LV9 TV

LV9 TV LV9 TV is a one stop Telugu news channel. Focuses on a comprehensive coverage of politics, sports, entertainment, education and business.

LV9 features exclusive interviews by eminent personalities, movie promotions and other events.

24/11/2021
నవంబరులో ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, ఈశాన్య ...
23/11/2021

నవంబరులో ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, ఈశాన్య రుతువపనాలతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు వద్ద వాయుగుండం తీరం దాటిన అనంతరం చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.ఈసారి కూడా నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలపైనే తీవ్ర స్థాయిలో ప్రభావం ఉంటుందని, ఈ నెల 27 నుంచి ఆ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తాజా నివేదికలో పేర్కొన్నారు. అనంతపురం జిల్లాతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా, ఇప్పటికే నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు వరద ప్రభావంతో తల్లడిల్లాయి.

కేసీఆర్ పాలనలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందారని మంత్రే స్వయంగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవ...
23/11/2021

కేసీఆర్ పాలనలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందారని మంత్రే స్వయంగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ పాలనలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందారని మంత్రిగారు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. రైతుబీమా పథకం 59 ఏళ్ల వయస్సు లోపు వారికే వర్తింస్తుంది కనుక, సదరు 67 వేల పైచిలుకు చావులు సహజ మరణాలు కానట్టే కదా!’’ అని రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ్ తీవ్రంగా స్పందించారు. ఏపీ అసెం...
23/11/2021

ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ్ తీవ్రంగా స్పందించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను దేశం మొత్తం ఖండించాలని ఆమె అన్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల మాటలు తనను కలిచి వేశాయన్నారు. ఒక మహిళగా తోటి మహిళకు జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. దీనిపై పార్టీలకతీతంగా ప్రతీ ఒక్కరు స్పందించాలని ఆమె అన్నారు.రాజకీయాలు… పార్టీల వరకే పరిమితం అవ్వాలి, వ్యక్తిగతంగా కుటుంబాల వరకు వెళ్లొద్దని కొండా సురేఖ హితవు పలికారు.

గాల్వాన్ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కార ప్రదానం జరిగింది. ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ...
23/11/2021

గాల్వాన్ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కార ప్రదానం జరిగింది. ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్‌లో పరమవీర చక్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహావీర చక్ర పురస్కారాన్ని సంతోష్ బాబు కుటుంబ సభ్యులు తల్లి, భార్యకు అందజేశారు.

ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీనే విజయం సాధిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మం...
23/11/2021

ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీనే విజయం సాధిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. మూడో వంతు మెజార్టీ మాకే ఉందని స్పష్టం చేశారు.రైతుల జీవితాల బాగు కోసం సీఎం కేసీఆర్ తపన పడుతుంటే మీకు రాజకీయంగా కనిపిస్తుందా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తర్వాత పార్టీ తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నదని ప్రశ్నించారు.

సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఈరోజు  స్థానిక కోటా ఎమ్మెల్సీకి ఆమె నామినేషన్ దాఖల...
23/11/2021

సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఈరోజు స్థానిక కోటా ఎమ్మెల్సీకి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. కవిత వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్దన్, ఉమ్మడి జిల్లా ఎమ్మేల్యేలు ఉన్నారు. మొత్తం కవిత తరపున నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. 90 శాతం ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, వారంతా సహకరించి గెలిపిస్తారని ఆశిస్తున్నానని కవిత అన్నారు..

మరో 10 రోజుల్లో హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని..ముందే గ్రహించిన ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును  ఉపసంహరించుక...
23/11/2021

మరో 10 రోజుల్లో హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని..ముందే గ్రహించిన ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు మహాపాదయాత్ర కొనసాగించాలని సూచించారు. సీఆర్డీఏలో రాజ్‌భవన్, సెక్రటేరియట్, హైకోర్టు ఉంటాయని..గతంలో అగ్రిమెంట్ రాశారన్నారు. మూడు రాజధానులతో వస్తామని నిన్న సీఎం జగన్ స్పష్టం చేశారని, 3 రాజధానుల అంశంలో ప్రభుత్వం వెనక్కి వెళ్లేదేలేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు, రాజధానికి సంబంధం లేదని, ఇప్పటికైనా సీమ రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు.

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కడప జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగానే కడప ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చే...
23/11/2021

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కడప జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగానే కడప ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పులపుత్తూరు, మందపల్లి, గుండ్లూరులో పర్యటించనున్నారు. వరద బాధితులను పరామర్శించారు. ఎయిర్‌పోర్టు దగ్గర టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా శాసన మండలి రద్దు తీర్మాన...
23/11/2021

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా శాసన మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకుంది. మండలి రద్దు ఉపసంహరణ తీర్మానాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సభలో మంగళవారం ప్రవేశపెట్టారు.మండలి రద్దు నిర్ణయం తర్వాత సందిగ్ధత నెలకొందని తెలిపారు. దానిని తొలగించేందుకు మండలిని కొనాసాగించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఈ మధ్యాహ్నం హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ...
23/11/2021

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఈ మధ్యాహ్నం హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.కొన్ని రోజుల కిందట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతుండడంతో వైద్య పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆయన అర్థాంగి సుప్రవ హరిచందన్ కూడా కరోనా బారినపడ్డారు. దాంతో మెరుగైన చికిత్స కోసం వారిద్దరినీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. కొవిడ్ పరీక్షలో నెగెటివ్ రావడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. నేరుగా విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్నారు.

23/11/2021

PART - 1 BELLOW LINK
https://fb.watch/9shWVxmOLq/

కులం పేరుతో ఓ ప్రభుత్వ ఉద్యోగిని దూషించి దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల లో చోటు చేసుకుంది.. వివరాలు లోకి వెళ్తే మలాజి నాగార్జున ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టేట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు .. నవంబర్ 13న నాగార్జున తన కుమారుని పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో షాపింగ్ చేసి తిరిగి కంచికచర్ల వస్తుండగా రాత్రి పూట గుర్తు తెలియని దుండగులు నాగార్జున కార్ ఆపి అతని పై దాడి చేశారు ... ఈ విషయము ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ... నాగార్జున పై కులం పేరుతో దూషించి ఆతని పై దాడి చేసి అతని కారు పై అతికించిన బి.ఆర్ అంబేత్కర్ స్టికర్ కూడా చించివేసరూ ...అదేసమయం లో పోలీసులు కూడా నాగార్జున పై కర్రలతో లాఠీ చార్జ్ చేశారు .. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఏస్ఐ కూడా
పురుష పదజాలంతో బాధితుడి పై ఆగ్రహంతో ఫైర్ అయ్యారు .. దీనిపై బాధిత వ్యక్తి మాలాజి నాగార్జున ఈ సందర్భంగా సమావేశం నిర్వహించారు .. ప్రజలకి అండగా నిలబడి ఉండాల్సిన పోలీసులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని మలాజి నాగార్జున ఆవేదన చెందారు ....

Address

Vijayawada
520010

Opening Hours

Monday 9:30am - 6pm
Tuesday 9:30am - 6pm
Wednesday 9:30am - 6pm
Thursday 9:30am - 6pm
Friday 9:30am - 6pm
Saturday 9am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when LV9 TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to LV9 TV:

Share