
28/05/2024
నందమూరి తారకరామారావు గారి
జయంతిని పురస్కరించుకుని..
యుగ పురుషుడు-
నందమూరి నాయకుడు
—— —— ——
విశ్వ విఖ్యాతుడిగా
నట సార్వభౌముడిగా
రాజకీయ చాణుక్యుడిగా!
రాముడిగా కృష్ణునిగా
తెలుగు ప్రజల దేవుడిగా
విరాజిల్లిన ఓతారకరామా!
కళారంగంలో నీవు
వేయని పాత్ర లేదు!
సేవారంగంలో నీవు
చేయని సహాయం లేదు!
రాజకీయ రంగంలో
నీవంటి నేత లేడు!
దేశ రాజకీయంలో
నీకు పోటీయే లేడు!
ఇందుగలడందు లేడని
సందేహం వలదు అని
నిరూపించిన ఏకైక
మహాపురుషుడి వయ్యా!
రాజకీయ కోణంలో
అష్టకష్టాలు ఎదుర్కొని
ప్రజల నీరాజనాలు అందుకున్న
యుగపురుషుడి వయ్యా!
నీదోక ప్రత్యేక రాజ శకం!
అది తెలుగువారి అదృష్టం!
నీ జన్మ మాకు ఓ సూర్యోదయం!
నీమరణం జీర్ణించుకోలేని ఓఅస్తమయం!
పదకొడుమంది సంతానం కన్నా
అంతిమ ఘడియలో
అక్కున చేర్చుకున్న వారు లేరే
అనే బాధ మము కలచివేసే
చీకటి జ్ఞాపకమే!
ఏదేమైనా నీవు
అవతార పురుషుడీవే!
ఎవరే మనుకున్నా
నీవు మాకు ఆరాధ్య దేవుడివే!
నీ చరిత్ర ఈభూమి
ఉన్నంత వరకు పదిలమే!
నీవు లేకున్నా
నీ కళలకు బానిసలమే!
అందుకే నీవు యుగ పురుషుడవు!
కాగలిగావు మహా పురుషుడవు!