – Current Status

Quota Completed @ 03:25am

*Srivari Mettu Divya Darshan Tokens status

Quota completed @ 04:20am

SSD tokens కోసం శుక్రవారం  12am తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు శనివారం దర్శనం కోసం….టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు: శ్రీనివాసం కాంప...
27/08/2026

SSD tokens కోసం శుక్రవారం 12am తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు శనివారం దర్శనం కోసం….
టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు:
శ్రీనివాసం కాంప్లెక్స్- బస్టాండ్ ఎదురుగా
విష్ణు నివాసం- రైల్వే స్టేషన్ ఎదురుగా
భూదేవి కాంప్లెక్స్- అలిపిరి వద్ద బాలాజీ బస్టాండ్ లోపల
శ్రీవారి మెట్టు టోకెన్స్: భూదేవి కాంప్లెక్స్ లో

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దుసెప్టెంబర్ 15 నుండి 23 వ తేది వరకు తిరుమలలో శ్రీవారి ...
27/08/2026

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు
సెప్టెంబర్ 15 నుండి 23 వ తేది వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ 9 రోజుల పాటు ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది.

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది.

ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

ఆగస్టు 28న తిరుమ‌ల‌లో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవతిరుమల,ఆగస్ట్ 27:తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున‌ మాదిరి బ్...
27/08/2026

ఆగస్టు 28న తిరుమ‌ల‌లో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

తిరుమల,ఆగస్ట్ 27:
తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున‌ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గ‌రుడ‌వాహ‌నంపై శుక్రవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు.
సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భ‌క్తుల‌కు కల్పిస్తున్న సౌక‌ర్యాలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించ‌నున్నారు......

27/08/2026

Today SSD tokens starts 1:30 AM, Present Situation at Tirumala

Angapradakshinam Tickets Update...
27/08/2026

Angapradakshinam Tickets Update...

Address

Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when Tirumala Connect posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share