Eagle Media Works

Eagle Media Works A Quality Production house for media works, A Creative Media Which Handles All Types of Videos, Seri

Thank you for watching Our videos For more updates like, comment, share. DISCLAIMER: The information provided on this Page and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our Page is our own creativity.

రాజనాల తెలుగు సినిమాల్లో ఒకే ఇంటిపేరుతో ఒకే టైమ్ లో ఇద్దరు విలన్లు ఉండేవారు. అందులో ఒకరు ఒంటి పేరుతోనే పాపులర్ అయితే రెం...
06/09/2025

రాజనాల
తెలుగు సినిమాల్లో ఒకే ఇంటిపేరుతో ఒకే టైమ్ లో ఇద్దరు విలన్లు ఉండేవారు. అందులో ఒకరు ఒంటి పేరుతోనే పాపులర్ అయితే రెండో వారు ఇంటి పేరుతో పాపులర్ అయ్యారు.
మొదటి వారు ఆర్.నాగేశ్వరరావు. రెండవ వారు రాజనాల గా పాపులర్ అయిన కల్లయ్య ఉరఫ్ కాళేశ్వరరావు. ఇద్దర్నీ తెలుగు సినిమా రంగం బాగానే ఆదరించింది.
ఆర్.నాగేశ్వరరావు ఇంటిపేరు రాజనాల అని సాధారణ ప్రేక్షకులకు తెలియదు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఇద్దరు రాజనాలలూ దూరపు బంధువులు కూడా. తెలుగు సినిమా తొలి గ్లామరస్ విలన్ ఆర్.నాగేశ్వర్రావు. తన ఇంటిపేరు తెలియాలని తనే అనుకోలేదు.
అలీఘర్ యూనివర్సిటీలో చదువుకు స్వస్తి చెప్పాక పూర్ణా అండ్ ప్రిమియర్ డిస్ట్రిబ్యూషన్ సంస్ధలో మేనేజరుగా చేరాడు.
అక్కడ మానేసి సికిందరాబాద్ వచ్చేశారు.
పారమౌంట్ థియేటర్ లో మేనేజరుగా పనిచేశారు. అక్కడ నచ్చక మళ్లీ ప్రీమియర్ కు తిరిగి వెళ్లారు.
ప్రీమియర్ సంస్ధ విజయా వారి చిత్రాలను పంపిణీ చేసేది. ఆర్.నాగేశ్వరరావు పర్సనాల్టీ చూసిన చాలా మంది నువ్వు సినిమాల్లో నటించకూడదూ అనేవారు. కానీ తను ఇంట్రస్టు చూపించేవాడు కాదు.
ప్రీమియర్ కంపెనీ పనిమీదే విజయా వాహినీ స్టూడియోలో జరుగుతున్న షావుకారు షూటింగుకు హాజరయ్యారు ఆర్.నాగేశ్వరరావు.
అక్కడే డైరక్టర్ ఎల్వీ ప్రసాద్ ను కలసి నేను సినిమాలకు పనికొస్తానా అని అడిగారట. ఆయన ఓ సారి పైకీ కిందకీ చూసి ఎందుకు పనికిరావూ బానే ఉన్నావుగా కాస్త వాచికం … నటనా గురించి తెలుసుకో చాలు … సినిమా నటులు కావాలంటే ఉత్సాహంతో పాటు అబ్జర్వేషను ఉంటే చాలు అని తన పనిలో తాను పడిపోయారట.
ప్రీమియర్ వారు మాత్రం ఆర్.నాగేశ్వరరావు సినిమాల్లోకి పోతే కష్టమౌతుందని ఆపేందుకు ప్రయత్నించారు.
అయినా నాగేశ్వరరావు తన మిత్రుడైన పూర్ణా పిక్చర్స్ కామరాజు తో విషయం చెప్పారు. ఆయన సినిమాల్లోకి వెళ్లడమే బెటరని ఎడ్వైజ్ చేయడమే కాకుండా బి.ఎ సుబ్బారావును కలవమని ఓ ఉత్తరం రాసిచ్చి మరీ మద్రాసు పంపారు.
పూర్ణా కామరాజు ఉత్తరం చూసిన సుబ్బారావుగారు అప్పటికి తను ప్లాన్ చేస్తున్న రాజు పేద చిత్రంలో విలన్ వేషానికి కన్ఫర్మేషన్ ఇచ్చారు.
అయితే ఆర్.నాగేశ్వరరావుకి వేషం దొరికింది రాజు పేదలోనే అయినా మొదటగా రిలీజైన సినిమా మాత్రం సంక్రాంతి.
చమ్రియా వారు సి.పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన సంక్రాంతిలో పాపారావు పాత్రలో ఆర్.నాగేశ్వరరావు నటన ఇండస్ట్రీ పెద్దల్ని ఆకట్టుకుంది.
చెరపకురా చెడేవు, కన్నతల్లి చిత్రాల్లో వెంటనే అవకాశం వచ్చింది.
దొంగరాముడు, పెళ్లినాటి ప్రమాణాలు చిత్రాలతో పాపులార్టీ పెరిగిపోయింది. దొంగరాముడులో రావోయి మా ఇంటికీ పాటతో స్టార్ విలనైపోయారు.
అదే సినిమాలో నాగేశ్వరరావు ఊతపదం బాబులుగాడి బెబ్బ గోలకొండ అబ్బా అనాలి కూడా మారుమ్రోగింది.
దేవదాసులో అక్కినేని సోదరుడుగా నటించారు ఆర్.నాగేశ్వరరావు.
కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాబజార్ లో దుశ్శాసనుడుగా నటించి భళా మామ భళా … అదే మన తక్షణ కర్తవ్యం అనే డైలాగుతో పాపులర్ అయ్యారు.
అప్పు చేసి పప్పుకూడులో అదే దెబ్బ డైలాగు చాలా పాపులర్.
చాలా ఫాస్ట్ గా యాభై సినిమాలు పూర్తి చేశారు ఆర్.నాగేశ్వరరావు.
పాలిష్డ్ విలనీ చాలా సినిమాల్లో చేశారాయన. వాటిలో ఇల్లరికం, దొంగల్లో దొర , ముందడుగు తదితర చిత్రాలున్నాయి.
తన కెరీర్ లో చంద్రహారం లాంటి జానపద చిత్రాలతో పాటు భక్తశబరి తదితర పౌరాణిక చిత్రాలు కూడా చేశారాయన.
జస్ట్ మూడు పదులు నిండని వయసులోనే అంతులేని పాపులార్టీ సంపాదించిన అరెస్టింగ్ పర్సనాల్టీ అతనిది.
వేట అంటే చాలా ఉత్సాహం చూపించే ఆర్.నాగేశ్వరరావుకు ఓ సారి అడవిలో పులి ఎదురయ్యింది. దాన్ని కారుతో గుద్దేశారు. పులి చచ్చిపోయింది. కారు తలకిందులయ్యింది. ఆర్.నాగేశ్వరరావు తలకు బలంగా దెబ్బలు తగిలాయి.
ఆ గాయాలు తగ్గాయిగానీ సిగరెట్ల అలవాటు వలన క్షయ వ్యాధికి గురై 33 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు.
ఆర్.నాగేశ్వరరావు మరణానంతరం రాజనాల హవా ప్రారంభమయ్యింది.

*నిజమే కదా మరి*...  1. ఇది గడియారాన్ని తినేసింది 2. ఇది టార్చ్ లైట్‌ను తినేసింది 3. ఇది పోస్టు కార్డుల్ని తినేసింది 4. ఇ...
04/09/2025

*నిజమే కదా మరి*...
1. ఇది గడియారాన్ని తినేసింది
2. ఇది టార్చ్ లైట్‌ను తినేసింది
3. ఇది పోస్టు కార్డుల్ని తినేసింది
4. ఇది పుస్తకాల్ని తినేసింది
5. ఇది రేడియోను మింగేసింది
6. ఇది టేప్‌రికార్డర్‌ను తినేసింది
7. ఇది కెమెరాను మాయం చేసింది
8. ఇది కాలిక్యులేటర్‌ను తినేసింది
9. ఇది ఇరుగుపొరుగుతో దోస్తీ తినేసింది
10. ఇది బంధుత్వాల్ని తినేసింది
11. ఇది మన మెమొరీని తినేసింది
12. థియేటర్ లేదు నాటకం లేదు,
టీవీ లేదు, ఆట లేదు, పాట లేదు...
ఇదే బ్యాంకు,
ఇదే హోటల్,
ఇదే కిరాణ షాపు...
ఇదే డాక్టర్,
ఇదే జ్యోతిష్కుడు...
అసలు మార్కెట్ అంటేనే ఇది...
బయటికి వెళ్తే కదా...
అంతా వర్క్ ఫ్రమ్ ఫోన్...
అంతా స్మార్ట్ ఫోన్‌దే రాజ్యం...
మనిషి పిచ్చోడవుతుంటే ఫోన్ స్మార్ట్‌గా మారుతోంది.
వేలు ప్రపంచాన్ని, మనిషి జీవితాన్ని శాసిస్తోంది...
నోరు మ్యూట్‌లో ఉంది...
ఎస్, నిజమే... టచ్‌తోనే జీవితం...
కానీ ఎవరూ టచ్‌లో లేరు... నిజమే కదా ....

17/08/2025

4500 మంది పిల్లలకు గుండే ఆపరేషన్స్ చేయించిన మహేష్ బాబు
గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు.!

చిరంజీవి గారు నటించిన ఈ సినిమా పేరు ఏంటో చెప్పగలరా...?
05/08/2025

చిరంజీవి గారు నటించిన ఈ సినిమా పేరు ఏంటో చెప్పగలరా...?

01/08/2025

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు

71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉంది. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకం. ఆ చిత్ర దర్శకుడు శ్రీ అనిల్ రావిపూడి, నిర్మాతలు శ్రీ సాహు గారపాటి, శ్రీ హరీష్ పెద్దిలకు అభినందనలు. ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్. చిత్రంగా ‘హను-మాన్’ చిత్రం నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు శ్రీ ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్.నిపుణులకు, నిర్మాతకు అభినందనలు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా శ్రీ నీలం సాయి రాజేష్ (బేబీ చిత్రం), ఉత్తమ గీత రచయితగా శ్రీ కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడుగా శ్రీ పి.వి.ఎన్.ఎస్.రోహిత్ (బేబీ), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ గా శ్రీ నందు పృథ్వీ (హను-మాన్), ఉత్తమ బాల నటిగా సుకృతివేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) పురస్కారాలకు ఎంపికైనందుకు వారికి హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారాలు చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయి.
జాతీయ ఉత్తమ నటులుగా శ్రీ షారుక్ ఖాన్, శ్రీ విక్రాంత్ మాస్సే, ఉత్తమనటిగా శ్రీమతి రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడుగా శ్రీ సుదీప్తో సేన్, ఇతర పురస్కార విజేతలకు అభినందనలు.
ఫౌండర్ చైర్మన్ ఈగల్ మీడియా

31/07/2025

చిరంజీవి గారు అన్న ఆ మాటకి ఏడుపొచ్చింది | Eagle Media Works

30/07/2025

నందమూరి బాలయ్య 6 బెస్ట్ సినిమాలు | Eagle Media Works

Director   along with   visited   sets, cherishing moments with Darling  .
29/07/2025

Director along with visited sets, cherishing moments with Darling .

29/07/2025

కెజిఫ్ లో సినిమాలో ఆ డైలాగ్ చెప్పినప్పుడే | Eagle Media Works

28/07/2025

రాజీవ్ కనకాల తో ముచ్చట్లు | Eagle Media Works

27/07/2025

నాగ మహేష్ ఉప్పెన గోవింద గా ఎలా మారాడు | Eagle Media Works

26/07/2025

RGV గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ | Eagle Media Works

Address

Uppal

Opening Hours

Monday 9am - 5pm
6pm - 7pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
6pm - 7pm

Telephone

+914027155589

Alerts

Be the first to know and let us send you an email when Eagle Media Works posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Eagle Media Works:

Share