Mana Atmakur

Mana Atmakur Local News Page
(1)

08/02/2025

శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నందికొట్కూరు - ఆత్మకూరు - దోర్నాల రహదారిలో ఆంక్షలు.

15/01/2025

శ్రీశైలం ఘాట్లో పల్టీలు కొట్టిన కారు

శ్రీశైలం ఘాట్ రోడ్లో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాజమండ్రి, జంగారెడ్డిగూడెంకు చెందిన 5 మంది భక్తులు శ్రీశైలం వస్తుండగా, కారు అదుపుతప్పి 2 పల్టీలు కొట్టి పక్కనే ఉన్న చెట్లల్లోకి దూసుకెళ్లింది. ఇష్టకామేశ్వరి ఆలయ ప్రవేశం గేటు సమీపంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

13/01/2025

పాములపాడులోని రెడిమెడ్ బట్టల దుకాణంలో చోరి

బస్టాండ్ స్టాండ్ సమీపంలోని ఓ రెడీమెడ్ బట్టల దుకాణంలో సుమారు 20 వేల విలువ గల దుస్తులను చోరి చేసిన నలుగురు మహిళలు..

షాప్ లో వున్న గుమస్తాను ఏమర్చి దుకాణంలో దొంగతనం చేసిన మహిళలు... సీసీ కెమెరాలో దొంగ తనం దృశ్యాలు నమోదు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

11/01/2025

వెంకటాపురం వద్ద కన్నడ భక్తులను అడ్డుకున్న అటవీ అధికారులు.

🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊ప్రియమైన శ్రేయోభిలాషులందరికీ దీపావళీ శుభాకాంక్షలతో...🎆🎇🎆🎇🎆🎇🎆🎇🎆🎇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
29/10/2024

🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
ప్రియమైన శ్రేయోభిలాషులందరికీ దీపావళీ శుభాకాంక్షలతో...
🎆🎇🎆🎇🎆🎇🎆🎇🎆🎇
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

29/08/2024
22/08/2024

సైకో శేషమ్మ..! ఆత్మకూరులో అంగన్వాడీ ఆయా దాష్టీకం...

28/07/2024

ఈ నెల 30వ తేది అనగా మంగళవారం ఉదయం 11:00 గంటలకు శ్రీశైలం డ్యాం ద్వారా 5 లేదా 6 గేట్ల తీసి నీటిని దిగువకు విడుదల చేయనున్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి.


నంద్యాల జిల్లా ( ఆత్మకూరు ) ఆత్మకూరు మండలం రాదాపురం సమీపంలో పోలీసు వాహనాన్ని ఢీ కొన్న ట్రాక్టర్,లక్ష్మణ్ అనే కానిస్టేబుల...
22/06/2024

నంద్యాల జిల్లా ( ఆత్మకూరు )

ఆత్మకూరు మండలం రాదాపురం సమీపంలో పోలీసు వాహనాన్ని ఢీ కొన్న ట్రాక్టర్,

లక్ష్మణ్ అనే కానిస్టేబుల్ కు తీవ్రగాయలు, స్వల్ప గాయాలతో బయటపడ్డ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు

ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స

నంద్యాల జూన్ 22:2023 బ్యాచ్ కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌ ల బృందం బైర్లూటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో పర్యటించింది. శనివారం ఏపీ ద...
22/06/2024

నంద్యాల జూన్ 22:2023 బ్యాచ్ కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌ ల బృందం బైర్లూటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో పర్యటించింది. శనివారం ఏపీ దర్శన్ ప్రోగ్రామ్ కింద నాగార్జునసాగర్ శ్రీశైలం - పులుల అభయారణ్యంపై ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసేందుకు ట్రైనీ ఐఏఎస్‌ ల బృంద అధికారులైన సిహెచ్ కళ్యాణి, హిమవంశీ, ఎస్.జగన్నాథ్, వినూత్న, భావన, శుభం నోకల్ తదితరులు బైర్లూటి నల్లమల్ల అడవుల్లో పర్యటించి ప్రాజెక్టు రిపోర్టుకు అవసరమైన వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డిలు ట్రైనీ ఐఏఎస్‌ ల బృందాన్ని కలిసి జిల్లా అడ్మినిస్ట్రేషన్, నైసర్గిక స్వరూపము, అటవీ విస్తీర్ణం తదితర అంశాలపై వివరించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవీంద్రనాథరెడ్డి చెంచుగూడెంలలో నివసిస్తున్న గిరిజనుల జీవన విధానం, అటవీ ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ట్రైనీ ఐఏఎస్‌ ల బృందానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు గుర్తుగా నంది విగ్రహ జ్ఞాపికలను అందచేశారు. అనంతరం చెంచుగూడెంలలో నివసిస్తున్న గిరిజనులతో ట్రైనీ ఐఏఎస్‌ ల బృంద అధికారులు ముచ్చటించి ప్రాజెక్ట్ రిపోర్టుకు అవసరమైన వివరాలు సేకరించారు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Atmakur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share