
27/06/2024
*Press Release*
*గన్నవరం నియోజవర్గం ఉంగుటూరు మండల పార్టీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు మండవ రమ్యకృష్ణ మృతి బాధాకరం : గన్నవరం శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు*
గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు మండవ రమ్యకృష్ణ మృతికి గన్నవరం శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు సంతాపం తెలిపారు. శిర్డీ నుండి గన్నవరం వస్తున్న రమ్యకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు.రమ్యకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.రమ్యకృష్ణ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.
***