Visalaandhra Publishing House

  • Home
  • Visalaandhra Publishing House

Visalaandhra Publishing House VISALAANDHRA PUBLISHING HOUSE
Chandram Buildings C.R.Road Chuttugunta
Vijayawada-520004
Ph 9059617089

02/05/2025
పాఠకులందరికీ, మా ప్రచురణకర్తలందరికీ, మరియు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు.  ఈ భోగి రోజు మీ కుటుంబాలకు,...
13/01/2025

పాఠకులందరికీ, మా ప్రచురణకర్తలందరికీ, మరియు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు.

ఈ భోగి రోజు మీ కుటుంబాలకు, స్నేహితులకు కొత్త వెలుగులు నింపాలని, మీ జీవితాల్లో కొత్త ఆరంభాలకు దారులేసాలని ఆశిస్తున్నాము.

తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి, సంప్రదాయాలకు విశాలాంధ్ర సేవలు ఎప్పటికీ కొనసాగుతాయి.

మీ జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, ఆరోగ్యం, శాంతి నిండిపోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

విజయవాడ పుస్తక మహోత్సవంలో బుధవారం భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు రచించిన పుస్తక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కా...
08/01/2025

విజయవాడ పుస్తక మహోత్సవంలో బుధవారం భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు రచించిన పుస్తక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, పెనుగొండ లక్ష్మీనారాయణ, శారచ్చంద్ర జ్యోతిశ్రీ, బి. తులసీ దాస్, ఆకుల అమరయ్య, న్.వెంకట్రావ్, సమ్మెట నాగ మల్లేశ్వర రావు, చందు జనార్ధన్, సి.హెచ్ సతీష్, బుక్ ఫెస్టివల్ కార్యదర్శి మనోహర్ నాయుడు, చవా రావి, పాఠకులు, సాహితీ ప్రేమికులు హాజరయ్యారు. చలపతిరావు గారి రచన భారతీయ జర్నలిజం, సాహిత్యం, సామాజిక అంశాలపై లోతైన అవగాహనను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆవిష్కరణ సందర్భంగా అతిథులు పుస్తకంలోని ప్రత్యేకతలను మరియు చలపతిరావు గారి రచనా శైలిని కొనియాడారు.

కూడూ, గుడ్డా, నీడా మనిషి స్వేచ్ఛకు సంబంధించిన మూడు త్రిముఖపార్శ్వాలు. అవి మనిషి మనుగడకు అవసరమైన ఎంతో ముఖ్యమైన స్వేచ్ఛలు....
06/01/2025

కూడూ, గుడ్డా, నీడా మనిషి స్వేచ్ఛకు సంబంధించిన మూడు త్రిముఖ
పార్శ్వాలు. అవి మనిషి మనుగడకు అవసరమైన ఎంతో ముఖ్యమైన స్వేచ్ఛలు. అయితే వీటితోనే మనిషి సంపూర్ణమైన మానవ జీవితాన్ని పొందడం సాధ్యం కాదు. పరిపూర్ణ మానవ జీవికకు అవసరమైన స్వేచ్ఛలు అనేకం. వివిధ పార్శ్వాలుగా ఉండే స్వేచ్ఛలతో నిండైనా జీవితం వైపు సాగడమన్నది సాపేక్షమైన ఒక క్రమం. కానీ రాజ్య అభీష్టంతో విభేదించిన లేక దానికి భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నా తనకుండవలసిన సాపేక్ష స్వేచ్ఛ కూడా వ్యక్తికి దూరమైపోతుంది. అది ఎలానో అన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యమే 'బీటలు వారిన స్వేచ్ఛ.' తన సామాజిక, ఆర్ధిక, వైజ్ఞానిక నేపథ్యాన్ని కాదనుకొని అధోఃజగత్తు సహోదరుల కొరకు నాలుగు దశాబ్దాలుగా శ్రమించిన వ్యక్తి కృషి ఏవిధమైన అభినందలు అందుకోలేదు. పైగా అలాంటి నిస్వార్ధ సేవలు అందించిన వ్యక్తి జీవితం నిష్కారణంగా దశాబ్ద కాలం పాటు జైలు పాలైంది. అమానుషంగా అవమానకరమైన జైలు జీవితాన్ని దాదాపు పది సంవత్సరాలు గడిపి నిరపరాధిగా బయటపడిన సామాజిక మేథోజీబీ కోబడ్ గాంధీ రాజకీయ జ్ఞాపకాల దొంతరే ఈ గ్రంథం. స్వేచ్ఛ కొరకు పరితపించే ప్రతి ఒక్కరూ అవశ్యంగా చదవవలసిన పుస్తకమిది.

1963 - టీనేజ్ భారతం- రాజమండ్రి- కలిసారు వాళ్లిద్దరు. ఒకే కుగ్రామంలో ఒకే సమయంలో పుట్టినవారు. వేయేళ్లపరిణామాలలో విడివిడిగా...
06/01/2025

1963 - టీనేజ్ భారతం- రాజమండ్రి- కలిసారు వాళ్లిద్దరు. ఒకే కుగ్రామంలో ఒకే సమయంలో పుట్టినవారు. వేయేళ్ల
పరిణామాలలో విడివిడిగా పెరిగినవారు. వలసపాలనలో బీజం పడిన సార్వత్రిక విద్యావిధానంతో యాదృచ్చికంగా కలిసినవారు.
నిర్హేతుక అనురాగంతో ఒకటయ్యారు. ఒకరికి ఒకరు అయ్యారు. ఆ బంధం కలకాలం నిలిచిందా?
మంచి సమాజం కోసం కలవరించారు. ఒకరితో ఒకరు కలగలసిపోవాలని ప్రయత్నించారు. అలాగే ఉన్నారా? 'ప్రపంచ ప్రచ్ఛన్న యుద్ధం' ముగించి 'ప్రచ్ఛన్న విభజన' మంత్రపఠనం ఆరంభించారు పెత్తందార్లు.
గతపు గంతల ఉత్పత్తి చేపట్టారు. మార్పుని మళ్లించటానికి వ్యూహం తలపెట్టారు.
వేల సంవత్సరాల పరిణామాలు, రెండు వందల ఏళ్ల పరపాలనా పరిణామాలు అమ్మకం. వస్తువులు అయ్యాయి.
ఇందులో లాభాలు ఏవి? ఎవరివి? అధికార తృప్తి కొందరిది.. సంపద పోగేత కొందరిది. నాయకులని మీసాలు దువ్వుడు. వ్యాపారులవి ముసిముసి నవ్వులు.
వర్తమాన భారతానికి మూలాలు ఆ అమ్మకంలో ఉన్నాయి. ఆ వ్యాపారాన్ని వ్యతిరేకించేవారే దాని ప్రచారకర్తలు. దాన్ని నిరసించేవారే కొనుగోలుదార్లు. 'వ్యక్తిగత రాజకీయాధికారం' ఒక్కటే 'సమూహ రాజకీయాధికారం' అనే రేపర్లో సరుకులు చెల్లిపోతున్నాయి.
60 ఏళ్ల ఈ పరిణామాలలో మనుషులుగా కలవాలనుకున్న ఆ ఇద్దరూ ఏమయ్యారు?
బీటలు వారుతున్న బంధంలో ఒకడు ఒకడిని కోరినదేమిటి? శవసంస్కారమా? సిల్లీ కోరికా? దేనికైనా ప్రతీకా?
రండి!
వాళ్లిద్దరూ చేసిన ప్రయాణంలో పాల్గొందాం! వాళ్లు చేసుకున్న చర్చల్లో పొందిన ఉద్వేగాలలో పాల్గొందాం! పరిణామంలో భాగంగా సాగిన విప్లవాల ఎత్తుపల్లాలను కందాం! పరిణామాన్ని ఆకళింపుచేసుకుందాం!
'వాడూ.. నేనూ' చదువుదాం!

స్వాతంత్ర్యోద్యమ సమరంలో ముగ్గురు కుటుంబ సభ్యులను జైలుకి పంపిన దేశ భక్తుల ఇంట్లో - మూడు తరాలుగా విప్లవ సాహిత్య చర్చలకు వే...
06/01/2025

స్వాతంత్ర్యోద్యమ సమరంలో ముగ్గురు కుటుంబ సభ్యులను జైలుకి పంపిన దేశ భక్తుల ఇంట్లో - మూడు తరాలుగా విప్లవ సాహిత్య చర్చలకు వేదికగా నిలిచిన ముంగిట్లో - ఛాందసాన్ని వెలివేసిన పండిత కుటుంబంలో - 1933లో - తూర్పుగోదావరి జిల్లా ముంగండలో జననం. 1953-55లో ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఫిజిక్సులో మాస్టర్స్ డిగ్రీ : 1960-63లో మాస్కో యూనివర్శిటీ నుంచి డాక్టరేటు డిగ్రీ తీసుకున్నారు. 1969-71లో స్వీడన్లోని ఉప్పలా ఆయనోస్ఫెరిక్ అబ్జర్వేటరీలోనూ; 1974-75లో బల్గేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లోనూ, 1981-82లో ఇంగ్లండులో యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ వేల్స్లోనూ స్పేస్ రీసెర్చి చేశారు. ఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ లేబరేటరీలో డిప్యూటీ డైరెక్టరుగా అంతరిక్ష పరిశోధనచేస్తూ, 18 రాకెట్టు ప్రయోగాలలో పాల్గొని, 1993లో రిటైరు అయ్యారు.
15వ ఏటనుంచీ కవిత్వ రచనలో ప్రవేశం ఉన్న నళినీమోహన్ పాపులర్ సైన్సులో 30 పుస్తకాలు, పిల్లలకోసం 16 పుస్తకాలు, పద్యకావ్యాలు 4 ప్రచురించారు. వివిధ తెలుగు పత్రికలలో వీరి రచనలు 1600లకు పైగా ప్రచురితం అయ్యాయి. 1968లో కవికోకిల దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన బహుమతిని, వైజ్ఞానిక రచనల ద్వారా ప్రజాబాహుళ్యానికి సైన్సుమీద అభిమానం కలిగిస్తున్నందుకు 1986లో ఇందిరాగాంధీ విజ్ఞాన బహుమతిని ప్రప్రథమంగానూ అందుకున్నారు. ఆంధ్రజ్యోతి వీక్లీ నిర్వహించిన బాలెట్లో 1986లో "తెలుగువారిలో ప్రముఖవ్యక్తి"గా ఎన్నిక అయారు. 1992లో పిల్లలలో సైన్సు భావాల వ్యాప్తికి ఉత్తమ కృషి చేస్తున్నందుకు N.C.S.T.C. వారిచే జాతీయ అవార్డును అందుకున్నారు. 1993లో హాస్యరచనలకై తెలుగు యూనివర్శిటీ వారి బులుసు బుచ్చి సుబ్బారాయుడు ప్రతిభా పురస్కారాన్ని; 1994లో నన్నపనేని మంగాదేవి బాల సాహిత్య పురస్కారాన్ని ప్రప్రథమంగానూ అందుకున్నారు.
సుప్రసిద్ధ నవలా రచయిత, జర్నలిస్టు శ్రీ మహీధర రామమోహనరావుగారు వీరి తండ్రి. బహుగ్రంథ కర్త శ్రీ మహీధర జగన్మోహనరావుగారు వీరి పినతండ్రి.

03/01/2025

Address


Opening Hours

Monday 10:00 - 18:30
Tuesday 10:00 - 18:00
Wednesday 10:00 - 18:00
Thursday 10:00 - 18:00
Friday 10:00 - 18:00
Saturday 10:00 - 18:00

Telephone

+919059617089

Alerts

Be the first to know and let us send you an email when Visalaandhra Publishing House posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Visalaandhra Publishing House:

Shortcuts

  • Address
  • Telephone
  • Opening Hours
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share

VISALAANDHRA PUBLISHING HOUSE

Leading Publisher, Book sellers and Distributors in Andhra Pradesh and Telangana States.