Nijam Today

Nijam Today News, Analysis, Opinions & Fact-Check. Subscribe our YouTube channel: https://youtube.com/

ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి దేశం నుంచి పంపిస్తాంబిహార్‌లో ఉన్న ప్రతి ఒక్క చొరబాటుదారుడిని గుర్తించి, వారి స్వస్థలాలక...
27/10/2025

ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి దేశం నుంచి పంపిస్తాం

బిహార్‌లో ఉన్న ప్రతి ఒక్క చొరబాటుదారుడిని గుర్తించి, వారి స్వస్థలాలకు తిరిగి పంపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. చొరబాటుదారులను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తుంటే వారిని రక్షించేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారని విమర్శించారు. బిహార్‌లోని ఖగారియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా ఆర్జేడీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

ప్రధాని మోదీ, సీఎం నీతీశ్ కుమార్‌లు బిహార్ అభివృద్ధికై పనిచేస్తుంటే, లాలూ తన కుటుంబం బాగు కోసం అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని అమిత్ షా విమర్శించారు. ఎన్డీఏ హయాంలో బిహార్‌లో నేరాలు తగ్గాయని చెప్పారు.

“లాలూ, రబ్రీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, జంగిల్ రాజ్ పాలన మళ్లీ వస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బిహార్ అభివృద్ధి గురించి దేశం మొత్తానికి తెలుస్తుంది. ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను 11 నుంచి 4వ స్థానానికి చేర్చారు. 2027 కంటే ముందే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది”, అని తెలిపారు.

ప్రధాని మోదీ దేశాన్ని సురక్షితంగా మార్చారని చెబుతూ యూపీఏ హయాంలో పాకిస్థాన్ తరచూ మనపై దాడి చేసేది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సోనియా, మన్మోహన్‌, లాలూ మౌనంగా ఉండేవారని ధ్వజమెత్తారు. ఇటీవల రాహుల్ బాబా చొరబాటుదారులను రక్షించేందుకు యాత్ర చేపట్టారని పేర్కొంటూ బిహార్‌ నుంచి చొరబాటుదారులను వెళ్లగొట్టాలా? లేదా? మీరే‍(ప్రజలు) చెప్పండి అని బీహార్ ప్రజలను అడిగారు.

“బిహార్లో 2005 నుంచి 2025 వరకు నేరాలు గణనీయంగా తగ్గాయి. గత 10 సంవత్సరాల్లో మారణహోమం జరగలేదు. 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రి మోదీ భారతదేశంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చారు. అయోధ్యలో రామ్ లల్లా ఆలయానికి పునాది రాయి వేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. రాహుల్, మమత, లాలూ అంతా రాముడి ఆలయాన్ని వ్యతిరేకించారు. కాగా మా మోదీ హయాంలోనే బిహార్ వారసత్వాన్ని చాటే నలంద విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించాం” అని అమిత్ షా తెలిపారు.

ఘట్కేసర్ లో గోరక్షకుడిపై దాడి –ముస్లిం  దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలిభారతీయ విలువలు, సాంప్రదాయాలు, ధర్మ పరిరక్షణ అంటే...
23/10/2025

ఘట్కేసర్ లో గోరక్షకుడిపై దాడి –ముస్లిం దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి
భారతీయ విలువలు, సాంప్రదాయాలు, ధర్మ పరిరక్షణ అంటే గోరక్షణ. భాగ్యనగర్ శివారులో ఘట్కేసర్ వద్ద గోరక్షకుడిపై జరిగిన కాల్పుల ఘటన హిందూ సమాజానికి తీవ్ర అవమానం. గోమాతను రక్షించే పవిత్ర ధర్మాన్ని కాపాడే వారిపై తుపాకీతో దాడి చేయడం కేవలం చట్ట విరుద్ధ చర్య మాత్రమే కాదు, హిందూ మనోభావాల పట్ల చేసిన విపరీతమైన దాడి కూడా.విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహ కార్యదర్శి చింతల వెంకన్న గారు ఈ ఘటనను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను గట్టిగా మందలించారు. ఆయన డిమాండ్ చేశారు —గోరక్షకుడిపై కాల్పులు జరిపిన ఇబ్రహీం మరియు అతని ముఠాను వెంటనే అరెస్టు చేయాలి.జరిగిన నేరంపై 24 గంటల్లో విచారణ ప్రారంభించి కఠిన శిక్షలు విధించాలి.గో హత్య నిషేధ చట్టాన్ని తెలంగాణలో పూర్తిగా అమలు చేయాలి.రాష్ట్రవ్యాప్తంగా గోస్మగ్లింగ్ ముఠాలను గుర్తించి నిర్మూలించాలి.వెంకన్న గారు స్పష్టం చేశారు — “ఇది కేవలం ఒక నేరం కాదు; ఇది ధర్మం పై దాడి. గోమాతను కాపాడేవాడు గోరక్షకుడు; అతనిపై జరగిన దాడి ప్రతి హిందువుని గాయపరిచింది. రాక్షస శక్తులు ధర్మబలాన్ని సవాల్ చేస్తున్నాయి.”ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది —
నిందితులను తక్షణం పట్టుకోని కఠినంగా శిక్షించకుంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రజా ఆందోళనలు తప్పవు.హిందూ సమాజం ఇక మౌనంగా ఉండదు. గోమాత రక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం ప్రతి హిందువూ లేచి నిలబడాలి.– చింతల వెంకన్న
రాష్ట్ర సహ కార్యదర్శి, విశ్వహిందూ పరిషత్

శ్రీరాముడే స్ఫూర్తిగా ఆపరేషన్‌ సింధూర్‌ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే, తమకు జరిగిన అన్యాయానికి ...
22/10/2025

శ్రీరాముడే స్ఫూర్తిగా ఆపరేషన్‌ సింధూర్‌

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే, తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆపరేషన్ సింధూర్​కు శ్రీరాముడే స్ఫూర్తి అని తెలిపారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళిని శక్తి , ఉత్సాహంతో నిండిన పండుగగా అభివర్ణించారు. ఈ క్రమంలో దేశప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

“అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం తర్వాత ఇది మనకు రెండో దీపావళి వేడుక. శ్రీరాముడు మనకు ధర్మాన్ని నిలబెట్టమని బోధించాడు. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ధైర్యాన్ని కూడా ఇచ్చాడు. కొన్ని నెలల క్రితం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్​కు శ్రీరాముడే స్పూర్తి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే, తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంది” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

అలాగే దేశ ప్రజలకు రాసిన లేఖలో నక్సలిజం, ఆపరేష్ సిందూర్ విజయం, జీఎస్టీ సంస్కరణలు తదితర అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశంలోని పలు జిల్లాల్లో నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడంతో మారుమూల ప్రాంతాలు సహా అనేక జిల్లాల్లో మొదటిసారి దీపావళి వెలుగులు వెలిగాయని తెలిపారు.

“ఈ దీపావళి చాలా ప్రత్యేకం. ఎందుకంటే నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందించిన తర్వాత మొదటిసారిగా దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలతో దీపాలు వెలిగించారు. ఇటీవలి కాలంలో మన దేశ రాజ్యాంగంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, హింస మార్గాన్ని విడిచిపెట్టి చాలా మంది జన జీవన స్రవంతిలోకి వచ్చేశారు.” అని మోదీ తెలిపారు.

జీఎస్టీ రేట్లను తగ్గించే నిర్ణయాన్ని తమ ప్రభుత్వం సాధించిన చారిత్రక విజయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ ఇటీవల కాలంలో జీఎస్టీ తదుపరి తరం సంస్కరణలను కూడా ప్రారంభించిందని తెలిపారు. దసరా నవరాత్రుల మొదటి రోజున తగ్గిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయని గుర్తు చేసుకున్నారు.

ఈ ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ (పొదుపు పండుగ) సందర్భంగా దేశ ప్రజలు వేలాది కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నారని వెల్లడించారు. బహుళ సంక్షోభాలతో ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే భారత్ స్థిరత్వానికి చిహ్నంగా మారిందన్నారు. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వికసిత్ (అభివృద్ధి చెందిన), ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంభన భారతదేశం) కోసం పాటుపడాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అలాగే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. అన్ని భాషలను గౌరవించడం, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, యోగాను స్వీకరించడం, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం వంటి ప్రయత్నాలు దేశాన్ని త్వరగా వికసిత్ భారత్ వైపునకు తీసుకెళ్తాయని భరోసా వ్యక్తం చేశారు.

తెలంగాణాలో ముస్లిం అరాచక శక్తులు విశృంఖల విహారం* పోలీసు అమరవీరుల సంస్మరణ దినం మూడు రోజుల కింద నిజామాబాద్‌లో సీసీఎస్ కాని...
21/10/2025

తెలంగాణాలో ముస్లిం అరాచక శక్తులు విశృంఖల విహారం

* పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

మూడు రోజుల కింద నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. ఈ నెల 17న రాత్రి ఓ చోరీ కేసులో నిందితుడు రియాజ్ ను పట్టుకొస్తుండగా అతడు కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడిచేసి పారిపోవడంతో, గాయాలకు గురై మృతి చెందారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినంకు నాలుగు రోజుల ముందుగా ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.

1959లో చైనాతో మన సరిహద్దులను కాపాడుకుంటూ ప్రాణాలను అర్పించిన 10 మంది పోలీసుల త్యాగాలను ఈ రోజు గుర్తుచేసుకుంటుంది. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్‌లో భారత భూభాగంలో జరిగిన అసమాన ఘర్షణలో 10 మంది సహసవంతులైన పోలీసులను చైనా సైన్యం మెరుపుదాడి చేసి చంపింది.

ఈ 10 మంది వీర పోలీసుల జ్ఞాపకార్థం, 1962లో జరిగిన డీజీపీల సమావేశం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ని పోలీసు సంస్మరణ దినోత్సవంగా పాటించాలని నిర్ణయించారు. దేశంలో ఎక్కడైనా, ఎటువంటి ఉగ్రవాద సంఘటన జరిగినా ఏదోవిధంగా హైదరాబాద్ తో సంబంధం ఉండటాన్ని గమనిస్తున్నాము. ముఖ్యంగా ముస్లిం తీవ్రవాదులు పోలీసులను, ఇతర పౌరులను లక్ష్యంగా చేసుకొని హత్యాకాండకు దిగడాన్ని గమనిస్తున్నాము.

33 ఏళ్ళ క్రితం 1992 నవంబర్ 29న హైదరాబాద్‌లోని టోలిచౌకిలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ జి కృష్ణ ప్రసాద్ (1950-92)ను అతని గన్ మెన్ వెంకటేశ్వర్ రావుతో పాటు ఐఎస్ఐ ప్రాయోజిత ఉగ్రవాద మాడ్యూల్ కాల్చి చంపడం గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా పాతబస్తీలో తరచూ ఆ విధమైన దాడులు గురై పలువురు మృతి చెందుతున్నారు. పోలీసులనే కాకుండా విద్యుత్ బకాయిలు, మున్సిపల్ బకాయిలు వసూలు చేసేందుకు పాతబస్తీలో ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కూడా దాడులు జరగడం పరిపాటిగా మారింది. అదేవిధంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్, సిబ్బందిపై దాడులు సర్వసాధారణంగా మారాయి.

2020 ఏప్రిల్‌లో చాంద్రాయణగుట్టలో పోలీస్ కానిస్టేబుల్‌పై జరిగిన వాగ్వాదం తర్వాత దాడికి పాల్పడినందుకు తెలంగాణ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. కానిస్టేబుల్ పి ప్రవీణ్ కుమార్ తన విధుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ సర్వీస్ పాయింట్‌లో ఉండగా, ఇద్దరు యువకులు కానిస్టేబుల్‌పై దాడి చేసి అక్కడి నుండి పారిపోయారు. నిందితులను షేక్ మహ్మద్ అమీరుద్దీన్ (21) అనే మెకానిక్, షేక్ సైఫ్ మోహియుద్దీన్ (24) అనే ఎలక్ట్రీషియన్‌గా గుర్తించారు. వీరు చాంద్రాయణగుట్టలోని గుల్షన్ ఇక్బాల్ కాలనీ నివాసితులు.

27 ఏప్రిల్ 2016న పాతబస్తీలో ఫలక్‌నుమా సబ్-డివిజన్ పరిధిలోని గుల్షన్-ఎ-ఇక్బాల్ వద్ద విద్యుత్ బకాయిలు వసూలు చేస్తుండగా విద్యుత్ లైన్‌మెన్ అక్బర్ అలీ ఖాన్ పై దాడి జరగడంతో అతడిని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. 30–31 జనవరి 2024 యాకుత్‌పురా ప్రాంతంలోని మాదన్నపేటలో ఒక లైన్‌మెన్ (రజినీష్ బాబు)పై దాడి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఎంఐఎం కార్యకర్త షఫత్ అలీను అరెస్టుచేశారు. మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

27 జనవరి 2025న ఆర్టీసీ కాళోజీలో మౌలా అలీ వద్ద పెండింగ్ బకాయిలపై విద్యుత్ సరఫరాను నిలిపి వేయడంతో జూనియర్ లైన్‌మెన్ కుర్రం సురేష్ పై భౌతికంగా దాడి చేసి, అతని బైక్‌ను ధ్వంసం చేశారు. 2018లో శాలిబండ వద్ద ఒక సంఘటనలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి జరిగింది. 19 జూన్ 2025న అత్తాపూర్ వద్ద ఒక మహిళా ఆర్టీసీ బస్సు కింద పది మృతి చెందడంతో ఒక సమూహం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది.

14 మే 2010న శాలిబండలో సున్నితమైన పాత నగర ప్రాంతంలో పికెట్ డ్యూటీలో ఉన్న యు రమేష్ అనే పోలీసు కానిస్టేబుల్ ను పట్టపగలు మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు.

లొంగిపోయిన మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు* ప్రజలే శిక్షిస్తారంటూ మావోయిస్టు పార్టీ ఆగ్రహం ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయ...
21/10/2025

లొంగిపోయిన మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు

* ప్రజలే శిక్షిస్తారంటూ మావోయిస్టు పార్టీ ఆగ్రహం

ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్‌, ఆశన్నలకు ప్రజలే శిక్ష విధిస్తారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. వారి లొంగుబాటు విప్లవ ద్రోహమని మండిపడింది. వారితోపాటు లొంగిపోయినవారందరినీ మావోయిస్టు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్‌ పేరిట నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది.

మల్లోజుల భార్య గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎదుట లొంగిపోయిందని, అప్పటి నుంచే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌తో ఆయనకు సంబంధాలు ఏర్పడినట్లు అనుమానిస్తున్నామని ఆ లేఖలో అభయ్‌ పేర్కొన్నారు. ఆయన కోవర్టు చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు. 2011 చివరి నుంచి గడ్డు స్థితిని ఎదుర్కొంటూ వచ్చిన దండకారణ్య విప్లవోద్యమం 2018 నాటికి తాత్కాలిక వెనకంజకు గురైందని, అప్పటి నుంచే మల్లోజులలో రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయని తెలిపారు.

2020లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలపై ఆయన స్వీయ విశ్లేషణ చేస్తూ ఒక పత్రాన్ని ప్రవేశపెట్టారని, దాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించిందని వివరించారు. తర్వాత పలుమార్లు జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో సమావేశాల్లో ఆయనను సరిదిద్దడానికి పార్టీ ప్రయత్నించినట్టు తెలిపారు. 2011 నుంచే మల్లోజుల తీవ్ర అహంభావాన్ని, పెత్తందారీతనాన్ని ప్రదర్శిస్తున్నారని.. దీంతో పార్టీ పలుమార్లు ఆయన్ను హెచ్చరించిందని వివరించారు.

ఈ ఏడాది మేలో జరిగిన కగార్‌ దాడిలో పార్టీ కార్యదర్శి బసవరాజ్‌ మరణం తర్వాత మల్లోజులలో బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకొని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయని, ఆయనలో ప్రాణభీతి ఏర్పడిందని అభయ్‌ పేర్కొన్నారు. ఆయుధాలను పార్టీకి అప్పగించాలని కేంద్ర కమిటీ చెప్పినప్పటికీ మల్లోజుల వాటిని శత్రువుకు అప్పగించి, విప్లవ ద్రోహిగా మారారని పేర్కొన్నారు.

ఎందరో కామ్రేడ్స్‌ శత్రు బలగాలతో పోరాడి, ప్రాణాలు అర్పించి, వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను మళ్లీ శత్రువుకు అప్పగించడమంటే విప్లవకారులను హత్య చేయడమేనని, హత్య చేయాలని సూచించడమేనని, ఇది విప్లవ ఘాతుకమవుతుందని అభయ్‌ పేర్కొన్నారు. పార్టీలోని ఎంత మంది సరెండర్‌ అయినా పార్టీ మాత్రం శత్రువులకు సరెండర్‌ కాదని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నామని అభయ్‌ లేఖలో పేర్కొన్నాడు.

మల్లోజుల, ఆశన్నల్లో పెరిగిన మితవాద భావాలను సకాలంలో గుర్తించడంలో పార్టీ విఫలమైందన్న ఆయన ఈ వైఫల్యంపై సమీక్షించుకొని గుణపాఠాలు నేర్చుకుంటామని స్పష్టం చేశారు. విప్లవోద్యమంలో వెనుకంజలు తాత్కాలికమేనని, పార్టీ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తామని అభయ్‌ తెలిపారు.

17/10/2025

టెకీ అనుమానాస్పద మృతి.. ఆరెస్సెస్ లక్ష్యంగా రాజకీయ కుట్ర

బలహీనపడిన అమెరికా పాస్‌పోర్ట్అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా నుంచి పడిపోయింది. 20 స...
16/10/2025

బలహీనపడిన అమెరికా పాస్‌పోర్ట్

అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా నుంచి పడిపోయింది. 20 సంవత్సరాల తర్వాత తొలిసారిగా యూఎస్ పాస్‌పోర్ట్ టాప్-10 నుంచి దిగజారింది. గత 20 ఏళ్లుగా ఎప్పుడూ టాప్ 10లో స్థానం దక్కించుకున్న అమెరికా పాస్‌పోర్ట్ .అంతర్జాతీయ వాయు రవాణా సంస్థ (ఐఎటిఎ) డేటా ఆధారంగా హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ రూపొందించిన ఈ ర్యాంకింగ్స్ ప్రకారం, అమెరికా ఇప్పుడు 12వ స్థానానికి పడిపోయింది.

ప్రస్తుతం, మలేషియాతో కలిసి యూఎస్ 12వ స్థానంలో నిలిచింది. అమెరికా పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు కేవలం 180 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇక, ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ పాస్‌పోర్ట్‌తో 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఆ తర్వాత దక్షిణ కొరియా (190), జపాన్ (189) ఉన్నాయి.

అమెరికా ర్యాంక్ పడిపోవడానికి పలు దేశాలు తమ వీసా నిబంధనలను మార్చడమే ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాది బ్రెజిల్ తన వీసా రహిత ప్రవేశం రద్దు చేసింది. అలాగే, చైనా కూడా వీసా అవసరం లేని దేశాల జాబితాలో యూఎస్‌ను చేర్చలేదు. మయన్మార్, పపువా న్యూగినియా వంటి దేశాలు సైతం ఆంక్షలు విధించాయి.
తాజాగా వియత్నాం, సోమాలియా కూడా అమెరికా పౌరులకు వీసా నిబంధనలను కఠినం చేశాయి.
ఈ విషయంలో యూకే కూడా ఏ మాత్రం భిన్నంగా లేదు. గతంలో టాప్‌లో ఉన్న బ్రిటన్, ఇప్పుడు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఇంకా, హెన్లీ ఓపెన్‌నెస్ ఇండెక్స్ ప్రకారం, ఇతర దేశాల పౌరులను ఆహ్వానించడంలో అమెరికా వెనుకబడి పోయింది. ఇప్పటివరకు, అమెరికా పౌరులకు 180 దేశాలు వీసా లేకుండా ప్రయాణ సౌకర్యం ఉండగా అమెరికా మాత్రం కేవలం 46 దేశాల పౌరులను మాత్రమే వీసా లేకుండా అనుమతిస్తుంది. అందువల్ల ఈ జాబితాలో అమెరికా 77వ స్థానంలో నిలిచింది.

చైనా ఈ విషయంలో ముందుకు దూసుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో చైనా తన పాస్‌పోర్ట్ ర్యాంకును 94 నుంచి 64కు మెరుగుపరచుకుంది. చైనా ఇప్పుడు 76 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తూ, ఓపెన్‌నెస్ ఇండెక్స్‌లో 65వ స్థానంలో నిలిచి అమెరికాను అధిగమించింది.

ఆపరేషన్‌ సిందూర్​లో 100 మందికి పైగా పాక్ సైనికులు హతంభారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో  పాకిస్థాన్​కు చెందిన 1...
15/10/2025

ఆపరేషన్‌ సిందూర్​లో 100 మందికి పైగా పాక్ సైనికులు హతం

భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్థాన్​కు చెందిన 100 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైన్యంలోని డైరెక్టర్‌ జనరల్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డిజిఎంఒ) లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ వెల్లడించారు. పాకిస్థాన్ ఆగస్టు 14న ప్రకటించిన వీరమరణ సైనికుల జాబితాలో ఉన్న సంఖ్యను బట్టి ఈ అంచనాలు వెల్లడి అయ్యాయని చెప్పారు. అదే సమయంలో పాకిస్థాన్ వాయుసేనకు చెందిన 12 యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయని ఆయనతెలిపారు.

ఐక్యరాజ్యసమితి దళాలను అందిస్తున్న 32 దేశాల అధిపతులు, ప్రతినిధుల సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ మాట్లాడుతూ, “పాకిస్తానీయులు, బహుశా తెలియకుండానే, ఆగస్టు 14న తమ అవార్డుల జాబితాను విడుదల చేసి ఉండవచ్చు. మరణానంతర అవార్డుల సంఖ్య ఎల్‌ఓసిలో వారి ప్రాణనష్టం 100 కంటే ఎక్కువగా ఉందని సూచిస్తుంది” అని తెలిపారు.
పాకిస్థాన్ లో క్షీణిస్తున్న సైన్యం, ముఖ్యంగా తన ఇమేజ్ ను కాపాడుకొనేందుకై ఆర్మీ చీఫ్ ఆసిన్ మునీర్ స్వయంగా పహల్గామ్ ఉగ్రవాద దాడికి పధక రచన జరిపారని ఆయన ఆరోపించారు. “ఏమి జరిగిందో, అది ఎందుకు జరిగిందో మీరు విశ్లేషించాలనుకుంటే అది జరిగిన సమయంలో పాకిస్తాన్ సైన్యం, దాని చీఫ్ ఒత్తిడిలో ఉన్నారనే వాస్తవం అందరికీ తెలుసు. అందువల్ల, అతనికి తన ఇమేజ్‌ను మాత్రమే కాకుండా, పాకిస్తాన్ సైన్యాన్ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు.
మే 7న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించింది. పాకిస్థాన్​తోపాటు పాక్ ఆక్రమిత భూభాగంలో ఉన్న తొమ్మిది ఉగ్రశిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం కచ్చితమైన దాడులు జరిపింది. దీని అనంతరం పాకిస్థాన్​ తక్షణమే సరిహద్దు కాల్పులు ప్రారంభించిందని రాజీవ్ ఘాయ్‌ తెలిపారు. మే 7 నుంచి 10 వరకు రెండు దేశాల మధ్య తీవ్ర సైనిక ఘర్షణలు జరిగాయని, చివరికి మే 10న కాల్పులు నిలిపివేయాలన్న అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు.

ఆ సమయంలో పాక్ నావికాదళం, వైమానిక దళం పూర్తి సన్నద్ధతలో ఉన్నప్పటికీ, భారత సైన్యం చేసిన ప్రతిఘటనకు అది తట్టుకోలేకపోయిందని గుర్తు చేశారు. పాకిస్థాన్​ డ్రోన్లను ఉపయోగించి భారత సరిహద్దు ప్రాంతాల్లో నష్టం కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ, అవి పూర్తిగా విఫలమయ్యాయని లెఫ్టినెంట్‌ జనరల్‌ ఘాయ్‌ చెప్పారు. “వారు వివిధ రకాల డ్రోన్లను పంపినా, ఒక్కదీ తమ లక్ష్యాన్ని చేరుకోలేదు. అన్నీ వృధా అయ్యాయి” అని ఆయన స్పష్టం చేశారు. డ్రోన్‌ దాడులకు ప్రతిగా భారత వైమానిక దళం మే 9-10 రాత్రి పాక్‌ సైనిక స్థావరాలపై తీవ్ర వైమానిక దాడులు జరిపిందని రాజీవ్ ఘాయ్‌ తెలిపారు.

“మేం వారి 11 ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నాం. వాటిలో ఎనిమిది ఎయిర్‌బేస్‌లు, మూడు హ్యాంగర్లు, నాలుగు రాడార్‌ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి” అని చెప్పారు. పాకిస్థాన్ ​ ఒక సి-130 రకానికి చెందిన విమానం, ఒక ఎఈడబ్ల్యు&సి (ఎయిర్‌బోర్న్‌ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌) విమానం, నాలుగు నుంచి ఐదు యుద్ధ విమానాలను కోల్పోయిందని వివరించారు.

అలాగే 300 కిలోమీటర్ల దూరం నుంచి భూస్థాయి క్షిపణులతో ఐదు ఫైటర్‌ జెట్లు కూల్చివేయడం ప్రపంచంలోనే అతి పొడవైన ఎయిర్‌ కిల్‌గా నమోదైందని చెప్పారు. కాగా, పహల్గాం దాడికి బాధ్యులైన ముగ్గురు ఉగ్రవాదులను జూన్‌లో భారత సైన్యం హతమార్చిందని రాజీవ్ ఘాయ్‌ తెలిపారు. “వారిని 96 రోజులపాటు వెంబడించాం. చివరకు వారిని నరకం వరకు వెంబడించి అంతం చేశాం” అని ఆయన స్పష్టం చేశారు.

జమ్మూ కాశ్మీర్‌లో అల్లకల్లోల కాలపు చరిత్రను వివరిస్తూ, సీమాంతర ఉగ్రవాద సమస్య 1980లలో ప్రారంభమైందని ఘాయ్ గుర్తు చేశారు. “అప్పటి నుండి, మేము 28,000 కంటే ఎక్కువ ఉగ్రవాద సంఘటనలను చూశాము. 1990ల నుండి, మైనారిటీ వర్గాలకు చెందిన లక్ష మంది కంటే ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్‌ను విడిచిపెట్టవలసి వచ్చింది. 60,000 కంటే ఎక్కువ కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. దాదాపు 15,000 మంది అమాయక పౌరులు, 3,000 కంటే ఎక్కువ మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఈ హింసకు మూలం అందరికీ తెలుసు” అని ఆయన తెలిపారు.
ఉగ్రవాదంపై భారత్‌ వైఖరిలో మౌలిక మార్పు చోటుచేసుకుందని లెఫ్టినెంట్‌ జనరల్‌ ఘాయ్‌ తెలిపారు. “ఉగ్రదాడులు యుద్ధ చర్యలుగా పరిగణిస్తున్నాం. కాబట్టి నిర్ణయాత్మక ప్రతిస్పందన తప్పదు. అణు బెదిరింపులకు తలవంచం. ఉగ్రవాదులు, వారిని ప్రోత్సహించే వారిలో ఎలాంటి తేడా ఉండదు” అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన అంశాలను ఆయన గుర్తుచేశారు. మొత్తం మీద, ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సైన్యం చూపిన కచ్చితత్వం, ప్రణాళిక, ధైర్యం పాకిస్థాన్​కు గట్టి పాఠం నేర్పిందని లెఫ్టినెంట్‌ జనరల్‌ ఘాయ్‌ వ్యాఖ్యానించారు.

ఐసిస్ ఉగ్రవాదులను ఆఫ్ఘన్ నుండి పూర్తిగా తుడిచిపెట్టాం!కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ ను ఆఫ్ఘానిస్తాన్ నెల నుండి పూర్తిగా...
14/10/2025

ఐసిస్ ఉగ్రవాదులను ఆఫ్ఘన్ నుండి పూర్తిగా తుడిచిపెట్టాం!

కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ ను ఆఫ్ఘానిస్తాన్ నెల నుండి పూర్తిగా తుడిచిపెట్ట్టామని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఢిల్లీలో ప్రకటించారు, 2021లో తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఇస్లామిక్ ఎమిరేట్ దేశవ్యాప్తంగా పూర్తి నియంత్రణ, భద్రతను పునరుద్ధరించిందని ఆయన పేర్కొన్నారు.

“అమెరికా, నాటో తమ ఉనికిని కలిగి ఉన్నప్పుడు, వివిధ ప్రావిన్సులలో ప్రధాన ఐసిస్ కేంద్రాలు ఉండేవి. అయినప్పటికీ, మేము ఘర్షణలను ఎదుర్కొన్నాము. కానీ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని పూర్తిగా నియంత్రించిన తర్వాత, బలమైన ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు, అదృష్టవశాత్తూ, ఐసిస్ లేదా మరే ఇతర సమూహం పనిచేయడం ఆఫ్ఘన్ నేలలో ఒక్క అంగుళం కూడా లేదు,” అని ముత్తాకి న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులను ఉద్దేశించి వెల్లడించారు.

పరిశ్రమల సంస్థ ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంపై హాజరైన ముత్తాకి “స్నేహపూర్వక గల్ఫ్ దేశాల” అభ్యర్థన మేరకు తన కార్యకలాపాల ప్రతిస్పందిస్తూ నిలిపివేయడానికి ముందు పాకిస్థాన్ దురాక్రమణ విషయంలో తమ లక్ష్యం సాధించుకున్నాము” అని తెలిపారు. “ఆపరేషన్ సమయంలో, సౌదీ అరేబియా, ఖతార్, యుఎఇ యుద్ధం ఆపాలని అభ్యర్థించాయి. మేము అంగీకరించాము” అని ఆయన తెలిపారు. అప్పటి నుండి ఎటువంటి పెద్ద సంఘటన జరగలేదని చెప్పారు.

“యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని మేము నమ్ముతున్నాము. సమస్యలను పరిష్కరించడానికి సంభాషణలు, దౌత్యం అవసరం. భవిష్యత్తులో కూడా ఇదే మా విధానం అవుతుంది. ఈ ప్రాంతంలోని ప్రజలు శాంతియుతంగా జీవించాలని, అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము” అని ముత్తాకి స్పష్టం చేశారు. ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా ఒక ముఖ్యమైన ప్రకటనలో, అమృత్సర్- కాబూల్, కాందహార్ మధ్య ప్రత్యక్ష విమానాలు త్వరలో ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఇది వాణిజ్యం, ప్రజల నుండి ప్రజల సంబంధాలను పెంచే దశగా అభివర్ణించబడుతుందని ముత్తాకి తెలిపారు.

ఈ చర్యను “చారిత్రాత్మక అడుగు” అని రాజ్యసభ ఎంపీ, వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, విదేశీ వ్యవహారాల కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు డాక్టర్ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నే హర్షం ప్రకటించారు. కొత్త మార్గాలు భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య “వేగవంతమైన, మరింత సురక్షితమైన వాయు వంతెన”ను సృష్టిస్తాయని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు, హస్తకళలు, ఔషధాలలో పాల్గొన్న రైతులు, వ్యాపారులు, ఎంఎస్ఎంఇలకు ప్రయోజనం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆనందు అజి మరణం – వాస్తవాలు, పుకార్లు, పరిశీలన..తాజాగా కేరళకు చెందిన ఆనందు అజి (24) అనే యువకుడి మరణం చుట్టూ వివిధ పుకార్ల...
13/10/2025

ఆనందు అజి మరణం – వాస్తవాలు, పుకార్లు, పరిశీలన..

తాజాగా కేరళకు చెందిన ఆనందు అజి (24) అనే యువకుడి మరణం చుట్టూ వివిధ పుకార్లు మరియు రాజకీయ ఆరోపణలు మార్మోగుతున్నాయి.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) క్యాంపులో వేధింపుల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో జరిగిన పరిశీలనలో ఈ పుకార్లు నిజం కావని తేలింది.
ఘటన వివరాలు

ఆనందు అంజి స్వస్థలం కేరళలోని కొట్టాయం జిల్లా – పొంకున్నం.అక్టోబర్ 10వ తేదీ రాత్రి అతను ఇంటిని విడిచి, తిరువనంతపురంలోని తంపనూర్ లాడ్జ్‌కు వెళ్లాడు.కొన్ని గంటల తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు.అతని మరణం జరిగిన కొద్దిసేపటికి అతని Instagram ప్రొఫైల్‌లో ఒక “షెడ్యూల్డ్ పోస్ట్” కనిపించింది.ఆ పోస్ట్‌లో RSS వ్యవస్థలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణ చేసిన సూసైడ్ నోట్ ఉండటం ఆందోళన కలిగించింది.

ఆరోగ్య నేపథ్యం

ఆరోగ్య పరీక్షల ప్రకారం, ఆనందు OCD (Obsessive Compulsive Disorder) సమస్యతో బాధపడుతున్నాడు.2019లో జరిగిన బైక్ ప్రమాదంలో తండ్రి మరణం తర్వాత అతను దీర్ఘకాలిక చికిత్సలో ఉన్నాడు.

కుటుంబ నేపథ్యం

ఆనంద్ సోదరి అంజిత అజి, బెంగళూరులో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసి, ప్రస్తుతం ఎర్నాకుళంలో బొటిక్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది.ఆమెకు ఎరట్టుపెట్ట ప్రాంతానికి చెందిన ముస్లిం యువకుడు అంజిల్ బషీర్ తోవివాహం జరిగింది.కుటుంబం ఈ వివాహానికి అంగీకరించకపోయినా, ఆనందు అజి తన సోదరికి మద్దతిచ్చాడు.ఇదే విధంగా, తన బంధువులో ఒకరి మతాంతర వివాహానికి కూడా అతను సహకరించాడు.

Rssపై ఆరోపణలు - వాస్తవాలు

ఆనందు అజి మరణంలో RSS పాత్ర లేదు. అతను గత 7–8 ఏళ్లుగా సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. అతను "NB" పేరుతో పేర్కొన్న వ్యక్తి RSS‌లో లేరు.ఆనంద్ తండ్రి మాత్రం సంఘ్‌కు గౌరవనీయ సేవలు అందించారు.కుటుంబ సభ్యులు కూడ RSS‌పై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. శిబిరాల్లో ఏదైనా జరిగినట్లయితే, ఈ 8 ఏళ్లలో అతడు ఎప్పుడూ ప్రస్తావించలేదు. మరణం తర్వాత అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన పోస్ట్‌పై నిజ నిర్ధారణ అవసరం ఉందని భావిస్తున్నారు. కుటుంబం చట్టపరమైన చర్యలు అవసరం లేదని స్పష్టం చేసింది.కానీ వామపక్ష అనుబంధ సంస్థ DYFI వజూర్ బ్లాక్ సెక్రటరీ గౌతం బాలచంద్రన్, ఈ ఘటనపై పోలీసులకు దర్యాప్తు కోసం ఫిర్యాదు చేశారు. వామపక్ష భావజాలంతో పనిచేస్తున్న కేరళలో రిపోర్టర్ టీవీ మాత్రం ఉద్దేశ్య పూరకంగా దీనికి ఎక్కువ ప్రచార కల్పిస్తోంది.

సమగ్ర దర్యాప్తుకు సంఘ్ డిమాండ్ :

మరోవైపు ఆనందు అజి అసహజ మరణంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఓ ప్రకటన ద్వారా స్ప్ందించింది. ఈ అసహజ మరణం చాలా విచారకరమని, దురదృష్టకరమని పేర్కొంది. అనేక సంవత్సరాలుగా ఆయన కుటుంబం సంఘ్ తో అనుంబంధం పెంచుకుందని తెలిపింది.
ఆనందు తండ్రి దివంగత అజి సంఘ కార్యకర్త. ఈ విచారకరమైన సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలబడతామని సంఘ్ ప్రకటించింది. అలాగే ఆనందు అజి ఆత్మకు శాంతి చేకూరాలని ఈశ్వరుడ్ని ప్రార్థించింది.
మరోవైపు ఆనందు అసహజ మరణానికి దారి తీసిన పరిస్థితులతో పాటు సోషల్ మీడియాలో కనిపించిన సూసైట్ నోట్ పై కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కొట్టాయం శాఖ డిమాండ్ చేసింది.అందులో సంఘ్ పై కొన్ని నిరాధారమైన, సందేహాస్పదమైన ఆరోపణలు వున్నాయని, అవే తన ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నాడని గుర్తు చేసింది.దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, సంఘ్ నిర్దోశిత్వాన్ని బయటకు తీసిన వారవుతారని ఆరెస్సెస్ అభిప్రాయపడింది.

భారత్, అఫ్గాన్ ఉమ్మడి ప్రకటనపై పాక్ అక్కసుభారత్​ అఫ్గానిస్థాన్‌ విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం ...
13/10/2025

భారత్, అఫ్గాన్ ఉమ్మడి ప్రకటనపై పాక్ అక్కసు

భారత్​ అఫ్గానిస్థాన్‌ విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్​లో అప్గాన్​ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. భారత్​ పర్యటనలో భాగంగా అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్‌ ఖాన్ ముత్తాఖీ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జమ్ముకశ్మీర్​ గురించి చేసిన సూచనలకు సంబంధించి పాకిస్థాన్ సందేశాలను తెలియజేసినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

“జమ్ముకశ్మీర్​ను భారత్​లో భాగంగా పేర్కొనడం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుంది. ఉగ్రవాదాన్ని నియంత్రించే బాధ్యతను పాకిస్థాన్​పై మోపడం వల్ల ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కాపాడే బాధ్యత నుంచి అఫ్గన్ ఆఫ్ఘన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని తప్పించుకోవడం సాధ్యంకాదు” అంటూ పాకిస్తాన్ ఆక్రోశం వెళ్లగక్కింది.

“గత నాలుగు దశాబ్దాలుగా దాదాపు నలుగురు మిలియన్ల అఫ్గన్ పౌరులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు అఫ్గానిస్థాన్​లో శాంతి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్​లో అనధికారికంగా నివసిస్తున్న అప్గాన్ పౌరులు తిరిగి తమ దేశానికి వెళ్లాలి. ఇతర అన్ని దేశాల మాదిరిగానే, తమ భూభాగంలో ఉన్న విదేశీ పౌరుల నివాసాన్ని నియంత్రించే హక్కు పాకిస్థాన్​కు కూడా ఉంది” అని విదేశాంగ కార్యాలయం పేర్కొంది.

ఇక రెండు దేశాల మధ్య సామాజిక,ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు వాణిజ్యం, ఆర్థిక, అనుసంధాన సదుపాయాలను పాకిస్థాన్​ విస్తరించిందని పేర్కొంది. అయితే, పాకిస్థాన్ తన పౌరుల భద్రతను కాపాడే బాధ్యత కలిగి ఉందని చెప్పింది. పాకిస్థాన్​కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు తన భూభాగాన్ని ఉపయోగించకుండా అప్గాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు విదేశాంగ కార్యాలయం నొక్కి చెప్పింది.

దాయాది దేశం పాకిస్థాన్​తో ఘర్షణల వేళ అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ గురువారం భారత్‌ పర్యటనకు వచ్చారు. అక్టోబర్ 10న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్​తో భేటీ అయ్యి, వివరణాత్మక చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఇరువురు మంత్రులు అభివృద్ధి సహకార ప్రాజెక్టులలో, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, ప్రజా మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాల్లో అఫ్గాన్​కు భారత్ సహకారంపై మాట్లాడుకున్నారు. మరోవైపు, పర్యటకులపై పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు, అలాగే భారత ప్రజలు, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకు అఫ్గాన్​కు కృతజ్ఞతలు తెలియజేశారు జైశంకర్.

ఈ క్రమంలో భారత్‌పై ఉగ్రవాద దాడులు లేదా భారత వ్యతిరేక దాడులకు తమ భూభాగాన్ని ఎప్పటికీ అనుమతించబోమని ముత్తాఖీ స్పష్టం చేశారు. భారత్‌ను మిత్రదేశంగా భావిస్తామని, పరస్పర గౌరవం, వాణిజ్యం, ప్రజా సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదం పాకిస్థాన్​ అంతర్గత సమస్య అని ముత్తాఖీ చేసిన వ్యాఖ్యలను ఇస్లామాబాద్ కూడా తోసిపుచ్చింది.

లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్ఏపీ మంత్రివర్గ సమావేశంలో  లులూ గ్రూప్‌కు భూకేటాయింపుపై ...
11/10/2025

లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్

ఏపీ మంత్రివర్గ సమావేశంలో లులూ గ్రూప్‌కు భూకేటాయింపుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు ప్రశ్నలు లేవనెత్తిన్నట్లు తెలుస్తున్నది. మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు రావడంతో లులూ సంస్థ తమ పెట్టుబడుల విషయంలో కోరుతున్న అంశాలు, షరతుల పైన అధికారులు వివరించారు. వాటిపై పవన్‌ కల్యాణ్‌ వరుస ప్రశ్నలు సంధించారు. పలు సందేహాలు లేవనెత్తారు.

మెగా ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? అని ప్రశ్నించారు. అలా చేస్తే తాము వ్యతిరేకమని పవన్ తేల్చి చెప్పారు. అదే విధంగ లులూ లో ఉద్యోగాల పైన పవన్ కీలక సూచనలు చేశారు. స్థానికులకు ఏమాత్రం అవకాశం ఇస్తారని నిలదీశారు. మంత్రివర్గ సమావేశంలో లులూ సంస్థకు కేటాయింపులు, మినహాయింపుల పైన చర్చ సమయంలో కృష్ణాజిల్లా మల్లవల్లి మెగా ఫుడ్‌ పార్కులో లులూగ్రూప్‌లో భాగమైన మెస్సర్స్‌ ఫెయిర్‌ ఎక్స్‌పోర్ట్స్‌కు 7.48 ఎకరాలను కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది.

దీంతో ఆహారశుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా? అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఆహారాన్నే శుద్ధి చేస్తారని అధికారులు బదులివ్వగా ఆహారశుద్ధి అని ఊరికే అంటే కుదరదు, అక్కడ అసలు ఏం పని చేస్తారు? కూరగాయలు, పండ్లు సాగుచేస్తారా? ఉద్యానవన పంటలు సాగుచేస్తారా? లేక కబేళాను నిర్వహించి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా? అని పవన్‌ సూటిగా ప్రశ్నించారు.
ఇదే సమయంలో గోవధ జరగడానికి వీల్లేదని, ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని పవన్ తేల్చి చెప్పారు. దీంతో అధికారులు నీళ్లు నమిలారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని రాష్ట్ర పరిధిలో ఎక్కడా గోవధ జరగడానికి వీల్లేదని, అలాంటి వాటిని అనుమతించబోమని స్పష్టంచేసినట్లు సమాచారం. అక్కడ ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.


మామిడి, బొప్పాయి వంటి పండ్లు మాత్రమే ప్రాసెస్‌ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత లులూ గ్రూప్‌ వ్యవహారశైలి, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంటల్‌ అగ్రిమెంట్లు వంటి పలు కీలక అంశాలను పవన్‌ ప్రస్తావించారు. లీజు మొత్తాన్ని 5 సంవత్సరాలకు 5 శాతం మాత్రమే పెంచడం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రస్తావించారు. నిబంధనల ప్రకారం 3 ఏళ్లకు 10 శాతం పెంచాలి కదా? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
కాగా, రాష్ట్రంలోని విశాఖపట్నం ముంబై తరహాలో అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఐటీ హబ్​గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. 2028 నాటికి విశాఖలో వేలాది ఐటీ ఉద్యోగాలు వస్తాయని భవిష్యత్తులో విశాఖ ప్రత్యేక నగరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
పశ్చిమలో ముంబై ఎలాంటి మహానగరమో తూర్పులో విశాఖ అంతటి మహానగరంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. వచ్చే15ఏళ్లలో విశాఖ మహా నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతుందని తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా ప్రస్తుతం 4.7లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్యను 10 లక్షలకు పెంచాలని అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటంతో పాటు రైల్వే జోన్ సాధన వంటి అంశాలు ప్రజల్లోకి తీసుకోవాలని సూచించారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when Nijam Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nijam Today:

  • Want your business to be the top-listed Media Company?

Share