05/09/2026
ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తాం: పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ గట్టి వార్నింగ్.. భారత సైన్యం దెబ్బ రుచి చూపిస్తామని హెచ్చరిక!
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌పై ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని, భారత సాయుధ దళాలు శత్రువుల స్వదేశీ భూభాగంలోకి నేరుగా చొరబడి మరీ దాడి చేస్తాయని ఘాటుగా స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదం, నక్సలిజం నడ్డి విరిచిందని, జమ్మూకశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు మునుపెన్నడూ లేని విధంగా శాంతి నెలకొంటోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో బలహీనమైన భారత విధానాల గురించి చర్చించుకున్న ప్రపంచ వేదికలు, ఇప్పుడు నవభారత దూకుడు, వేగవంతమైన నిర్ణయాలు, తిరుగులేని డైనమిజం గురించి ప్రశంసిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.