11/12/2025
సరికొత్త ఆవిష్కరణలకు పర్యాటక శాఖ నాంది
వినూత్న ఆలోచనలు, 16 నెలల కాలంలో దాదాపు 30,000 పర్యాటక పెట్టుబడులతో ప్రగతికి చిరునామాగా నిలిచిన పర్యాటక శాఖ
ఇప్పటివరకు 27 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ అనుమతులు జారీ.. వీటిలో ప్రారంభానికి సిద్ధంగా 3 ప్రాజెక్టులు ... పురోగతిలో 12 ప్రాజెక్టులు.. శంకుస్థాపనకు సిద్ధంగా 5 ప్రాజెక్టులు.. 7 ప్రాజెక్టులకు భూ కేటాయింపులు పూర్తి.. వీటన్నింటి ద్వారా పర్యాటకులకు అందుబాటులోకి 4597 రూమ్స్..
2025-26లో దేశవ్యాప్తంగా 11,272 రూమ్స్ ఏర్పాటైతే మూడింట ఒక వంతు హోటళ్లు ఏపీలోనే ఏర్పాటు కావడం కూటమి ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనం
రాష్ట్ర విభజన తర్వాత కూటమి ప్రభుత్వ హయాంలో 8 పర్యాటక గమ్యస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నుండి అత్యధికంగా రూ.428 కోట్ల నిధులు రాబట్టిన పర్యాటక శాఖ
టూరిజం పాలసీతో ఇన్వెస్టర్ల ఆకర్షణ..పాలసీ ఆపరేషనల్ గైడ్ లైన్స్ తో దిశానిర్దేశం.. పారిశ్రామిక హోదాతో పర్యాటక రంగానికి ఊతం
అడ్వెంచర్ స్పోర్ట్స్ గైడ్ లైన్స్, హోమ్ స్టే మరియు బ్రెడ్, బ్రేక్ ఫాస్ట్, ఉపాధి, క్యారవాన్, ల్యాండ్ అలాట్ మెంట్ తదితర పాలసీ-2025 లతో వినూత్న ఆవిష్కరణలకు నాంది
త్వరలోనే కాంక్రీట్, చారిత్రక కట్టడాలు, మైస్, బీచ్ శాక్ , ఫిల్మ్ టూరిజం పాలసీతో పర్యాటక శాఖలో నూతనోత్తేజం
మిషన్ -2029కి అనుగుణంగా ఆర్థిక వృద్ధి, ఉపాధి, సాంస్కృతిక మార్పిడికి కీలకమైన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట, అధికారులు
రాష్ట్రంలో 50,000 గదుల ఏర్పాటు, 10,000 హోమ్ స్టే లు, 20 శాతం జీవీఏ సాధన, 15 శాతం ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్న పర్యాటక శాఖ టీమ్.. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా 4500 నుండి 20 వేలకు పైగా క్లాసిఫైడ్ రూమ్స్ ఏర్పాటుకు చర్యలు
ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, క్లాసిఫైడ్ రూమ్స్ ఏర్పాటు, తలసరి ఆదాయానికి పర్యాటక శాఖ నుండి ఆర్థిక సహకారం అందించడం, ఉపాధి కల్పన, సమాజ భాగస్వామ్యంతో సుస్థిర, బాధ్యతాయుతమైన పర్యాటకం దిశగా అడుగులు వేస్తోన్న పర్యాటక శాఖ
అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఏపీ పర్యాటక రంగానికి సరికొత్త జవసత్వాలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, నూతన పర్యాటక పాలసీ 2024-29 విడుదల చేయడం దానికి అనుబంధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ గైడ్ లైన్స్, హోమ్ స్టే మరియు బ్రెడ్, బ్రేక్ ఫాస్ట్, ఉపాధి, క్యారవాన్, ల్యాండ్ అలాట్ మెంట్ తదితర పాలసీ-2025 లతో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికిన పర్యాటక శాఖ అనతి కాలంలోనే అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేసింది. పీపీపీ విధానంలో ముందుకు వెళ్తోన్న పర్యాటక శాఖ వందలాది మంది ఇన్వెస్టర్లను ఆకర్షించి వారి నమ్మకాన్ని పొందింది. పాలసీ ఆపరేషనల్ గైడ్ లైన్స్ తో ఎప్పటికప్పుడు పర్యాటక పెట్టుబడిదారులకు దిశానిర్దేశం చేస్తోంది. త్వరితగతిన ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేస్తోంది. అదే విధంగా ఐదేళ్ల కాలంలో 25,000 పర్యాటక పెట్టుబడులు లక్ష్యంగా నిర్దేశించుకున్న పర్యాటక శాఖ కేవలం ఏడాదిన్నర కాలంలోనే 30,000 కు పైగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించింది. రాష్ట్రంలో 50,000 గదుల ఏర్పాటు, 10,000 హోమ్ స్టే లు, 20 శాతం జీవీఏ సాధన, 15 శాతం ఉద్యోగాల కల్పన, పర్యాటకులు చేసే ఖర్చు 1700 నుండి 25000 కు పెంచేలా, పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువ రోజులు గడిపేలా అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్న పర్యాటక శాఖ టీమ్ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా 4500 నుండి 20 వేలకు పైగా క్లాసిఫైడ్ రూమ్స్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, క్లాసిఫైడ్ రూమ్స్ ఏర్పాటు, తలసరి ఆదాయానికి పర్యాటక శాఖ నుండి ఆర్థిక సహకారం అందించడం, ఉపాధి కల్పన, సమాజ భాగస్వామ్యంతో సుస్థిర, బాధ్యతాయుతమైన పర్యాటకం దిశగా పర్యాటక శాఖ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలకు సరికొత్త రూపుతెస్తూ అవకాశాలను అందిపుచ్చుకొని స్థానిక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తూ వేలాది మంది యువతకి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధికి మార్గం చూపిస్తోంది. త్వరలోనే కాంక్రీట్, చారిత్రక కట్టడాలు, మైస్, బీచ్ శాక్ , ఫిల్మ్ టూరిజం పాలసీతో పర్యాటక శాఖలో మరింత నూతనోత్తేజం సంతరించుకోనుంది. ఇప్పటివరకు 27 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ అనుమతులు లభించగా వీటిలో 3 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పురోగతిలో 12, శంకుస్థాపనకు సిద్ధంగా 5, 7 ప్రాజెక్టులకు భూ కేటాయింపులు పూర్తి అయ్యాయి. ఈ నిర్మాణాలన్నీ పూర్తయితే పర్యాటకులకు 4597 రూమ్స్ అందుబాటులోకి రానున్నాయి. 2025-26లో దేశవ్యాప్తంగా 11,272 రూమ్స్ ఏర్పాటైతే మూడింట ఒక వంతు హోటళ్లు ఏపీలోనే ఏర్పాటు కావడం కూటమి ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనం. రాష్ట్ర విభజన తర్వాత కూటమి ప్రభుత్వ హయాంలో 8 పర్యాటక గమ్యస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నుండి అత్యధికంగా రూ.428 కోట్ల నిధులను పర్యాటక శాఖ రాబట్టి సీఎం చంద్రబాబునాయుడు విశ్వాసాన్ని గెలిచింది. అందులో అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్, అహోబిలం, నాగార్జున సాగర్, అరకు, అన్నవరం, సింహాచలం తదితర ప్రాంతాల్లో చేపట్టిన పర్యాటక ప్రాజెక్టుల పనులు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మిషన్ -2029కి అనుగుణంగా ఆర్థిక వృద్ధి, ఉపాధి, సాంస్కృతిక మార్పిడికి కీలకమైన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్న పర్యాటక శాఖ మంత్రి మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాటలు నిత్యం అంతర్జాతీయ, జాతీయ, క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పనుల తీరుని పర్యవేక్షిస్తూ తదనుగుణంగా అధికారులకు మార్గదర్శకత్వం అందిస్తూ పర్యాటక శాఖ పురోగతికి ఇంధనంగా, పర్యాటక శాఖ ప్రగతికి చిరునామాగా నిలిచారు. త్వరలోనే పర్యాటక రంగం సరికొత్త పుంతలు తొక్కి ఏపీ ప్రపంచ పర్యాటక గమ్యస్థానాల్లో అగ్రగామిగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు..