NDN News

NDN News NEWS CHANNEL

29/07/2025

తిరుమల శ్రీవారికి భారీ విరాళం..
రెండున్నర కోట్ల రూపాయల శంఖు చక్రాలు..!
=====================
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సుమారు 2.4 కోట్ల విలువ గల బంగారు శంఖం, చక్రాన్ని విరాళంగా సమర్పించారు. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్‌ ప్రైజెస్ ప్రతినిధులు ఈ ఉదయం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపం వద్ద సుమారు 2.5 కిలోల బరువుతో కూడిన శంఖం, చక్రాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం అదనపు ఈవో దాతలను శేషవస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి భక్తులు అందించిన బంగారు శంఖం, చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

29/07/2025

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో
మహాకుంభాభిషేక మహోత్సవం..!
====================
నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మహాకుంభాభిషేక మహోత్సవం వేడుకగా ప్రారంభమైంది. దేవస్థానం, విమాన గోపురం, జీవధ్వజ, నవగ్రహ మంటప పునః ప్రతిష్ట కార్యక్రమాలు జరుగనున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటుగా ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ సిబ్బంది తెలిపారు.

29/07/2025

జగన్ పర్యటనలో ఆంక్షలు..
తేడా వస్తే కేసులు తప్పవంటున్న పోలీసులు..!
============================
వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ పర్యటన వివరాలను ఇంఛార్జి ఎస్పీ దామోదర్ మీడియాకు తెలిపారు. జగన్ హెలిప్యాడ్ వద్దకు కేవలం పది మందికి మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు. అక్కడి నుంచి జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని జగన్ పరామర్శిస్తారని.. జైలు లోపలికి వెళ్లేందుకు కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. ఆ తర్వాత సుజాతమ్మ కాలనీలోని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి జగన్ వెళ్లి పరామర్శలో పాల్గొంటారని చెప్పారు. వైసీపీ నేతలు ఎటువంటి జనసమీకరణ చేయకూడదని ఆదేశించామని పేర్కొన్నారు. జగన్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నామన్నారు. ర్యాలీలకు అనుమతి లేదని.. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు.

29/07/2025

కనుపర్తిపాడు సుబ్రమణ్యస్వామి ఆలయంలో..
నాగ పంచమి పూజలు..!
==================
కనుపర్తిపాడులోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది. నాగపంచమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. నాగశిలలకు పాలతో అభిషేకాలు చేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

29/07/2025

శ్రీకాళహస్తి ఆలయంలో..
భారీ నాగు పాము.. దేనికి సంకేతం..?
======================
తిరుపతి జిల్లాలోని పవిత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చాలా మంది భక్తులు రాహు, కేతు దోషాలకు పూజలు చేయించుకుంటారు. ముఖ్యంగా ఇక్కడకు వచ్చి రాహు, కేతు దోషాలకు నివారణ పూజలు చేయించుకుంటే వెంటనే దాని రిజల్ట్ పాజిటివ్ గా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ కాళ హస్తిశ్వర స్వామి అంటే.. శివుడితో పాటు, అక్కడ సుబ్రహ్మణ్యుడు యదార్థంగా వెలిశారని భక్తులు నమ్ముతుంటారు. ఇలాంటి పవిత్రమైన ఆలయంలో రాహు కేతు దోషాల కోసం భక్తులు పూజలు చేసుకుంటుండగా.. ఓ భారీ సర్పం ప్రత్యక్షమైంది.

29/07/2025

జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థకు..
చవటపాలెంలో భూమిపూజ..!
======================
భారతదేశంలోనే ఆరవ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ NCERT ప్రాంతీయ కేంద్రం నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కానుంది. 936 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ సంస్థకి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. వెంకటాచలం మండలం, చవటపాలెం వద్ద 2016 డిసెంబరు 27న ఈ సంస్థ ఏర్పాటుకు అప్పటి ఉప రాష్ట్రపతి ముప్పవారపు వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ శంకుస్థాపన చేశారు. నిధులు కేటాయింపులో జాప్యం మరి ఇతర కారణాలతో కార్యరూపం దాల్చలేదు. అయితే సంవత్సరం కిందట వెంకయ్య నాయుడు చొరవతో మళ్లీ జాతీయ అధికారులు, మరోసారి భూమిని పరిశీలించి రైతులకు పరిహారం అందించారు. ఇప్పుడు ఆ సంస్థ ఏర్పాటుకు ప్రిన్సిపల్ రమేష్ బాబు, లక్ష్మీ నరసింహ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ సంస్థను 50 ఎకరాల స్థలంలో 936 కోట్లతో సంస్థ ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతగా 347 కోట్లతో భవనాల నిర్మాణం అందులో అకాడమిక్ భవనాలు, అడ్మినిస్ట్రేటివ్ భవనాలు, ఆడిటోరియం, గ్రంథాలయం, ల్యాబ్ లు వంటివి పూర్తి చేస్తారు. ఈ పనులను ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించి 30 నెలల కాలవ్యవధిలో పూర్తి చేస్తారు. ఈ సంస్థకు అనుబంధంగా నాలుగు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులు శిక్షణ పొందుతారు. ఈ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల స్థానికులకు పాక్షికంగానూ, పరోక్షంగాను 400 మంది వరకు ఉపాధి పొందుతారని ప్రిన్సిపల్ రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు (OSD), ప్రిన్సిపల్, లక్ష్మీనారాయణ అసిస్టెంట్ ప్రొఫెసర్, నాలుగు రాష్ట్రాలకు చెందిన శిక్షణ పొందుతున్న అధికారులు, స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు.

29/07/2025

సింగపూర్ లో వీడియో జర్నలిస్ట్ గా..
మారిపోయిన మంత్రి నారాయణ..!
===================
ఏపీ మంత్రి నారాయణ వీడియో జర్నలిస్ట్ గా మారారు. సింగపూర్ లో సీఎం చంద్రబాబుతో కలిసి పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ.. అమరావతి నిర్మాణానికి సంబంధించి సుస్థిర పట్టణాభివృద్ధికి ఉపయోగపడే పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. వాటిపై అధ్యయనం చేస్తూ.. వీడియోలను కూడా ఆయనే స్వయంగా తీసుకుంటున్నారు. సింగపూర్ లోని పుంగోల్ పాయింట్ కేవ్ టౌన్ షిప్ పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్ట్ ను సందర్శించారు. పుంగోల్ పాయింట్ కేవ్ సింగపూర్ లోని మొట్ట మొదటి ఎకో టౌన్ సముద్ర తీరం, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ మొబిలిటీ, కమ్యూనిటీ కేంద్రీకృతంగా నిర్మించిన హౌసింగ్ ప్రాజెక్ట్ ను స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. భవిష్యత్తులో అమరావతి స్మార్ట్ సిటీలో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ అభివృద్ధికి, వాతావరణ అనుగుణమైన ఇళ్ల నిర్మాణాలు, స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ కు సంబంధించి అధ్యయనం చేశారు.

29/07/2025

తిరుమల శ్రీవారి ఆశీస్సులతో
నిసర్ ఉపగ్రహ ప్రయోగం రేపు సాయంత్రమే..
=====================///
తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ బృందం దర్శించుకుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఇస్రో సంయుక్తంగా తయారుచేసిన నిసర్ ఉపగ్రహాన్ని 30 వతేది ప్రయోగించనున్న సందర్భంగా , శాస్త్రవేత్తలు స్వామివారిని దర్శించుకున్నారు. ఇస్రో నుంచి ఎప్పుడు ఉపగ్రహ ప్రయోగాలు జరిగినా తిరుమల స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. నిసర్ ఉపగ్రహంలో రెండు ముఖ్యమైన పేలోడ్స్ ఉంటాయి. ఈ శాటిలైట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. జీఎస్ఎల్వీ మార్క్-2 రాకేష్ ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. 30 వతేది సాయంత్రం 5.40 నిమిషాలకు ఈ ప్రయోగం జరగనుంది భూ ఉపరితలం పరిశీలన, ఉపద్రవాల హెచ్చరికలు, అనేక రకాలుగా ఈ శాటిలైట్ ఉపయోగపడనుంది .12 రోజుల్లో భూమి మొత్తము చుట్టేస్తుంది.. శాటిలైట్ ద్వారా వచ్చే డేటా ను గ్లోబల్ కమ్యూనిటీ వెల్ఫేర్ కు ఉపయోగపడుతుందని తెలిపారు.

29/07/2025

నెల్లూరు రూరల్ లో అభివృద్ధి పరుగులు
ప్రజలు కూడా ప్రగతి పధంలో భాగస్వాములు కావాలి
==========================///
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్, బ్యాంక్ కాలనీలో 15లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 23వ డివిజన్ అభివృద్ధికి 4.80 కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. .23వ డివిజన్ పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్న ప్రాంతమని . డివిజన్ ను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సి.ఎం. కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడికక్కడ ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దుద్దుగుంట (ఒరిస్సా) శ్రీనివాసులు రెడ్డి, కో క్లస్టర్ ఇంచార్జ్ రాఘవేంద్ర రావు, 23వ డివిజన్ టిడిపి అధ్యక్షులు మేకల మధు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, టిడిపి నాయకులు పుల్లారెడ్డి, పామూరు సుధాకర్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, చల్లా సుబ్బన్న, మల్లికార్జున్ రెడ్డి, బాబ్జి, శివయ్య, మురళి రెడ్డి, పామూరు శ్రీనివాసలురెడ్డి, చిన్న మల్లికార్జున, అంకయ్య, శివ, వెంకటేశ్వర్లు, మోడేపల్లి శివ, మమతారెడ్డి, మాధవి మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

29/07/2025

జగన్ ములాఖత్ ,పరామర్శ యాత్ర
విజయవంతం చెయ్యండి , నేతల పిలుపు
============================
నెల్లూరులో ఈ నెల 31 వ తేదీన మాజీముఖ్యమంత్రి జగన్ పర్యటనను విజయవంతం చెయ్యాలని మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి కోరారు. జైలులో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ తరువాత , మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికెళ్లి పరామర్శ చేస్తారని చెప్పారు. జగన్ నెల్లూరు యాత్రని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

28/07/2025

రాత్రి పదిగంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఫోన్ కాల్ కి స్పందించి ఆఘమేఘాలమీద కారెక్కి స్పాట్ కి వచ్చేశాడు. ఓ వ్యక్తి భార్యా పిల్లలుతో బైక్ మీద పోతుండగా పోలీసులు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నారు. నేను తాగలేదు మొర్రో అన్నా వినలేదట. 10 వేలు కట్టమన్నారు. దీంతో ఆ కుటుంబం ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది. అన్యాయంగా తమను ఆపేసి వేధిస్తున్నారని చెప్పారు. నిమిషాల వ్యవధిలో ఇంటినుంచి ఆయన కారులో వేదాయపాలెం వచ్చేసారు . ట్రాఫిక్ పోలీసులు ఇలా చేశారని తెలిసి, ఆ కుటుంబాన్ని కారులో ఎక్కించుకుని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరకెళ్లాడు. అక్కడ పోలీసులను ఇదేమి పని, భార్య బిడ్డలతో పోతుంటే ఇలా చేస్తారా అని ప్రశ్నించి బైక్ ఇప్పించారు. ఆ మహిళ ఎమ్మెల్యే కాళ్ళకు దండం పెట్టి ఆనందంతో కన్నీరు పెట్టింది. రాజకీయాల్లో అరుదుగా జరిగే సంఘటన ఇది..

28/07/2025

ఆత్మకూరులో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఆగస్టు 1,2 వ తేదీలలో ఆత్మకూరు ఇంజనీరింగ్ కళాశాలలో జరగబోయే మెగా జాబ్ మేళాకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఆగస్టు 1,2 తేదీలలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని 70 కంపెనీలు పాల్గొంటాయని వీటి ద్వారా సుమారు 4వేల ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసే జాబ్ మేళాను విజయవంతం చేయాలని అన్నారు.మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతి మూడు నెలలకు ఓసారి ఎదో ఒక నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when NDN News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NDN News:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share