13/06/2025
మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయ ల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ఎనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమానంలో ఉన్నవారిలో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. ఎయిరిండియా ఈ మేరకు ధ్రువీకరించింది. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీ యులు కాగా 53 మంది బ్రిటన్ వాసులు, ఏడుగురు పోర్చుగల్్వసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది. ఉన్నారు. బ్రిటన్ లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లిం ది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంస మయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలం టుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెం ట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్వాసుల్లో కూడా పలువురు ప్రమాదం లో గాయపడ్డారు. వారిలో కనీసం 24 మంది మర ణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. “60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయప డ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాల య్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది" అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసి యేషన్ పేర్కొంది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో మృ తుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. ఇద్దరు ఎంబీ బీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షీ పారిఖ్
వెల్లడించారు. విమాన శకలాలు, ధ్వంసమై కాలిపో యిన భవనాలు, కార్లు, చెట్లు తదితరాలతో ప్రమా దస్థలి భీతావహంగా మారింది. విమానాశ్రయ అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్. సైనిక, స్థానిక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి దాదాపుగా విమానంలోని వారంతా కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యారు. వారిని బయటికి తీసి ఆ ప్రాంగణంలోనే ఉన్న సిటీ సివిల్ ఆస్పత్రికి తర లించారు. ఈ దారుణంపై భారత్తో తో పాటు ప్రపం చ దేశాలన్నీ దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బ్రిటన్ రాజు చార్లెస్-3, ప్రధాని యిర్ స్టార్మర్,పలువురు దేశాధినేతలు, రాజకీయ తదితర రం గాల ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. జరిగిం ది మాటలకందని దారుణమని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించనున్నారు
పైలట్ 'మే డే' అలర్ట్
విమానం మధ్యాహ్నం 1.39కి టేకాఫ్ అయింది. 600 అడుగుల పై చిలుకు ఎత్తుకు వెళ్లిందో లేదో సమస్య తలెత్తింది. దాంతో మరింత పైకి వెళ్లాల్సిన విమానం కాస్తా కిందకు రాసాగింది. అప్పటికింకా కనీసం లాండింగ్ గేర్ కూడా పూర్తిస్థాయిలో మూసుకోలేదు! దాంతో తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తూ పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రో లక్కు 'మే డే' కాల్ చేశారు. "ఏటీసీ తక్షణం స్పందిం చి తిరిగి కాల్ చేసినా అప్పటికే పరిస్థితి చేయి దాటి పోయింది. పైలట్ నుంచి ఎలాంటి స్పందనా రాలే దు" అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. చుట్టుపక్కల వాళ్లంతా చూస్తుండగానే క్షణాల్లో ఘోరం జరిగిపో యింది. ప్రమాదం తాలూకు వీడియో ప్రపంచవ్యా ప్తంగా వైరలైంది. విమానం తాలూకు జంట ఇంజ న్లలో టేకాఫ్కు అవసరమైన పూర్తిస్థాయి థ్రస్ట్ లోపించడమే ప్రమాదానికి కారణమని వైమానిక నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఇంజన్లను పక్షులు ఢీకొట్టి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్ర యంలో కార్యకలాపాలు సాయంత్రం దాకా నిలి చిపోయాయి. "విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెడికల్ కాలేజీలో డాక్టర్లు, సర్సింగ్ సిబ్బంది నివాస క్వార్టర్లపై కూలిపోయింది. వాటికి మంటలు అంటుకుని లోపలున్న చాలామంది గాయపడ్డారు" అని ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు.
Source: Sakshi epapar