16/08/2023
*Press Release*
Vizag.
ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్, ప్రసంగం:-
• దేశం కోసం విశాఖలో విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
• ఒక విజన్ ద్వారా పని చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి.
• దేశంలో ఫ్రీ ఫ్రం కరెప్షన్, ఫ్రీ ఫ్రం క్రైం అనేది సాక్షాత్కారం కావాలి.
• దేశంలో అనేక సంస్కరణలు తెచ్చిన వారు నాటి ప్రధాని పివి నరసింహారావు. ఆర్థిక సంస్కరణ వల్ల సంపద సృష్టింపబడుతోంది. అయితే ఆ సంపద కొందరికే పరిమితం అవుతోంది. అందుకే పేదరికం లేని సమాజం కోసం ఒక విజన్ అవసరం
• దానికోసమే విజన్ 2047 కు రూపకల్పన చేశాను.
• భారత దేశ యువత చాలా శక్తి వంతులు. వచ్చే 100 ఏళ్లు యువ శక్తిదే.
• ప్రపంచంలో భారతీయులు శక్తివంతమైన జాతిగా ఉన్నారు. వారిలో తెలుగు వారు ముందున్నారు.
• ప్రతి వ్యక్తికి...ప్రతి పౌరుడికి విజన్ ఉంటుంది. తన పిల్లలను ఎలా చదివించాలి..ఎలా తీర్చిదిద్దాలి అని ఆలోచిస్తారు. దాని కోసం ప్రణాళికలు రూపొందిస్తారు.
• అలాగే దేశానికి కూడా విజన్ ఉండాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగానే ఇండియా, ఇండియన్స్, తెలుగూస్ అని విజన్ ను రూపొందించాను.
• 2047 నాటికి ఇండియా ప్రపంచ నెంబర్ 1 ఆర్థిక శక్తిగా మారాల్సిన అవసరం ఉంది.
• డ్రాఫ్ట్ విజన్ ను ప్రజల ముందుకు తెస్తున్నాను. దీనిపై మేథావులు, నిపుణులు స్పందించాలి. తమ సూచనలు సలహాలు ఇవ్వాలి.
• ఆ ఐదు స్ట్రాటజీలు ఇవే.
• 1.గ్లోబల్ ఎకానమిగా భారత ఆర్థిక వ్యవస్థ-ప్రపంచ పౌరులుగా భారతీయులు-బహుళ జాతీయ కంపెనీలుగా భారత కార్పొరేట్లు
• 2.డెమోగ్రాఫిక్ మేనేజ్ మెంట్ – పి 4 మోడల్ సంక్షేమం
• 3.సాంకేతికత, పరిశోధన, సృజనాత్మకత (ఇన్నోవేషన్) – భావి నాయకత్వం
• 4.ఎనర్జీ సెక్యూర్ ఇండియా – డెమోక్రైజేషన్, డీకార్బనైజేషన్, డిజిటలైజేషన్
• 5.వాటర్ సెక్యూర్ ఇండియా
• సోలార్, విండ్, పప్డ్ ఎనర్జీతో తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేయవచ్చు. ప్రజలు స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. దీన్ని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా కరెంట్ చార్జీలుపెంచే అవసరం ఉండదు. ఇది దేశంలో గేమ్ చేంజర్ అవుతుంది
• నీరు అత్యంత విలువైనది. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంది.
• నదుల అనుసంధానం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. సాగు, తాగునీటి కొరత లేకుండా చేయవచ్చు. ఎపిలో గత ప్రభుత్వ హయాంలో నదుల అనుసంధానంపై ఖర్చు పెట్టాం.
• భారత దేశానికి ఉన్న యువ శక్తి, టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. దీని కోసం ప్రత్యేకమైన ప్రణాళికలతో పనిచేయాల్సిన అవసరం ఉంది.
• పి4 నే విధానం ద్వారా సమాజంలో పేదరికాన్ని రూపుమాపవచ్చు.
• దేశానికి విజన్ తో పాటు ఎపి నెంబర్ 1గా రూపొందడానికి విజన్ అమలు చేయాల్సి ఉంది
• గత ప్రభుత్వ హయాంలో విజన్ 2029 తో పనిచేశాం. రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా చేశాం.
• ఎపిని నెంబర్ 1 స్టేట్ గాతీసుకునే బాధ్యత అందరిపైనా ఉంది.
• కరప్షన్, నేరాలు లేని సమాజం తీసుకువస్తే..అప్పుడు అభివృద్ది, సంక్షేమం సాధ్యం అవుతుంది.
• ఒకప్పుడు హేళనకు గురైన దేశం...ఆర్థిక సంస్కరణల తరవాత మేటిగా మారింది.
• కోవిడ్ సమయంలో కూడా ప్రపంచంలో మంచి ఫలితాలు సాధించింది.
• ఈ రోజు ఇచ్చిన డ్రాఫ్ట్ విజన్ పై ప్రజలు మీ సూచనలు, సలహాలు తెలపాలని కోరుతున్నా. #2047