DDNewsAndhra - అధికారిక ఖాతా

DDNewsAndhra - అధికారిక ఖాతా Official DD NEWS ANDHRA PRADESH

13/07/2025

♦దూరదర్శన్ రోబోకాన్ ఇండియా.. జాతీయ రోబోటిక్స్ పోటీలు న్యూఢిల్లీలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.
♦ఈ పోటీలకు ఐఐటీ ఢిల్లీ ఆతిథ్యమిస్తోంది.
♦దాదాపు 800 మంది విద్యార్థులు పాల్గొంటున్న ఈ పోటీల్లో మొత్తం 40 జట్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నాయి.
♦ఈ ఏడాది పోటీలు "బాస్కెట్‌బాల్" థీమ్ ఆధారంగా నిర్వహించబడుతున్నాయని ఐఐటీ ఢిల్లీ తెలిపింది.

13/07/2025

♦బౌద్ధ మతంలో విశిష్ట స్థానం కలిగిన 14వ దలైలామా 90వ జన్మదినాన్ని పురస్కరించుకుని.. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ప్రత్యేక సదస్సును న్యూఢిల్లీలో నిర్వహించింది.
♦ఈ కార్యక్రమంలో దలైలామా ఆధ్యాత్మిక జ్ఞానం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ప్రభావం, బౌద్ధ మతాభివృద్ధికి, భారతదేశానికి అంతర్జాతీయ సమాజానికి అందించిన సేవలను స్మరించారు.

13/07/2025

♦ప్రఖ్యాత టెన్నిస్ టోర్నమెంట్ అయిన వింబుల్డన్‌లో పోలాండ్‌కు చెందిన టెన్నిస్ స్టార్‌ ఇగా స్వియాటెక్ అద్భుతమైన ప్రదర్శనతో తన తొలి టైటిల్‌ను సాధించారు.
♦ఫైనల్‌లో ఆమె అమెరికాకు చెందిన అమాండా అనిసిమోవాను 6-0, 6-0 తేడాతో ఓడించి విజేతగా నిలిచారు.

13/07/2025

♦హిమాచల్ ప్రదేశ్‌ లోని చంబా లో మణిమహేశ్ యాత్ర ఈ సంవత్సరం ఆగస్టు 16న అధికారికంగా ప్రారంభం కానుంది.
♦ఈ పవిత్ర యాత్రను దృష్టిలో ఉంచుకుని, జూలై 15 నుంచి 30 వరకు హడ్సార్‌ నుండి మణిమహేశ్ డల్ సరస్సు వరకు ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

13/07/2025

♦గుజరాత్ ఖేడా లోని సలోన్ లో మహిళలకు కృత్రిమ ఆభరణాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు.
♦మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం కేంద్ర సామాజిక సంక్షేమ శాఖ సహకారంతో “ప్రయత్న్” సంస్థ ఆధ్వర్యంలో SEED ప్రాజెక్ట్ నిర్వహించారు.

13/07/2025

♦అక్షియం-4 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) మిషన్ లోని అంతరిక్షయాత్రికులు జూలై 15న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు భూమిపైకి తిరిగి చేరనున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

13/07/2025

♦భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. సింగపూర్‌లో పర్యటిస్తున్నారు.
♦ఈ సందర్బంగా సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సమావేశమయ్యారు.
♦తన పర్యటనలో భాగంగా టెమాసెక్ హోల్డింగ్స్‌ చైర్మన్ టియో చీ హీన్‌తో కూడా భేటీ అయ్యారు.

13/07/2025

♦ప్రముఖ సినీనటుడు, మాజీ బీజేపీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
♦ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు మరణం బాదాకరమని.. ఆయన తన సినీ ప్రతిభ, విభిన్న పాత్రల పోషణతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.

13/07/2025

♦విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు భక్తులు ఆషాడం సారె సమర్పిస్తున్నారు.
♦ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

13/07/2025

♦విజయవాడలోని బెరం పార్కు వద్ద మున్సిపల్ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లోర్ పెయింటింగ్ పోటీలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు.

13/07/2025

♦రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసిన నలుగురు సభ్యులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు.

Address

Vijayavada

Alerts

Be the first to know and let us send you an email when DDNewsAndhra - అధికారిక ఖాతా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DDNewsAndhra - అధికారిక ఖాతా:

Share