24/01/2025
రాజకీయాల్లో పవర్ఫుల్ నాయకుడు పవన్ కళ్యాణ్...
ప్రెస్ నోట్....
దశాబ్ద కాలం క్రితం పురుడు పోసుకున్న జనసేన పార్టీ 2019లో తొలిసారి ఎన్నికల పోరులో దిగి ఉత్కంఠభరితంగా ఊహించని రీతిలో పోటీ చేసిన విషయం తెలిసిందే... అప్పట్లో ఒక్క సీటు గెలిచామని నిరాశకు లోను కాకుండా మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన జనసేన పార్టీ ప్రయాణం నేడు ఆంధ్ర రాష్ట్రంలో నూటికి నూరు శాతం బలాన్ని చూపించి రాష్ట్రంలోనే సముచిత స్థానాన్ని పొందింది...
నేడు కూటమిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రభుత్వంలోనూ ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవ నేడు దేశం ప్రశంసిస్తుంది....
ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసును ఖరారు చేస్తూ ప్రకటించడం హర్షదాయకం....
నెల్లూరు జిల్లాలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు దశ నిర్దేశకంలో ముందుకు సాగుతూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.. గాజు గ్లాసు గుర్తుపై రానున్న కాలంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ మన గుర్తు ఇదే అంటూ జన సైనికులు సామాన్య జనం దృష్టిలో గాజు గ్లాసును ప్రజలోకి తీసుకెళ్లాలి..... భవిష్యత్ లో జనసేన నే కీలక స్థానం పోషించనుంది...
ఈ కార్యక్రమం లో జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, గునుకుల కిషోర్, కొట్టె వెంకటేశ్వర్లు,సుజయ్ బాబు,లాయర్ శ్రీరామ్,కృష్ణా రెడ్డి, రవి,జమీర్ జనసేన పార్టీ ఆఫీస్ ఇంచార్జి,నాగి శెట్టి మురళి కృష్ణ,పవన్ యాదవ్,మునిగిరీష్, జంపాల ప్రకాష్,అనిల్,వెంకటసుబ్బయ్య,సురేష్ నాయుడు,కోలా విజయ లక్ష్మి, ఆలియా,కస్తూరి, నందిని,ప్రసన్న, రాధమ్మ, రేణుక,వరలక్ష్మి, భవాని, మరియు జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.
Follow