GeeTv Telugu News

  • Home
  • GeeTv Telugu News

GeeTv Telugu News Hai Friends welcome to geetv telugunews
this is an unique channel, here we make your geetv telugun

28/05/2025
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహానాడు వేదికగా చంద్రబాబు గారు ...
28/05/2025

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహానాడు వేదికగా చంద్రబాబు గారు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసారు.




కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నూతన గృహప్రవేశంకుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంప...
25/05/2025

కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నూతన గృహప్రవేశం

కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులతో పాటు కార్యక్రమంలో, నాయకులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కొత్త ఇంట్లో పాలు పొంగించిన బ్రాహ్మణి

మంత్రి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కొత్త ఇంట్లో పాలు పొంగించారు. ఈ సందర్భంగా, కుప్పం గృహ ప్రవేశానికి నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ సొంతింటి పండుగలా పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందని బ్రాహ్మణి పేర్కొన్నారు. ఇంత మంది ఆత్మీయుల ఆశీర్వాదం అందుకోవడం నిజంగా అదృష్టం అని, వారి అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

07/05/2025
07/05/2025

ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్, డ్రోన్ల ద్వారా దాడి చేశాం: వింగ్ కమాండర్

పాకిస్థాన్, పీవోకేలోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేశామని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్న స్థావరాలపై అటాక్ చేశామన్నారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్, డ్రోన్ల ద్వారా దాడి చేశామని పేర్కొన్నారు. ఇందులో సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం కలగలేదని వివరించారు.

04/05/2025

హైదరాబాద్ :ఈదురుగాలులకు ధ్వంసమైన నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్..!

భయాందోళన పరుగులు తీసిన ప్రయాణికులు...

మూడు నెలల కింద రైల్వే స్టేషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అట్టహాసంగా ప్రారంభించిన ప్రధాని మోడీ...

ఈదురు గాలులకు ఇలా అయితే..? భారీ వర్షం వస్తె ఇంకేం జరుగుతుందో.

30/04/2025

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో మృత్యు ఘోష...!!

గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ₹300 టికెట్‌ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు....

31/01/2025

For More Videos and NEWS Updates Please S U B S C R I B E To Our GEE NEWS YouTube Ch...

Address


Alerts

Be the first to know and let us send you an email when GeeTv Telugu News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GeeTv Telugu News:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share