24/07/2025
స్థానిక 40వ డివిజన్, గాంధీ బొమ్మ రోడ్ లోని 40వ డివిజన్ వైసిపి కార్యాలయం నందు స్థానిక కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మేనిఫెస్టో ను గుర్తుకు తెస్తూ 40వ డివిజన్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు గారు, క్లస్టర్ ఇంచార్జ్ కేసరి కృష్ణా రెడ్డి, కార్పొరేటర్లు షేక్ ఇర్ఫాన్, బాపతి కోటిరెడ్డి, శిరంశెట్టి పూర్ణచంద్రరావు, 40వ డివిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాబు మోసాలను, ప్రజలకు ఇచ్చిన బాండ్లు, వైయస్ జగన్ గారి ప్రెస్ మీట్ ని టివిలో చూపించారు. ఇంటింటికి క్యూ ఆర్ కోడ్ తో వెళ్లి ప్రజలతో ఆ క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేపించి కూటమి మోసాలను వివరించాలని కోరుతూ క్యూ ఆర్ కోడ్ ని ఆవిష్కరించారు
ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిందని, కేవలం మాటలకే కూటమి ప్రభుత్వం పరిమితమైందన్నారు. సుపరిపాలన పేరుతొ ప్రజల వద్దకు వెళ్తున్నారని, ఎం చేసారని ప్రజలలోకి వెళ్తారని కూటమి నేతలను ప్రశ్నించారు. గతంలో వైసిపి హయాంలో ప్రతి గడపకు వెళ్లి ఇచ్చిన హామీలు అమలు చేసిన సంక్షేమ పధకాలు అందాయ లేదా అని ప్రజలనడిగి తెలుసుకొని రానివాళ్ళకి అక్కడికక్కడే పరిష్కారం చేసామన్నారు. టిడిపి వాళ్ళు మాత్రం జగన్ గారికి కంటే మీకు ఎక్కువ పధకాలు ఇస్తామని మోసపూరిత హామీలతో ప్రజల వద్దకు వెళ్లారని, సూపర్ సిక్స్ లో పధకాలు డబ్బులతో కలిపి కరపత్రంలో ముద్రించి ఇంటింటికి తిరిగి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటె మీకు 30 వేలు శాంక్షన్ అయిందని, పెన్షన్ నాలుగు వేలు అయిందని, 18 ఏళ్ళు దాటితే ప్రతి నెల 1500 ఇస్తా అని చెప్పారని, రాష్ట్రం మొత్తం ఉచితంగా ప్రయాణించచ్చు అన్ని చెప్పారని, ఉచిత గ్యాస్ ఇస్తాం అన్ని చెప్పారని మొత్తంగా సంవత్సరానికి ప్రతి ఇంటికి సుమారు రెండున్నర లక్షల రూపాయలు మీకు ఆమోదించబడిందని త్రికరణ శుద్దితో జూన్ 24 నుంచే మీకు అందించడం జరుగుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన దొంగ పాత్రలను ఇచ్చి ప్రజలను మోసం చేసారన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో కూడా ఏ పధకం ఆపకుండా అమలు చేశారన్నారు. కుట్రని ప్రభుత్వం అమ్మఒడిని అమలు చేయకుండా ఒక సంవత్సరం ఎగ్గొట్టారన్నారు. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఉచితంగా బస్సులో ప్రయాణించవచనారని కానీ నేడు జిల్లా పరిధిలోనే ఉచితంగ ప్రయాణించవచ్చంటున్నారని ఈ పధకం అమలుకి అనేక వాయిదాలు వేశారన్నారు. చంద్రబాబు మాటలు. జూన్ 24 అయిపోయి సంవత్సరం అయిందని ఒక్క పెన్షన్ తప్ప కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. తల్లికి వందనం ఎవరికీ వచ్చిందో ఎవరికీ రాలేదో తెలియడం లేదని తల్లికి వందనం అర కొర అమలు చేసారన్నారు. ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన బండ్ల గురించి, మేనిఫెస్టో గురించి మోసపూరిత వాగ్దానాల గురించి వివరించి గుర్తుచేయాలని పధకాలు వచ్చాయా లేదా అన్ని అడగాలన్నారు. సూపరిపాలన పేరుతో కూటమి నేతలు ప్రజలవద్దకు వచ్చినప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను, బాండ్లను చూపించి ప్రశ్నించే విధంగా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ హోదాలలో పదవులు పొందిన వారు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు